Saturday, April 9, 2011

అవినీతికి వ్యతిరేకమా...??? నాదో చిన్న ప్రశ్న...

అవినీతికి వ్యతిరేకంగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న అన్నా హజారే కి మద్దతునిస్తున్న అన్ని పార్టీల నాయకులకు నాదో ప్రశ్న...

అసలు అవినీతి ఎక్కడ ఉంది... ??

మీలో కాదా....???
రాజకీయ నాయకుల్లో కాదా?? అసలు మీరు సరిగ్గా పని చేస్తే దేశం ఇలా ఎందుకు ఉండేది..??? లక్షల కోట్లకు మించిన అవినీతి ఎందుకు జరిగేది....?? ఒక్క సారి మీ మనస్సాక్షి ని అడగండి, ఆ తర్వాతే మద్దతునివ్వండి.... అస్సలు అవినీతి పుట్టిందే మీ దగ్గర నుండి...??
మీ,
దీపం,

Sunday, April 3, 2011

ఒక మధురానుభూతి....

అనిర్వచనీయం ఆ మధుర క్షణాలు... ఒక గొప్ప అనుభూతి ఎలా ఉంటుందో తెల్సుకోవాలంటే ఇంతకు మించిన అనుభవం ఇంకోటి ఉండదేమో...
ఎన్నో సంవత్సరాలుగా సాధించాలి అని తాపత్రయ పడుతున్న ఒక విజయంలోని మజా తెలియాలంటే దీనిని మించింది ఇంకోటి ఉండదేమో...
ఆ మధుర క్షణాల్లో సాధించిన వాళ్ళలో వచ్చేవి ఆనంద భాష్పాలు కావు, మధురానంద భాష్పాలు కుడా కావు.. అవి కన్నీళ్ళు... ఎన్నో సంవత్సారాలుగా వారు పడ్డ కష్టాలకు ఒక్కసారిగా వచ్చిన కన్నీళ్లు... అద్భుతం.. మహాద్భుతం... ఇంతకు మించిన ఆనందం వాళ్లలోనే కదూ ప్రతి భారతీయుడిలోను ఇంకెప్పుడు ఉండదు...

మానవతావాదం తో చెప్పుకోవాలంటే, ఎంతో మందికి ప్రాణాలు పోసింది ఈ కప్పు.. ఎందుకంటే ఆసిస్ తో మాచ్ గెలువకున్న, పాక్ తో మాచ్ గెలువకున్న, ముఖ్యంగా ఈ మాచ్ లో కూడా గెలువకపోయినా ఖచ్చితంగా, ఎన్నో కొన్ని ప్రాణాలు మాత్రం పోయేవే... ఈ దృష్టి తో చెప్పుకుంటే, ఏంటో మందికి జీవం పోసింది, ఎంతో మంది తల్లులకు గర్భ శోఖాన్ని కలుగకుండా చేసింది....
అదే మన విజయం... క్రికెట్లో భారత్ ప్రపంచ కప్పు ను గెలిచినా క్షణాలు మాటలతో చెప్పలేనివి, పదాల్లో రాయలేనివి...

ఇట్లు,
మీ దీపం,

Saturday, April 2, 2011

ఈ విజయం మామూలు విజయం కాదు... ఎంతో విలువైనది, సరయిన సమయంలో సాధించింది...

ఈ విజయం మామూలు విజయం కాదు... ఎంతో విలువైనది, సరయిన సమయంలో సాధించింది...
28 ఏళ్ళ సుదీర్ఘ నిరీక్షణ, ఎంతో మంది గొప్ప ఆటగాళ్ళకు దక్కని గౌరవం, 6 వరల్డ్ కప్ లు ఆడినా తన స్వదేశానికి కప్పుని ఇవ్వలేకపోయాననే క్రికెట్ దిగ్గజం పడిన మానసిక వ్యధ, ప్రపంచ క్రికెట్ ని ఏలుతున్నా, రెండోసారి కప్పుని గెలువలేకపోయాం అని జట్టులోకి వచ్చి, పోయిన ప్రతి ఆటగాడు పడ్డ భాద, 121 కోట్లకు పైగా ఉన్న ప్రజల గుండె చప్పుడు... అన్ని ఫలించిన వేళ.....ఇక నువ్వు లేకున్నా( ఒకవేళ రిటైర్మెంట్ తీసుకుంటే ), మేమున్నాం ఇక ముందు కలిసికట్టుగా ఆడుతాం, గెలుస్తాం, నువ్విచ్చిన స్పూర్తి తో మరింత ముందుకేల్తాం అంటూ, జట్టు మొత్తం కలిసి కట్టుగా సాధించిన అద్భుత విజయం.... ఆ మారాజు చేతుల్లో ఒక్కసారి కూడా ఒదగకపోతే ఇక విలువ ఏమి ఉండదు అని అనుకుందేమో ఆ ప్రపంచ కప్పు... ... త్వరలో రిటైర్ కాబోతున్న క్రికెట్ మారాజుకి లభించిన గొప్ప బహుమతి ఈ ప్రపంచకప్పు... ఒక్కటే భాద, ఈ విజయం లో మన దాదా లేడే , మన కుంబ్లే లేడే, మన శ్రీకాంత్ లేడే, ఇలా ఎందరినో ఊరించి లభించని ఈ వరల్డ్ కప్, చివరికి చిరునవ్వులు చిందిస్తూ , ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఎవ్వరికి అందనంత ఎత్తుకు ఎదిగిన మన క్రికెట్ రారాజు చేతుల్లో ముసి ముసి నవ్వులు చిందిస్తోంది.... అలా చిందులు చిందిస్తున్న ప్రపంచ కప్పుని ఆ రారాజు కుంబ్లే కి చూపిస్తూ ఆ ఆనందాన్ని డ్రెస్సింగ్ రూం లో పంచుకుంటున్న క్షణాలు... ఆ....... మా జన్మ ఇక ధన్యం...
జై హో భారత్... చక్ దే ఇండియా....