Friday, July 5, 2013

పంటల పాఠాలమ్మ


రసాయన ఎరువుల్లో ఉపయోగించే నత్రజని, భాస్వరం, పొటాష్ లాంటివాటికి ఆవర్తన పట్టికలో ఉండే స్థానాలూ ధర్మాలూ మర్మాలూ ఏమీ తెలియదు ఆ అమ్మకు. ఆమెకు తెలిసిందల్లా ఒక్కటే...చేలల్లో చాళ్లలో వేళ్లు పారాడిస్తూ పంట నిండుగా పండాలంటే నేలకు సారం ఉండాలని! అందుకు రసాయనాల కంటే పేడ, పుట్టమట్టిలాంటివే గట్టివని! ఆ అనుభవంతో సేంద్రియ ఎరువనే పరుసవేదిని ఆకాశం స్లాబ్ కింద నేలతల్లి ఫ్లోరింగ్‌లోని నాలుగెకరాల చేను ల్యాబ్‌లో కనుక్కుందామె. ఆ పరుసవేదిని పంటకు ఆనించి బంగారం పండించితన చెలకలో ఆమె సృష్టించిన కలకలం ఢిల్లీలోని ‘కలెక్టర్ల కాలేజీ’ చెవులనూ తాకింది. అంతే... నేల మోటారునే అబ్బురంగా చూసే ఆమె గాలిమోటారుని నిబ్బరంగా ఎక్కి వచ్చింది. కాబోయే ‘జిల్లా దొరలకు’ పాఠాలు చెప్పడానికి ఢిల్లీ దాకా వెళ్లొచ్చిన లలితమ్మ స్ఫూర్తిదాయక కథనమే నేటి ప్రజాంశం. పదేళ్ల కిత్రం లలితమ్మ రోజుకూలి. పొద్దునే కొడవలి పట్టుకుని పొలానికి వెళితేగాని పొట్టగడిచేది కాదు. సొంతంగా పొలం ఉన్నా...పెట్టుబడి పెట్టి పండించే స్తోమతలేక లలితమ్మ, ఆమె భర్త వ్యవసాయ పనులు చేసుకుని బతుకు బండినీడ్చారు. నాటి రోజుకూలి లలితమ్మే ఇప్పుడు ట్రైనీ ఐఏఎస్ ఆఫీసర్లకు పాఠాలు చెప్పింది. మూడు నెలల క్రితం ఢిల్లీలోని లాల్‌బహుదూర్ శాస్త్రి నేషనల్ ఎకాడమి ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ వేదికగా లలితమ్మ పాఠాలు విన్న ట్రైనీ ఐఏఎస్‌లు హాలు దద్దరిల్లేలా చప్పట్లు కొట్టారు. ‘పుస్తకాల్లో అక్షరాలు కాదు...లలితమ్మలాంటి సాక్ష్యాలు’ కావాలంటూ శిక్షణలో ఉన్న కలెక్టర్లు సభాముఖంగా తెలియజేశారు. అవును, అధిక దిగుబడిని వచ్చే వ్యవసాయ పద్ధతుల్ని ల్యాబ్‌లో కాదు లైవ్‌గానే చేసి చూపించాలి. లలితమ్మ అదే చేసింది. సుస్థిర వ్యవసాయం పేరుతో అంతరించిపోతున్న పాత పంటల్ని సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్లో పండించి అధిక లాభాలు గడిస్తున్న లలితమ్మ తోటి రైతులందరికీ ఆదర్శంగా నిలబడడం వెనకున్న విశేషాలే ఈ వారం ప్రజాంశం. ‘‘హైదరాబాద్ నుంచి ఢిల్లీకి మీదిమోటార్ల (విమానం) తీస్కపోయిండ్రు. అక్కడ మసూర్కి పోవాలన్నరు. చూస్తే ఏప్రిల్ నెల...ఈడ ఎండలు మండుతుంటే... ఆడ మస్తు చలి. సెట్టర్లు కట్టుకుని పోయినం. గదేదో... చదువుకునే కాలేజి లెక్కుంది. పెద్ద హాలునిండ నల్లసూట్లు ఏసుకుని మస్తు జనమున్నరు. ఈడికెల్లి నాతోని ఇంకో నలుగురు ఆడోళ్లు వచ్చిండ్రు. లోపలికి పోంగనే రాండ్రి అనుకుంటూ మా చేతులు వట్టుకుని తీస్కపోయిండ్రు. ముందుగాల మమ్మల్ని తీస్కపోయిన రాయుడుసారు ఇంగ్లీష్‌ల మాట్లాడిండు. ఆ తర్వాత నన్ను మాట్లాడమన్నరు. నేను తెలుగుల చెబుతుంటే...గతే ముచ్చట ఆ సారు ఇంగ్లీష్‌ల చెప్పిండు’’ అని ఎంతో ఆనందంగా చెప్పింది లలితమ్మ. మెదక్‌జిల్లా జహిరాబాద్ మండలం రాయ్‌పల్లి గ్రామానికి చెందిన లలితమ్మ తన జీవితంలో మోటర్‌సైకిల్ కూడా ఎక్కుతాననుకోలేదు, ఏకంగా విమానంలో వెళ్లి ట్రైనీ ఐఏఎస్‌లకు క్లాస్‌లిచ్చింది. సుస్థిర వ్యవసాయం ‘‘గిప్పుడు తినే తిండిల బలంలేదు అంటున్నరు. అయినా తింటున్నరు. ఏం జేస్తరు. మందులేసి మందుల్ని పండించుకుంటున్నం. గదంత ఎందుకు పంట పండించేటోడే కరువైండు. ఇంక మందుల పంటలు, మంచి పంటల సంగతెక్కడిది. ఎవరైనా... పొలముంది కదా అని పంట పెడితే పెట్టిన సొమ్ము కూడా వస్తలేదు. పదేళ్లక్రితం నాది గూడ ఇదే కథ. అప్పుడు... ఇందిర క్రాంతి పథకం కింద సుస్థిర వ్యవసాయ పద్ధతుల గురించి కొందరు సార్లు వచ్చి మాకు శిక్షణ ఇచ్చిండ్రు. మా చుట్టుపక్కల రైతులంతా మంచిగ విని ఊకుండ్రు. నాకు మాత్రం నచ్చి మా చేన్ల చాన ప్రయోగాలు చేసిన. ఇంకెవరో వచ్చి పాత పంటలకు ఇప్పుడు మస్తు గిరాకి ఉందని చెబితే వాటి గురించి ఆలోచన జేసిన’’ అంటూ తన తొలి అడుగుల గురించి పూసగుచ్చినట్టు వివరించింది లలితమ్మ. కొర్రలు, సామలు, తైదలు, పచ్చసజ్జలు, నల్లనువ్వులు వంటి పాత పంటల్ని పండించి పట్టణాలకు ఎగుమతి చేయడం సుస్థిర వ్యవసాయంలో లలితమ్మ ప్రత్యేకత. ఎరువుల రహస్యం... వ్యవసాయం పేరు చెప్పగానే రైతులకు రసాయన ఎరువుల ధరలు గుర్తుకొస్తాయి. ఏళ్ల అనుభవం ఉన్న రైతులు కూడా వ్యవసాయం పేరు చెప్పేటప్పటికి చేతులెత్తేసే పరిస్థితుల్లో లలితమ్మ అద్భుతమైన లాభాలు గడిస్తోంది. దీనికి ప్రధాన కారణం ఆమె సొంతంగా తయారుచేసుకుంటున్న సేంద్రీయ ఎరువులే. వాటి వెనకున్న రహస్యం కనుక్కోడానికే సెర్ప్(సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ)వారు ఆమెను ఢిల్లీకి తీసుకెళ్లి కలెక్టర్ల ముందు కూర్చుబెట్టారు. ‘‘ఢిల్లీల కలెక్టర్లకు నా వ్యవసాయ పద్ధతుల గురించి చెప్పినంక ఒకాయన లేచి నేను తయారుచేసే ఘనజీవామృతం ఎరువు గురించి అడిగిండు. ఎట్లచేయాలో కూడా చెప్పమన్నడు. అన్నీ వివరంగా చెప్పినంక అందరూ లేచి నిలవడి తప్పట్లు కొట్టిండ్రు. వాళ్లనట్ల జూసేసరికి వంద ఎకరాలల్ల పంట ఊడ్చినంత సంతోషమొచ్చింది’’ అని ఎంతో గర్వంగా చెప్పిన లలితమ్మ కళ్లలో ఆకలి తీర్చే రైతన్నతో పాటు, తెలిసిన విద్యను పదిమందికి పంచిపెట్టే గురువు కూడా కనిపించాడు. ఘనజీవామృతం అంటే...పొలానికి వాడే సేంద్రీయ ఎరువు. ‘‘పది కిలోల పెండల రెండు కిలోల పప్పుల పొడి, రెండు కిలోల బెల్లం, ఒక కిలో పుట్టమట్టి, మూడు లీటర్ల ఆవు మూత్రం బోసి బాగ కలిపి ఎండవెట్టాలి. పది దినాల తర్వాత అది చాయిపత్త పొడిలా అయితది.. దాన్నిపొలంల యిత్తులు పెట్టినపుడు, కలుపుతీసినపుడు సల్లితే మొక్కలు దొడ్డుగ వెరుగుతయి. గీ సంగతే ఢిల్లీల కలెక్టర్లతో చెప్పిన. వాళ్లు పుస్తకంల రాసుకున్నరు’’ అని తన ఎరువుల తయారీ గురించి చెప్పింది లలితమ్మ. అన్నీ తానై.... సుస్థిర వ్యవసాయం అంటే ఎరువుల్ని, విత్తనాల్ని రైతులే తయారుచేసుకోవాలి. ఓపికుంటే అమ్మకాలు కూడా రైతులే చేసుకుంటే పెట్టుబడిలేని వ్యాపారంలా సాగుతుంది. లలితమ్మ విజయం వెనకున్న కారణాలు ఇవే. తనకోసం మాత్రమే కాదు ఆ చుట్ట్టుపక్కల యాభై మంది రైతులకు సేంద్రీయ విత్తనాలను, ఎరువుల్ని అమ్ముతుంది కూడా. ప్రస్తుతం ఆమె పదమూడు రకాల సేంద్రీయ పంటల్ని పండిస్తోంది. అమ్మకం పని కూడా తనదే. దళారీల ప్రసక్తే రానివ్వదు. ‘‘పొలముంది కదా అని ఒకటే రకం పంట ఏసుకుంటే బొమ్మ బొరుసులెక్క ఉంటది. అట్లగాకుండా నాలుగైదు రకాల పంటలేసుకుంటే అమ్ముకోడానికి బాగుంటుంది. ఒకదాన్ల నష్టమొచ్చినా ఇంకోదాన్ల లాభమొస్తది. మన దగ్గర రైతులు ఎక్కువ తలకాయి నొప్పిలేకుండా పంట పండాలంటరు. వ్యవసాయంలా ఎంత ఓర్పు ఉంటే గంత లాభముంటది. పంట సరిగ రాకుంటే దేవుడా....అంట కూసుంటరు. మొక్క లేవకుంటే ఎంబడే పీకేసి కూరగాయలు పెట్టుకుని మార్కెట్‌కి ఏస్కుంటే కాలం కలిసొస్తది, సొమ్ములొస్తయి’’ లలితమ్మ ఆలోచనతో కాదు...అనుభవంతో చెప్పిన మాటలివి. ఐదేళ్లపాటు పాతపంటలపై రకరకాల ప్రయోగాలు చేసి, ఆ తర్వాత ఐదేళ్లలో సేంద్రీయ పంటల్లో ఎవ్వరూ ఊహించని విజయాలు సాధించింది. అందుకుగానూ మూడేళ్లక్రితం ప్రభుత్వంవారు ఉత్తమరైతు అవార్డు కూడా ఇచ్చారు. తోటి రైతులకు... కొర్రలు తింటే స్థూలకాయం తగ్గుతుంది. సజ్జలు మంచి న్యూట్రిషన్, తైదలు శక్తినిస్తాయి. మరివన్నీ ఎక్కడ దొరుకుతాయి? అక్కడక్కడ తప్ప ఎక్కడబడితే అక్కడ అందుబాటులో లేవు. ఈ విషయాన్ని గ్రహించిన లలితమ్మ లాభాలరైతుగా పేరు తెచ్చుకుంది. ఆమె విత్తనాలకు, ఎరువులకు, ఆహార ధాన్యాలకు విపరీతమైన గిరాకి ఉంది. అలాగని లలితమ్మ తన వ్యవసాయాన్ని పదుల ఎకరాలకు విస్తరింపచేయలేదు. తనకున్న నాలుగెకరాల్లోనే ప్రయోగాలైనా, పంటలైనా. తన వ్యవసాయ పనులతో పాటు తన గ్రామంలో ఉన్న రైతులకు, చుట్టుపక్కల సేంద్రీయ పద్ధతుల్లో పంటలు వేసే రైతులకు లలితమ్మ ఉచితంగా శిక్షణ ఇస్తోంది. ఏ రైతుకొచ్చిన ఇబ్బంది అయినా, సందేహమైనా తీర్చేవరకూ లలితమ్మకు నిద్ర పట్టదు. మొక్క పెట్టే దగ్గర నుంచి మార్కెట్ కెళ్లేవరకూ ఆ చుట్టుపక్కల రైతులకు లలితమ్మ అండగా నిలబడుతుంది. గురువులు పాఠాలు మాత్రమే చెబుతారు. లలితమ్మ పాఠాలు చెపుతూనే ప్రాక్టికల్స్ చేసి చూపిస్తోంది. వాటిలో పొరపాటు జరక్కుండా కాపాడుతుంది కూడా. అందుకే ఈమె టీచింగ్‌కి కాబోయే కలెక్టర్లుసైతం లేచి నిలబడి చప్పట్లు కొట్టారు. - భువనేశ్వరి ఫొటోలు: వై. శ్రీనివాస్‌రెడ్డి, జహీరాబాద్ మొక్క పెట్టే దగ్గర నుంచి మార్కెట్‌కెళ్లేవరకూ ఆ చుట్టుపక్కల రైతులకు లలితమ్మ అండగా నిలబడుతుంది. గురువులు పాఠాలు మాత్రమే చెబుతారు. లలితమ్మ పాఠాలు చెపుతూనే ప్రాక్టికల్స్ చేసి చూపిస్తోంది. - See more at: http://sakshi.com/Main/WeeklyDetails.aspx?Newsid=65088&Categoryid=11&subcatid=23#sthash.X9hG2vZq.dpuf

Thursday, October 18, 2012

Power crisis in A.P - An Immediate Solution Available!

Dear Friends After reading controversial emails of this forum members, i felt it is essential for me to interfere in ur discussions. I am a retired engineer in electricity department (Present APGENCO) serving 30 years in generating stations ( power generation plants). I can say one sentence that you are all not aware of real situation for power problem in our state for that matter in our country except in few states. 1.The power problems started with mixing up political power and electrical power and privatisation policy of power generarion .( Electrical +Political power+ privatisation) = no power or less power). Most of the power plants in particular gas plants which have come up in Pvt. sector( with political back ground capitalists) are interested in not running their plants with some reason or other because they are assured of getting fixed Charges irrespective of weather they generate power or not. The fixed charges are almost equivalent to 50 to 60% of per unit cost of power they are selling as per PPAs conditions. The extra amount they are going to get by generating power is almost nil, as the amount they get is going to spent for purchasing coal or gas.Then why should they generate, when they are getting money with out any activity. This type of activity is more in A.P as Govt is concentrating on plans to suppress Telangana agitation. 2. Govt.is not reimbursing subsides amount to Govt. under taking power generation Companies in turn they are becoming financially weak and not able to purchase coal/ gas in time. 3. Most gas is allotted to private power companies keeping aside the needs of Govt. power generating Companies ( APGENCO/NTPC) 4. Hydro power generation is reduced at Srisailam with the idea of taking more water to Seemandhra by keeping Srisailam reservoir level above 860 Ft even though the original go. reads for keeping water above 834 ft.and use for power generation. One more thing I feel to clarify to Telanganites with confidence is that there will not be any power problem in Telangana if Telangna state is formed., because all capitalists plants are in seemandhra area only and we can complete all thermal stations formulated in Telangana and not taken up by this Seemandhra Govt. Coming to immediate and permanent solution for power crisis A) Immediate solutions. 1. Impose restrictions use of power advertisements lighting and impose severe punishment for use of electricity for advertising boards. 2. Impose restrictions ( energy consumption and load is to be limited to 50 % of previous year consumption ) on use of power( Energy i.e no. of units) in commercial organisations/ star hotels and sign boards, and impose heavy penalty if they cross the limits . 3. As some friends suggest install solar power plants in remote villages on war footing with battery back up system. B) Permanent 1. To pressurise Govt to arrange Coal or Gas to Govt under taking Companies, instead of private power companies. 2. Reduce fixed charges to 50% and remove the Clause of deemed generation from PPAs 3. Do not permit any private agency in power generation and Coal/ Gas must first allotted to Govt. power companies only. Govt. under taking companies shall be permitted for power generation by giving counter guarantees for loans. This is because many power plants of APGENCO/ NTPC are got delayed because of requirement of counter guarantee from state or Central Govt. for loans and allotment of coal/Gas 4. Make power power generation corporations/ organisations administration system free from political and IAS administration system. Power generation corporations shall be formed and headed by engineers only. Appointment of members and Chairman shall be only by Committee members From institutional members instead of IAS/ politicians. 5. Privtisation of Coal mines/ gas shall be stooped immediately. all the coal mines and Gas wells shall be nationalized. Please note that i am writing this to contradict others views and hurt them but only to share my views i am writing this. K.P. Reddy S.E ( Retd.)/ APGENCO Associate president Telangana Retired Enginers Forum

Friday, October 5, 2012

ఇంత విషం కడుపులో దాచుకుని ఎలా కలిసుందామనుకుంటున్నారు?


ఇంత విషం కడుపులో దాచుకుని ఎలా కలిసుందామనుకుంటున్నారు? By: కొణతం దిలీప్ (ఒక తెలంగాణ మీడియా మిత్రుడి సహకారంతో...) పేరుకది విశాలాంధ్ర మహాసభ అయినా అదొక పచ్చి విషాంధ్ర మహాసభ అని వెనుకటికొకసారి రాశాను. వాస్తవానికి అది పట్టించుకోవలసినంత పెద్ద సంస్థ కాదు. కానీ తెలంగాణకు వ్యతిరేకంగా నడుస్తున్న గుంపు కాబట్టి మన సీమాంధ్ర మీడియా దాని స్థాయికన్న ఎక్కువే "స్పేస్" ఇస్తోంది. అందులో ఉన్నది గుప్పెడు మందే. గత ఏడాదిన్నరగా కష్టపడుతున్నా పాపం వారి సభలో సంఖ్య రెండంకెలు కూడా దాటట్లేదు. ఎలా దాటుతుంది? చేసే పనిలో చిత్తశుద్ధి ఉండాలి కదా. విశాలాంధ్ర పేరిట వారు చేసేది అవకాశం దొరికినప్పుడల్లా తెలంగాణ ఉద్యమం మీద, ఇక్కడి ప్రజల మీద విషం చిమ్మడమే. ఈ మూకను పెంచి పోషిస్తున్నది బెజవాడ బ్రోకర్ ఉరఫ్ లగడపాటి అనే జోకర్. వారి కడుపులో ఎంత విషం ఉందో తాజాగా పరకాల ప్రభాకర్ తెలంగాణ మార్చ్ పై చేసిన దొంగ విశ్లేషణతో మరోసారి బయటపడింది. ఎప్పటిలాగానే ఈ చెత్త విశ్లేషణను పట్టుకుని లగడపాటి జోకర్ తెగ వాగుడు వాగుతున్నాడు. వీరిద్దరి అతి చేష్టల వల్ల సమైక్యాంధ్ర ఉద్యమానికి మేలు జరగకపోగా తెలంగాణ్ర ప్రజల రాష్ట్రసాధన సంకల్పం రెట్టింపు అవుతుంది. సెప్టెంబర్ 30 నాడు తెలంగాణ మార్చ్ కు లక్షలాది మంది ప్రజలు వచ్చి మరోసారి తమ ప్రత్యేక రాష్ట్ర కాంక్ష చాటారు. కానీ పరకాల బృందానికి మాత్రం ద్వేషంతో కళ్లు మూసుకుపోయాయి. పత్రికల్లో ప్రచురితమైన మీటింగు ఫొటోనొకదాన్ని తీసుకుని కోడి గుడ్డు మీద ఈకలు పీకే పని ఒకటి మొదలుపెట్టారు. ఆ ఫొటోపై పరకాల విశ్లేషణ చూస్తే వారి మెదడు మోకాల్లో కాదు కదా అరికాల్లో కూడా లేదని చిన్నపిల్లాడికైనా అర్థం అవుతుంది. పరకాల చేసిన పిచ్చిపని చూడండి: తెలంగాణ మార్చ్ ఫొటోను తీసుకుని దానిపై నిలువు, అడ్డం గీతల గ్రిడ్ ఒకదాని గీసి ఒక్కో చదరంలో ఎంతమంది ప్రజలు ఉన్నారో లెక్కకట్టి మొత్తం మార్చ్ కు 18,000 మందే వచ్చారని తేల్చాడీ మట్టి బుర్ర. ముందీ అవకతవక మేధావి విశ్లేషణలో ఉన్న డొల్ల వాదనను చూద్దం. ఆ తరువాత తెలుగు జాతి అంతా ఒక్కటిగానే ఉండాలని పైకి కోరుకునే ఇతగాడి మనసులో తెలంగాణపై ఎంత విషం ఉన్నదో చూద్దాం. పరకాల వాదన ఇది:
ఈ ఫొటోలో కుడి వైపు ఉన్న ఒక చదరంలో 500 మంది ప్రజలు ఉన్నారు కాబట్టి మొత్తం 36 చదరాలు ఉన్నాయి కాబట్టి మార్చ్ కు వచ్చిన ప్రజల సంఖ్య 18,000 ఉంటుందని ఈ కోడి మెదడు మేధావులుంగారు అంచనా వేశాడు. ఇక్కడే పరకాల హుస్సేన్ సాగర్ తీరంలోని రొచ్చులో అడుగేశాడు. మార్చ్ ఫొటో తీసిన angle వేరు, దానిపై గీసిన గీతల angle వేరు అయినప్పుడు ఒక చదరంలో ఉన్న ప్రజల సంఖ్యను ఇంకో చదరంలో ఉన్న సంఖ్యతో పోల్చలేం అనేది ఇంగిత జ్ఞానం ఉన్న ఎవరికైనా అర్థం అవుతుంది. ఉదాహరణకు ఈ ఫొటో చూడండి:
పై చిత్రంలో కుడివైపు కింది భాగంలో "A" అని మార్క్ చేసిన చదరంలో కేవలం రెండు టైల్స్ (దాదాపు) మాత్రమే ఉన్నాయి. అదే ఇంకో చివర "B" చదరంలో చూడండి దాదాపు 20 వరకు టైల్స్ ఉన్నాయి. ఇరవై ఫీట్ల పొడవున్న లాన్ లోనే ఇంత వ్యత్యాసం వస్తే ఇక ఆయనే చెప్పినట్లు 1300 ఫీట్ల దూరాన్ని ఫొటో తీస్తే దానిలో ఎంత వ్యత్యాసం వస్తుందో వేరే చెప్పనక్కరలేదు కదా. మరి ఈ లెక్కన ఆ ఫొటోలో పరకాల లెక్క ప్రకారం ఈ చివర 500 మంది ఉంటే అటు చివర ఎంత మంది ఉంటారో ఊహించుకోండి. ఫోటో తీసిన Angle ను గమనించకుండా చెత్త లాజిక్కులు తీసే పని ఏ చదువురాని నిరక్షరాస్యుడో చేస్తే అర్థం చేసుకోవచ్చు. కానీ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో డాక్టరేట్ పొందిన పరకాలకు ఇంత చిన్న విషయం తెలియదా? లేక తెలిసీ బుకాయిస్తున్నాడా? ఇక రెండో విషయం. తెలంగాణమార్చ్ అనేది పబ్లిక్ మీటింగు కాదు. ఆరోజు మధ్యాహ్నం నుండి సాయంత్రం పొద్దుపోయేంతవరకూ ప్రజా ప్రవాహం ఆగకుండా వస్తూనే ఉన్నది. అటువంటప్పుడు ఏదో ఒక ఫొటోను పట్టుకుని వచ్చినవారి సంఖ్యను అంచనా వేయడం తలకాయ ఉన్నవాడెవడూ చేయడు. కానీ మన పరకాలకు అది లేదు కాబట్టి ఇట్లాంటి చెత్త అయిడియాలు వస్తుంటాయి. మూడో సంగతి: పరకాల వారి దివ్యజ్ఞానంతో నెక్లెస్ రోడ్డులో మార్చ్ జరిగిన ప్రదేశం పొడవు 1300 వందల ఫీట్లు, వెడల్పు 100 ఫీట్లు అని అంచనా వేశాడు. అయితే నిజానికి మార్చ్ జరిగిన ప్రదేశం పొడవు (నా అంచనా ప్రకారం ) కనీసం కిలోమీటర్ పైనే ఉంటుంది. అంటే 3280 ఫీట్లు. ఇక్కడా పరకాల లెక్కలు తప్పే. అన్నిటికన్న ప్రధానమైనది అసలు అనేక నిర్బంధాల మధ్య జరిగిన తెలంగాణ మార్చ్ కు ప్రజలు తక్కువ వచ్చారని లెక్కలు వేయడం వీరి మనసుల్లో తెలంగాణ ప్రజల మధ్య ఎంత ద్వేషభావం ఉన్నదో తెలుపుతున్నది. తెలంగాణ మార్చ్ కు వారం రోజుల ముందే జిల్లాల్లో వేలాదిమంది తెలంగాణవాదుల అరెస్టులు మొదలయ్యాయి. మార్చ్ జరిగిన రోజు హైదరాబాదుకు వచ్చే దాదాపు నలభై రైళ్లు రద్దు చేశారు. తెలంగాణ జిల్లాల నుండి హైదరాబాదుకు వచ్చే అనేక బస్సులు రద్దు చేశారు. వరంగల్ నుండి వస్తున్న శాతవాహన ఎక్స్ ప్రెస్ ను జనగాం వద్ద నిలిపివేసి ఆఖరికి డ్రైవర్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇక నిజామాబాద్ వంటి జిల్లాల నుండి వస్తున్న వందల ప్రైవేటు వాహనాలను అడ్డుకున్నారని ఏకంగా "సాక్షి" వంటి సీమాంధ్ర పత్రికలే రాశాయి. ఇక ఇన్ని అడ్డంకులు దాటుకుని హైదరాబాదుకు వచ్చిన తెలంగాణ ప్రజలను నెక్లెస్ రోడ్డు మీదికి రాకుండా అన్ని రహదారులూ దిగ్బంధించింది పోలీస్ శాఖ. ప్రతి చోటా ప్రజలు పోలీస్ బారీకేడ్లను బద్ధలు కొట్టుకుని, లాఠీ దెబ్బలు, టియర్ గ్యాస్ మోతల మధ్య మార్చ్ జరుగుతున్న ప్రదేశానికి చేరుకున్నారు. ఉద్యమ పురిటిగడ్డ ఉస్మానియా యూనివర్సిటీ ముందతే ఆరోజు మొత్తం యుద్ధమే సాగింది. ఒక్క విద్యార్ధి కూడా బయటికి రాకుండా పోలీసులు నిర్బంధించారు. ఆరోజు పరిస్థితి తెలియాలంటే మచ్చుకు ఈ చిత్రాలు చూడండి:
ఫొటో: నెక్లెస్ రోడ్డులోకి ఎవరూ రాకుండా వేసిన రంపపు ముళ్లతీగెలు.
ఫొటో: అనేక బ్యారీకేడ్లు, పోలీసులని దాటుకుని తెలంగాణ మార్చ్ కు వచ్చారు ప్రజలు
ఫొటో: టియర్ గ్యాస్ ప్రయోగిస్తున్న పోలీసులు
ఫొటో: సభాస్థలి వద్ద టియర్ గ్యాస్ పొగ భరించలేక ముక్కు మూసుకుంటున్న చిన్న పాప -- సభాస్థలి వద్ద పోలీసుల ఓవరాక్షన్ అంతా ఇంతాకాదు. నెక్లెస్ రోడ్డులోని మార్చ్ వేదిక వద్ద ఆరోజు మొత్తం 150 రౌండ్ల భాష్ప వాయువు గోళాలు పేల్చారంటే ఈ మార్చ్ పై సీమాంధ్ర ప్రభుత్వం, పోలీసులు ఎంత దమనకాండకు పాల్పడ్డాయో అర్థం అవుతుంది. ఈ టియర్ గ్యాస్ వల్ల మార్చ్ కు వచ్చిన చిన్నపిల్లలు, వృద్ధులతో సహా అనేక మంది అస్వస్థతకు గురయ్యారు. సభాస్థలి వద్ద నేరుగా ప్రజలపైకి టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించడం వల్ల ఇద్దరు ఉద్యమకారులకు తలతో ఫ్రాక్చర్లు అయ్యి ప్రస్తుతం మహావీర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇన్ని కష్టనష్టాలకు ఓర్చి అక్కడికి లక్షలాదిగా ప్రజలు వచ్చింది ఒక ఆకాంక్షను వ్యక్తబరచడానికి మాత్రమే. ఈజిప్టులో హోస్నీ ముబారక్ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు తహ్రీ స్క్వేర్ లో గుమికూడినప్పుడు కూడా అక్కడి నియంతృత్వ ప్రభుత్వం తమ ప్రజల పట్ల ఇంత దుర్మార్గంగా ప్రవర్తించలేదు. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం మార్చ్ కు ప్రజలు రాకుండా చూడాలనే ప్రయత్నించామని సాక్షాత్తూ అధికారులే ఓవైపు చెబుతుంటే పరకాల లాంటి మేతావులు మాత్రం వచ్చిన జనాలను తక్కువచేసి చూపడానికి ఇలాంటి తలతిక్క విశ్లేషణలు చేస్తున్నారు. సీమాంధ్ర ప్రభుత్వం మా గుండెలపై చేసిన గాయాలపై మీరు కారం జల్లుతున్నారు పరకాల ప్రభాకర్. ఇలాంటివి చేసి తెలంగాణ ప్రజలకు మీరు ఏం సంకేతాలు పంపదలుచుకున్నారు? ఈ చర్యలద్వారా మీరు సీమాంధ్ర ప్రజలపై తెలంగాణ ప్రజలకు ఇంకొంచెం ద్వేషం రగిల్చి మా సంకల్పాన్ని బలోపేతం చేయగలరేమో కానీ సమైక్యతను మాత్రం ఎన్నటికీ సాధించలేరు. ఇన్ని నిర్బంధాలు దాటుకుని ఒక మహోజ్వల పోరాటస్ఫూర్తిని కనబరచిన ప్రజల పట్ల జాలి లేకపోయినా పరవాలేదు కానీ మరీ ఇంత దుర్మార్గపు మాటలా? అసలు మీరు మనుషులేనా? ఇంత విషం కడుపులో దాచుకుని మాతో ఎలా కలిసి ఉందామనుకుంటున్నారు?

Saturday, August 25, 2012

"Eureka!" "Eureka!" - "I have found it!"

Hey all, am sharing the experience from one of my friends, Mr. Parshu ram from Telangana Netizens Forum. Telangana netizens forum (with almost 30 people ) recently visited flourosis effected areas in nalgonda dist. "Eureka!" "Eureka!" - "I have found it!" that was a place on the earth... it was not a different planet.... "Eureka!" "Eureka!" - "I have found it!" they were human beings just like all of us... they were not aliens.... "Eureka!" "Eureka!" - "I have found it!" god didn't cursed them.. it was the politicians selfishness that cursed them !! for political party : they are the sympathy VOTES ! for politicians : they are the way to loot crore rupees ... for TV channels : they are the way to increase TRP ratings ... for celebrities : they are the way to publicity ... for the world : they are disabled.... for the visitors : they are the aliens ...... for martyrs : they are the way to sacrifice there life .... for ME : they are the inspiration ! Cost for the solution : The exact budget the politicians spent to visit them.... Less than 25% of the budget they looted on there names.... One pipe line of water from 3 pipe lines going to hyderabad from there villages.... Its there share they should get from krishna river and godavari river legally .... International aid by the Netherlands government sanctioned `317.30 crore which NEITHER -LANDED nor used for them, which would have solved 75% of the problem if they have landed properly ......!! AS it is the place of " REBELLION" from the time of nizam till date ..they are still fighting for their rights...!! but it is shameful that they are fighting for such basic right... RIGHT TO LIVE..............! Water is the basic need for the survival of human beings and is part of the right to life and human right as enshrined in. Article 21 of the Constitution of India The rivers Krishna, Musi River, Aleru, Peddavagu, Dindi and Paleru flow through the district and Most importantly Nagarjuna Sagar: World's largest masonry dam, This is famous Dam in south India with 26 gates and a Hydroelectric plant is JUST VISIBLE TO THEIR EYESIGHT ! still they are fighting for WATER from past 65 years..... yes, they are the unlucky people born in NALGONDA DISTRICT of ANDHRAPRADESH, INDIA. the problem they are facing is known to the whole world.... NALGONDA holds the record of being FIRST in the WORLD in FLUORIDE with 28ppm the normal content of fluoride in water is 0.2ppm to 0.8ppm but people here will drink the water containing upto 28ppm.... "searching on net will let u know the problems but a direct interaction will let u know the PAIN" thinking the same team TNF took the initiation to visit the affected villages and im proud to be in the team ! MY EXPERIENCE @visit to fluoride affected villages... As i walked the few miles in the village , i felt like i was in the new planet NO humans around , NO noise, NO pollution.... i walked few more miles and i was thirsty.... i found no water around, i asked the old woman who was sitting near a old house to give me some water and she refused to give,not because she was hard-hearted but she don't want to serve the POISON that they are drinking..... REASON behind not finding people on the road is that half of the villagers are highly affected that they can't even get up from the bed and remaining half cannot come out without support... the youth of the village left to slave in other states and other countries and kids left for school....! NOW i have been to a school which is in the same village and i was shocked to see only 13 kids in the school from 1-5th class including kid of the in-charge lady and the government teacher was absent and lady could not give proper reason about that.... and this shows how well a government school is working in village level...!! and i have realised that most of kids are also affected and i couldn't imagine their situation 5years from now !! "I have found it!" that was a place on the earth... its was not a different planet.... me with the team TNF almost visited 12 villages around and met 150 highly effect people.... i have rechecked my self whether im on same planet or not ?, oh my god what am i seeing..??? they dnt have a shape for their body.. not even similar to human body ! what am i seeing ?? am i seeing human beings or any other creatures ?? are they humans or aliens ?? these type of questions were killing me....! the things were so worst , few people are living like new type of animals.... there are suffering like FISH OUT OF WATER exactly !! and at least FISH have two better ways either DIE without water or JUMP BACK TO WATER ... but they don't even have a way.. they have to suffer all the way !! I have found it!" they are human beings just like all of us... they are not aliens.... they are tired of false promises, either its a politician or a NGO --they shouted with anger no one should enter the village with TAG LINE- FOR FLUORIDE AFFECTED PEOPLE ! i had a talk with the group of local villagers on the way... all the old grandmaa's said -" we use to think that this was the curse of the god for our mistakes but with the help of born leaders who are fighting for us, we came to know it was a political game to loot us, every thing was game from past six decades, this time when politicians came for votes we ill kick them off ...!! " a villager was in worst situation she don't even realised her grandson of 3 years was affected with the fluoride.. there are many more who are in same situation.... each and every one have shown a strong desire for SEPARATE TELAGANA STATE formation , they believe things change, they get a equal share of water so that they district will get benefited and fluoride can be eradicated with mother krishna and mother godavari !! "THEY have found it!" god don't cursed them.. its was the politicians selfishness that cursed them !! A Mother's Cry.. HER son will not call her AMMA.... he will not play in front of her house... he will not ask her to buy things... he will not go to school... he will not fight with her... he will not share all the stories he know... all he ill do is sleep like a dead body..... moving now and then remind her he is still alive... no other feeling could possibly be worse than this.... fills her soul with unbearable grief, sorrow and pain... what can i explain in my next line..???? face to face interaction with INSPIRING PEOPLE: 1. Name : Tirupathamma ( fluoride victim ) village:vattupalli Age: 30 years Qualification: 10th Standard 1996 Due to her never ending fight against fluorosis she has won TIMES OF INDIA young women achiever award. She also contested as ZPTC member in 2006 elections but lost in a short margin. 2.name: amshala swami village:shivanagudem age:33 years... he met many people like Cm's,Pm's, governors,film actors and recent miss worlds (Miss World Canada Denise Garrido, Miss Iceland World Fanney Ingvarsdóttir, Miss World Irealnd Emma Waldron, Miss Universe Slovenia Marika Savsek, Miss Universe Bolivia Claudia Arce Lemaitre and Miss Bikini International Diana Irina Boancă world title holders have come down to meet him check here ) he says : all of them used them for their publicity... he realised there is no use with all public figures,he took the initiation and contested as ZPTC in 2006 and as MLA in 2008, he projected the problem in state and national wide...!! the way i saw him - he was a great leader !! 3:name : rajitha village :marrigudem age:22 years Pm's , CM"s and all public figure came and meet her, spent time with her.. but till date she doesnt have proper toilets facility in her home.. this explain the way of our soo called celebrates use them for gaining the popularity !! 4: name: ajay village: kodashpally age:14 years he is on the bed from his birth,a tear rolled from my eye's and my friend lohith couldn't take a 30 seconds vedio of this guy... after seeing him i got to know the value of LIFE...! just watch his situation : watch it (click) now,who are real disabled ? we who cant even rise our voice for fellow person?? or they who are fighting for there rights with all the disabilities ?? 5. A TRUE LEADER : name : dusharla satyanarayana in 1990, he came to the town as a bank employee -Field officer,but see the injustice happening to the people he resigned to his job.. raised his voice by starting " jala sadhana samithi" many parties tried to influence him and asked him to join there party but realising the politicial parties true colours he denied all the huge offers and still fighting for them !! inspired by him .... a true leader doesn't need publicity as he is 'for the public, to the public , with the public and FROM THE PUBLIC " ! from the past 65 years.. we asked, we begged, we shouted and we were fighting, now we lost hope on so called GOVERNMENT.. NOW LETS DO PERSON TO PERSON.. Join your hands... GIVE YOUR FREE TIME.. LETS CHANGE....... PROGRESS IS IMPOSSIBLE WITHOUT CHANGE... and those who cannot change their mind cannot change ANYTHING.......!! join us to fight https://www.facebook.com/?ref=logo#!/fluorosisinnalgonda

Thursday, August 23, 2012

ఎవడు రా మా ఈ దుస్థితికి కారణం.. ఇంకెవ్వడు..

సమైక్యాంధ్ర ముసుగు పాలన లో, బీడు బారిన మా బీద బతుకులు, చిద్రమై, మీ ఖజానా కు దేవుడిచ్చిన ఒక వరమై.. మీ జేబులు నింపిన మా జీవితాలు.. తెలంగాణా ఉద్యమ కెరటాలై.. నివురు గప్పిన నిప్పులా మా ఆశయ సాధనే మా ధ్యేయమై.. కదులుదాం కదులుదాం .. మన లక్ష్య సాధనకై కదులుదాం.. ఎవడు రా మా ఈ దుస్థితికి కారణం.. ఇంకెవ్వడు.. http://www.youtube.com/watch?v=xHlkLHunJKY&feature=youtu.be Discriminated !! ఈ ఫోటో లో మీరు చూస్తున్న ఫ్లోరోసిస్ తో బాధపడుతున్న బాలుడి పేరు కారెంగి అజయ్. తండ్రి పేరు యాదయ్య. ఊరు కోడష్పల్లి. ఈ పిల్లవాడి వయసు 14 సంవత్సరాలు. ఇతనికి మాటలు రావు, చూపు లేదు. ఒక వినటం, ఏడవటం తప్ప ఎం చెయ్యరాదు .. !! మెలకువ తో ఉన్నప్పుడు ఈ పిల్లవాడు చలికి వనికినట్టు వణుకుతూ కొట్టుకుంటాడు. ఆకలేసినా "అమ్మా ఆకలి" అని అడగలేని దయనీయ స్థితి. ఇతని పరిస్థితి ఒక 30 సేకేన్లు కు మించి ఎక్కువ చూడలేకపోయాను. అప్పటికే నా కళ్ళ నుండి నీళ్ళు రాలి ఎం చెయ్యాలో తోచని పరిస్థితి. మరి ఆ పిల్లవాడి తల్లిదండ్రులు 14 సంవత్సరాలు నుండి ఆ బిడ్డకు ఎలా సేవ చేస్తున్నారో. కళ్ళ ఎదుట కొడుకును అల చూస్కుంటూ ప్రత్యక్ష నరకాన్ని అనుభవిస్తున్నారు ఆ తల్లిదండ్రులు. డబ్బు పెట్టి రోగాన్ని నయం చేద్దామన్న నయం కానసువంటి రోగం అది. వయసు మీరుతున్నప్పుడు తమ బాగోగులు చుస్కునే కొడుకులను కనలనుకుంటారు ప్రతి తల్లిదండ్రులు. మరి తాము బ్రతికున్నంత కాలం ఆ అమాయకుడైన కొడుకుకు సేవ చేస్కుంటూ బ్రతకాలి అని కొడుకును గానేతప్పుడు ఆ తల్లి కూడా అనుకోలేదు. బిడ్డను కడుపులో మోసేటప్పుడు తల్లి పడే పాట్లకు ఈ విధంగా కొడుకును చూడటం ఇంకెంత నరకం??? ప్రతి తల్లి తమ పిల్లలతో "అమ్మ" అని పిలిపించుకోవాలని కోరుకుంటుంది. మరి ఈ తల్లిని ఎవరు పిలుస్తారు "అమ్మ" అని ??? ఆ పిల్లవాడు అల వణుకుతూ కొట్టుకుంటున్నప్పుడు అతని ఆత్మ గోష నాకు అర్ధమైంది. దేవుడా నన్ను ఈ తెలంగాణా ల ఎందుకు పుట్టిన్చినావ్? ఇసువంటి కష్టము నేను అనుభావిన్చాలేకున్నాను అని అతని ఆత్మ రోదిస్తుంది.. ఇలాంటి అజయ్ లాంటి వాళ్ళు నల్లగొండ జిల్లా లో చాల మంది ఉన్నారు.. వారి బాధను యే దేవుడు అర్ధం చేసుకోగలడు? కుల మతాల పేరుతో అంధకారం తో కొట్టుకుంటున్న మనం నిజమైన అనాగారి'కులము' !!! ఇది ఈరోజు నా తెలంగాణా తల్లి హృదయం లో పడే ఆవేదన !! - తెలంగానాస్ రెబెల్ టైగర్ Dt : 23 ఆగష్టు 2012

Friday, August 10, 2012

సిగ్నల్ సిండ్రోమ్!

సిగ్నల్ సిండ్రోమ్! తెలంగాణ సమాజం ఇప్పుడు కొంచెం ఊరడిల్లే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలారోజుల స్తబ్తత తరువాత, ఈ మధ్యే మళ్ళీ తెలంగాణ మాట వినబడుతోంది. కేసీఆర్ మౌనం వీడడం చాలామందికి ఊర ట కలిగిస్తోంది. ఈమధ్య ఇంట్నట్‌లో ఒక చర్చ నడుస్తోంది. అందులో భాగం గా కేసీఆర్ ఎక్కడ అంటూ ప్రశ్నల పరంపర మొదలయ్యింది. పరకాల ఎన్నిక ల తరువాత తెలంగాణ అలికిడే లేకుండాపోయిందని చాలామంది నెటిజన్లు బహుశా అందులో ఎక్కువమంది ఎన్‌ఆర్‌ఐలు వాపోతున్నారు. కేసీఆర్ ఒక వారం పదిరోజులు కనిపించకుండా, వినిపించకుండాపోయే సరికి సీమాంధ్ర మీడియా బెంగ పడిపోయినట్టే, తెలంగాణ పిల్లలు కూడా అలా బెంబేపూత్తిపోతారు. వెంటనే ఇంట్నట్ గ్రూపుల్లో వ్యాఖ్యానాలు చేస్తుంటారు. ఈ వ్యాఖ్యానాలకు కొందరు మిత్రులు ఓపిగ్గా వింటుంటారు, వివరణలిస్తుంటారు . కేసీఆర్ ఏమైనా టీవీ యాంకరా రోజూ కనిపిస్తూ కబుర్లు చెప్పడానికి అని ఆయన అప్పుడప్పుడు గదమాయిస్తుంటారు. కానీ ఇప్పుడు సగటు తెలంగాణవాదులది కోడిపిల్లల మనస్తత్వంగా మారిపోయింది. తల్లికోడి కనిపించకపోతే పిల్లకోళ్ళు పలవరించినట్టే కేసీఆర్ కనబడకుండాపోతే తెలంగాణ అంత అయోమయం ఆవరించేస్తుంటుంది. దీనికితోడు మీడియా కథనాలు కలవరపెడుతుంటాయి. వాటిని తెలంగాణవాదులు ఎవరికీ వారు తిప్పికొట్టడమో, ఒప్పుకోవడమో చేస్తుంటారు. ఇటువంటి సందర్భంలో అసలు సారేమనుకుంటున్నారన్న ప్రశ్న ఎవరికైనా వస్తుంది. అందుకే కేసీఆర్ ఇప్పుడు ఏ చర్యకైనా కేంద్ర బిందువు అయిపోతాడు. ఆయన ముమ్మాటికి తెలంగాణ ఉద్యమానికి కేంద్ర బిందువే! అలాంటప్పుడు మాటా పలు కూ లేకుండా మాయమైపోతే అయోమయం తప్పదు. నిజమే నాయకుడు ప్రతిరోజూ మాట్లాడడు. ఆ అవసరం లేదు. నాయకునికి ప్రత్యామ్నాయంగా ప్రతిరోజూ మాట్లాడేవాళ్ళు వేరే ఉంటారు. కానీ టీఆర్‌ఎస్‌లో గానీ, తెలంగాణ ఉద్యమంలో గానీ కేసీఆర్‌కు ప్రత్యామ్నాయంలేని పరిస్థితి. కొంతకాలం కోదండరాంను ప్రజలు తెలంగాణ ఉద్యమ ప్రతినిధిగా, కేసీఆర్ ఆలోచన ప్రతిబింబంగా చూశారు. కానీ అది నిజం కాదని ఎవరిదారి వారిదేనని ఇద్దరి మాట లు, కార్యాచరణను బట్టి ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఇక పార్టీలో కూడా కేసీఆర్‌లా ఇంకొక వ్యక్తి కనిపించడు. బయట కనిపించే ‘అధికార ప్రతినిధులు’ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కరకంగా, కొన్నిసార్లు ఒక్కరే అనేక రకాలుగా చానల్స్‌ను బట్టి మాట్లాడుతుంటారు. ఉద్యమంలో కేంద్రీకృత నాయకత్వం తప్పనిసరి. అదిలేకపోతే వ్యవస్థీకృత నిర్మాణం, కార్యాచరణ అయినా ఉండాలి. ఆ రెండూ లేనప్పుడు ముమ్మాటికీ తప్పుడు సంకేతాలు వెళ్తుంటాయి. కేసీఆర్ మాత్రం తనకు సంకేతాలు సరిగానే ఉన్నాయని అంటున్నారు. తనకు ఢిల్లీ నుంచి ఎప్పటికప్పుడు సిగ్నల్స్ అందుతున్నాయనీ అంటున్నాడు. సిగ్నల్స్ అందడం వల్లే తాను మౌనంగా ఉన్నాననీ అంటున్నాడు. కేసీఆర్‌కు ఉన్న సిగ్నల్స్ సామాన్యులకు లేవు. ఆ సిగ్నల్స్, ఉద్యమంలో ఉన్న మిగితా నేతపూవరికీ లేవు. చివరకు ఆయన పార్టీకి చెందిన శాసనసభ్యులకు, అధికారపార్టీకి చెందిన తెలంగాణ నేతలకు కూడాలేవు. సిగ్నల్స్‌తో ఉన్న చిక్కే ఇది. వాటికి రూపం ఉండదు. అవి కేవలం వాయుతరంగాలు. ఒక టవర్ నుంచి, ఇంకొక టవర్‌కు అవి ఉపక్షిగహం గుండా అందుతుంటాయి. ఉపక్షిగహం నుంచి వచ్చిన సిగ్నల్స్‌ను టవర్ నెట్‌వర్క్‌కు అందిస్తుంది. అప్పుడు గానీ అది ప్రజలకు చేర దు. అక్కడే ఉంది చిక్కంతా. తెలంగాణలో ఇప్పుడు అనేక ఉద్యమ నెట్ వర్క్ లు ఉన్నాయి. తెలంగాణ సంస్థలు, వేదికలు, జేఏసీలు, రాజకీయపార్టీలు వేటికవి సొంత నెట్ వర్క్‌లతో నడుస్తున్నాయి. అయినప్పటికీ తెలంగాణ ఉద్యమానికి కేసీఆర్ ఒక్కరే ప్రథానమైన టవర్‌గా ఉన్నారు. టీఆర్‌ఎస్ ఒక్కటే ప్రధానమైన నెట్‌వర్క్ అని అనేక సందర్భాల్లో రుజువయ్యింది. ఒక్క కేసీఆర్‌కు మాత్ర మే సిగ్నల్స్ అందుతున్నాయి కాబట్టి అవి టీఆర్‌ఎస్ శ్రేణులకు, ప్రజలకు కూడా అందితే తప్ప ఈ సమస్య ఉండదు. కానీ అప్పుడప్పుడు కేసీఆర్ గారే అందుబాటులో లేకుండా ఉంటున్నారని దానివల్లే నెట్‌వర్క్ సమస్యలు వస్తున్నాయని అంటున్నారు. ఢిల్లీలో ఉన్న టవర్ నుంచి ఏ సిగ్నల్స్ అందాయో హైదరాబాద్‌లో ఉన్న తెలంగాణ ప్రజలకు తెలియాలి. ఆ సిగ్నల్స్‌ను డీ కోడ్ చేసి ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాల్సిన బాధ్యత సిగ్నల్స్ అందుకున్నవాళ్ళ మీద ఉంటుంది. ఢిల్లీ నుంచి వస్తున్న సిగ్నల్స్ ఏం సూచిస్తున్నాయి అనేది అర్థం కాకపోతే క్రాస్ టాక్ ఇలాగే ఉంటుంది. పార్లమెంటు సమావేశాలు మళ్ళీ మొదలయ్యాయి. ఇప్పుడిక సీక్రెట్ సిగ్నల్స్‌తో పనిలేకుండా పార్లమెంటులో తెలంగాణ విషయంలో ఎవవరు ఏం చేస్తున్నారో ప్రత్యక్ష ప్రసారంలో దృశ్య రూపంలో చూసేయవచ్చు. కొద్దిరోజులుగా తెలంగాణలో ఒక విధమైన స్తబ్ధత నెలకొని ఉన్న మాట వాస్తవం. ముఖ్యంగా పరకాల ఉపఎన్నిక తరువాత విజయమ్మ యాత్ర మినహా మరో సంచలనం ఏమీ లేకపోవడమే ఈ స్తబ్ధతకు కారణం. సుదీర్ఘ పోరాటంలో ప్రతిరోజూ సంచలనాలు ఉండవు, కానీ తెలంగాణ ప్రజలిప్పుడు వాటికి అలవాటుపడి ఉన్నారు. వేరే పనులన్నీ పక్కనబెట్టి ఏదైనా జరిగితే బాగుండునని ఎదురు చూస్తున్నవాళ్ళూ ఉన్నారు. వెంటనే తెలంగాణ ఇచ్చేస్తున్నట్టు కేంద్రం ప్రకటిస్తుందని ఎవరూ అనుకోవడం లేదు. కానీ ఎప్పటికైనా తెలంగాణ వస్తుందనే నమ్మకం మాత్రం ఇంకా సడల లేదు.పార్లమెంటు సమావేశాలు మొదలైన బుధవారం నాటి దృశ్యం టీవీలలో చాలామందే చూసి ఉంటారు. మేడం సోనియాగాంధీ హఠాత్తుగా స్కూల్ టీచర్ అయిపోయారు. చూపులబెత్తంతో ఆమె తన పార్టీకి చెందిన ఎంపీలను కట్టడి చేశారు. మేడం గారు తెలంగాణపై మొదటిసారిగా మౌనం వీడారు. కానీ మౌనం వీడి ఏం చేశారు? తెలంగాణ కోసం మాట్లాడుతున్న ఎంపీలను మౌనంగా ఉండమని ఆదేశించారు. ఈ మాట చెప్ప డం ద్వారా ఆమె ఏ రకమైన సిగ్నల్స్ ఇచ్చారు? మేడంగారి మాటల్లో తమకు సానుకూల సంకేతాలే అందాయని టీ కాంగ్రెస్ ఎంపీలు చెపుతున్నారు. కానీ టీవీల్లో జరిగిన తతంగం చూసిన వారికి సోనియాగాంధీ నోరుమూసుకుని కూర్చోండి అన్నట్టే కనిపించింది. నోరుమూసుకుంటే తప్ప ఎవనా మౌనంగా ఉండలేరు కదా! బహుశా కాంగ్రెస్ ఎంపీలు ఇప్పుడు ఆ పనిలో ఉంటారు. సంకేతాలు సరిగానే ఉన్నా సందేశాలు ఎందుకు అందడంలేదో. నెట్‌వర్క్ నిపుణులు చెప్పాలి. తెలంగాణ విషయంలో ఎప్పటికప్పుడు సిగ్నల్స్ సరిగానే అందుతున్నాయి. ఉట్టి సిగ్నల్సే కాకుండా తెలంగాణ ఉద్యమం చెవులు బద్దలయ్యే శబ్ద తరంగాలను సృష్టించింది.ఇటునుంచి అటు, అటు నుంచి ఇటు సిగ్నల్స్ నిరంతరాయంగా ఉంటున్నా.. ఇప్పటిదాకా ఢిల్లీ టవర్ నుంచి ఒక్క సందేశం కూడా ఇక్కడ డెలివరీ కాలేదు. వాయిదాల మీద వాయిదాలతో ఈ వ్యవహారం అలాగే సాగుతోంది. ఇప్పుడు ఏదో ఒకటి తేలాలంటే ఇప్పటిదాకా ఉత్తుత్తి గాలి తరంగాలుగా ఉన్న వాయుతరంగాలు ఇప్పుడు స్పష్టమైన శబ్ద తరంగాలుగా రావాలి. దాని కి పార్లమెంటును మిం చిన వేదిక ఉండదు. కానీ కేసీఆర్ పార్లమెంటుకు వెళతా రో లేదో తెలియదు. వెళ్ళినా అక్కడ ఉపయో గం లేదనేది గతంలో ఆయన అనుభవం. బిల్లు పెట్టండి మద్దతునిస్తం అని బయట దాంబికంగా మాట్లాడే భారతీయ జనతాపార్టీకి,అస్సాం శాంతి భద్రతల విష యం కంటే తెలంగాణ ప్రశాంతంగానే కనిపిస్తుంది. ఆ పార్టీ తెలంగాణను పెద్దగా పట్టించుకోవ తెలంగాణ మీద పార్లమెంటులో పెద్దగా చర్చ జరగకపోతే ఏం చేయాలి. ఉగా ది నుంచి దసరాకు, దీపావళి నుంచి హోలీకి తిరిగినట్టే తెలంగాణ వ్యవహారం ఎన్నికల తరువాత ఎన్నికలతో వాయిదాపడుతున్నది. చివరికి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు కూడా అయిపోయాయి. రాష్ట్రపతి ఎన్నికల తరువాత ప్రణబ్ ముఖర్జీ తన మొదటి సంతకం తెలంగాణ బిల్లుమీదే పెడతారని ఆ మధ్య కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యులొకరు ఒక జోక్ చేశారు. ఈ జోక్‌కు ఎవ్వరూ నవ్వలేదు. కానీ ఆ పార్లమెంటు సభ్యుడి అమాయకత్వానికి మాత్రం నవ్వుకోక తప్ప దు. ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతిగా హాయిగా పోయిన ఆగస్టు ఫస్టున తన మొదటి సంత కం మొదటి జీతం కోసం పెట్టే ఉంటాడు. అయినా యూపీఏ ఆమోదించకుండా, కేబినేట్ చర్చించకుండా అసలు ప్రతిపాదనే తయారు కాకుండా ఏ బిల్లు పెట్టినా అది చెల్లుబాటు కాదు. ఇప్పుడు అన్ని వాయిదాలు అయిపోయాయి. పార్లమెంటు కూడా మొదలయ్యింది. ఇప్పుడు తెలంగాణ మీద ప్రకటన చేయడానికి కాంగ్రెస్ పార్టీకి ఏ సమస్యా లేదు. బహుశా అందుకే కేసీఆర్ ఆగస్ట్ 20వ తేదీని అంతిమ వాయిదా అంటున్నాడు. చాలారోజుల తరువాత మళ్ళీ తెరమీద కనిపించిన కేసీఆర్ మళ్ళీ వాడి వేడి ప్రకటనలు చేయడంతో హడావిడి మొదలయ్యింది. పోయిన వారమంతా తెలంగాణ నేతల్లో ఏదో ఒక చలనం కనిపించింది. ముఖ్యంగా ఆగ స్టు ఇరవైలోపు తెలంగాణ విషయంలో ప్రకటన రాకపోతే అంతు చూస్తామని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కే సీఆర్ ప్రకటించడం ఒక తాజా పరిణామం. కేసీఆర్‌కు ఇలాంటి డెడ్‌లైన్లు కొత్త కాదని కొట్టిపారేసే వాళ్ళూ ఉన్నారు. అయినా సరే కేసీఆర్ అన్నాడంటే ఆయనకు ఏదో ఒక సిగ్నల్ ఉందని అనుకునే వాళ్లే ఎక్కువ. కేసీఆర్‌కు అందుతున్న సిగ్నల్స్ కంటే మనకు కనిపిస్తోన్న సిగ్నల్స్‌కు చాలా తేడా ఉన్నట్టు అనిపిస్తోంది. ఏదిఏమైనా మొట్టమొదటిసారి కేసీఆర్ ఒక స్పష్టమైన డెడ్‌లైన్ కేంద ప్రభుత్వం ముందుపెట్టారు. కానీ ఇంకా కార్యాచరణ ప్రకటించలేదు. దానికి సంబంధించిన కసరత్తు ఏదీ మొదలుపెట్టలేదు. బహు శా ఆయన ఢిల్లీ నుంచి రావాల్సిన సిగ్నల్స్ కోసం వేచి చూస్తూ ఉండవచ్చు. అయినా ఇప్పుడు కొత్త సిగ్నల్స్ వచ్చే అవకాశం లేదు. అలాంటిదేదైనా జరగాలంటే ఇక్కడ ఉద్యమ పొగ రాజుకోవాలి, ఆ సెగ ఢిల్లీకి తాకాలి. పార్లమెంటు సభ్య్లంతా ఢిల్లీ లోనే ఉండి, చెవిలో జోరీగల్లా పార్లమెంటును చికాకు పరచాలి. ఇప్పుడు ఇక సిగ్నల్స్ తో పనికాదు, నేరుగా షాక్ తగిలితే తప్ప చలించే స్థితిలో కేంద్రం లేదు. ఆ దిశగా ఆలోచించాలి. పొఫెసర్ ఘంటా చక్రపాణి సమాజశాస్త్ర ఆచార్యులు, రాజకీయ విశ్లేషకులు ఈ మెయిల్:ghantapatham@gmail.co

Friday, June 29, 2012

TGBKS victory in singareni elections

ooops.. i just came to know from one of my friends from my city about the victory made by the Telangana Boggu Gani Karmika Sangham (TGBKS) .. kudos.. it seems am missing alot..