Friday, March 11, 2011

వి'గ్రహాల' విద్వంసం!

జాతి రత్నాలు అంటున్నావ్, ఎవడి జాతి..
బొమ్మలు తగలబడితేనే నీకు చరిత్ర, సంస్కృతీ గురుతోచ్చిందా..
అసలు నీకు 'ఆత్మ' ' గౌరవం' అంటే అర్థాలు తెలుసా..
కూలిన నీ చరిత్ర కారులని అడిగి తెలుసుకో బ్రదర్
తెలుగు జాతి తగల బడింది అని కుల్లుతున్నావ్
తెలంగాణా జాతి మాటేప్పుడైనా వినపడిందా

వారు గొప్ప వారు కావొచ్చు..
కాని నా తల్లి గుండె మీద
నిప్పులై మండుతున్నారు
ఎపుడైనా నీ ఎసి కార్లల్ల తిరుగుతుంటే
కనపడిందా మా గోస

హుస్సేన్ సాగర్ నిండా నా తల్లి కంటి నీరే కదా..
భాషని, యాసని హేళన చేసి చూసే నీకు
ఎక్కడిదిరా హక్కు
జాతి గురించి ఊసెత్తడానికి

అందమైన హైదరాబాద్ ను తయారు చేసిన
నా రాజుల చరిత్ర ఏది?
ప్రపంచ పటంల నా జాతి ని నిలబెట్టిన
నా నిజాం పరిమళాలు కలుషితం చేసి
మా కొమరం భీమ్ ధైర్యానికి , వీర చరిత్రకు మసి పూసి,
అయిలవ్వను , యాదగిరిని , బందగిని బొందపెట్టి
ఏ చరిత్ర గురించి మాట్లాడుతున్నావ్..

రాయి బద్దలయితే రాద్ధాంతం చేస్తున్నావ్,
బొమ్మ పగిలితే గుండె పగిలినట్టు
గంటలూ గంటలూ రొద పెడుతున్నావ్
నువ్వు నిలబడ్డ జాగా నాది,
నా జాగా చరిత్ర ఏది? సంస్కృతీ ఏది?

నా బిడ్డలు ఏరి..
ఓ గురజాడా, ఎర్ర ప్రగడ, ఇంకా ప్రజా కవులారా..
మీరు చేసిన తప్పంతా..
రక్త మాంసాలు తినే నర రూప రాక్షసుల చేతుల్లో పడడమే,
మిమ్మల్ని అడ్డం పెట్టుకొని మా జాతి ని మట్టు బెట్టి,
మా చరిత్ర సమాధుల మీద మిమ్మల్ని నిలబెట్టడమే

మేము గురి పెట్టింది మిమ్మల్ని కాక పోవచ్చు,
మీరు చేసిన కృషిని కాకపోవచ్చు..
మా ఆక్రోశం బద్దలు అయింది
భాల్ల్లున పగిలింది మీ బొమ్మల పైన..

మీ జాగా ఖాళి అయితేనే కదా
మా చరిత్రలు నిలబడేది

ఒకటి అంతం అయితేనే మరొకటి మొదలు..
మా జాతి కోసం ప్రాణాలు అర్పించిన
అమర వీరుల సమాధులకు కూడ
జాగా లేదు, వారికి చోటియ్యనియండి,
బొమ్మలకి బాద పడే మీరు..
బిడ్డలు కళ్ళముందు కాలుతుంటే
ఒక్క కన్నీటి బొట్టు కూడ రాల్చ లేదే?
కవితలు రాల లేదే, పుస్తకాలు అచ్చు కాలేదే ?

మీ మాటలు కత్తుల్ల దిగుతుంటే
ముక్కలైన మా మట్టిని ,
బూడిదైన మా సంస్కృతిని
మళ్లీ నిలబెట్టుకున్దామనే
చరిత్రని మల్లా తిరగ రాస్తున్నాం,

ఇక్కడ మీకు , మీ గొప్ప చరిత్రలకు
స్తానం లేదు..అందమైన విగ్రహాలకు
విడిది కాదు నా ఇల్లు,
ఆగమైతున్న బతుకు చిత్రాలకు
కొలువు..

భుతల్లి కన్నీట మునుగుతున్నాం
గర్భ శోకంతో కుంగి పోతున్నాం..
మోసాలకు ఎత్తులకు జిత్తులకు
విసిగి వేసారి ఉన్నాం..
కొలిమిల్లాగా మండుతున్నాం..
దగ్గర కొస్తే ఆగం అయితారు..

మాట్లాడే సహనం లేదు,
బ్రతిమిలాడే క్వాయిష్ అంత కన్న లేదు
మిగిలినవి చేతలు , చేతులే ..
ఆవేశం అంటుకున్నది
ఆవేదన అలుముకున్టున్నది..
మంచి చెడుల మధ్య
చెరిగిన రేఖ..
న్యాయ అన్యాయాల మధ్య నలిగిన
సత్యం..

ఇప్పటికైనా ...
నా భూమ్మీద నా బిడ్డలకే హక్కు..
మేమూ ప్రజా కవులను ప్రేమిస్తాం..
మీ చరిత్రనూ నిలబెడతాం..
మా చేతుల మీదుగా
మేము ప్రశాంతంగా
స్వేచ్చగా గాలి పిలచిన రోజు..


...సుజాత సూరేపల్లి

15 comments:

తెలుగు said...

Excellent - hats off to you.

Jai Telangana Jai Jai Telangana

Ananth said...

Excellent... Wow this is the perfect answer for all who are crying since yesterday...

Keep it up..

Jai Telangana

Nageswara Rao said...

I wonder how these greats can be labeled as belonging to only Seemandhra people. Greats like Nannayya, Pothana belong to everyone. I grew up in Andhra and studied Telugu. I can say this for sure, no one there thinks of greats like Dasarathis, Kaloji etc., this way. Telangana has given us many great people and heroes who are respected everyone there, as they contributed so much to telugu Jaati. I know many freedom fighters from that area(including my English teacher in Class X), who took part in the Sayudha Raitanga Poratam during the Nizam's rule and made great sacrifices.

Sujatha gaaru put forth her feelings very well. My sincere request to her is to do atma vimarsa about what purpose this kavitha serves. This piece serves little to support the Telangana cause, but could be a morale booster to all those third rate thugs and vandals. Many of my friends from Telangana areas (I hateto think about them on these lines) are equally upset about this mindless act.

KD said...

మిత్రుడు నాగేశ్వర,
చరిత్ర బానే తెల్సుకున్నావ్ కాని ఆ చరిత్రలో ఉన్న తెలంగాణా చరిత్రకారులు ఎక్కడ పోయారో తెలుసుకోలేక పోయావా... అసలు మన స్చూల్స్ లో చెప్పే పాతాలను ఒక్కసారి తిరగవేసి చూడు. అసలు ఎంత మంది గురించి చెప్తారో... ??? నువ్వన్న దాసరథి, పోతన ల గురించే కాదు ఎంతో మందిని తెలంగాణా మనకు అందించిందని అన్నావ్, మరి ట్యాంక్ బాండ్ మీద ఉన్న ౩౩ విగ్రహాలలో ౩ మాత్రమే తెలంగాణా వారివి ఎందుకున్నాయి...ఈ ముగ్గురు తప్ప ఇంకెవరు లేరా, ఈ తెలంగాణాలో సంఘ సంస్కర్తలు, గొప్ప చరిత్రకారులు... అది కనబడడం లేదా నీ (మీ ప్రభుత్వానికి )కళ్ళకి... నిజాం కి వ్యతిరేకంగా భారత దేశ చరిత్రలో చెప్పుకోదగ్గ పోరాటం చేసారు మా తాతలు,,, ముత్తాతలు... వాళ్ళలో ఎంతమంది విగ్రహాలు ఈ తెలంగాణా నది బొద్దు ఐన ట్యాంక్ బాండ్ మీద ఉన్నాయి..?? అందరూ కలిసి పోరాడితే ఒక కొమురం భీమ్ విగ్రహం పెడుతం అని ఒప్పుకున్న ఈ సీమంధ్ర దగా ప్రభుత్వం, ఇప్పటికి దాదాపుగా ఒక్క సంవత్సరం కావస్తున్నా, అసలు పనులే మొదలుపెట్టలేదు... ఇవన్ని తెలుసుకుని మాట్లాడుతున్నావా లేదా తెలుకోవడం ఇష్టం లేక, ఈ తెలంగాణా వాళ్ళు చేసే ప్రతి పనిని వ్యతిరేకించే పనినే పెట్టుకొని ఈ కామెంట్ చేస్తున్నావా...??
అసలు ఆ పని చేయడానికి దారి తీసిన పరిస్థితులను అర్ధం చేసుకోకుండా ఇలాంటి మాటలు మాట్లాడడం సాటి తెలుగు వాడిగా నీకు ఎంత వరకు సమంజసమో...
ఈ ఉద్యమంలోనే కాదు, ప్రతి ఉద్యమంలో ఇలాంటి సంఘటనలు జరిగాయి.. సోవియట్ లో లెనిన్, బెంగాల్ లో రవీంద్ర నాథ్ టాగోర్ లాంటి ఎంతో గొప్ప వాళ్లకు కూడా తప్పలేదు ఈ ధ్వమ్సాలు... అంతెందుకు మీ ఆంధ్రలో కూడా ఒకటి జరిగింది, ఆంధ్ర లో సంజీవరెడ్డి విగ్రహాన్ని సైతం ధ్వంసం చేసిన సందర్బం కుడా ఉంది...
అసలు నీ స్కూల్ టీచర్ ఎవరో సాయుధ పోరాటంలో పల్గోనాడు, నిజాం కి ఎదురుగ పోరాడాడు అంటునావ్.. కాస్త చెపు బాబు ఆయన డిటైల్స్... తెలంగాణా వాడు ఎవడో ఆంధ్ర కు వెళ్లి జాబు చేస్తున్నాడు అనే అర్ధం వచ్చేట్లు చెప్తున్నావ్... కాస్త మా తెలంగాణా చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో లికించే పని మొదలు పెడుతం మీ మాస్టారు తో....
నీ తెలంగాణా దోస్తులేవరో అప్ సెట్ అయినారు అంటున్నావ్ కదా.. నా దృష్టిలో అసలు వారు తెలంగాణా వారే కాదు... తెలంగాణా పేరు చెప్పుకొని పబ్బం గడిపేవాళ్ళు... నిజంగా తెలంగాణా కావాలని అనుకునే వారే అయితే, ఇలా నీ దోస్తుల్ల మాట్లాడారు... అసలు వాళ్లు తెలంగాణా వాళ్ళే కాదు.. అసలు ఇలాంటి వారి వల్లే తెలంగాణా రావట్లేదు ...
నాయకుల్లందరినీ అర్రెస్ట్ చేసి జైళ్లలో పెడితే, ఒకడేమో అసలు ఇదేనా నాయకత్వం అంటే అని వాగుతాడు, ఇంకోదేమో ఆత్మ గౌరవం మీద దాడి అంటాడు, ఇంకొకడు జాతి మీద జరిగిన దాడి అంటాడు.. బొమ్మలను ధ్వంసం చేస్తేనే ఇంతగా ఫీల్ ఆతున్నారే, అలాంటిది గత ఐదారు దశాబ్దాలుగా తెలంగాణా ప్రజల జీవితాలతో ఆడుకునారు.. ఎన్నో సంవత్సరాల పోరాట ఫలితంగా వచ్చిన తెలంగాణా ను కోటి కాడి తిండి లాగేసుకున్నట్లుగా, అర్దరాత్రి లో లాగేసుకున్న్రు మీ వాళ్ళు, అపుడు గుర్తుకు రాలేదా ఈ ఆత్మ గౌరవం, ఈ గొప్పవాళ్ళు చెప్పిన సిద్ధాంతాలు...ఇపుడు గుర్హ్తుకు వచ్చిన సిగ్గుచేటు, అపుడు గుర్తుకురాలేదా?? దీనికి సిగ్గుపడని మీరు మా గురించా మాట్లాడేది... అసలు దేశం అంటే మట్టి కాదోయి, దేశంఅంటే మనుషులోయి అన్న మన పెద్దల మాటను మనమే మరచిపోతే ఎలా....??
ఇపుడు మాట్లాడుతున్న పెద్దలందరూ, తెలంగాణా యునివెర్సిటిల్లోని విద్యార్థులను పిట్టల వలె కాల్చుతుంటే గుర్తుకు రాని తెలుగు వాడి ఆత్మ గౌరవం గురించి మాట్లాడడం ఎంత హాస్యాస్పదమో... ఇదేనా ఆ పెద్దల పెద్దరికం.. ఇదేనా తెలుగు వాడి ఆత్మగౌరవం... ఇదేనా తెలుగు జాతి గొప్పదనం... ఇదేనా ...........??

voleti said...

మీ తాత ముత్తాతలంతా రజాకార్ల చేతిలో తన్నులు తిని పారి పోతే ఆంధ్రా ప్రాంతం నుండి వచ్చిన వాళ్ళే వాళ్ళని ఎదిరించి పోరాడారు.. పొలం దున్నడం కూడా రాని మీకు అన్ని విద్యలు నేర్పించి.. భాష కూడా రాని మీకు భాష నేర్పే ప్రయత్నం చేసారు (ఇప్పటికీ సరిగ్గా పలకరేరులే) అన్నీ వుర్దూ మిక్సింగ్ లే కదా.. మరోటి... గిప్పుడు కర్ణాటక వోల్లు..మహరాష్ట్ర వోల్లు అందరూ వుండచ్చు గాని ఆంధ్రా వోల్లు వుండకూడదా? విగ్రహాలేం ఖర్మ.. చార్మినార్, గోల్కోండ, అసెంబ్లీ గియన్నీ కూల్చెయ్యండి.. స్మశానాన్ని ఏలుకోండి .. ఎవరొద్దన్నారు...

voleti said...

తెలంగాణ ప్రాంతం ఇంకా కర్ణాటక, మహారాష్ట్ర లో కూడా వుంది.. దాని కోసం కూడా పోరాడండి ఒకప్పుడు నైజాం నవాబు భూమి దాని మీద మీ కెంత హక్కు వుందో న్యాయబద్దంగా సంపాదించుకున్న వాళ్ళందరికీ హక్కు వుంటుంది...నీళ్ళు పల్లం లోకి పారకుండా మోటార్లు పెట్టి మీ మెరక వైపు పారించండి (కోట్లు మీ బాబు గాడు గాని కె సీ ఆర్ గాని ఇస్తాడు) ఇహ వుద్యోగాలు గావాలె గావాలె అని అరుస్తె రావు.. గీ తెలబాన్ వుద్యమాలు మాని సక్కగ సదువుకోవాలె..

KD said...

పిచి నా వోలేటి,
రజాకార్ల చేతిలో తన్నులు తినడం కాదు, వాల్ల్లను ధైర్యం గా ఎదుర్కొన్న గొప్ప చరిత్ర మాది,,,, అస్సలు ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఏ ఒక్కరి పేరైన చెప్పు రజాకర్ల పోరాటంలో పాలు పంచుకున్నట్టుగా ఎవరైనా ఉంటె... . అది మీకు తెలియదు, అలా చరిత్రను తప్పుదారి పట్టించారు గత ప్రభుత్వాల కాలంలోని మన చరిత్ర కారులు.. అస్సలు తమిళులు తన్నితే చెన్నై నుండి పారిపోయి వచ్చారు మీ నాయకులూ, టెంట్ల కింద, డేరా ల కింద ప్రభుత్వం నడుస్తూ ఉంటె పాపం అని, మీరు కూడా సాటి తెలుగు మాట్లాడే వారే కదా అని జాలి తో మా ప్రాంతానికి చెందిన కొంత మంది నాయకులూ మిమ్మలను ఆదరించారు... రామ్మన్నదే తడవు గా ఇంతింతై వటుడింతై అన్న చందంగా మీరు ఇక్కడకు రావడమే కాదు వెలది మంది ని తీసుకోచారు, ఆ వీలాది మంది లక్షలాది మందిని లాక్కొచ్చారు... అది మీ చరిత్ర...
పొలం దున్నడం దారు, భాష రాదని నీకు తెలుసు, కాని అసలు నీ భాష పేరేంటో తెల్సుకో... అది కూడా తెలీని నీదెం భాషో.. ఆయ్... పర భాషనూ మేము గౌరవిస్తాం, మీలా అవమానించము ... ఇక్కడ మీరే కాదు ఎవరైనా ఉన్దోచు, ఆంధ్ర వారు ఉండొద్దు అని ఎవరు అనటం లేదు.. మేమేమి అంటునామో కూడా తెలీదా.. ఆంధ్ర పెట్టుబడి దారుల మీద మా పోరాటం అని ఎపతినుందో చెప్తున్నాం... అదే ఫాలో అవుతున్నాం కూడా,,, ఎక్కడ కూడా ఆంధ్ర ప్రాంతానికి చెందిన సామాన్య జనం మీద దాడులు జరగలేదు ఇప్పటిదాకా.. అది మా నైజం కాదు కూడా... గోల్కొండ, చార్మినార్, అసెంబ్లీ ఇవ్వన్ని మా చరిత్రకు గుర్తింపులు... ఇక్కడ ఎవరు కూడా ఎవరినో తొక్కిపెట్టి ఇంకొకరిని గొప్పవాళ్ళను చేయలేదు... ఆ దాడిని మీరు చరిత్రకారుల మీద దాడిగా మీరు భావిస్తున్నారు, మేము మాత్రం ఆంధ్ర పెట్టన్దరులమీద ఇన్నాళ్ళుగా అణచబడ్డ తెలంగాణా ప్రజల ఆవేశం గా మేము అంటున్నాం.... మీరేమనుకున్నా మేమేం పట్టించుకోం....
తప్పు నీది కాదు, చరుత్రను వక్రీకరించిన ప్రభుత్వానిది...

voleti said...

ఓకే...
మరి మీ తాలిబన్ వీరులచే ధ్వంసం చేయబడ్డ శ్రీకృష్ణ దేవరాయలు, నన్నయ్య, అన్నమయ్య, శ్రీశ్రీ మున్నగు వారంతా పెట్టుబడి దారులేనా నీ దృష్టిలో... పిచ్చి నీకా.... నాకా...

Sripal Sama said...

Voleti,

తెలుగు, ఉర్దూ నాకు రెండు కన్నులు. ఆ రెండు కళ్ళతో అన్ని భాషలని చదువుతాను నేను అన్నాడు మా దాషరధి. ఉర్దు ని భాషగా చూడలేని దౌర్భాగ్యం నీది. 'విధ్య' ని 'విద్య' అనే నువ్వా మాకు భాష నేర్పేది ? తెలంగాణా సాయుధ పోరాటానికి తోడ్పడిన నెల్లూరు వాడైన పుచ్చలపల్లి సుందరయ్య గారికి సాలాం !! నువ్వు ఆయన స్పూర్తికి సిగ్గు చేటు !!

KD said...

చూడు మిత్రమా వోలేటి,
I already gave thereply to ur same comment, once again m giving for u...

కర్ణాటక, మహారాష్ట్రల్లో కలిసిన వాళ్ళు ఎవరు అడగడం లేదంటే దాని అర్ధం- వాళ్లకు ఆయా రాష్ట్రాల్లో న్యాయం జరుగుతుందని.. అక్కడ ఉంటున్న ప్రజలు ఎపుడు కూడా వివక్షతకు గురి కాలేదు అని... ఇక్కడ ఎవడు కూడా నవాబు బూమి మీద హక్కుల గురించి మాట్లాడటంలేదు..... సందర్భాన్ని బట్టి ఉంటుంది... నీ ఉద్దేశ్యం ఏంటో నాకు అర్ధం కావట్లేదు కాని, నీరు ఎత్తు నుండి పల్లానికి పారుతుందని కూడా తెలీని నీ చదువు కి సలాం... ప్రభుత్వమే తలుచుకుంటే ఈ ప్రాంతంలో ప్రాజెక్టులు కట్టలేదా....???.
ఇకఉద్యోగాలు అంటావా..
ఉద్యోగాలు చదువుకుంటేనే వస్తాయి అనుకుంటే, అది నీ భ్రమ... ఎక్కడిదో, ఎన్నాటిదో ఎందుకు నీకు ఈ మధ్యే జరిగిన సంఘటన చెప్తాను విను... మొన్న జరిగిన అంటే గ్రూప్-1 2008 పరీక్షల రిజల్ట్ నీకు తెలీదేమో.. తెలిస్తే ఇలా మాట్లాడవు... వ్రాత పరీక్షల్లో టాప్ లో ఉన్నారు మావాళ్ళు కాని ఇంటర్వ్యూ లో ఏమైందో తెల్సా...?? రాత పరీక్షల్లో 30 , 40 కి పైగా ఎక్కువ మార్కులు ఉన్న తెలంగాణా వారికి ఇంటర్వ్యూ ఐపోయేసరికి, మొత్తం మార్కుల్లో మిగతా వారికంటే 20 మార్కులు తక్కువగా ఉన్నాయి.. అంటే ఒక్క ఇంటర్వ్యూ లోనే సీమంధ్ర వారికి తెలంగాణా వారికంటే 50 కి పైగా మార్కులు వచాయి... ఒక్కొకరికి 80 కి పైగా ఎక్కువ మార్కులు వచాయి సారీ వేసారు... అంతటి మేథావులు అన్నమాట మీ వాళ్ళు... ఇక వీళ్ళ గురించి తెలుసుకుంటే,. అలా ఎక్కువ మార్కులు వచ్చిన వారంతా ఒకే ప్రాంతానికి, ఒకే సామాజిక వర్గం ముఖ్యంగా APPSC చైర్మన్ సామాజిక వర్గానికి చెందిన వారు.... ఇదంతా తెలీకుండా మాట్లాడుతున్నావ్.. ముందు చరిత్ర తెలుస్కో, ఆ తర్వాత ప్రస్తుతం జరుగుతున్నదేంటో తెల్సుకో అపుడు మాట్లాడు.... చదివిన కూడా ఉద్యోగాలు సాధించలేని పరిస్థితి ఇక్కడ ఉంది.. ఇక తాలిబాన్ అంటూ ఏదో పిచికూతలు కూస్తున్నావ్... జాగ్రత్త...
ఇక ఈ కామెంట్ ప్రచురించను అని అంటున్నావ్... నేను నువ్వు అనుకుంటున్నట్లు కాదు... ప్రతి కామెంట్ ని ప్రచురిస్తా... డునాట్ వర్రీ అబౌట్ యువర్ కామెంట్...
నేను రిప్లై ఇచే టైం లోనే ఏ కామెంట్ ని అయినా ప్రచురిస్త, అంతవరదాక హోల్డ్ లో ఉంచుతా, అంతే కాని డిలీట్ చేయను... ఇదంతా చూస్తుంటే నీ అజ్ఞానం తెల్సుస్తోంది...

KD said...

శ్రీకృష్ణ దేవరాయలు, నన్నయ్య, అన్నమయ్య, శ్రీశ్రీ మున్నగు వారిని పెట్టుబడిదార్లు అని ఎవరు కూడా అనలేదు, వారి పేర్లు చెప్పుకొని, వారి ముసుగులో బతుకుతున్న వారంతా పెట్టుబడిదారులే... ప్రాంతాలకతీతంగా ఎవరైనా సరే......

శ్రీధర్ said...

Dear Friend, how was the local leaders allowed such negligence of development and literal disparity? why was it happened to be andhara valla palana? why are our leaders not united againest them? the same are going to be there in future? will seperate telangana really is the solution for the problems?

శ్రీధర్ said...

, మరి ట్యాంక్ బాండ్ మీద ఉన్న ౩౩ విగ్రహాలలో ౩ మాత్రమే తెలంగాణా వారివి ఎందుకున్నాయి?
Dear Friend, dont make such statements. as per my knowledge itself there are 7 from telengana region. i hope RaniRudramma, SuravaramPratapReddy, MehboobAliKhan, MaqdoomMohiuddin, Ramadasu,TaniShah,Potana etc., are from telengana region only. we should always be careful in talking the facts. keeping the emotion is important but not the expense of truth.

KD said...

So do u think that there is no more than these 7 personalities in the whole telangana. And how many statues you found on tank bund…??So do u think that there is no more than these 7 personalities in the whole telangana. And how many statues you found on tank bund…??

KD said...

Yes, agree with you Sridhar, your comment on local leaders is good. But can you run with a heavy load on your head… that is what happened with the telangana politicians… one good example is our home minister- sabitha and PM manmohan. To name they are ministers, but they cant take any decision on their own and they cant move with out the orders from their higher officials.