Friday, July 15, 2011

కాపీ ఉద్యమానికి కాపీ కవరేజి



ఆయన పేరు కొమ్మినేని శ్రీనివాస రావు. N-TV అనే చెత్త టీవీ చానెల్ కు చీఫ్ ఎడిటర్ ఉద్యోగం వెలగబెడుతున్నాడు.
ఆయన చానెల్ లో ప్రదర్శించే ప్రావీణ్యానికి తోడు సారు ఒక వెబ్ సైటు కూడా నడుపుతున్నాడు.

www.kommineni.info అనే పేరు మీద ఉన్న అ వెబ్ సైటును ఆయన తెలంగాణవాదంపై విషం చిమ్మే
ఏకైక ఎజెండాతో నడుపుతున్నారు. N-TV లో తెలంగాణ పై చిమ్మే విషం సరిపోక ఇది అదనపు డోస్
అన్నమాట. తెలంగాణ ఉద్యమం గురించిన ఎంత పాజిటివ్ వార్తలనైనా "తనదైన శైలి" లో నెగెటివ్ గా
రాయడంలో కొమ్మినేనిని మించినవారు లేరు.

స్వంతంగా ఒక్క ఆలోచన కూడా రాని సీమాంధ్ర ఉద్యమ నాయకత్వంపై మొన్న నేనొక పోస్టు రాశాను.
ఇవ్వాళ కొమ్మినేని గారు తిరుపతిలో జరిగిన వంటా వార్పు గురించి ఒక పోస్టు రాశారు.
అందులో యధాశక్తి సీమాంధ్ర ఉద్యమాన్ని పొగిడేసారు. అంతవరకూ బాగానే ఉంది. కానీ సారు వారు
అక్కడే అతి తెలివి చూపించి అడ్డంగా దొరికిపోయారు.

తిరుపతిలో వంటా వార్పు వార్తకు ఆయనగారు వాడిన ఫొటో గత నెల హైదరాబాదులో జరిగిన వంటా వార్పు
సందర్భంగా తీసినది. గన్ పార్క్ వద్ద తెలంగాణ ఉద్యోగులు చేసిన వంటా వార్పు ఫొటోను కొమ్మినేని గారు
నిస్సిగ్గుగా వాడేసారు.
కొమ్మినేని పోస్టును ఈ కింది లింకులో చూడండి:
http://kommineni.info/articles/dailyarticles/content_20110713_21.php
-


-
ఆ ఫొటో హైదరాబాద్ లో తీసిందని అంత ఖచ్చితంగా ఎలా చెబుతున్నారని అంటారా?
ఎందుకంటే అది naa friend తీసిందే కాబట్టి!

ఇదిగో ఒరిజినల్ ఫొటో
-



-

లేని ఉద్యమాన్ని భూతద్దంలో పెట్టి చూపించడానికి ప్రయత్నిస్తే ఇలాగే దొరికిపోతారు మరి!

ఇంటర్నెట్లో ఒక సైట్ లోని ఫొటోలు ఇంకొక సైట్లో వాడుకోవడం మామూలే అయినా ఒక ఉద్యమానికి
సంబంధించిన ఫొటోలు సరిగ్గా ఆ ఉద్యమానికి వ్యతిరేకంగా జరిగే ఉద్యమ కవరేజ్ కి వాడుకోవడం అయితే
జర్నలిజం వరిత్రలోనే ఎక్కడా జరిగి ఉండదు.

ఈ విధంగా మన కొమ్మినేని గారొక గొప్ప ట్రెండ్ సృష్టించారనుకోవాలి.

ఇకపై సీమాంధ్ర చానెళ్లలో, పేపర్లలో "సీమాంధ్రలో ఉద్యమం ఉధృతం" లాంటి వార్తలు వస్తే ఆయా వీడియోలు,
ఫొటోలు నిజమైనవా లేక కొమ్మినేని బ్రాండా అని కళ్ళు చికిలించుకుని చూడాలేమో మనం.

Thursday, July 14, 2011

"తెలంగాణ " : అడ్డుకునే అధికారం అసెంబ్లీకి లేదు

అడ్డుకునే అధికారం అసెంబ్లీకి లేదు
రాష్ట్ర అసెంబ్లీకి నిర్దిష్ట కాలవ్యవధిలో అభివూపాయం తెలిపే అవకాశం ఇవ్వాలి. అసెంబ్లీ తన అభివూపాయం చెప్పనంత మాత్రాన అది బిల్లు ప్రవేశపెట్టడానికి అడ్డంకి కాదు. అసెంబ్లీ అభివూపాయాన్ని పార్లమెంటు ఆమోదించాలని, పరిగణనలోకి తీసుకోవాలని ఎటువంటి నిబంధన లేదు.

ఒక అబద్ధాన్ని వెయ్యిసార్లు పదేపదే చెబితే అది వాస్తవం కాదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో ఇదే జరుగుతున్నది. కొంత మంది కాంగ్రెస్ నాయకులు, తెలంగాణ వ్యతిరేకులు తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలంటే చట్టం ప్రకారం ఆంధ్రవూపదేశ్ అసెంబ్లీలో తీర్మానం చేయాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇదంతా పచ్చి అబద్ధం. ప్రముఖ తెలంగాణ వాది సుభాష్ చంద్ర అందించిన వివరాలను ఈ కింది విధం గా ఉన్నాయి. మొదటి భాగం రాజ్యాంగంలోని సంబంధిత వివరాలు. రెండవ భాగం ఈ అంశంపై చర్చలు. మూడవ భాగం బొంబాయి హైకోర్టు ఇచ్చిన తీర్పులోని భాగం. రాష్ట్ర విభజన బిల్లును ఆ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించవలసిన అవసరం లేదనేది కోర్టు తీర్పు సారాంశం.

మొదటి భాగం:
భారత రాజ్యాంగం- ఆర్టికల్ 2 ప్రకారం పార్లమెంటు చట్టం ద్వారా కొన్ని నిబంధనలతో కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేయడానికి, కలపడానికి అధికారం ఉంది.
ఆర్టికల్3 ప్రకారం కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేయవచ్చు, సరిహద్దులను మార్చవచ్చు. రాష్ట్రాల పేరు మార్చవచ్చు.

పార్లమెంటు చట్టం ద్వారా ఈ విధంగా చేయవచ్చు.
ఒక రాష్ట్రం నుంచి కొంత భాగాన్ని విడదీయడం ద్వారా, రెండు లేదా అంతకు మించి రాష్ట్రాలను కలపడం ద్వారా లేదా కొన్ని రాష్ట్రాలలోని భాగాలను కలపడం ద్వారా, ఏదైనా భూభాగాన్ని ఒక రాష్ట్రానికి కలపడం ద్వారా కేంద్రం కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయవచ్చు. ఈ విధంగా ఏదైనా రాష్ట్ర భూభాగాన్ని పెంచవచ్చు, లేదా తగ్గించవచ్చు. రాష్ట్ర సరిహద్దు లు మార్చవచ్చు. రాష్ట్రం పేరు మార్చవచ్చు.

రాష్ట్రపతి సూచన ద్వారా తప్ప సంబంధిత బిల్లును పార్లమెంటు ఏ సభలోనూ ప్రవేశపెట్టకూడదు. ఈ బిల్లు ఏదైనా రాష్ట్ర భూభాగానికి, సరిహద్దుకు పేరుకు సంబంధించినది అయితే రాష్ట్రపతి ఆ బిల్లును సంబంధిత రాష్ట్ర అసెంబ్లీ అభివూపాయం తెలుసుకోవడానికి పంపించాలె. రాష్ట్రపతి సూచించిన గడువు ముగిసేవరకు వేచి ఉండాలి.

రెండవ భాగం:
రెండవ అధికరణానికి సంబంధించి రాజ్యాంగ నిర్మాతలు ఏమన్నా రు. (1948 రాజ్యాంగ సభ) కె. సంతానం ఈ విధంగా వివరించారు- ఉదాహరణకు మద్రాసు రాష్ట్రం సంగతి చూద్దాం. ఆంధ్రా వారు విడిపోవాలంటున్నారు. మద్రాసు శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టారు. తీర్మానం వీగిపోయింది. కథ అక్కడితో ముగుస్తుంది. ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయడానికి వారింక ఏమీ చేయలేరు. ఇట్లా కాకుండా గౌరవనీయులైన డాక్టర్ అంబేడ్కర్ చెప్పిన ప్రకారమైతే- ఆంధ్రా వారు శాసనసభలో మెజారిటీ పొందలేకపోతే రాష్ట్రపతి దగ్గరికి వెళ్లి తమ సమస్య వివరించుకోవచ్చు. తమ రాష్ట్ర ఏర్పాటుకు అడ్డంకి తొలగించమని కోరవచ్చు. రాష్ట్రపతి సంతృప్తి చెందితే వారి సూచనల ప్రకారం పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టమని సూచించవచ్చు. కేంద్ర ప్రభుత్వం గానీ ప్రైవేట్ సభ్యులు లేదా బృందం ఈ బిల్లును ప్రవేశపెట్టవచ్చు.

పండిట్ హృదయ్‌నాథ్ కుంజ్రూ ఈ విధంగా అన్నారు:
ప్రాంతాల పునర్ వ్యవస్థీకరణకు రాష్ట్రాల ఆమోదం అవసరం లేదు. వాటిని సంప్రదిస్తే సరిపోతుంది.

పండిట్ ఠాకూర్ దాస్ భార్గవ ఈ విధంగా అన్నారు:
ఒక ప్రాంతం ఒక రాష్ట్రం నుంచి విడిపోయి మరో రాష్ట్రంతో కలవడానికి స్వేచ్ఛ ఉండాలె. ఈ సౌకర్యం దేశంలోని అన్ని ప్రాంతాలకు వర్తింపచేయాలి. అడ్డంకులు ఉండకూడదు. ఒక ప్రాంతం విడిగా ఉండాలనుకుంటే స్వయం నిర్ణయాధికార హక్కు ఉండాలి.

ప్రొఫెసర్ కె.టి.షా ఈ విధంగా అన్నారు:
ఒక ప్రాంతం రాష్ట్రం నుంచి విడిపోదలుచుకుంటే ఆ ప్రతిపాదన సభ్యుల ముందు పెట్టాలి. మెజారిటీ సభ్యులు దానిని తిరస్కరిస్తారు కనుక ఆ లక్ష్యం నెరవేరదు. ఏ రాష్ట్రం నుంచి అయినా ఒకవూపాంతం విడిపోయే ఆకాంక్షను గౌరవించాలని నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతున్నాను. కొత్త రాష్ట్రం ఏర్పాటులో అడ్డంకులను తొలగించాలి. అందు కు సంబంధించిన చట్టబద్ధమైన సహకారం అందించాలి. ఏ రాష్ట్ర అసెంబ్లీ కూడా కొంత భూభాగం విడిపోతామంటే అంగీకరించదు. బాధిత ప్రాంతం అభివూపాయాలు వెలుబుచ్చడానికి అవకాశం కల్పించ దు. ఆ ప్రాంత ప్రజల అభివూపాయం, అసెంబ్లీ తీర్మానం పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకునే అధికారం పార్లమెంటుకు ఉండాలె తప్ప రాష్ట్రపతికి కాదు.

ఈ బిల్లుకు సంబంధించి నోటీసు ఇచ్చే అధికారం ప్రతి సభ్యునికి ఉండాలి. రాష్ట్ర అసెంబ్లీ అభివూపాయం తెలుసుకోవచ్చు. కానీ విడిపోదామన్న ప్రాంత ప్రజల అభివూపాయం మేరకే మార్పు జరగాలి. ఈ ఏర్పాటు చేయకపోతే ప్రజల స్వయం నిర్ణయాధికారం అనే సూత్రాన్ని విస్మరించినట్టవుతుంది. స్వాతంత్య్ర రాగానే అందరికీ స్వయం నిర్ణయాధికారం ఉంటుందని చెప్పుకున్నాం. రాష్ట్ర అసెంబ్లీ అభివూపాయం తెలుసుకోవచ్చు, పరిశీలించవచ్చు. కానీ నిర్ణయాత్మ పాత్ర వహించేది మాత్రం విడిపోదామనుకుంటున్న ప్రాంత ప్రజల అభివూపాయం మాత్రమే.

ప్రొఫెసర్ షిబ్బన్‌లాల్ సక్సెనా ఈ విధంగా అన్నారు:
రాష్ట్రపతికి ఎవరైనా సభ్యుల నుంచి తీర్మానానికి సంబంధించి నోటీసు అందినట్టయితే ఆబాధిత ప్రాంత ప్రజల అభివూపాయం ముందు తెలుసుకోవాలి. ఆ ప్రాంత మెజారిటీ ప్రజలు విడిపోతే సంతోషంగా ఉంటామని అభివూపాయపడుతున్నట్టయితే మంత్రి వర్గాన్ని సంప్రదించి బిల్లు ప్రవేశపెట్టాలనే సూచన చేయ్యాలి. ప్రధానికి కూడా ఈ సూచన చేయాలి. తీర్మానం ప్రవేశపెట్టి పార్లమెంటులో చర్చించాలనే విషయమై ప్రధాని కూడా రాష్ట్రపతితో ఏకీభవించవచ్చు. దీనివల్ల తమ సరిహద్దులు మార్చుకునే అవకాశం, స్వేచ్ఛ ప్రతి ప్రాంతానికి లభిస్తుందని ఆశిస్తున్నాను.

ఆర్.కె. సిధ్వా ఈ విధంగా అన్నారు:
రాష్ట్రాల నుంచి ‘అభివూపాయం’ తీసుకోవాలే తప్ప ‘ఆమోదం’ కాదు.

మూడవ భాగం:
బాబూలాల్ పరంథేకు బొంబాయి రాష్ట్రానికి మధ్య వివాదం. (1960-ఎఐఆర్ 51, 1960 ఎస్ సిఆర్(1) 605)
ఈ కేసులో కోర్టు ఆర్టికల్ మూడులోని అంశాలను వివరించింది.

రాష్ట్ర అసెంబ్లీ ఎంత కాలంలోగా తన అభివూపాయాలు వెల్లడించాలనేది రాష్ట్రపతి నిర్ణయించాలి. అవసరమైతే ఆ గడువును పెంచవచ్చు. గడువు ముగిసే లోగా రాష్ట్ర శాసనసభ తన అభివూపాయం చెప్పకపోయినా కూడా రాష్ట్ర అసెంబ్లీని సంప్రదించాలన్న నిబంధన పాటించినట్టవుతుంది.

న్యాయస్థానం ఇచ్చిన ఈ వివరణ ప్రకారం-రాష్ట్ర అసెంబ్లీకి నిర్దిష్ట కాలవ్యవధిలో అభివూపాయం తెలిపే అవకాశం ఇవ్వాలి. అసెంబ్లీ తన అభివూపాయం చెప్పనంత మాత్రాన అది బిల్లు ప్రవేశపెట్టడానికి అడ్డంకి కాదు. అసెంబ్లీ అభివూపాయాన్ని పార్లమెంటు ఆమోదించాలని, పరిగణనలోకి తీసుకోవాలని ఎటువంటి నిబంధన లేదు.

Is Assembly Resolution Mandatory to Create New States?

Is Assembly Resolution Mandatory to Create New States?
-By Subhash Chandra.



They say a lie repeated a thousand times will pass off as truth. The same thing seems to be happening in the case of Telangana state formation. Opponents of Telangana have been repeatedly issuing false statements that a resolution of Andhra Pradesh state assembly is mandatory for formation of Telangana. This is nothing but a blatant lie.

Part 1
THE CONSTITUTION OF INDIA
(As Modified upto the 1st December 2007)
THE UNION AND ITS TERRITORY
Article 2. Parliament may by law admit into the Union, or establish, new States on such terms and conditions as it thinks fit.
Article 3. Formation of new States and alteration of areas, boundaries or names of existing States.
Parliament may by law—
form a new State by separation of territory from any State or by uniting two or more States or parts of States or by uniting any territory to a part of any State;
increase the area of any State;
diminish the area of any State;
alter the boundaries of any State;
alter the name of any State:
4[Provided that no Bill for the purpose shall be introduced in either House of Parliament except on the recommendation of the President and unless, where the proposal contained in the Bill affects the area, boundaries or name of any of the States 1***, the Bill has been referred by the President to the Legislature of that State for expressing its views thereon within such period as may be specified in the reference or within such further period as the President may allow and the period so specified or allowed has expired.]

Part 2
What the fathers of our Republic and authors of its Constitution said about Article 2 and 3 (1948, Constituent Assembly):
The Honourable Shri K. Santanam explains Article 3 thus: “Mr. Vice-President, Take the case of the madras Province for instance. The Andhras want separation. They bring up a resolution in the madras legislature. It is defeated by a majority. There ends the matter. The way of the Andhras is blocked altogether. They cannot take any further step to constitute an Andhra province. On the other hand, as re-drafted by the Honourable Dr. Ambedkar, if the Andhras fail to get a majority in the legislature, they can go straight to the President and represent to him what the majority did in their case and ask for further action removing the block in the way of a province for them. If they are able to convince the President, he may recommend it and either the Government of India may themselves sponsor legislation for the purpose or any private Member or a group in the Central legislature can take up the question.”
Pandit Hriday Nath Kunzru : “the consent of the States should not be necessary for a re-organisation of their territories. Consultation with them should be quite enough.”
Pandit Thakur Dass Bhargava : “…every part of India should be given this facility, that, should it decide to secede from one part and to accede to another, then there should be no impediment in its way. If the people of an area want separation, then the right of self-determination should be given to them.”
Prof. K. T. Shah: “if anypart of a big province wants to break away then the only course before it is to bring the matter before the Members.But by doing so the very purpose would be defeated because the majority would always reject such a proposal. I would like the Congress Government to respect the wishes of the areas, which desire to separate from any province and that no hurdles are placed in their way; on the other hand, all legal aid should be given for the formation of a new province. No provincial legislature would agree to the separation of apart, and the representatives of the affected area will be so influenced that they would not be able to give free expression to their views. Parliament, and not the President, should have the right to determine the matter after taking into account the opinion of the people of the area concerned and of the vote of the provincial legislature. It is therefore necessary that every Member of the parliament should have the right to give notice of such a bill. Views of the provincial legislature may be taken but the changes should be effected in accordance with the wishes of the people of the area, who want separation. If this is not done then the principle of self-determination would be nowhere. We used to hear that after the attainment of Swaraj the right of self-determination would be given to all. Views of the legislatures may be invited, and may be taken into consideration; but the determining factor should be the vote of the people of the area, which wants to separate. ”
Prof. Shibban Lal Saksena: “the President after he receives notice of such a motion from any Member will try to take the opinion of the area concerned and then, of course after consulting his Ministry, give his recommendation for moving the Bill probably if the President feels that the people of an area – the majority of them – are of the opinion that they would be happier if they go to some other State or Province, he would advise the Prime Minister, and probably the Prime Minister also will agree with him that the motion should be allowed and that Parliament should be allowed to discuss the question. I think that gives full liberty and opportunity to every area which desires a change of boundaries.”
Shri R. K. Sidhwa: “View means “observations, consent means unanimity and decision on a matter…. I feel that in the case of the states, it is very necessary that their views should be obtained rather than consent ”

Part- 3
Babulal Parante v. State of Bombay, 1960 AIR 51, 1960 SCR (1) 605
In this case, the court explains the provisions of Article 3:

The period within which the State Legislature must express its views has to be specified by the President; but the President may extend the period so specified. If, however, the period specified or extended expires and no views of the State Legislature are received, the second condition laid down in the proviso is fulfilled in spite of the fact that the views of the State Legislature have not been expressed.

The intention seems to be to give an opportunity to the State Legislature to express its views within the time allowed; if the State Legislature fails to avail itself of that opportunity, such failure does not invalidate the introduction of the Bill.

Nor is there anything in the proviso to indicate that Parliament must accept or act upon the views of the State Legislature.

Sunday, July 3, 2011

సమైక్య ‘రాగాలు’.. దోపిడీ ‘తాళాలు’

సమైక్య ‘రాగాలు’.. దోపిడీ ‘తాళాలు’
- రాజకీయం ముసుగులో కాంట్రాక్టులు
- తెలంగాణ వస్తే ఆటలు సాగవనే భయం
- పాత కుట్రలు బద్దలవుతాయని ఆందోళన
- ఇకపై యథేచ్ఛ దోపిడీ సాగదని మనాది
- చిత్తం సొమ్ముపైన.. భక్తి దోపిడీపైన
- సీమాంధ్ర నేతల తెలంగాణ వ్యతిరేకత వెనుక..
చెరుకు రైతుల నోళ్ళు కొడుతున్న తిక్కవరపుఆర్‌ఈసీలో సీమాంధ్ర కలుపు మొక్క కావూరితెలంగాణలో రోడ్ల కాంట్రాక్టర్ రాయపాటితెలంగాణ గుత్తేదారు మేకపాటిలాభాలు ఎత్తుకుపోతున్న టీజీరాష్ట్రం విడిపోతే లగడపాటి నోట్లో మన్నేకాలుష్య రాంకీతో మోదుగుల సయ్యాటభూములు మింగిన జగన్గురుకుల్ కబ్జాకోరు ధర్మాన మందు వ్యాపారి మాగుంట‘పొదుగు’ కోసిన బాబుముంచేటి పోలవరం గుత్తేదారు నామాతెలంగాణనుఅడ్డుకుంటున్నది వీరేసీమాంధ్ర జనం విభజనకు వ్యతిరేకం కాదు.

లగడపాటి సమైక్యతా ‘రాగం’ వెనుక ‘తాళం’ ఏమిటి? సాక్షాత్తూ శ్రీకృష్ణ కమిటీనే మేనేజ్ చేసి సమైక్య సిఫారసు చేయించడానికి తిక్కవరపు ఎందుకు ‘కష్ట’పడ్డారు? టీడీపీ సభ్యుల చేతిలోంచి సమైక్య ప్లకార్డు లాక్కుని మరీ జగన్ పార్లమెంటులో ఎందుకు గొంతెత్తారు? కావూరి హస్తినలో చేస్తున్న సమైక్య తంత్రాంగ మంత్రాంగాల వెనుక దోపిడీ యంత్రాంగం ఏమిటి? మేకపాటికి పోయేదేంటి? టీజీ వెంక కోల్పోయేదేంటి? కాలుష్య భూతం రాంకీకి ఎలాంటి ఇబ్బందులు వస్తాయని మోదుగుల ఆందోళన చెందుతున్నారు? చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతి అవతారం ఎందుకు ఎత్తారు? ఇవి కొన్ని ప్రశ్నలు! ఓవైపు ప్రత్యేక రాష్ట్ర సాధనలో సమరంలో తెలంగాణ ఉరకలేస్తున్నది! కపట నాటకాలపై అట్టుడికిపోతున్నది! భావోద్వేగాలు రగులుతున్నాయి! లక్షల మంది బహిరంగ సభల్లో జై తెలంగాణ నినాదాలు చేస్తున్నారు. మరి.. ఏవీ సీమాంవూధలో వేల మందితోనైనా బహిరంగ సభలు? సమైక్య భావోద్వేగం ఏ స్థాయిలో ఉంది? ఎందుకని గుప్పెడు మందే సమైక్య నినాదంతో గొంతు చించుకుంటున్నారు? జగడాల మారిగా మారి లడాయి పెట్టుకుంటున్నారు? ప్రతి మనిషి మాట వెనుక అతని వర్గ స్వభావం దాగి ఉంటుంది! దశాబ్దాల క్రితమే లెనిన్ చెప్పిన మాట ఇది! ఆ మనుషులు సీమాంధ్ర ప్రజానీకం కాదు.. ఆ వర్గం ఆ ప్రాంత మేధావులో సంఘ సంస్కర్తలో, విద్యాధికులో కానే కాదు.. అది సీమాంధ్ర పెట్టుబడిదారీ వర్గం. తెలంగాణలో తమ అక్రమ పెట్టుబడుల గోడలు కూలకుండా.. అక్రమార్జనల గుట్టు రట్టవకుండా.. తాపవూతయపడుతున్న ఫక్తు దోపిడీ వర్గం. రాజకీయం ముసుగేసుకుని మురికి కాల్వ మొదలుకుని.. పంట కాల్వ దాకా.. రోడ్లు మొదలుకుని.. భారీ భవంతుల దాకా.. సత్తు రూపాయలు పెట్టుబడులు పెట్టి.. సొత్తు దోచుకుపోతున్న సీమాంధ్ర కుట్ర కుతంవూతాల గుత్తేదారుల వర్గం ఇది. చెరుకు మద్దతు ధర పెరగకుండా తెలంగాణ రైతుల పొట్టగొడుతున్నదొకరు. వక్ఫ్ భూములాక్షికమించి.. ఆకాశహర్మ్యాలు కట్టి.. కోట్లు కొల్లగొడుతున్నది మరొకరు. వరంగల్ ఆర్‌ఈసీ కాలేజీ నుంచి వచ్చిన సీమాంధ్ర కలుపు మొక్క.. తెలంగాణలో దోపిడీ వట వృక్షమై ఎదిగిందొకరు. రోడ్ల కాంట్రాక్టులను ఎగరేసుకుపోతున్న రాజకీయ నాయకుడింకొకరు. తెలంగాణ పొదుగు కోసి.. తన పాల పంట పండించుకుంటున్న నేతాక్షిగేసరులు.. కాలుష్య రాంకీతో కులుకుతున్న నాయకామణులు.. టోల్ గేట్ల దగ్గర పైసలు గుంజుకుంటున్న చిల్లర దొంగలు... అయ్య హయాంలో చేసిన దోపిడీని కాపాడుకునేందుకు అధికార పీఠంవైపు అర్రులు చాస్తున్న యువరాజ చోరాక్షిగేసరులు...! అంతా కుట్రల గుత్తేదారులు.. తెలంగాణను వ్యతిరేకిస్తున్న రాజకీయ కాంట్రాక్టర్ల ముఠాలు! వీరి చేతుల్లో తెలంగాణే కాదు.. యావత్ రాష్ట్రమూ దగా పడింది. తెలంగాణ ప్రజలే కాదు.. సీమాంధ్ర అమాయక జనమూ తెలుసుకోదగిన కుట్రల పుటలు వీరి దోపిడీ చరివూతలు!

ఇవీ రాయపాటి కారణాలు

ఇవీ రాయపాటి కారణాలు
జాతీయ రహదారుల నిర్మాణంలో పెట్టుబడులు పెట్టిన మరో బడా కాంట్రాక్టర్ గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు. తెలంగాణలో ఇప్పుడిప్పుడే జాతీయ రహదారుల విస్తరణ పనులు మొదలైనవి. తెలంగాణను అడ్డుకోవడానికి కావూరికి, సుబ్బిరామిడ్డికి ఉన్న కారణాలే రాయపాటికీ ఉన్నాయి.
అందరూ దొంగలే
మాదాపూర్ గురుకుల్ ట్రస్ట్ భూముల కబ్జాలో మంత్రి ధర్మాన ప్రసాదరావుకూ భాగముంది. ఆయనా తెలంగాణ వ్యతిరేకే. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులుడ్డి ‘మందు భాయి’లందరికీ సుపరిచితమైన యూబీ (యునైటెడ్ బ్రేవరీస్) గ్రూపు రాష్ట్ర బాధ్యుడు. తెలంగాణ రాష్ట్రం వస్తే ఎక్సయిజ్ అధికారులను చెప్పుచేతుల్లో ఉంచుకోవడం, ప్రభుత్వ ఎక్సయిజ్ విధానాలను నిర్దేశించడం, పన్నులు ఎగవేయడం కుదరకపోవచ్చు. అందుకే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఈయన ఒక అడ్డంకి. నెల్లూరు ఎంపీ మేకపాటి చంద్రశేఖర రెడ్డి కేఎంసీ కన్‌వూస్టక్షన్స్ అధినేత. తెలంగాణలో అనేక కాంట్రాక్టు పనులు వీరూ నిర్వహిస్తున్నారు. తెలంగాణలో భవిష్యత్తులో మరెన్నో కాంట్రాక్టులు చేజిక్కించుకోవాలనే ఆశతో ఉన్నారు. తెలంగాణలో వందల కోట్ల రూపాయల వాణిజ్య, వ్యాపారాలు నిర్వహిస్తున్న సీమాంధ్ర మంత్రులలో రాయలసీమ ఆల్కలీస్ అధినేత కర్నూలు ఎమ్మెల్యే టీజీ వెంక అమర్‌రాజా (బ్యాటరీస్) గ్రూప్ ఆఫ్ ఇండవూస్టీస్ అధినేత భార్య గల్లా అరుణకుమారి ఉన్నారు. నర్సారావుపేట ఎంపీ మోదుగుల వేణుగోపాలడ్డికి తెలంగాణ ప్రజల మొఖాలపై కాలుష్యాన్ని కుమ్మరిస్తున్న రాంకీ గ్రూప్‌తో సంబంధాలున్నాయి. మాజీ మంత్రి పీ రామచంవూదాడ్డి పీవీఆర్ కన్‌వూస్టక్షన్స్ అధినేతకాగా, ఏపీఆర్ కన్‌వూస్టక్షన్స్ ఆదాల ప్రభాకర్‌డ్డిది. బాలినేని శ్రీనివాస్ రెడ్డి గ్రానైట్స్ వ్యాపారంతో, సీమాంధ్ర శాసనసభ్యులైన ఏ ఆదినారాయణడ్డి, శ్రీకాంతడ్డి, గురునాథ రెడ్డి తదితరులకు నీటిపారుదల, రోడ్ల నిర్మాణ కాంట్రాక్టులతో సంబంధం ఉన్నది. తెలంగాణలోని తెలుగుదేశం కాంట్రాక్టర్, ఖమ్మం ఎంపీ నామానాగేశ్వర్‌రావు పార్టీలోని తెలంగాణవాదులలో ఒకనిగా ఉంటూ, తెలంగాణ నేతల ఐక్యతను దెబ్బతీస్తూ, చంద్రబాబుకు ఏజెంట్‌గా, తెలంగాణను వ్యతిరేకించే ఒక సామాజిక వర్గానికి ప్రతినిధిగా వ్యవహరిస్తున్నాడు. వేల కోట్ల మధుకాన్ గ్రూప్‌కు అధిపతి. తెలంగాణ ప్రజల ముఖ్యంగా తన జిల్లాలోని ఆదివాసులు వ్యతిరేకించే పోలవరం ప్రాజెక్ట్‌లో బడా కాంట్రాక్టర్. పోలవరం పూర్తి కావాలంటే తెలంగాణ రాకూడదు. బయటికి తెలంగాణవాదులతోనే ఉన్నట్లు కన్పిస్తున్నా రెండుకళ్ళ సిద్ధాంత బాబుకు నమ్మిన బంటు ఈ నామా.
తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకోవాలనే సీమాంధ్ర నేతల వైఖరికి అసలు కారణాలివి. తెలంగాణలో వేలకోట్ల వ్యాపారాలు చేస్తున్న సీమాంధ్ర సంపన్న వర్గాలు, పారిక్షిశామికాధిపతులు, వాణిజ్య వేత్తపూవరూ తెలంగాణను అడ్డుకోవడం లేదంటే వారికి పైన తెలిపిన నేతలకున్న అవినీతి, అక్రమాల చరిత్ర లేదు. నగరంలో స్థిరపడ్డ సీమాంధ్ర ప్రజలకూ అలాంటి దుష్ట చరిత్ర, దుష్ట బుద్దీ లేదు. బతుకు పోరాటం వారిది.
సీమాంధ్ర నేతల పాపాలు బద్దలయ్యే రోజు, మోసాల, అక్రమాల అవినీతి బాగోతం బయటపడే రోజు మరెంతో దూరం లేదు. ఆరిపోయే ముందు దీపం బాగా వెలిగినట్లు ఈ కుట్రదారులు తెలంగాణను అడ్డుకోవడానికి ‘ఆఖరి ప్రయత్నాలు’ చేస్తున్నారు.

Saturday, July 2, 2011

మరపురాని తెలంగాణ ముద్దుబిడ్డ

ఆయన ఎన్నోసార్లు వారించినా ఆయనను అందరూ తెలంగాణ సిద్ధాంతకర్తగానే గుర్తించారు. కొందరు కొంత చిన్నచూపుతో తెరాస సిద్ధాంతకర్తగానో, సలహాదారుగానో కూడ గుర్తించి ఉండవచ్చు. కాని ఆయన ఆ విశేషణానికి ఎన్నోరెట్లు మించిన తెలంగాణ ముద్దుబిడ్డ. మరపురాని తెలంగాణ మహావ్యక్తి.
ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ నిజంగా ఒక అరుదైన మానవతామూర్తి, ఒక ప్రజ్ఞావంతుడైన విద్యావేత్త, ఒక సమర్థుడైన విద్యా నిర్వాహకుడు, ఒక శక్తిమంతుడైన ప్రజామేధావి, ఒక అసాధారణమైన ఆలోచనాపరుడు-ఆచరణశీలి కలగలిసిన మహావ్యక్తి. మహాశక్తి. డెబ్బై ఆరు సంవత్సరాల జీవితంలో ఆరు దశాబ్దాల పాటు ఆయన తెలంగాణ స్వతంత్ర వ్యక్తిత్వం గురించి, తెలంగాణ ప్రజల ఆకాంక్షల గురించీ పనిచేశారు గనుక తెలంగాణ సిద్ధాంతకర్త అనే పిలుపు ఆయనకు అక్షరాలా సరిపోతుంది.
ఉన్నత పాఠశాల విద్యార్థిగా 1952 ముల్కీ ఆందోళనలో పాల్గొన్ననాటినుంచి, 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి మేధో పునాది అందించిన తెలంగాణ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ బాధ్యుడిగా ఉన్ననాటినుంచి, ప్రస్తుత తెలంగాణ ఉద్యమం దాకా అరవై సంవత్సరాల పాటు ఆయన తెలంగాణ ప్రత్యేక అస్తిత్వాన్ని, తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ఎత్తి చూపడానికి నిరంతరం ప్రయత్నిస్తూ వచ్చారు. 1950ల తొలిదినాలనుంచి 2011 దాకా ఆయన తెలంగాణ ఉజ్వల భవిష్యత్తు గురించి కలగంటూనే ఉన్నారు, పరితపిస్తూనే ఉన్నారు. ఆ కృషిలో ఎవరి కలిసి వస్తే వారితో కలిసి పనిచేస్తున్నారు. ఆ అర్థంలో ఆయనను తెరాస సిద్ధాంతకర్త అన్నా, తెలంగాణ సిద్ధాంతకర్త అన్నా అతిశయోక్తి కాదు. నిజానికి అంగీకరించినా అంగీకరించకపోయినా తెలంగాణ కోసం పనిచేస్తున్న రాజకీయ, రాజకీయేతర సంస్థలకూ వ్యక్తులకూ అందరికీ ఆయనే ప్రేరణ. లోలోపలనైనా ఆయన ఆరాధ్యుడు. కాళోజీ తర్వాత ఆ స్థానం దక్కేది జయశంకర్ కు మాత్రమే. కాళోజీకైనా తొలిరోజులలో విశాలాంధ్ర మహాసభ నేపథ్యం ఉన్నది గాని జయశంకర్ ఆదినుంచి తుదివరకూ తెలంగాణను మాత్రమే కోరుకున్నారు.
తెలంగాణ వ్యక్తిత్వం మాత్రమేకాక జయశంకర్ లో విశిష్టతలు ఎన్నో ఉన్నాయి. వ్యక్తిగా ఆయన స్నేహశీలి. వయోభేదం లేని స్నేహం ఆయనది. మనుషులపట్ల, తోటి మనుషుల ఇబ్బందుల పట్ల ఉద్వేగపూరితంగా స్పందించేవారాయన. ఎవరితోనైనా మృదువుగా, సాదరంగా, ప్రేమతో ప్రవర్తించేవారు. విద్యావేత్తగా ఆయన ప్రజ్ఞావంతుడు. పరిశోధకుడిగా, అధ్యాపకుడిగా, లోతైన విశ్లేషకుడిగా ఆయన కృషి మరవరానిది. ఆయన రచనల్లో, ఉపన్యాసాల్లో అది నిక్షిప్తమై ఉంది. ఆయన నిర్వహణ సామర్థ్యానికి అద్దంపట్టే పదవులూ ఎన్నో ఉన్నాయి. అధ్యాపకుల సంఘ బాధ్యుడిగా, వరంగల్ చందాకాంతయ్య స్మారక కళాశాల ప్రిన్సిపాల్ గా, సెంట్రల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ రిజిస్ట్రార్ గా, కాకతీయ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ గా, వైస్ చాన్సలర్ గా ఆయన నిర్వహించిన బాధ్యతలు, ఆ కాలాలు గర్వంగా గుర్తుంచుకోదగ్గవి.
హనుమకొండలో గడిచిన చిన్నతనంలో ఆయన నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు చేసిన వీరోచిత పోరాటాన్ని కళ్లారా చూశారు. బహుశా దుష్పరిపాలనకు వ్యతిరేకించే ప్రజల పోరాటశక్తి మీద అపారమైన విశ్వాసం ఆయన మనసు మీద చెరగని ముద్ర వేసి ఉంటుంది. అందుకే ఆయన జీవితమంతా పరాయిపాలకుల దుష్పరిపాలన మీద పోరాటానికి సిద్ధపడ్డారు. 1952 విద్యార్థి ఆందోళనలో భాగం పంచుకోవడం మాత్రమే కాదు, ఫజల్ అలీ కమిషన్ ను కలిసి హైదరాబాద్ ప్రత్యేక రాష్ట్రం కోరుతూ విజ్ఞప్తి పత్రం ఇచ్చిన విద్యార్థి బృందంలో ఉన్నారు. అలా 1950ల తొలినాళ్లలో పడిన నిప్పురవ్వ అరవై సంవత్సరాల పాటు ఆరకుండా జ్వలిస్తూనే ఉండింది. అర్థశాస్త్ర అధ్యాపకుడిగా, పరిశోధకుడిగా ఆయన తెలంగాణ వివక్ష మీద ప్రత్యేకంగానూ, ప్రాంతీయ అసమానతల మీద మొత్తంగానూ విశేష అధ్యయనం చేశారు. ఎన్నో రచనలూ ఆలోచనలూ చేశారు. అవన్నీ తెలంగాణ సమాజంతో ఎప్పటికప్పుడు పంచుకున్నారు. వందలాది సమావేశాలలో, సభలలో పాల్గొన్నారు. 1969 ఉద్యమ సమయంలో తెలంగాణ వివక్ష పై ఏర్పాటు చేసిన అసాధారణమైన సదస్సు నిర్వాహకులలో ఆయన ఒకరు.
1969 ఉద్యమం ద్రోహానికి బలి అయి ముగిసిపోయి, వెనుకంజ వేసిన తర్వాత ఆయన చాల నిశ్శబ్దంగా ఆ అపజయానికి కారణాలను, పునర్విజృంభణ అవకాశాలను అన్వేషిస్తూ ఉండిపోయారు. ఆ నిశ్శబ్ద కృషి 1990ల నాటికి ఫలితాలు సాధించింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తప్ప మరొక మార్గాంతరం లేదు అనే ఆలోచనకు 1990లనాటికి బహుజనామోదం లభించింది. 1990ల మధ్య నుంచీ అనేక సంస్థలు పుట్టుకువచ్చి ఈ ఆకాంక్షను వ్యక్తీకరించడం ప్రారంభించాయి. ఆ సంస్థలు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాటిమీద జయశంకర్ ప్రభావం నిరాకరించడానికి వీలులేనిది.
1971 తెలంగాణ ప్రజాసమితి ద్రోహం తర్వాత మొదటి రాజకీయ నిర్మాణంగా 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడడం కూడ ఆయన కృషికి కొనసాగింపే. ఈ పరిణామాలతో తన కల సాకారం కాబోతున్నదని ఆయన సంతృప్తి చెందినట్టు కనిపిస్తుంది. అయితే అప్పటికీ కొన్ని నిరుత్సాహాలు, ఆశాభంగాలు లేకపోలేదు. ఆయన వాటిని సన్నిహిత మిత్రుల దగ్గరా, అభిమానుల దగ్గరా వ్యక్తం చేసేవారు కూడ. కాని ఎన్ని లోపాలు ఉన్నా తెలంగాణను సాధించడానికి, ఒక రాజకీయ పార్టీ వెంట ఉండి కృషి చేయక తప్పదు అని ఆయన తనకు తాను నచ్చజెప్పుకునే వారు.
తెలంగాణ రాష్ట్ర సాధనకు మూడు ప్రధాన ఆధారాలున్నాయని ఆయన ఎన్నోసార్లు చెప్పారు. 1. రాజ్యాంగ అధికరణం (3) కింద పార్లమెంటులో బిల్లు పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే రాజకీయ ప్రక్రియ. 2. ఆ రాజకీయ ప్రక్రియను సక్రమంగా నడిపే, ప్రజల మద్దతును కూడగట్టే ప్రజా ఉద్యమం. 3. తెలంగాణ ప్రజలలో ప్రతిఒక్కరిలోనూ తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షలను నింపే భావజాల వ్యాప్తి, మేధో కృషి.
జయశంకర్ అరవై సంవత్సరాల పాటు భావజాల వ్యాప్తి, మేధోకృషి సాగించారు. మూడు దశలలోనూ ప్రజా ఉద్యమాలు వెల్లువెత్తినప్పుడు వాటిలో పాల్గొన్నారు. గత పది సంవత్సరాలలో రాజకీయ ప్రక్రియను ప్రభావితం చేయడానికి ప్రయత్నించారు. అంటే ఆయన తాను చెప్పినమాటకు అక్షరాలా, మనసా వాచా కర్మణా కట్టుబడ్డారు. ఆ కృషి కొనసాగించడమే ఆయనకు నివాళి.