Wednesday, February 15, 2012

నిజమైన ప్రజాస్వామ్యవాదులు..


మన ప్రజాస్వామ్య దేశంలో వ్యక్తిస్వామ్యం ఉండకూడదు, వ్యక్తి పూజ కు నేను వ్యతిరేకం అంటూ చెప్పుకొని రాజకీయాల్లోకి వచ్చిన ఒక IAS ఆఫీసర్ గారి అనధికారిక/ అధికారిక (ఆన్ లైన్, ఆఫ్ లైన్) ప్రతినిధుల తీరు ఇలా ఉంది.. వాళ్ళు వాళ్ళ ప్రియతమ నాయకుణ్ణి దేవునితో పోలుస్తున్నారు (పోలుస్తూనే ఉంటారు కూడా), మరి ఆ దేవుడు చెప్పే మాటలు వీళ్లు వినరా లేకా, దేవుడే కావాలని ఇలా వీళ్ళతో చేయిస్తున్నాడా?? అదేనండి మన బాబు గారి రెండు కాళ్ళ సిద్ధాంతం లాగే ఈ దేవుడికి కూడా ఏదో ఒక సిద్ధాంతం ఉండే ఉంటుంది కదా.. ఒక రాజకీయ నాయకుడిగా పరిపూర్ణత సాధించినట్టే ఇంకా.. చిరంజీవి ఎక్కడున్నావు సామి నీ సీట్ కి ఎసరు పెట్టె టైం దగ్గరలోనే ఉంది..
అదేంటోనండి , ఈ దేవుడి మీద అలా చేయి పడిందో లేదో (చేయి పడిందో లేదో కూడా సరిగ్గా తెలీదు) ఇలా వీళ్ళకు ప్రజాస్వామ్యం గుర్తుకొచ్చింది.. ఒక మనిషికి జరిగిన అవమానాన్ని, మొత్తం ప్రజాస్వామానికి జరిగిన అపహాస్యంగా చిత్రీకరిస్తున్న వీళ్ళను ఏమనాలో?? పగ పట్టాలి, ఆ వన్ మాన్ వెనక ఉన్న ఆర్మీ సత్తా చూపెట్టాలి అంటూ స్టేటస్ లు పెట్టడం చూస్తా ఉంటె, వీళ్ళ స్టేటస్ లు చూస్తా ఉంటె నాకో సామెత గుర్తుకు వస్తుంది.. సదువుకేస్తే ఉన్న మతి పోయిందంట .. ఇది నిజమేనేమో..

వీళ్ళ దృష్టిలో, వ్యక్తి స్వామ్యానికి వేరే అర్ధం ఉందేమో??
here is a sample post from one of the followers..

http://www.facebook.com/photo.php?fbid=2927055248879&set=o.170778996367398&type=1&theater

and these people, who are far away from the motherland are celebrating this day ie. Feb 17th as the black day in democracy.. they dont bother about the martyrs who immolated for their wish (ex. telangana state) which is a dream of crores of people from the decades.. Is this the democracy you mean??
http://www.facebook.com/events/170778996367398/