Friday, August 10, 2012

సిగ్నల్ సిండ్రోమ్!

సిగ్నల్ సిండ్రోమ్! తెలంగాణ సమాజం ఇప్పుడు కొంచెం ఊరడిల్లే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలారోజుల స్తబ్తత తరువాత, ఈ మధ్యే మళ్ళీ తెలంగాణ మాట వినబడుతోంది. కేసీఆర్ మౌనం వీడడం చాలామందికి ఊర ట కలిగిస్తోంది. ఈమధ్య ఇంట్నట్‌లో ఒక చర్చ నడుస్తోంది. అందులో భాగం గా కేసీఆర్ ఎక్కడ అంటూ ప్రశ్నల పరంపర మొదలయ్యింది. పరకాల ఎన్నిక ల తరువాత తెలంగాణ అలికిడే లేకుండాపోయిందని చాలామంది నెటిజన్లు బహుశా అందులో ఎక్కువమంది ఎన్‌ఆర్‌ఐలు వాపోతున్నారు. కేసీఆర్ ఒక వారం పదిరోజులు కనిపించకుండా, వినిపించకుండాపోయే సరికి సీమాంధ్ర మీడియా బెంగ పడిపోయినట్టే, తెలంగాణ పిల్లలు కూడా అలా బెంబేపూత్తిపోతారు. వెంటనే ఇంట్నట్ గ్రూపుల్లో వ్యాఖ్యానాలు చేస్తుంటారు. ఈ వ్యాఖ్యానాలకు కొందరు మిత్రులు ఓపిగ్గా వింటుంటారు, వివరణలిస్తుంటారు . కేసీఆర్ ఏమైనా టీవీ యాంకరా రోజూ కనిపిస్తూ కబుర్లు చెప్పడానికి అని ఆయన అప్పుడప్పుడు గదమాయిస్తుంటారు. కానీ ఇప్పుడు సగటు తెలంగాణవాదులది కోడిపిల్లల మనస్తత్వంగా మారిపోయింది. తల్లికోడి కనిపించకపోతే పిల్లకోళ్ళు పలవరించినట్టే కేసీఆర్ కనబడకుండాపోతే తెలంగాణ అంత అయోమయం ఆవరించేస్తుంటుంది. దీనికితోడు మీడియా కథనాలు కలవరపెడుతుంటాయి. వాటిని తెలంగాణవాదులు ఎవరికీ వారు తిప్పికొట్టడమో, ఒప్పుకోవడమో చేస్తుంటారు. ఇటువంటి సందర్భంలో అసలు సారేమనుకుంటున్నారన్న ప్రశ్న ఎవరికైనా వస్తుంది. అందుకే కేసీఆర్ ఇప్పుడు ఏ చర్యకైనా కేంద్ర బిందువు అయిపోతాడు. ఆయన ముమ్మాటికి తెలంగాణ ఉద్యమానికి కేంద్ర బిందువే! అలాంటప్పుడు మాటా పలు కూ లేకుండా మాయమైపోతే అయోమయం తప్పదు. నిజమే నాయకుడు ప్రతిరోజూ మాట్లాడడు. ఆ అవసరం లేదు. నాయకునికి ప్రత్యామ్నాయంగా ప్రతిరోజూ మాట్లాడేవాళ్ళు వేరే ఉంటారు. కానీ టీఆర్‌ఎస్‌లో గానీ, తెలంగాణ ఉద్యమంలో గానీ కేసీఆర్‌కు ప్రత్యామ్నాయంలేని పరిస్థితి. కొంతకాలం కోదండరాంను ప్రజలు తెలంగాణ ఉద్యమ ప్రతినిధిగా, కేసీఆర్ ఆలోచన ప్రతిబింబంగా చూశారు. కానీ అది నిజం కాదని ఎవరిదారి వారిదేనని ఇద్దరి మాట లు, కార్యాచరణను బట్టి ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఇక పార్టీలో కూడా కేసీఆర్‌లా ఇంకొక వ్యక్తి కనిపించడు. బయట కనిపించే ‘అధికార ప్రతినిధులు’ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కరకంగా, కొన్నిసార్లు ఒక్కరే అనేక రకాలుగా చానల్స్‌ను బట్టి మాట్లాడుతుంటారు. ఉద్యమంలో కేంద్రీకృత నాయకత్వం తప్పనిసరి. అదిలేకపోతే వ్యవస్థీకృత నిర్మాణం, కార్యాచరణ అయినా ఉండాలి. ఆ రెండూ లేనప్పుడు ముమ్మాటికీ తప్పుడు సంకేతాలు వెళ్తుంటాయి. కేసీఆర్ మాత్రం తనకు సంకేతాలు సరిగానే ఉన్నాయని అంటున్నారు. తనకు ఢిల్లీ నుంచి ఎప్పటికప్పుడు సిగ్నల్స్ అందుతున్నాయనీ అంటున్నాడు. సిగ్నల్స్ అందడం వల్లే తాను మౌనంగా ఉన్నాననీ అంటున్నాడు. కేసీఆర్‌కు ఉన్న సిగ్నల్స్ సామాన్యులకు లేవు. ఆ సిగ్నల్స్, ఉద్యమంలో ఉన్న మిగితా నేతపూవరికీ లేవు. చివరకు ఆయన పార్టీకి చెందిన శాసనసభ్యులకు, అధికారపార్టీకి చెందిన తెలంగాణ నేతలకు కూడాలేవు. సిగ్నల్స్‌తో ఉన్న చిక్కే ఇది. వాటికి రూపం ఉండదు. అవి కేవలం వాయుతరంగాలు. ఒక టవర్ నుంచి, ఇంకొక టవర్‌కు అవి ఉపక్షిగహం గుండా అందుతుంటాయి. ఉపక్షిగహం నుంచి వచ్చిన సిగ్నల్స్‌ను టవర్ నెట్‌వర్క్‌కు అందిస్తుంది. అప్పుడు గానీ అది ప్రజలకు చేర దు. అక్కడే ఉంది చిక్కంతా. తెలంగాణలో ఇప్పుడు అనేక ఉద్యమ నెట్ వర్క్ లు ఉన్నాయి. తెలంగాణ సంస్థలు, వేదికలు, జేఏసీలు, రాజకీయపార్టీలు వేటికవి సొంత నెట్ వర్క్‌లతో నడుస్తున్నాయి. అయినప్పటికీ తెలంగాణ ఉద్యమానికి కేసీఆర్ ఒక్కరే ప్రథానమైన టవర్‌గా ఉన్నారు. టీఆర్‌ఎస్ ఒక్కటే ప్రధానమైన నెట్‌వర్క్ అని అనేక సందర్భాల్లో రుజువయ్యింది. ఒక్క కేసీఆర్‌కు మాత్ర మే సిగ్నల్స్ అందుతున్నాయి కాబట్టి అవి టీఆర్‌ఎస్ శ్రేణులకు, ప్రజలకు కూడా అందితే తప్ప ఈ సమస్య ఉండదు. కానీ అప్పుడప్పుడు కేసీఆర్ గారే అందుబాటులో లేకుండా ఉంటున్నారని దానివల్లే నెట్‌వర్క్ సమస్యలు వస్తున్నాయని అంటున్నారు. ఢిల్లీలో ఉన్న టవర్ నుంచి ఏ సిగ్నల్స్ అందాయో హైదరాబాద్‌లో ఉన్న తెలంగాణ ప్రజలకు తెలియాలి. ఆ సిగ్నల్స్‌ను డీ కోడ్ చేసి ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాల్సిన బాధ్యత సిగ్నల్స్ అందుకున్నవాళ్ళ మీద ఉంటుంది. ఢిల్లీ నుంచి వస్తున్న సిగ్నల్స్ ఏం సూచిస్తున్నాయి అనేది అర్థం కాకపోతే క్రాస్ టాక్ ఇలాగే ఉంటుంది. పార్లమెంటు సమావేశాలు మళ్ళీ మొదలయ్యాయి. ఇప్పుడిక సీక్రెట్ సిగ్నల్స్‌తో పనిలేకుండా పార్లమెంటులో తెలంగాణ విషయంలో ఎవవరు ఏం చేస్తున్నారో ప్రత్యక్ష ప్రసారంలో దృశ్య రూపంలో చూసేయవచ్చు. కొద్దిరోజులుగా తెలంగాణలో ఒక విధమైన స్తబ్ధత నెలకొని ఉన్న మాట వాస్తవం. ముఖ్యంగా పరకాల ఉపఎన్నిక తరువాత విజయమ్మ యాత్ర మినహా మరో సంచలనం ఏమీ లేకపోవడమే ఈ స్తబ్ధతకు కారణం. సుదీర్ఘ పోరాటంలో ప్రతిరోజూ సంచలనాలు ఉండవు, కానీ తెలంగాణ ప్రజలిప్పుడు వాటికి అలవాటుపడి ఉన్నారు. వేరే పనులన్నీ పక్కనబెట్టి ఏదైనా జరిగితే బాగుండునని ఎదురు చూస్తున్నవాళ్ళూ ఉన్నారు. వెంటనే తెలంగాణ ఇచ్చేస్తున్నట్టు కేంద్రం ప్రకటిస్తుందని ఎవరూ అనుకోవడం లేదు. కానీ ఎప్పటికైనా తెలంగాణ వస్తుందనే నమ్మకం మాత్రం ఇంకా సడల లేదు.పార్లమెంటు సమావేశాలు మొదలైన బుధవారం నాటి దృశ్యం టీవీలలో చాలామందే చూసి ఉంటారు. మేడం సోనియాగాంధీ హఠాత్తుగా స్కూల్ టీచర్ అయిపోయారు. చూపులబెత్తంతో ఆమె తన పార్టీకి చెందిన ఎంపీలను కట్టడి చేశారు. మేడం గారు తెలంగాణపై మొదటిసారిగా మౌనం వీడారు. కానీ మౌనం వీడి ఏం చేశారు? తెలంగాణ కోసం మాట్లాడుతున్న ఎంపీలను మౌనంగా ఉండమని ఆదేశించారు. ఈ మాట చెప్ప డం ద్వారా ఆమె ఏ రకమైన సిగ్నల్స్ ఇచ్చారు? మేడంగారి మాటల్లో తమకు సానుకూల సంకేతాలే అందాయని టీ కాంగ్రెస్ ఎంపీలు చెపుతున్నారు. కానీ టీవీల్లో జరిగిన తతంగం చూసిన వారికి సోనియాగాంధీ నోరుమూసుకుని కూర్చోండి అన్నట్టే కనిపించింది. నోరుమూసుకుంటే తప్ప ఎవనా మౌనంగా ఉండలేరు కదా! బహుశా కాంగ్రెస్ ఎంపీలు ఇప్పుడు ఆ పనిలో ఉంటారు. సంకేతాలు సరిగానే ఉన్నా సందేశాలు ఎందుకు అందడంలేదో. నెట్‌వర్క్ నిపుణులు చెప్పాలి. తెలంగాణ విషయంలో ఎప్పటికప్పుడు సిగ్నల్స్ సరిగానే అందుతున్నాయి. ఉట్టి సిగ్నల్సే కాకుండా తెలంగాణ ఉద్యమం చెవులు బద్దలయ్యే శబ్ద తరంగాలను సృష్టించింది.ఇటునుంచి అటు, అటు నుంచి ఇటు సిగ్నల్స్ నిరంతరాయంగా ఉంటున్నా.. ఇప్పటిదాకా ఢిల్లీ టవర్ నుంచి ఒక్క సందేశం కూడా ఇక్కడ డెలివరీ కాలేదు. వాయిదాల మీద వాయిదాలతో ఈ వ్యవహారం అలాగే సాగుతోంది. ఇప్పుడు ఏదో ఒకటి తేలాలంటే ఇప్పటిదాకా ఉత్తుత్తి గాలి తరంగాలుగా ఉన్న వాయుతరంగాలు ఇప్పుడు స్పష్టమైన శబ్ద తరంగాలుగా రావాలి. దాని కి పార్లమెంటును మిం చిన వేదిక ఉండదు. కానీ కేసీఆర్ పార్లమెంటుకు వెళతా రో లేదో తెలియదు. వెళ్ళినా అక్కడ ఉపయో గం లేదనేది గతంలో ఆయన అనుభవం. బిల్లు పెట్టండి మద్దతునిస్తం అని బయట దాంబికంగా మాట్లాడే భారతీయ జనతాపార్టీకి,అస్సాం శాంతి భద్రతల విష యం కంటే తెలంగాణ ప్రశాంతంగానే కనిపిస్తుంది. ఆ పార్టీ తెలంగాణను పెద్దగా పట్టించుకోవ తెలంగాణ మీద పార్లమెంటులో పెద్దగా చర్చ జరగకపోతే ఏం చేయాలి. ఉగా ది నుంచి దసరాకు, దీపావళి నుంచి హోలీకి తిరిగినట్టే తెలంగాణ వ్యవహారం ఎన్నికల తరువాత ఎన్నికలతో వాయిదాపడుతున్నది. చివరికి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు కూడా అయిపోయాయి. రాష్ట్రపతి ఎన్నికల తరువాత ప్రణబ్ ముఖర్జీ తన మొదటి సంతకం తెలంగాణ బిల్లుమీదే పెడతారని ఆ మధ్య కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యులొకరు ఒక జోక్ చేశారు. ఈ జోక్‌కు ఎవ్వరూ నవ్వలేదు. కానీ ఆ పార్లమెంటు సభ్యుడి అమాయకత్వానికి మాత్రం నవ్వుకోక తప్ప దు. ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతిగా హాయిగా పోయిన ఆగస్టు ఫస్టున తన మొదటి సంత కం మొదటి జీతం కోసం పెట్టే ఉంటాడు. అయినా యూపీఏ ఆమోదించకుండా, కేబినేట్ చర్చించకుండా అసలు ప్రతిపాదనే తయారు కాకుండా ఏ బిల్లు పెట్టినా అది చెల్లుబాటు కాదు. ఇప్పుడు అన్ని వాయిదాలు అయిపోయాయి. పార్లమెంటు కూడా మొదలయ్యింది. ఇప్పుడు తెలంగాణ మీద ప్రకటన చేయడానికి కాంగ్రెస్ పార్టీకి ఏ సమస్యా లేదు. బహుశా అందుకే కేసీఆర్ ఆగస్ట్ 20వ తేదీని అంతిమ వాయిదా అంటున్నాడు. చాలారోజుల తరువాత మళ్ళీ తెరమీద కనిపించిన కేసీఆర్ మళ్ళీ వాడి వేడి ప్రకటనలు చేయడంతో హడావిడి మొదలయ్యింది. పోయిన వారమంతా తెలంగాణ నేతల్లో ఏదో ఒక చలనం కనిపించింది. ముఖ్యంగా ఆగ స్టు ఇరవైలోపు తెలంగాణ విషయంలో ప్రకటన రాకపోతే అంతు చూస్తామని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కే సీఆర్ ప్రకటించడం ఒక తాజా పరిణామం. కేసీఆర్‌కు ఇలాంటి డెడ్‌లైన్లు కొత్త కాదని కొట్టిపారేసే వాళ్ళూ ఉన్నారు. అయినా సరే కేసీఆర్ అన్నాడంటే ఆయనకు ఏదో ఒక సిగ్నల్ ఉందని అనుకునే వాళ్లే ఎక్కువ. కేసీఆర్‌కు అందుతున్న సిగ్నల్స్ కంటే మనకు కనిపిస్తోన్న సిగ్నల్స్‌కు చాలా తేడా ఉన్నట్టు అనిపిస్తోంది. ఏదిఏమైనా మొట్టమొదటిసారి కేసీఆర్ ఒక స్పష్టమైన డెడ్‌లైన్ కేంద ప్రభుత్వం ముందుపెట్టారు. కానీ ఇంకా కార్యాచరణ ప్రకటించలేదు. దానికి సంబంధించిన కసరత్తు ఏదీ మొదలుపెట్టలేదు. బహు శా ఆయన ఢిల్లీ నుంచి రావాల్సిన సిగ్నల్స్ కోసం వేచి చూస్తూ ఉండవచ్చు. అయినా ఇప్పుడు కొత్త సిగ్నల్స్ వచ్చే అవకాశం లేదు. అలాంటిదేదైనా జరగాలంటే ఇక్కడ ఉద్యమ పొగ రాజుకోవాలి, ఆ సెగ ఢిల్లీకి తాకాలి. పార్లమెంటు సభ్య్లంతా ఢిల్లీ లోనే ఉండి, చెవిలో జోరీగల్లా పార్లమెంటును చికాకు పరచాలి. ఇప్పుడు ఇక సిగ్నల్స్ తో పనికాదు, నేరుగా షాక్ తగిలితే తప్ప చలించే స్థితిలో కేంద్రం లేదు. ఆ దిశగా ఆలోచించాలి. పొఫెసర్ ఘంటా చక్రపాణి సమాజశాస్త్ర ఆచార్యులు, రాజకీయ విశ్లేషకులు ఈ మెయిల్:ghantapatham@gmail.co

No comments: