Tuesday, August 30, 2011

ఆత్మహత్యలు వద్దురా, తెలంగాణా ముద్దురా...



Wednesday, August 24, 2011

విష నాగు… మరో విష నాగు…కందిరీగ

విష నాగు… మరో విష నాగు…
తెలంగాణ సమాజాన్ని, మానవ సంబంధాల్ని, సంస్కృతిని, ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షనీ అనహేళన చేస్తూ విషం చిమ్మిన సినీ విష నాగు.
అది కందిరీగ రూపంలో ముందుకొచ్చింది.

55 ఏళ్ళ ముదనష్టపు సమైక్య రాష్ట్రంలో ఎద నిండా గాయాలూ, గుండె కోతలూ తెలంగాణకు కొత్త కాకపోయినా ఆంధ్రా ఆర్ధిక, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక ఆధిపత్యాన్ని ఈ ప్రాంతం ప్రశ్నిస్తోన్న, ప్రతిఘటిస్తోన్న తరుణంలో ఆ విషనాగు ‘కందిరీగ’ వేషం కట్టి తెలంగాణలో తిరుగుతోంది . ఇది ఆంధ్రా జాత్యాభిజాత్యానికి, అహంకారానికి తిరుగులేని ఉదాహరణ, ప్రతినిధి. అయినా ఈ ఘోర అవమానాన్ని గుర్తించలేని, గర్హించలేని అమాయకత్వం తెలంగాణ ప్రజలది.

కథ లోకి పోతే, కథానాయకుడి ఊరు, ఇంకెక్కడా… అదే ఆంధ్రా, అదే అనకాపల్లి. తల్లితండ్రులు 23 ఏళ్ళ వయసొచ్చినా తనకు పెళ్లి చేయడంలేదని ఆ విషయంతో ఏ విధంగానూ సంబంధం లేని ఒక అమ్మాయిని పెళ్లి పీటల మీదినించి ‘లేపుకొస్తాడు’. ఇది ‘హీరో’ పరిచయపు సన్నివేశం. ఆ తర్వాత డిగ్రీ కూడా పాసవని వాణ్ని పెళ్లి చేసుకోనని తన మరదలు చీదరించుకోవడంతో రేషంతో శపథం చేసి ట్రైనులో హైదరాబాదు బయలుదేరతాడు. అదే ట్రైనులో, అదే అనకాపల్లిలో తెలంగాణా యాసలో మాట్లాడే ఈవ్ టీజర్స్ బారి నుండి అమ్మాయిల్ని రక్షించి, ఆ రౌడీలకు ‘అమ్మాయిల్ని అల్లరి చెయ్యాలి కాని, అల్లరిపాలు చెయ్యకూడదు’ అని గీతోపదేశం చేస్తాడు. అంతే! ఆ ‘హీరోచిత’ ఫైటింగుకు, తర్వాతి ప్రవచనానికి అమ్మాయిలంతా ఫ్లాట్! మన ఖర్మ కాలి అలా ‘పడిపోయిన’ వారిలో మన తెలంగాణకు, వరంగల్లుకు చెందిన అమ్మాయీ ఉంటుంది.

హైదరాబాదు చేరుకున్న హీరో గారు(శీను) కాలేజీలో చేరతారు. అక్కడ మొదటి చూపులోనే శృతి అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు.

విశేషమేమిటంటే ఈమె తండ్రి ఆంధ్రా బ్యాంకులో ఉద్యోగి. ఆ ప్రస్తావన ఎందుకో తర్వాత చెప్తాను. ఇహ షరా మామూలుగానే విలన్లూ, ఫైటింగులూ ! మొత్తానికి హీరో తన చచ్చు, పుచ్చు ‘అతి తెలివితో’ తన ప్రేయసిని రక్షించుకుంటాడు. సుఖాంతమయ్యిందనుకున్న కథ మరో మలుపు తిరుగుతుంది. అప్పటికి ఒక గంటే అయ్యింది మరి!

శ్రుతిని వరంగల్ రాజన్నకు చెందిన మనుషులు కిడ్నాప్ చేస్తారు. అనకాపల్లిలో హీరో గారి వీరోచిత యుద్ధ ప్రావీణ్యానికి, ప్రవచనానికి ‘పడిపోయిన’ అమ్మాయిల్లో ఈ రాజన్న కూతురు ఒకరు. ఆమె శీనుగాడిని తప్ప మరెవర్నీ పెళ్ళిచేసుకోనని జిద్దుకు కూర్చుంటుంది. శ్రుతిని కిడ్నాప్ చేస్తే, ఆమెను ప్రేమిస్తున్నాడు కాబట్టి శీను కూడా వరంగల్లుకు వస్తాడు.

అదీ లింకు. అదే జరుగుతుంది. కాకతీయ తోరణమున్న ఒక పెద్ద భవనంలో రాజన్న మందీ మార్బలంతో ఉంటాడు. గమ్మత్తేమిటంటే ‘రాయలసీమ’ ‘మర్యాద రామన్న’ సినిమాను చిత్రీకరించిన ఇంటి లోనే ఈ సన్నివేశాల చిత్రీకరణ జరిగింది. ఇదేం అపరాధం కాదు కానీ, రాయలసీమ ప్రాంత గృహ నిర్మాణ పధ్ధతి ప్రతిబింబించేలా సెట్ వేసుకున్నామని చెప్పుకున్న ఇంట్లో తెలంగాణ ప్రాంతమని చెప్పి షూట్ చేయడాన్ని బట్టి దర్శకుడికి టేస్ట్, శ్రద్ధ, నిజాయితీ వంటివేవీ లేవని రుజువవుతుంది. మొత్తానికి ఒక తోరణాన్ని ఇంటి ముందర పెట్టి వరంగల్ అనిపించారు, కథ నడిపించారు.

ఇహ ఇక్కడ మొదలౌతుంది విష నాగు విశ్వరూపం! సారీ! అదే ‘కందిరీగ’ విశ్వరూపం!

మొట్ట మొదటి సీన్ నుంచే రాజన్న కూతురిని (సంధ్య) ఒక తెలివితక్కువదానిలా చూపిస్తాడు దర్శకుడు (అమాయకత్వానికి, తెలివితక్కువతనానికి చాలా తేడా ఉంది!).

హీరో గారు కూడా ‘తింగరబుచ్చి’, ‘ఇంత వయోలెంట్ గా ఎలా పుట్టావే!?’ అని అనడం ద్వారా, ఇంకా అసహనం, అవహేళన కూడిన వాచికం, అభినయంతో ఈ విషయంలో మనకేమైనా అనుమానలుంటే పూర్తిగా నివృత్తి చేస్తాడు. ఇక సంధ్యకు తనపై ఉన్నది ప్రేమ కాదనీ, ఇష్టం మాత్రమేనని, నిజమైన ప్రేమ కలిగితే గుండె గంటలు మోగుతాయని జ్ఞానోదయం ప్రసాదిస్తాడు. అయితే తర్వాతి సన్నివేశంలో హీరోకి బద్ద శత్రువైన భవానీని అనుకోకుండా గుద్దుకుంటుంది సంధ్య. భవానీ సంధ్యను కింద పడకుండా పట్టుకుంటాడు. చూపులు కలుస్తాయి. అదే సమయంలో ఇంటి బయట ఒక ఎద్దు మెడలో కట్టిన గంటలు మోగుతాయి. ‘గంట మోగింది’ కాబట్టి అదే ప్రేమ అనుకునేంత ఎడ్డిదానిగా (తెలంగాణా, వరంగల్ పిల్ల కదా!) చూపిస్తాడు దర్శకుడు. దార్శనికుడు మరి! ఇది చాలదన్నట్టు చివర్లో సంధ్యకు నత్తి అనే మరో ఆభరణం తగిలిస్తాడు. ఎందుకంటే విలన్ భవానీకి కూడా నత్తి ఉంటుంది. కాబట్టి ఇద్దరూ సరిజోడని వారి అభిప్రాయం కావచ్చు. ఎందుకంటే రాజన్న, భవానీ ఇద్దరూ గూండాలే కదా! మరి చిల్లర మల్లర గాడైన శీనుకి, ‘ఆంధ్రా’ బ్యాంకు ఉద్యోగి కూతురెందుకో? ‘రాయలసీమ మురిసిపడేలా’ రామినీడు కూతురు ‘తెలుగమ్మాయి’ అయినట్టు, ‘తెలంగాణ’ మురిసిపడేలా రాజన్న కూతురు ఎందుకు ‘తెలుగమ్మాయి’ కాలేకపోయింది? ‘తెలివితక్కువదెందుకయ్యింది’? ఎందుకంటే ఇది ‘సమైక్య’ రాష్ట్రం కాబట్టి!

‘ఇల్లే ఇంత అందంగా ఉంటే బావగారెంత అందంగా ఉంటారో’ అని ముందు చంద్ర మోహన్ పాత్రతో అనిపించి వెంటనే మర్డర్ చేసిన కత్తి రక్తంతో కాబోయే వియ్యంకుడికి రాజన్నచే తిలకం దిద్దిస్తాడు దర్శకుడు. రాజన్న పాత్రను జయప్రకాశ్ వేశారు. అలవాటులో పొరపాటుగా ఇది రాయలసీమ సినిమా అనుకున్నాడేమో పాపం దర్శకుడు! ఒక అమర్యాదస్తుడిగా, సంస్కారంలేని వ్యక్తిగా రాజన్నను చిత్రిస్తాడు. అక్కడితో అయిపోదు. కాబోయే మామగారిని సంధ్యకు పరిచయం చేస్తాడు రాజన్న. అదేమీ పట్టించుకోకుండా, కనీసం పలకరించకుండా కేబులోన్ని ‘బొక్కల నూకు’ మంటుంది సంధ్య. తెలంగాణా అమ్మాయిని మర్యాద తెలిసిన వ్యక్తిగా చూపించడం ఇష్టం లేదు కావొచ్చు దర్శకుడికి.

ఇది టూ మచ్ అంటారా? వెంటనే తండ్రి నమస్కరించమంటే సంధ్య ఏమంటుందో చూడండి. ‘ చల్… గా పొట్టి సాలెగాడు… గానికి నేను మొక్కుడేంది? నేన్మొక్కా..’ దానికి రాజన్న ‘అర్రే.. గాయన నీ మామ… మంచిగుండది…’ అంటాడు. అయితే తర్వాత సన్నివేశంతో లిబరల్స్ ఇంకా ఎవరైనా ఉంటే వారికి కూడా విషయం అర్థం అయ్యేలా జాగ్రత్త పడ్డాడు దర్శకుడు. శ్రుతిని తన తండ్రికి పరిచయం చేస్తాడు శీను. వెంటనే శృతి ‘పద్ధతిగా’ కాబోయే మామకి నమస్కరిస్తుంది. ఎంతయినా ‘ఆంధ్రా’ బ్యాంకు ఉద్యోగి కూతురు కదా! వినయం, విధేయత, సంస్కారం అన్నీ ఆంధ్రా వారి గుత్త సోత్తాయే!

ఈ సినిమాలో తెలంగాణ ప్రాంత వేషధారణ చేసిన వారు వింత వింతగా కన్పిస్తుంటారు. ఉదాహరణకు రాజన్న శత్రువు ఒకడు అడుగు స్థలం కోసం 500 ఎకరాల భూమిని అమ్ముకుంటాడు. పరువుకోసం అన్నట్టు చూపిస్తాడు దర్శకుడు. అంత ఎర్రోడు అని అయ్యవారి అభిప్రాయం. వేల ఎకరాల భూములను రియల్ ఎస్టేట్ గద్దలనుండి ఎలా కాపాడుకోవాలో తెలంగాణ వారికి తెలియకపోవడం నిజంగా ‘ట్రాజిడీయే’! దాన్ని కూడా కామెడీ చేయగల ప్రజ్ఞా పాటవాలు కేవలం ఆంధ్రా వారికే ఉన్నాయి. అట్లే ఈ పాత్రధారులు మాట్లేడే యాస కూడా చాలా చికాకు పెడుతుంది. సంధ్య ఎన్నిసార్లు ‘చల్’ అన్నదో, రాజన్న ఎన్నిసార్లు ‘తోడ్కలు తీస్తా’ నన్నాడో లెక్క పెట్టలేకపోయాను. అసలు ఇట్లాంటి యాస వరంగల్ జిల్లాలో ఎక్కడ, ఎవరు మాట్లాడతారో చెబితే దర్శక నిర్మాతలకు పాదాభివందనం చేసుకుంటాను.

తెలంగాణ యాసలను న్యూనపరిచే, అవహేళన చేసే, కింఛపరిచే ఇలాంటి సన్నివేశాలను అనేక సినిమాలలో గత 55 సంవత్సరాలుగా భరిస్తూనే ఉన్నాం. ఇంకెంతకాలం?

ఇప్పటి వరకూ తెలంగాణను ప్రతీకాత్మకంగా ఎట్లా అవమానించాడో చూసాం. ఇది ఒక ఎత్తయితే ఒక పాటలో తెలంగాణా ఉద్యమాన్నీ, తెలంగాణా వాదుల్నీ, తెలంగాణా ఉద్యమకారుల్నీ చులకన చేయటం మరో ఎత్తు! ‘ప్రేమే పోయినాదిలే’ పాటలో పూర్తిగా దిగజారుతాడు దర్శకుడు, పాట రచయిత.

‘… అల్లుడే రెడీ అంటే తెలంగాణ తెప్పించేస్తా…’ అంటాడు రాజన్న. అదేదో ఆ అల్లుడుగారి, ఈ మామగారి ప్రైవేటు వ్యవహారమన్నట్టు! ఈ లైన్ తర్వాత ఒక్కసారి స్క్రీన్ ఫ్రీజ్ అవుతుంది. అందరూ ఆముదం తాగిన మొహాలు పెడతారు. తర్వాత రాజన్న బామ్మర్ది ‘ మంచిగున్న బావని వీడు మెంటల్ గాన్ని చేసాడంటా…’ అని అందుకుంటాడు. అంటే తెలంగాణాని కోరుకోకపోవటం ‘మంచిగ ఉండటం’, కోరుకోవటం ‘మెంటల్’ గా అయిపోవటం! సదరు బామ్మర్ది ఇంటలిజెన్స్ డిపార్టుమెంటులో పనిచేయటం యాదృచ్చికమేనా?

దీంతో ఇప్పటివరకూ ఇస్తూ వస్తున్న ‘బెనిఫిట్ అఫ్ డౌట్’కు ఈ సినిమా పూర్తిగా అనర్హమౌతుంది! తెలంగాణ వాడి గుండె మండుతుంది, రక్తం మసలుతుంది. సమైక్యవాదం ఒక ఫార్సు కాకపోతే ఈ పాటికే సున్నితమైన ప్రస్తుత సందర్భంలో ఇలాంటి రెచ్చగొట్టే సినిమా తీసినందుకు సీమాన్ధ్ర ప్రాంత ప్రజలు ఆ దర్శక, నిర్మాతలను నిలదీయాలి, ప్రశ్నించాలి. కాని అది జరగలేదు, జరగదు! ఇప్పటికే ‘అన్నదమ్ముల్లా విడిపోదాం, ఆత్మీయుల్లా కలిసుందాం’ నించి ‘ప్రాంతాలుగా విడిపోదాం ప్రజలుగా కలిసుందాం’ వరకు వచ్చింది పరిస్థితి.

తెలంగాణ ఏర్పాటు అనివార్యం, తథ్యం! అయితే తెలుగువారి మధ్య ఈ విభజన భౌగోళికమే కాని మానసికం కారాదన్నా, పరస్పర అభిమానం, గౌరవం కొనసాగాలన్నా ‘కందిరీగ’ లాంటి సినిమాలను సీమాంధ్ర ప్రజలు తిరస్కరించాలి. ‘కందిరీగ’ రూపంలోని ఈ విషనాగు సీమాంధ్రలోని కోంతమంది స్వార్థపరుల, పెట్టుబడివర్గాల, ఆభిజాత్యం, ఆధిపత్యం, అహంకారం, ప్రాంతీయతత్త్వాలకు పుట్టిన విష పుత్రిక. వీటిని సమూలంగా నాశనం చేస్తేనే తెలుగువారి మధ్య భావ ఐక్యత సాధ్యం!

చేయీ చేయీ కలపటానికి తెలంగాణా ఎప్పుడూ సగానికంటే ఎక్కువ దూరం నడవటానికి సిద్ధమే!

- మాధవ్

Tuesday, August 23, 2011

లోక్ సత్తా లో నాకో బహుమానం..

లోక్ సత్తా లో నాకో బహుమానం..
మిత్రులారా, అందరికీ వందనాలు.. నేనిక్కడ ఈ పోస్ట్ ఎందుకు రాస్తున్నాంటే, ఇలాంటి అనుభవం మరెవ్వరిని కలుగకూడదు అనే ఉదేస్యంతోటి మాత్రమే. అంతేకాదు ఇది నా స్వీయానుభవం కూడా..
నేను మొదట్లో లోక్ సత్తా ఒక ఉద్యమం గా ఉనపుడు దానికోసం పని చేసాను, రాజకీయాల్లోకి రావడాన్ని తీవ్రంగా వ్యతిరేకించి, పార్టీ పెట్టాక వదిలేసాను.. ఇక్కడ మీకో విషయం చెప్పాల్సినదేంటంటే, నేను ఎపుడు కూడా ప్రత్యక్షంగా లోక్ సత్తా లో మెంబెర్ ని కాలే.. ఒక విధంగా బయటి మద్దతు.. నేను చాలా కాలం క్రితం, FB లో నా ఎకౌంటు తాయారు చేసినపుడు, లోక్ సత్తా గ్రూపు లో జాయిన్ అయ్యాను.. కానీ ఎపుడు కూడా నేను ఎలాంటి డిస్కసన్ లో అంత ఆక్టివ్ గా లేను, ఎందుకంటే నాకు అంతకు ముందే అర్ధం అయింది ఏంటంటే, అందులో ఉన్నవాళ్ళంతా చేపెదోకటి చేసేదొకటి.. పైకి మాత్రమే సిద్ధాంతాలు, చేసేదంతా వారికిష్టం వచ్చింది అని..
ఒకప్పుడు నేను జర్మనీ లో ఉన్నపుడు, కొందరు లోక్ సత్తా నాయకులూ నాకు మెస్సేజెస్ కూడా పంపారు, మీ ఊరిలో కొన్ని మంచి పనులు చేద్దాం, మీలాంటి వారు మాకు తోడుగా ఉండాలి అని.. నాకు వ్యక్తిగతంగా లోక్ సత్తా మీద అంత మంచి అభిప్రాయం లేకున్నా, చెడు అభిప్రాయం మాత్రం లేదు, పార్టీ గురించేమో కాని, ఆ మిత్రుడి మాటలు ఎందుకో వినాలి అనిపించి సరే అనుకున్నా..

ఇక ఈ మధ్య నేను కొంచెం active గా ఉండడానికి ముఖ్య కారణాలు ఏంటంటే, కొంతమంది నా మిత్రులు (లోక్ సత్తా కి strong suporters ) లోక్ సత్తా లో democracy ఉంటుంది అని చెప్తే నవ్వుకున్నా (నాలో నేనే), అయితే కొన్ని రోజుల క్రితం, నేనొక పోస్ట్ చూసా, అదేంటంటే ఒక పేరు చెప్పుకోవడానికి ఇష్టపడని ఒక సీమంధ్ర యువకుడు తెలంగాణా గ్రూపుల గురించి మరియు దాని admins ని చాలా చులకనగా చేసి మాట్లాడుతుంటే వాడికి సరైన జవాబు ఇచ్చి వాడి నోరు మూయించా, అప్పుడు డిసైడ్ చేస్కున్న, ఇంత మంది సదువుకున్నోల్లు ఇక్కడ ఉన్నారు కనీసం వీళ్ళలో ఉన్న ఒకరిద్దరయినా అర్ధం చేస్కోలేక పోతారా మన భాదలను అని ఆ గ్రూపులో తెలంగాణా గురించి discussions స్టార్ట్ చేశా.. నేను పెట్టిన pro -తెలంగాణా పోస్ట్ లకి 300 లకు పైగా comments వచ్చిన సందర్భాలు ఉన్నాయి.. అపుడు నా మిత్రుడొకరు, నీ పోస్ట్ గిన్నిస్స్ బుక్ లో రికార్డు అయ్యేలా ఉంది అని అంటే నేను ఎమన్నా అంటే, " అన్నా, ఏదో ఒక రోజు నన్ను ఖచ్చితంగా ఈ గ్రూప్ నుండి తీసేస్తారు " దానికి నా మిత్రుడు ఏమన్నాడు అంటే "నో ఛాన్స్" .. సరే చూద్దాం అని అనుకున్నా, మనసులో .. ఆ పోస్ట్ లను చూసిన కొంత మంది సీమాంధ్ర వాళ్ళు, నాకు పర్సనల్ massages కూడా పెట్టారు, "ఆ పోస్ట్ ని delete చేయండి, నాకిష్టం లేదు ఆ పోస్ట్, తొక్క తోలు అని ఏదో ఏదో "అన్నారు, నేనోకటే అన్న" నువ్వేదన్నా మాట్లాడాలి అనుకుంటే అక్కడే కామెంట్ చేయి " అని, ఇంకొందరు " మీరు చాలా మంచి పని చేస్తున్నారు, keep it up " అని moral support చేసారు.. అందులో ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్న మన తెలంగాణా వాదులయితే ఏకంగా నాతో పాటు ఆ debate లో పాల్గొని మేము సైతం తెలంగాణా కోసం అంటూ నాతో చేయి కలిపారు... అందులో ముఖ్యంగా ఉదయ్ , సతీష్, రమ్య లాంటి వారు... thanks alott to all who supported me in this way.. ఇలా మేము కొంచెం పనే చేస్తున్నాం అనుకున్నాం ఐనా కూడా మా మనస్సులో ఒకటే ఉంది, "ఎపుడో మనకు ఈ గ్రూప్ నుండి మమ్మల్ని compulsory గా remove చేస్తారు" అని ... మరి కొందరైతే, ఏకంగా ఇలాంటి పోస్ట్ లు మీ తెలంగాణా గ్రూప్ లో పెట్టుకోండి అకడ అయితే మీకు ఫుల్ సపోర్ట్ వస్తుంది, ఇక్కడ పోస్ట్ చేయకండి అని... అయినా ఊరుకున్నం... కొంతమంది మేథావి వర్గం అయితే మమ్మల్ని ఫూల్స్ అంది, అయినా భరించాం.. ఇంకొంతమంది తమ తమ ప్రత్యేక భాషలో మమ్మల్ని రెచ్చగొట్టారు అయినా మేము సర్దుకున్నాం.. మంచి మాటలతో సమాధానం ఇచ్చాం...

అలా కొంత మందిని మా శక్తి మేరకు convinience చేయగలిగాం... అది మేము సాధించిన మొదటి విజయం గా భావించాం... ఇలా ఎన్నో విషయాల్లో సాధ్యమయినంత వరకు మేము మా అభిప్రాయాలను పంచుకున్నం. ఇంకా కొందరైతే, మా వల్ల, మా పోస్ట్ ల వల్ల గ్రూప్ అంత నాశనం అవుతుందని పబ్లిక్ గా అరిచి గీపెట్టారు.. కొంతమంది pseudo మేధావి వర్గం వారికి వంత పడింది.. సర్లే ఎవరి ఇష్టం వారిది అనుకున్నాం.. pro -తెలంగాణా పోస్ట్ లకు వందల కొద్ది comments (debate) రాగా anti -సమైక్యాంధ్ర పోస్ట్ లకి ఒక్క రిప్లై వచ్చింది..అది కూడా anti telangana context lo... అది వారి నిజమైన మనస్తత్వానికి నిదర్సనం..
ఇలా మేము- ''చదువుకొని, సొసైటీ కి మంచి చేద్దాం అని వచ్చిన JP కి మా తెలంగాణా ప్రజల గోస కనపడ్తలేదా'' అని భహిరంగంగా, వారి గ్రూప్ లోనే మాట్లాడినం.. శత్రు గడ్డ మీదకెళ్ళి మరీ పోరాడుతున్న సైనికుల్లా మేము గర్వపడ్డాము.. మాకు తెలుసు వీళ్ళంతా (more than 90 % అఫ్ LSP people ) మాట్లాడుతారు తప్ప చేయడం ఏమీ ఉండదు అని.. అయినా కూడా ఏదో చిన్న ఆశ మా మనస్సులో, ఎవరైనా ఒకరు మాది న్యాయమైన పోరాటం అని ఒప్పుకుంటారేమో అని.. మేము అనుకున్నదానికి మించి మేము సాధించాం.. కొంతలో కొంత అన్నట్లు కొందరు మా వాదనలతో అంగీకరించారు. ఇంకొందరు మాతో దోస్తీ చేసారు...వాళ్ళ మనసులో ఏముందో మాకైతే తెలీదు కాని మేము మాత్రం మన సొసైటీ బాగు కోసం sincere గా పని చేసేవాళ్ళని దోస్తీ చేసాం...
అదే సమయంలో అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న అన్నా హజారే మీద ఒక మంచి పోస్ట్ చేస్తే, నన్ను తెలంగాణా విషయంలో ఎదిరించిన కొందరు బాగుందని అన్నారు.. అబ్బో అనుకున్నా.. మొన్న ఒక సభ లో విద్వేషాలు పెంచి ప్రాంతాలను విభాజించోడ్డు అన్న JP comments కి వ్యతిరేకంగా నా మిత్రుడొకరు ఒక పోస్ట్ చేసారు.. దానిని సమర్ధిస్తూ నేను కూడా వాదించా.. ఎంతో వినయంగా అయ్యా అంటూ జవాబు రాసా.. నేను రాసినదాంట్లో ఉన్న తప్పేంటంటే, JP కి వ్యతిరేకంగా రాయడమే ( అలా నేను రాయడం మొదటి సారేమి కాదు) .. JP ని పొగుడుతూ రాస్తే ఎంతో మంది నన్ను మెచుకునే వారేమో?? ఒకానొక సందర్భంలో JP ని కొట్టిన మల్లెషన్న ని సమర్దిన్చాము, AP భవన్ లో చందర్ రావు ని కొట్టి సారి చెపిన హరీష్ రావు ని సమర్దిన్చాము... JP నోరు తెరువాలి అని గట్టిగా అరిచాము.. అలా చేయకపోతే చదువుకొని, రాజకీయాల్లో మార్పు తెద్దామని , రాజకీయం చేస్తున్న JP కి మిగతా వారికి తేడా ఏమి లేదు అని అన్నాము.. నిజమే కదా మరి..
ఇలాంటి discussions నుండే నా మిత్రుడొకరు pseudo intellectuals / pseudo social activists అంటూ ఒక నోట్ పెట్టాడు... ఒక రకంగా ఆలోచిస్తే ఇది కరెక్టే అనిపిస్తుంది...

సమాజంలో మార్పు తెద్దామని కల్లెక్టర్ పదవిని తృణప్రాయంగా వదులుకున్న, ఒక IAS మేధావి, ఇలా అన్యాయం మీద పోరాడుతున్న ప్రజలను పట్టించుకోక పోవడం ఎంతవరకు సమంజసం?? అది తనలోని ఆంధ్ర అహంకారామా లేక, తెలంగాణా పట్ల వివక్షా లేక ఆ ఏమి చేస్తారు లే ఈ తెలంగాణా ప్రజలు అనే నిర్లక్ష్య ధోరణియా ..??
అసలు సమాజ బాగు కోరే వాడెవడైనా ఇలాగే చేస్తాడా? ఒక ప్రాంతానికి ఒక న్యాయం ఇంకో ప్రాంతానికి ఇంకో న్యాయమా?? అంటూ గొంతేత్తాం...
చివరకు మాకు లభించిన బహుమానం ఏంటో తెలుసా ... ఆ గ్రూప్ నుండి మమ్ములను remove చేసారు.. అది లోక్ సత్తా లో ఉన్న ''democracy ''. ఇది వారు కోరుకునే మార్పు.. ఇది వాళ్ళ లక్ష్యం.. ఇది వాళ్ళు తెచ్చే మార్పు.. ఇలాంటి వారు సొసైటీ ని ఏం బాగు చేస్తారో??
My sincere thanks to ravindra nandam, srinivas rao, sri atluri, sravanth reddy, sekhar chandra, vivek joginapally, alleni ramya, satish siripuram, udaykanth and many more for giving your support in many ways... and all the best to my friends who are still beleiving in LSP..
వ్యక్తి పూజ కు వ్యతిరేకం అనే JP తన పార్టీ లో చేసే వ్యక్తి పూజ కనబడడం లేదా, ఓ JP సారూ..?? ఈ మీ గ్రూప్ లో చేస్తున్నది అంత మీ భజనే.. అది తెల్సుకో JP సారూ... నీ లక్ష్యాన్ని మాటల్లో కాదు, చేతల్లో చూపెట్టు కొంచెం... ఓ నా మిత్రులారా, మీ పార్టీ నిజం గా మార్పు కోసమే పుట్టినట్లితే, నిజంగా సొసైటీ బాగు కోసమే పని చేస్తున్నట్లయితే, ఇంకా మిగతా పార్తీల్లాగా కాకుండా ఒక single stand తీసుకోమను.. ఎపుడు అడిగిన కొన్ని రోజుల్లో LSP నుండి గుడ్ న్యూస్ వింటావ్ అంటారు కాని ఎపుడో చెప్పరు... కొంచెం దిమాగ్ తో అలోచించి మాకు చెప్పరు.. ఇంకెన్ని రోజులు వెయిట్ చేయాలి?? మిగతా పార్టీలతో ఏ విధంగా తేడానో చెప్పండి మీ పార్టీ...

Sunday, August 7, 2011

ఎపిలో విచిత్రమైన పరిస్తితి- చిదంబరం!

ఎపిలో విచిత్రమైన పరిస్తితి- చిదంబరం!

చిదంబరం గారు సెలవిచ్చారు, ఇక్కడ విచిత్రమైన పరితిస్తితి ఉందని. కొద్దిగా అచ్చుతప్పులు ఉన్నాయనుకుంటా చిదంబరం , మిమ్మల్ని మీరు అనుకోబోయి నోరు జారి ఉన్నట్టున్నారు. మీకు పరిపాలనా సామర్ధ్యమే లేదనుకున్నాము కాని, మానసిక వైకల్యం కూడా వుందని ఇపుడే అర్థం ఐతుంది, మా కళ్ళు తెరిపించినందుకు శత కోటి దండాలు. అపుడు తెలంగాణా పై ప్రకటన ఇచ్చింది నేను కాదు మా ప్రభుత్వం అనుకుంటూ, ఇపుడు మాత్రం పరిస్తితి క్లిష్టంగా, జటిలంగా, అయోమయంగా, ఆందోళనగా ఉందంటూ దాట వేస్తున్నారు, పూటకొక మాట మాట్లాడే వాళ్ళని ఏమనాలె? ఏమిటి మీ భాద చిదంబరం? మా ప్రజా ప్రతినిధులు ఎట్లాగు మిమ్మల్ని అర్థం చేసుకోలేక పోతున్నారు, కనీసం మాకైనా చెప్పండి. మేము చాల మంది జోకర్లని భారిస్తున్నాము, మీరెంత మాకు? ఇప్పటికే మీ పుణ్యమా అని మాకు ఈ దేశం లో స్వతంత్రం ఉందా, అసలు ఇక్కడ ప్రజాస్వామ్యం అనగా ఏమి? పార్టీలు అనగా ప్రజలను పీడించుకుని, శవాల మీద రాజకీయాలు చేయును, వగైరా వగైరా ప్రశ్నలు వేసుకుంటూ, ఎన్నో విషయాల గురించి తెలుసుకో గలుగుతున్నాము. మీ పరిస్తితి ఎంత విచిత్రంగా ఉందొ, మీరు బఫూన్ల కంటే ఘోరంగా ఉన్నారు, మీరు కేంద్రం లో భాద్యతా యుత మైన స్తానంలో ఉన్నారంటే, మా దేశ భద్రతా మీద మాకు ఆందోళనగా ఉంది, నిన్నటి మీ మాటకి, ఇవ్వాల్టి జవాబుకి పొంతన లేదు, మేము మా నాయకులే పిచ్చి అనుకున్నాం కాని, మొత్తం కాంగ్రెస్ పార్టీ ఇట్లా నిర్వీర్యం అయిపాయింది అని తెలుసుకోలేక పోయినం. మాకు ప్రభుత్వాలు పోయి రెండు సంవత్సరాలు ఐతుంది, ఇక్కడ ఏమి లేదు, బూడిద తప్పితే, రేపటి పై ఆశలు లేవు, ఇపుడు మా ముందు ఉన్నది ఒకే ఒక్క కోరిక , పొద్దున్నే ఏ చావు వార్త వినకుండా ఉంటె బాగుండును అని. అసలు ఈ దేశ రాజకీయాలే విచిత్ర మైన స్తితిలో ఉన్నాయి, ఈ దేశంలో ఒక పార్టీ ఒక సిద్ధాంతం ఉండును అనుకుంటే చాల పొరపాటు. ఒక పార్టీ రెండు కళ్ళు, నాలుకలు..కేర్ ఆఫ్ మాత్రం ఒకే సోనియమ్మ. మా ప్రతినిధులు, మీ ప్రతినిధులు..ఇదే అన్ని పార్టీలలోనూ ఉన్నది. మరి రెండు ప్రభుత్వాలు ఉంటె ఏంది? ఇది చూసి కూడా మీకు అర్థం ఐతలేదంటే మీ పరిస్తితి..మెంటల్ హాస్పిటల్ డిల్లీలో లేకపోతె మా ఎర్రగడ్డకి రండ్రి అందరు..మా గుండె చాల పెద్దది, శత్రువులని కూడా మంచిగానే చూస్తాం. కాంగ్రెస్ వాళ్ళందరికీ ఆమోద యోగ్యమైన నిర్ణయం తీసుకుంటార? అంటే ఏంది? అసలు అంత ఉంటె, ఇంత ఉద్యమం ఎందుకు చిదంబరం? మీ పార్టీలో రెండు ప్రాంతాలల్లో ప్రజలు విదిపోఇనారు కదా? దాని అర్థం ఏమి మహానుభావా? వారు మిమ్మల్ని బహిష్కరించారని అర్థం..మీకు డబ్బు మూటల మీద అంత ప్రేమ ఉంటె ఏదైనా వ్యాపారం పెట్టుకొని ఉండొచ్చుకదా? నువ్వు దేశాన్ని దోచుకొని, విదేశీయులకి అమ్ముతున్నవన్న సంగతి, నీ 'వేదాంతం', నీ మైనింగులు లాంటి వార్త విన్నపుడే అందరికి తెలిసింది..నువ్వు సోనియమ్మ కలిసి దేశాన్ని అమ్ముకొని పోవాలని చూస్తున్నారా ఏంది? అంత లేదు చిదంబరం, ఇక్కడ ఉన్న వాళ్ళని చాల చిన్న చూపు చూడకు , ఆతరువాత చూడడానికి కళ్ళు ఉండవు, వినడానికి చెవులు ఉండవు..మెంటల్ గా పిచ్చి వాడివి ఎలాగు అయిపోయారు, ఇంకా శారీరక వైకల్యం గురించి కూడా ఆలోచించండి. నువ్వు ఏకాభిప్రాయం మాట ఎత్తావంటేనే అది బోగస్, అపుడు కృష్ణ కమిటీ వేసినపుడు కూడా ఇదే మాట మాట్లాడిన్రు.. మీ కాలయాపన వల్ల పానాలు పోతున్నాయిర హౌలే! ఎం చదువు చదువు కున్నారురా? సమస్యలకి పరిష్కారం డబ్బు మాత్రమె అని చెప్పిన్రా? మా చావులు కదిలించవు, బందులు, సమ్మెలు, నిరాహార దీక్షలు చివరికి మీ వోల్లు రాజీనామా చేసినాకూడా చలించరా?

మావోల్లకి సిగ్గులేదు అనడానికి ఒకటే నిదర్శనం, ఇంకా మీ వెనుకబడి తిరగడం, మీ పైన అపార నమ్మకం కలిగి ఉండడం. ఒకాయన అంటడు, మేము టిడిపిని ఒప్పించుకోవాలంట, సిబిఎన్ , వాడొక తుగ్లక్ కాడు, వాడి సంగతి ఎపుడో ఐపొఇన్ది తెలంగాణాల, మీ అమ్మని ఒప్పించుకో చేతకాని వాళ్ళు, మమ్మల్ని ప్రస్నించేది ఎక్కడిది? ప్రస్నించినోడిని అర్రెస్ట్ చేసి మరి జెండా పండుగలు చేస్తున్నారు కదా ? ఎవరి కోసం పండుగలు? ఏ సందర్బం లో? మీరు చచ్చిన నాడు, మేమంతా పండుగలు చేసుకుంటాం, పరేషాన్ కాకుండ్రి. మా పోరగాళ్ళను పొట్టన బెట్టుకున్నారు కదరా..మా ఉసురు తగలక మానదు, బిడ్డా! ఇది తెలంగాణా గడ్డ, జాదా నహి చల్తా..సమజ్ అయిందా? మీరు వాడి మీద, వాడు ఇంకొకడి మీద..పాస్సింగ్ ది బగ్, సరే, ఆడండి , ఎన్నిరోజులు ఆడతారో అదికూడా చూస్తాం. రాజీనామాలు మళ్ళా ఎలక్షన్ల కోసం అనుకునేరు ..మీ వోటు మీకు కూడ పడదు..మల్లా తెలంగాణా రాష్ట్రంలనే మీరు అందరు ఎన్నికల్ల నిలబడాలే, ఇది కాకుండా ఏమాత్రం గిమ్మిక్స్ చేసినా మంచిగున్డది. మీకు పని లేకపోతె మాకు పని లేదు అనుకుంటార? ఆంద్ర నాయకులు ఎందుకు అంత కూతలు కూస్తున్నారో మాకు అర్థం ఐతనే ఉంది, మీ అండ దండలు పరిపూర్ణంగా ఉంది అని తెలుస్తూనే ఉంది. ఆంధ్రా జనులారా, కళ్ళు తెరవండి, నిన్నటికి నిన్న మీ విజయవాడలో దళిత బహుజనులు ఒక చిన్న మీటింగ్ పెట్టుకోలేక పాయినారు, మీ దగ్గర ఏమి స్వాతంత్రం ఉంది అనుకుంటున్నారు? తెలంగాణాల ఏకులం అయినా, మతం అయినా ఎక్కడైనా మీటింగ్ పెట్టుకోవచ్చు ధైర్యంగా, దర్జాగా.. తెలుసుకోండి, అవే పెట్టుబడి రాజకీయ నాయకులు, మిమ్మల్ని , మమ్మల్ని మోసం చేయాలని చూస్తున్నారు, మాకు తెలుసు, ఆ 'నలుగురు' తప్పితే, మెజారిటీ ప్రజలకి తెలంగాణా ఆంధ్రా సెపరేట్ కావాలని ఉందని, ప్రజలుగా కలిసి, ప్రాంతాలుగా విడిపోదామని కోరుకుంటున్నారని, కాని ఇవే క్షుద్ర రాజకీయాలు మిమ్మల్ని అణగదొక్కి, ఇక్కడ కూడా దోపిడీ చేద్దామని అనుకుంటున్నారు.

అసలు అన్ని పార్టీలను కొంత కాలం మనం మరిచి పొఇ, మన సమ్మెలు, మన బందులు నిర్వహిస్తే? అపుడు కాని అందరు ఉరికి రారు కదా? అయ్య జాక్లు, మీరు కెసిఆర్ దగ్గరకి పొతే చాల తప్పుడు సంకేతాలు పోతున్నయి, దయచేసి అందరూ ఒక్క కాడ కలవండి..పెద్దన్నకి సడెన్ గా కలబడి, సమ్మె విరమించండ్రి అని కేకేస్తాడు, తస్మాత్ జాగ్రత్త! ఎంతైనా అన్న మనసు వెన్న అంటే నమ్మున్రి. ఈ సారి మాత్రం మీరు స్వతంత్ర నిర్ణయాలు తీసుకోండి, లేకపోతె నిజంగా ప్రపంచం ముందు తల వంచుకోవాల్సి వస్తుంది. ఇదే ఫైనల్ బట్టిల్, విజయమో వీర స్వర్గమో! సోనియమ్మనో, తెలంగాననో! టీడిపినో, బీజేపినో..ఏదో ఒకటి తెల్చేద్దాం. ఇంకా దాగుడు మూతలు ఆడడం వల్ల, ఆత్మ బలి దానాలు ఎక్కువైతై తప్పితే పరిష్కారం లభించదు.

మేము గెలిస్తే రాష్ట్రం ప్రకటిస్తాం అంటున్నారు బీజేపి, గెలవక పొతే? నో తెలంగాణా కదా? మీ పార్టీలు అందరు, ఒక కన్ను, ఒక చెవి, ఒక నాలుక ఉన్నవారు కలవండ్రి దయచేసి, మిగిలిన వాళ్ళని ఊరికిచ్చి తన్నున్రి. ఇంకా చిన్నగా చెపితే వినరు అన్నల్లార, కొంచెం చురక తగలాలి, అపుడు మాత్రమె ఉద్యమం ముందుకు పోతది. ఇంకా దిల్లికి పొతే తెలంగాణా రాదు అన్న విషయం మరిచిపోవద్దు! మీకు చాతనైతే సోనియామ్మని రప్పించున్రి, ఎట్లనో కోదండ సారూ చెప్తారు, ఇంకా పోరాట రూపాలు ఇపుడిపుడే మార్తుతున్నై, మన ధైర్యం చూసి, మన పట్టుదల చూసి, మన నమ్మకాలపై వారి జులుం ఏమి నడవదని తెలిసిపాయింది చాల జాగలల్ల,..కాబట్టి ప్రజా ఉద్యమం నడిపిద్దాము, సహాయ నిరాకరణ చేద్దాము, బిల్లులు కట్టుడు బందు, కరెంట్ బందు, నల్లాలు బంద్..మరి అందరం ఏడికి పోదాం..కూకట్పల్లి, వనస్టాలి పురం పోదాం! ఇంకా ౨౦౧౪ వరకు మేము ఆగలేము. అప్పటి వరకు లాక్కొని వచ్చిన్రంటే మన ఉద్యమం ఒడి పాయినట్టే, ఆత్మలు అవమాన పడ్డట్టే. మనకు రాజకీయ పార్టీలు లేనట్టే..

మా జాక్లు, ప్రజా సంఘాలు విజయం సాదిస్తే, వారే మన హై కమ్మాండ్, మన నాయకులు కాదు..వాళ్ల లోంచే మంచి నాయకులని ఎన్నుకుందాం, ఎవడు త్యాగం చేస్తే వాడే నాయకుడు, పని చేసిన వాడిదే హక్కు..

నువ్వు నడిచినా దారంతా ముళ్ళూ..పల్లేరు గాయాలు
నీ కలల నిండా కాలాల గేయాలు,
నీ వర్తమానం కావాలి ఒక
అలుపెరుగని పోరాటం..


జై తెలంగాణా!
సుజాత సూరేపల్లి

ఇవ్వాల సోనియమ్మకు కాన్సరు, రేపు ...??

ఇవ్వాల సోనియమ్మకు కాన్సరు, రేపు రాహుల్ కు కడుపునొప్పి, ఎల్లుండి మన్మోహన్ కు కాళ్ళ నొప్పి, ఆ ఆతర్వాత, చిదంబరానికి ఎన్ను నొప్పి, ఇలా ఎవడికో ఏదో నొప్పి ఉండనుకుంటూ పోతే మన తెలంగాణా ఎపుదోస్తాడో నాకైతే సమజ్ అయితలేదు... అసలు నిర్ణయం తీస్కోవాల్సింది పార్లమెంటా లేకా సోనియమ్మా?? దీని అమ్మ జీవితం.... మొన్నటిదాకా ఆగష్ట్ దాక ఆగుమన్న కాంగిరేసు నాయకుల్లరా... సిగ్గూ సారం ఎమన్నా ఉందా మీకు?? దేశం లో ఎవనికి ఏ చిన్న నొప్పి వచ్చినా తెలంగాణా కే ఆటంకం.. తూ... మీ జీవితాలు... ఎప్పుడురా మీరు బాగుపడేది...??

బలిదానాలు వద్దు - తెలంగాణ ముద్దు: Appeal to All Telangana Sisters and Brothers,

బలిదానాలు వద్దు - తెలంగాణ ముద్దు: Appeal to All Telangana Sisters and Brothers

Appeal to All Telangana Sisters and Brothers, If you are thinking about sacrificing your life for Separate Telangana Please read this first ……..

It will only take about five minutes We know the agony of Telangana Martyrs who sacrificed their lives for Telangana. As on date 06th Aug 2011 more than 600 Telangana people (from Srikantha Chary to Srikanth Mtech Student), statistically, at an average of 1 per day sacrifice themselves for the sake of separate Telangana, at time of suicide they felt at least their death can realize Struggle of Telangana. They wanted all of the Telangana people should lead happy & prosperous life and none should follow them. Just think a while if you still feel suicidal,

1. Just try to close the eyes and see the faces of your mother and father and give a thought on what will happen to them after you.

2. Try to share your feelings with a person who can understand you very well and be always with you. Carefully choose a friend or family member or a relative, someone who is likely to listen & understand you.Call Telangana helplineCall/visit a forum/group/society/ local JAC which is working for Telangana

3. Please remember your goal is Telangana state; hence think how to achieve it. Try to list the possible solutions for achieving Telangana state and rank them. If you carefully observe self immolation will not be in your list of solutions. “Impossible only means that you haven't found the solution yet.”

4. Find the most effective solution from your list of solutions; identify the critical resource required for that, no doubt it is the people with strong determination, confidence. “If we can really understand the problem, the answer will come out of it, because the answer is not separate from the problem”

5. Telangana state is your desire; if not you who else will fight for it. First of all our young men must be strong,Telangana state will form for sure. “What we want is vigour in the blood, strength in the nerves, iron muscles and nerves of steel, not softening namby-pamby ideas.”

6. You have to be alive to realize Telangana state. In between goals is a thing called life that has to be lived and enjoyed. “The important thing about a problem is not its solution, but the strength we gain in finding the solution”. Arise, Awake and Stop not till the goal is reached...

Jai Telangana

హంతకుడి జాడ....! by -అల్లం నారాయణ

హంతకుడి జాడ....! by -అల్లం నారాయణ
ఆకాగితం ముట్టుకున్నప్పుడు వేళ్లలోకి దుఃఖం వ్యాపించినట్టయింది. వెన్నుపూస భయంతో గజగజా వణికింది. నరనరాన జ్వరం. బహుశా అతనింకా చనిపోయి ఉండకూడదు. అతను బతకాలి. ఆ కాగితం ఒక ఈ- మెయిల్. సమస్తే తెలంగాణ టెక్ ఇన్‌చార్జి శ్రీనివాస్ అపుడే ఆ కాగితం తెచ్చిచ్చి ‘ఇది మీకు పంపారు సార్. సూ సైడ్ నోట్’ అనగానే నిలువెల్లా భయం. అయిదూ ముపె్పై ఏడు నిమిషాలకు పంపిన మెయిల్ అది. కింద ఫోన్ నెంబర్ .9052559413. గది చల్లబడిపోయింది. మృత్యు శీతలం. గదిలో మా ఎండీ దామోదర్‌రావు, సీఈఓ కట్టా శేఖర్‌డ్డి , రాజం గారు, ఆర్ విద్యాసాగర్. ఒక్కసారిగా కమ్ముకున్న నిశ్శబ్దం. అతనింకా చచ్చిపోకూడదు. ఫోన్ చేశాను... నమ్ముతారా! దుఃఖంలో దుఃఖం కలిసినట్టు శ్రీకాంత్ చెల్లెలి శోకం విన్నానా ఫోన్‌లో మా అన్న సచ్చిపోయిండు. అయిపోయింది.

ఆశ ఆరిపోయింది. ఆ పిల్లవాడి గొంతు విని, మాట్లాడి, నిలబెట్టి.. ఊహ ఛిద్రమైంది. గది గంభీరమై పోయింది.ఏం చేయగలం ఇప్పుడు. ఎట్లా స్వీకరించాలి దీన్ని.. చిదంబరం వ్యాఖ్యలకు రోసి మరణించిన శ్రీకాంత్. హైదరాబాద్ జేఎన్‌టీయూ లో ఎంటెక్ చదువుతున్న విద్యార్థి అతనిట్లా రాశాడు. ‘డియర్ సర్! నేను శ్రీకాంత్. జేఎన్‌టీయూలో ఎంటెక్ చేస్తున్నాను. నా తల్లిదంవూడులకు నేనొక్కణ్నే కొడుకుని. నేనిప్పుడు తెలంగాణ ఉద్యమంలో భాగం అవుతున్నా. యాదిడ్డి ఆత్మహత్యగురించి పార్లమెంటులో చిదంబరం చేసిన ప్రకటన పట్ల నేను నిజంగా బాధపడుతున్నాను. నా ఆత్మహత్యను కూడా ఇట్లా తప్పుడు ఆత్మహత్య చేయొద్దు.నా ఆత్మహత్య వాంగ్మూలాన్ని పొందుపరుస్తున్నా.

పాస్ వర్డ్. జై తెలంగాణ’ ఇదీ నమస్తే తెలంగాణ సంపాదకునికి శ్రీకాంత్ మరణానికి కొన్ని నిమిషాల ముందు పెట్టిన నోట్ సారాంశం. ఈ మెయిల్ అందుకున్న వెంటనే అతను చనిపోవద్దని కోరుకున్నా.. కుదరలే. మరో ఆత్మహత్య అయినా వీటిని ఆత్మహత్యలే అనాలా? ఇది హత్య కాదా! హంతకులు పోల్చుకోలేని వారు కాదు. హంతకులు మహాసౌధాల్లో ఉన్నారు. హంతకులు ఎవరు? యాదిడ్డి మరణాన్ని శంకించిన వారెవరు? మనసు పూడుకు పోతుండగా.. చిక్కదీసుకున్న ధైర్యంతో అమ్మను కూడా యాదిచేసుకుని రాసిన ఒక ఆర్తరావాన్ని ఎందుకని శంకించారు. హోంమంత్రి చిదంబరం మనసు స్థానంలో ఏమి ఉండి ఉంటుంది. వేదాంత కంపెనీ కాదు చావు అంటే. టూజీ స్పెక్ట్రమ్‌లు, కామన్ వెల్త్‌లూ, రాజాలు, బాజాలు, భవంతులు కాదు. మృత్యువంటే సాదాసీదా మనసుల , మనుషుల ఆర్తరావం ఎన్నడూ వినపడని పార్లమెంటు స్ట్రీట్‌లో జరిగిన ఒక ఆత్మహత్యను శంకించినందుకు మరో ఆత్మహత్య జరిగింది. ఎవరు బాధ్యులు.

చిదంబరం యాదిడ్డి ఆత్మహత్యను అవమానించినందుకు మరో అవమానపు హత్య. ఎవరు బాధ్యులు. శ్రీకాంత్‌కు కలలున్నాయి. శ్రీకాంత్‌కు ఫేస్‌బుక్కూ, పెరిగిన ప్రపంచం, స్నేహితులు, పుట్టిన రోజులు, హైదరాబాద్‌లో విశాలంగా భాసిల్లే జేఎన్‌టీయూ క్యాంపస్ , చిట్ చాట్లు , జీవితం నిండుగా ఉన్నది శ్రీకాంత్‌కు. అతను సాంకేతిక అంశాల మాస్టర్‌గిరీ చేసినా.. మనసు ఉన్న చోట పదిలంగా ఉన్నట్టున్నది. స్పందించే గుణమూ కాపాడుకున్నడు కనుకనే శ్రీకాంత్‌లో తెలంగాణ ఉన్నది. తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకున్న యాదిడ్డి ఉన్నడు. ఎవరు చెప్పాలి. శ్రీకాంత్‌కు కళ్లూ, చెవులూ, నోరు, పడిపోయిన ప్రభుత్వాలకు శ్వాస ఆగి అంపశయ్యపై తీసుకుంటున్న ప్రజాస్వామ్యాలకు, ఏ మొరా వినపడదని. ఆత్మహత్యలు వద్దేవద్దు.

చిదంబరం ప్రకటనకు, కావూరి కావరాలకు, లగడపాటి జగడాలకు, సోనియాగాంధీ పట్టనితనాలకు, ప్రణబ్‌ముఖర్జీ నటనలకూ, మోసాలకు, దుర్మార్గాలకు, ఆడిన మాట తప్పినందుకు, మాట ఇచ్చి మోసం చేసినందుకు... హంతకుపూవరు? అని ప్రశ్నిస్తూనే హతమైపోతున్న వారికీ.. దేనికీ రంది పడకూడదు. నిజమే తెలంగాణ ఒక కలే. నిజమే తెలంగాణ ఒక ఒడువని తీరని దుక్కమే. నిజమే కానీ తెలంగాణ ఒక ధిక్కార భూమి కూడా. శ్రీకాంత్ నువ్వు బతికి ఉంటే చిదంబరం, రెండు నాల్కల మీద, చంద్రబాబు రెండు కళ్ల మీద, ప్రజాస్వామ్యపు రుజాక్షిగస్థత మీద నువ్వూ, నేనూ సబ్బండ జాతీ దండెత్తి ఉండేవాళ్లం కదా! శ్రీకాంత్. మందమర్రి ఊరు. ఫోన్‌లో గుడగుడమని దుఃఖం ప్రహహించడం ఎవరికైనా ఎప్పుడైనా అవగతమయిందా.. సంపాదకుడా. ఏడువు. కరువుదీరా.. కల్మషం లేనిదొక కంటినీరే. శ్రీకాంత్ చెల్లెలు ఏడుస్తున్నది. చెవుల్లో మోగుతున్న చావు బాజా.. ఏమి ఖర్మమీ తెలంగాణది. ఒక్కడే కొడుకు. సింగరేణి సిగలో మెరిసిన చదువుల మేలిముత్యం. అయిపోయింది.

‘అన్న సచ్చిపోయిండు’ ఆ ఒక్క మాటే వద్దు. ఏది వినపడకూడదో.. అది. అంతా ఇక క్రితం తర్వాతే. కొంచెం ఆగితే.. కొంచెం కాలం జరిగితే. శ్రీకాంత్‌తో మాట్లాడగలిగితే.. శ్రీకాంత్.. తెలంగాణ గురించి నీతో సంభాషించాలనుంది. ఇరాముగా. మొత్తం పనులన్నీ బందుపెట్టి.. నా డెడ్‌లైన్లు పక్కనపెట్టి చాలా తీరికగా. నీ ఒక్కనికోసమే. మా అందరి కోసం జయశంకర్ మాట్లాడినట్టుగా.. గద్దర్ పాడ్తున్నట్టుగా.. అవును. తెలంగాణకు కేసీఆర్ మామయ్య అన్నవుగదా.. ఆయన మాట్లాడ్తున్నట్టుగా.. రందిపడొద్దు.. రణం చెయ్యాలె. అన్నట్టుగా.. శ్రీకాంత్‌నువ్వే లేవు. దగాపడ్డ తెలంగాణ.. సంగతులు ఎవరికి చెప్పుకోవాలి మేము. ఒక్కరొక్కరుగా.. మీరు.. ఇట్లా రాలిపోతున్నప్పుడు.. కాలిపోతున్నప్పుడు.. కూలిపోతున్నప్పుడు.. ఎవరికీ తెలంగాణ.. ఎవరి కలల కోసం తెలంగాణ.. శ్రీకాంత్‌కు అన్నీ తెలుసు. అతనొక విజ్ఞాని.

తెలంగాణ వస్తే ఏమి చెయ్యాలో తెలుసు? కానీ.. ప్రభుత్వాలు, వారిని నడిపే, దళారీలు, తాబేదార్లు, దొంగలు ప్రజాస్వామ్య సౌధాలను మలినం చేస్తున్న బేపారులు ఎట్లా దేనికి, ఎందుకు? ఆటంకం అవుతారో తెలియదు. తెలంగాణ ఎందుకు రాదో?ఎందుకు వస్తదో? ఏమి చేస్తే వస్తుందో తెలియదు. మనసులేని, మనిషితనం లేని, ఉత్త సాంకేతిక పదాల, బోలు మనుషుల సమూహాల మధ్య ఎట్లా మెసలాలో? తెలియదు. అంబేద పిల్లలు. శ్రీకాంత్ మిమ్మల్ని ప్రేమించే తల్లిదంవూడులం. మిమ్మల్ని ప్రేమించే ఉద్యమకారులం. మిమ్మల్ని ప్రేమించే తెలంగాణవాదులం. యుద్ధం మధ్యలో... నిలబడి ఉన్న వాళ్లం. ఒక్క వ్యాఖ్య కోసం. ఒక్క చర్య కోసం ప్రతిచర్య ఉంటుంది. కానీ.. ఆత్మహత్య దేనికీ పరిష్కారం కాదు. ఆత్మల స్థానంలో దయ్యాలు తిష్టవేసిన మనుషుల కోసం, గుండెల స్థానంలో రోగక్షిగస్థమైన ఉత్త తోలుతిత్తులు ఉన్న వాళ్ల కోసం ఎందుకు శ్రీకాంత్.

మీ ప్రాణాలు పోవడం. మీ చెల్లెలు ఏడుస్తున్నది. ఇప్పుడిక ఒకే ఒక ప్రశ్న. యాదిడ్డిది ఆత్మహత్య. అవును నిజమే. కానీ ఎందుకని యాదిడ్డి ఆత్మహత్య చేసుకున్నడు. సరే. శ్రీకాంత్ ఉరిపోసుకున్న శిరసునడుగు. అప్పటి దాకా సుచేతనంగా ఉద్వేగాల ఊయలలూగి కొట్టుమిట్టాడిన అతని ఆలోచనా అంతరంగాలను దర్శించు. అతను చిదంబరం వ్యాఖ్యలకు కలతబారాడు. ఈ బలవన్మరణానికి కారకుపూవరు? ఇంతకీ హంతకుపూవరు? తొమ్మిదో తేదీన మహాభారత దేశపు మహా ఘనత వహించిన ప్రజాస్వామ్య సౌధం పార్లమెంటులో తెలంగాణ ప్రక్రియ ప్రారంభమవుతుందని ప్రకటిస్తూ, చిదంబరం అదే పార్లమెంటులో ‘ మీది మీరే తెల్చుకోండి’ అన్నప్పుడు ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉన్న ఈ దేశంలో ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతున్న ఒక రాష్ట్రం విడిపోయే సమస్య మీద మీది మీరే చూసుకోండని అంటే పార్లమెంటుపూందుకు? రాజ్యాంగాపూందుకు? ఆర్టికల్ 3 అలంకరణపూందుకు? దీనికి యూపీఏలు, కోర్ కమిటీలు, మతులు తప్పిన వృద్ధ జంబూకాలు, తక్తుల మీద కూచొని మాటపూందుకు? అసలు మనకు ఒక కేంద్ర ప్రభుత్వం ఉందా? ఉంటే అది పనిచేస్తున్నదా? పనిచేస్తే ఏం చేస్తున్నది? తెలంగాణ ఇంకేం జెయ్యాలె. శాంతిగానూ, సామరస్యంగానూ, ఒక మహా యుద్ధం నడుస్తున్నది. పద్దెనిమిది నెలలు ఉధృత పోరాటం. ఆరువందల బలిదానాలు.

పార్లమెంటు సౌధానికి దగ్గరా యాదిడ్డి బలిదానం. ఇదిగో ఇవ్వాళ్ల మీ మురికి మనసులను బద్దలు కొడ్తూ, మీ వక్ర భాష్యాలు, వంకర మాటలు, చేతలు బద్దలుకొడుతూ ఉరికొయ్యను వేలాడిన శ్రీకాంత్. తెలుసా! ఇది ఆరని కుంపటి. నిజమే అప్పటి దాకా శానిగా మాట్లాడిన వాడు, అప్పటి దాకా సమజ్‌దార్‌గ మాట్లాడినవాడు. గుండెల్లో పచ్చల పిడిబాకు దిగేసినప్పుడు కలిగే ఒక భంగపాటులో ఉంది. ఒక ప్రజాస్వామ్యాన్ని, పార్లమెంటును, రాజకీయ ప్రక్రియను, ఆర్టికల్ 3ని, న్యాయాన్ని, ధర్మాన్ని నమ్ముకున్నది తెలంగాణ. కానీ.. కానీ.. మిస్టర్ చిదంబరం. న్యాయం విఫలమయిన చోట, ధర్మం ఓడిపోయిన చోట, ప్రజాస్వామ్యం పరాధీనమైనచోట, రాజ్యాంగం విఫలమయిన చోట ఇప్పుడు ఆత్మహత్యలు, బలిదానాలున్నయి. వాటి తర్వాత ఏముంటాయో? తెలుసా? తెలంగాణకు ఆయుధమూ తెలుసు.

ఇంకేం చెయ్యాలె తెలంగాణ. శ్రీకాంత్... ఈ దుక్కాన్ని రాస్తున్న చోట, వేళ్లు వణుకుతుండగా ఫోన్‌లోంచి శ్రీకాంత్ చెల్లెలు వెక్కిళ్లు వినపడుతుండగా, ఇదే సమయాన నా ముందొక మరో ఆత్మహత్య నోటు.. మరో మరణ వాంగ్మూలం. తెలంగాణ ప్రజలకు తెలియజేయునది ఏమనగా, నేను కే.రమేశ్; పీఎస్ మనోహరాబాద్, మండలం తూప్రాన్, జిల్లా మెదక్ వాసిని.. తెలంగాణ ప్రకటన ఆగస్టు 30 లోపు ప్రకటించాలి. లేనిచో సెప్టెంబర్ ఒకటో తేదీన ఆంధ్రవూపదేశ్ శాసనసభ వద్ద ఆత్మహత్య చేసుకుంటాను’. ప్రజాస్వామ్యం విఫలమయింది. ఇక ఆత్మహత్యలు చాలించాలి. రంది వద్దు రణానికి దిగాలె. మిస్టర్ చిదంబరం.. హంతకుపూవరో?తెలంగాణ పోల్చుకున్నది.

ఇంకేం చేస్తుంది తెలంగాణ చావో.. రేవో.. చచ్చి సాధించలేం. బతుకాలె. బతుకాలె... బతుకాలె. బలిదానాలు కాదు. తెలంగాణ బలికోరే రోజులచ్చినప్పుడు మీ మహా సౌధాలు ముక్కలయ్యే ప్రమాదం పొంచి వుంది.. జాగ్రత్త... జాగ్రత్త.. శ్రీకాంత్ నువ్వు చనిపోకుండా ఉంటే.. నీ ఒక్కడితోనే, దివారావూతులు తెలంగాణ గురించి మాట్లాడాలని ఉంది. నువ్వే లేవు. తెలంగాణ బతికే ఉంది. మిగిలే ఉంది. అది తన కలను సాకారం చేసుకుని తీరుతుంది. ఆత్మహత్యలు వద్దు. శ్రీకాంత్ మేం పోరాడతాం. శ్రీకాంత్ నీకు ఇదే నీ మందమపూరిలో బతికిన మనుషుల గురించి చెప్పాలని ఉన్నది. ఇక్కడ పారాడి,పోరాడిన వాళ్ల సంగతి చెప్పాలని ఉన్నది. ఉత్త చేతులతో మట్టికాళ్ల మహారాక్షసి మీద యుద్ధం ప్రకటించిన వాళ్ల గురించి చెప్పాలని ఉన్నది. గొంతు గుడగుడమంటున్నది. పెద్ది శంకర్ గురించి, బెల్లంపల్లిలో కన్నాలబస్తీలో వెలిగిన గజ్జెల గంగారాం గురించి, పులి మధునయ్య గురించి, ఎగిరే లోహ విహంగాలను గురి చూసి కొట్టగలిగిన గెరిల్లా యోధురాలి గురించి చెప్పాలని ఉన్నది. నువ్వే లేవు. శ్రీకాంత్ నువ్వుండాలి. తెలంగాణ గెలవాలి. శ్రీకాంత్‌లు, యాదిడ్డిలు బతకాలి. బతకాలి. బతకాలి.

దునియా అంతా స్నేహితుల దినోత్సవ వేడుకలు జరిగే రోజు

దునియా అంతా స్నేహితుల దినోత్సవ వేడుకలు జరిగే రోజు, తెలంగాణలో ఒక "మిత్రుని" అంతిమయాత్ర... శ్రీకాంతు నా దోస్తు కాదు, అతనెవ్వరో తెలవదు, కాని నాకు కన్నెళ్ళు ఆగడం లేదు.. ఎందుకు చచ్చిపోవాలి తను... నా దోస్తులాంటోడే కదా తనుకూడా.. తెలంగాణ కోసం అందరం ఉద్యమం చేస్తనె ఉన్నం... కాని ఎక్కడ పొరపాటు జరిగిందో నాకు సమజ్ ఐతలేదు, ఎందుకు మనవాళ్ళు ఆత్మహత్య చేసుకునే దిశల ఆలోచన చేస్తున్నరు!! ఒక్కొక్క మిత్రుడూ ఇలా రాలిపోవలసిందేనా...! నాకు నిజంగా ఇదొక కల ఐతే మంచిగుండు అనిపిస్తుంది.. కాని ఇది కన్నీళ్ళు పెట్టించే నిజం.. కలలను కల్లలు చేసే నిజం.. ఇక వొద్దు దోస్తులూ, ఇంక మనలో ఒక్కరు కూడా చనిపోవొద్దు... ఆత్మహత్యలతో తెలంగాణ రాదు, ఖచ్చితంగ దాదు.. తెలంగాణ రావాలంటే ఉద్యమ దిశ ఎటువైపుకు మార్చాలె అన్నది ఆలొచిద్దం, చర్చిద్దాం, ఏమి చేద్దమన్న నేనుకూడ ఉన్నమీతో, దోస్తు లాంటోన్ని.... మాట్లాడుదం, ముంగటికిపోదాం.. ఒక్క ఫోన్ చేయ్యున్లి నీవెంబడి ఉంటా, పోరాటంల పక్కనుండి నడుస్తా, ఏదంటే అది చేద్దం.. తెలంగాణ తెచ్చుకుందాం, తెలంగాణ రాష్ట్రం ల బతుకుదాం..లొల్లి లొల్లి చేద్దాం.. అంతే కని చచ్చిపోవడం అన్న మాటేవద్దు...

నేనెట్ల బతుకుదూ !

నేనెట్ల బతుకుదూ !

చిన్నపుడు నువ్వు కడుపులో
చిన్ని పాదాలతో తన్నుతుంటే
బాధని నొప్పిని చూసి మురిసి పోయిన

నువ్వు పుట్టినపుడు
నేను మళ్లీ ఒక జన్మ నెత్తి
నిన్ను కన్నా..నాన్నా !

నువ్వు పడుకోవాలని
ఎర్రటి కళ్ళతో నేను
నిద్రలేకుండా గడిపిన రాత్రులు
అన్ని జీవితంలో మధురమే

నువ్వు మొదటి సారి
ముద్దుగా అమ్మా అని పిలిచినపుడు
సంబురంగా ఊరంతా
గోపాగా చెప్పుకున్న
నీకు చిన్న జరం వస్తే
తీరొక్క దేవ్వుల్లకి మొక్కు కుంటి
ఎన్నొద్దులు ఉపాసాలున్ననో

ఒక్కో అడుగేస్తూ నువ్వు తుళ్ళి పడుతున్నపుడు
నన్ను నేను తమాయిన్చుకోలేక
నానా యాతన పడ్డ చిన్నా

నువ్వు లిల్లి చేసుకుంట స్కూల్ డ్రెస్
వేసుకుని మొదటి సారి బడికి పోతుంటే
నువ్వు పెద్ద ఆఫీసర్ ఐపొఇనన్త్తుగా
మస్తు కుషి అయిన ..
నువ్వు పెద్దగైనన్ని రోజులు
కష్టం తెలవకుండా
పస్తులున్డుకుంటా
పైసలు కూడ పెట్టి
పగలు రాత్రులు నీ కోసం
కలలు కంటూ
నన్ను నేను మరిచి పోయి
నువ్వే సర్వస్వం అనుకున్నా ..

పెద్ద చదువులు చదువు కుంట
నువ్వు ముందుకు పోయి
ఎంతో పెద్ద వాడివి కావాలని
ఎన్ని రాత్రులు కలలు కన్న బిడా!

అపుడెపుడో నువ్వు
జై తెలంగాణా అని
ఎప్పుడు ఆ ముచ్చట్లే చెప్పుతుంటే ..
తెలంగాణా తల్లి కోసం నీ ప్రేమని
చూసి..మరింత మురిసినా ..
నా కొడుకు చూడున్ద్రి అని
కనపడ్దోల్లకల్లా చెప్పుకున్నా ..

నిన్నటికి నిన్న
రక్తం పంచి , జీవితాన్ని
నీ కోసమే ధార పోసిన
ఈ తల్లిని మరిచి ..
నీ కుటుంబాన్ని అంత మరిచి పోయి
ఒక ఉత్తరం రాసి పెట్టి
నేను నా తెలంగాణా తల్లి కోసం
ప్రాణాలు విడుస్తున్నా అని
మమ్మలనందరినీ ఇడిచిపెట్టి పొతే ..
బిడ్డా !

ఇన్ని కోట్ల మందికోసం
నిన్ను కనీ మోసిన తల్లిని
కాటికి పంపించకుండా
ముద్దు మురిపెం తీరకుండా
అర్ధంతరంగా పాయినందుకు
గుండెలు బాదుకుంటా ఎడుస్తునా?
ఇంత గొప్ప తండ్రిని కన్నందుకు
చరిత్రలో నిలబడ్డందుకు గర్వపడుదునా..
ఏమి చెప్పకుండా
గట్లేట్ల పోతివి కొడుకా!

కాలేజి పోయి గంట సేపు
లేటుగొస్తే కాలు గాలిన పిల్లోలె
ఆటు ఇటు తిరుగుతుంటి
ఎప్పటి రాని దూరాలకి పాయినవంటే
నేనట్ల యాది మరిచి
ఎట్లా బతుకుదూ..
ఏడుస్తానికి కూడా కండ్లనీళ్ళు
లేకుండా పాయె బిడ్డా!
ఇంత పాడు బతుకు పగోల్లకు
కూడా రావొద్దు ..రావొద్దు!

నువ్వు సచ్చినవని
లోకమేమి ఆగం గాలే
నీ చివరి కోరిక కోసం
ఏ ఒక్కరు తన్లాడతలే..
పానం ఆగం చేసుకున్టివి
పాపిష్టి నాయకుల కోసం

బిడ్డల్లారా!
అమ్మ కడుపు కోత పెట్టకున్రి
కన్నోల్లని గోస గోస చేయకున్రి
నీ కల తెలంగాణా కోసం అయితే
మేము నీతో నడుస్తం..
నిండు ప్రాణం కాదు
అమ్మకి ఇచ్చేది
కల కాలం ఉండే నిండైన జీవితం
నీ పోరాటమే ఏ అమ్మకైనా బలం
నీ విజయమే అమ్మకి నిజమైన వరం!
గోస పెట్టకున్రి తండ్రి!
నిండు నూరేళ్ళు చల్లగా బతకండ్రి!
మీ ప్రాణాలని తీసుకుంటున్న
నీచ రాజకీయ నాయకులని
తన్ని తన్ని తరమండ్రి..
మీరే నాయకులు కండ్రి!
తెలంగాణా సాధించండి..

-సుజాత సూరేపల్లి
(శ్రీకాంత్ మరణ వార్త చూసి తట్టుకోలేని బాదతో..తల్లి మనసుతో )