Showing posts with label politics. Show all posts
Showing posts with label politics. Show all posts

Friday, October 5, 2012

ఇంత విషం కడుపులో దాచుకుని ఎలా కలిసుందామనుకుంటున్నారు?


ఇంత విషం కడుపులో దాచుకుని ఎలా కలిసుందామనుకుంటున్నారు? By: కొణతం దిలీప్ (ఒక తెలంగాణ మీడియా మిత్రుడి సహకారంతో...) పేరుకది విశాలాంధ్ర మహాసభ అయినా అదొక పచ్చి విషాంధ్ర మహాసభ అని వెనుకటికొకసారి రాశాను. వాస్తవానికి అది పట్టించుకోవలసినంత పెద్ద సంస్థ కాదు. కానీ తెలంగాణకు వ్యతిరేకంగా నడుస్తున్న గుంపు కాబట్టి మన సీమాంధ్ర మీడియా దాని స్థాయికన్న ఎక్కువే "స్పేస్" ఇస్తోంది. అందులో ఉన్నది గుప్పెడు మందే. గత ఏడాదిన్నరగా కష్టపడుతున్నా పాపం వారి సభలో సంఖ్య రెండంకెలు కూడా దాటట్లేదు. ఎలా దాటుతుంది? చేసే పనిలో చిత్తశుద్ధి ఉండాలి కదా. విశాలాంధ్ర పేరిట వారు చేసేది అవకాశం దొరికినప్పుడల్లా తెలంగాణ ఉద్యమం మీద, ఇక్కడి ప్రజల మీద విషం చిమ్మడమే. ఈ మూకను పెంచి పోషిస్తున్నది బెజవాడ బ్రోకర్ ఉరఫ్ లగడపాటి అనే జోకర్. వారి కడుపులో ఎంత విషం ఉందో తాజాగా పరకాల ప్రభాకర్ తెలంగాణ మార్చ్ పై చేసిన దొంగ విశ్లేషణతో మరోసారి బయటపడింది. ఎప్పటిలాగానే ఈ చెత్త విశ్లేషణను పట్టుకుని లగడపాటి జోకర్ తెగ వాగుడు వాగుతున్నాడు. వీరిద్దరి అతి చేష్టల వల్ల సమైక్యాంధ్ర ఉద్యమానికి మేలు జరగకపోగా తెలంగాణ్ర ప్రజల రాష్ట్రసాధన సంకల్పం రెట్టింపు అవుతుంది. సెప్టెంబర్ 30 నాడు తెలంగాణ మార్చ్ కు లక్షలాది మంది ప్రజలు వచ్చి మరోసారి తమ ప్రత్యేక రాష్ట్ర కాంక్ష చాటారు. కానీ పరకాల బృందానికి మాత్రం ద్వేషంతో కళ్లు మూసుకుపోయాయి. పత్రికల్లో ప్రచురితమైన మీటింగు ఫొటోనొకదాన్ని తీసుకుని కోడి గుడ్డు మీద ఈకలు పీకే పని ఒకటి మొదలుపెట్టారు. ఆ ఫొటోపై పరకాల విశ్లేషణ చూస్తే వారి మెదడు మోకాల్లో కాదు కదా అరికాల్లో కూడా లేదని చిన్నపిల్లాడికైనా అర్థం అవుతుంది. పరకాల చేసిన పిచ్చిపని చూడండి: తెలంగాణ మార్చ్ ఫొటోను తీసుకుని దానిపై నిలువు, అడ్డం గీతల గ్రిడ్ ఒకదాని గీసి ఒక్కో చదరంలో ఎంతమంది ప్రజలు ఉన్నారో లెక్కకట్టి మొత్తం మార్చ్ కు 18,000 మందే వచ్చారని తేల్చాడీ మట్టి బుర్ర. ముందీ అవకతవక మేధావి విశ్లేషణలో ఉన్న డొల్ల వాదనను చూద్దం. ఆ తరువాత తెలుగు జాతి అంతా ఒక్కటిగానే ఉండాలని పైకి కోరుకునే ఇతగాడి మనసులో తెలంగాణపై ఎంత విషం ఉన్నదో చూద్దాం. పరకాల వాదన ఇది:
ఈ ఫొటోలో కుడి వైపు ఉన్న ఒక చదరంలో 500 మంది ప్రజలు ఉన్నారు కాబట్టి మొత్తం 36 చదరాలు ఉన్నాయి కాబట్టి మార్చ్ కు వచ్చిన ప్రజల సంఖ్య 18,000 ఉంటుందని ఈ కోడి మెదడు మేధావులుంగారు అంచనా వేశాడు. ఇక్కడే పరకాల హుస్సేన్ సాగర్ తీరంలోని రొచ్చులో అడుగేశాడు. మార్చ్ ఫొటో తీసిన angle వేరు, దానిపై గీసిన గీతల angle వేరు అయినప్పుడు ఒక చదరంలో ఉన్న ప్రజల సంఖ్యను ఇంకో చదరంలో ఉన్న సంఖ్యతో పోల్చలేం అనేది ఇంగిత జ్ఞానం ఉన్న ఎవరికైనా అర్థం అవుతుంది. ఉదాహరణకు ఈ ఫొటో చూడండి:
పై చిత్రంలో కుడివైపు కింది భాగంలో "A" అని మార్క్ చేసిన చదరంలో కేవలం రెండు టైల్స్ (దాదాపు) మాత్రమే ఉన్నాయి. అదే ఇంకో చివర "B" చదరంలో చూడండి దాదాపు 20 వరకు టైల్స్ ఉన్నాయి. ఇరవై ఫీట్ల పొడవున్న లాన్ లోనే ఇంత వ్యత్యాసం వస్తే ఇక ఆయనే చెప్పినట్లు 1300 ఫీట్ల దూరాన్ని ఫొటో తీస్తే దానిలో ఎంత వ్యత్యాసం వస్తుందో వేరే చెప్పనక్కరలేదు కదా. మరి ఈ లెక్కన ఆ ఫొటోలో పరకాల లెక్క ప్రకారం ఈ చివర 500 మంది ఉంటే అటు చివర ఎంత మంది ఉంటారో ఊహించుకోండి. ఫోటో తీసిన Angle ను గమనించకుండా చెత్త లాజిక్కులు తీసే పని ఏ చదువురాని నిరక్షరాస్యుడో చేస్తే అర్థం చేసుకోవచ్చు. కానీ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో డాక్టరేట్ పొందిన పరకాలకు ఇంత చిన్న విషయం తెలియదా? లేక తెలిసీ బుకాయిస్తున్నాడా? ఇక రెండో విషయం. తెలంగాణమార్చ్ అనేది పబ్లిక్ మీటింగు కాదు. ఆరోజు మధ్యాహ్నం నుండి సాయంత్రం పొద్దుపోయేంతవరకూ ప్రజా ప్రవాహం ఆగకుండా వస్తూనే ఉన్నది. అటువంటప్పుడు ఏదో ఒక ఫొటోను పట్టుకుని వచ్చినవారి సంఖ్యను అంచనా వేయడం తలకాయ ఉన్నవాడెవడూ చేయడు. కానీ మన పరకాలకు అది లేదు కాబట్టి ఇట్లాంటి చెత్త అయిడియాలు వస్తుంటాయి. మూడో సంగతి: పరకాల వారి దివ్యజ్ఞానంతో నెక్లెస్ రోడ్డులో మార్చ్ జరిగిన ప్రదేశం పొడవు 1300 వందల ఫీట్లు, వెడల్పు 100 ఫీట్లు అని అంచనా వేశాడు. అయితే నిజానికి మార్చ్ జరిగిన ప్రదేశం పొడవు (నా అంచనా ప్రకారం ) కనీసం కిలోమీటర్ పైనే ఉంటుంది. అంటే 3280 ఫీట్లు. ఇక్కడా పరకాల లెక్కలు తప్పే. అన్నిటికన్న ప్రధానమైనది అసలు అనేక నిర్బంధాల మధ్య జరిగిన తెలంగాణ మార్చ్ కు ప్రజలు తక్కువ వచ్చారని లెక్కలు వేయడం వీరి మనసుల్లో తెలంగాణ ప్రజల మధ్య ఎంత ద్వేషభావం ఉన్నదో తెలుపుతున్నది. తెలంగాణ మార్చ్ కు వారం రోజుల ముందే జిల్లాల్లో వేలాదిమంది తెలంగాణవాదుల అరెస్టులు మొదలయ్యాయి. మార్చ్ జరిగిన రోజు హైదరాబాదుకు వచ్చే దాదాపు నలభై రైళ్లు రద్దు చేశారు. తెలంగాణ జిల్లాల నుండి హైదరాబాదుకు వచ్చే అనేక బస్సులు రద్దు చేశారు. వరంగల్ నుండి వస్తున్న శాతవాహన ఎక్స్ ప్రెస్ ను జనగాం వద్ద నిలిపివేసి ఆఖరికి డ్రైవర్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇక నిజామాబాద్ వంటి జిల్లాల నుండి వస్తున్న వందల ప్రైవేటు వాహనాలను అడ్డుకున్నారని ఏకంగా "సాక్షి" వంటి సీమాంధ్ర పత్రికలే రాశాయి. ఇక ఇన్ని అడ్డంకులు దాటుకుని హైదరాబాదుకు వచ్చిన తెలంగాణ ప్రజలను నెక్లెస్ రోడ్డు మీదికి రాకుండా అన్ని రహదారులూ దిగ్బంధించింది పోలీస్ శాఖ. ప్రతి చోటా ప్రజలు పోలీస్ బారీకేడ్లను బద్ధలు కొట్టుకుని, లాఠీ దెబ్బలు, టియర్ గ్యాస్ మోతల మధ్య మార్చ్ జరుగుతున్న ప్రదేశానికి చేరుకున్నారు. ఉద్యమ పురిటిగడ్డ ఉస్మానియా యూనివర్సిటీ ముందతే ఆరోజు మొత్తం యుద్ధమే సాగింది. ఒక్క విద్యార్ధి కూడా బయటికి రాకుండా పోలీసులు నిర్బంధించారు. ఆరోజు పరిస్థితి తెలియాలంటే మచ్చుకు ఈ చిత్రాలు చూడండి:
ఫొటో: నెక్లెస్ రోడ్డులోకి ఎవరూ రాకుండా వేసిన రంపపు ముళ్లతీగెలు.
ఫొటో: అనేక బ్యారీకేడ్లు, పోలీసులని దాటుకుని తెలంగాణ మార్చ్ కు వచ్చారు ప్రజలు
ఫొటో: టియర్ గ్యాస్ ప్రయోగిస్తున్న పోలీసులు
ఫొటో: సభాస్థలి వద్ద టియర్ గ్యాస్ పొగ భరించలేక ముక్కు మూసుకుంటున్న చిన్న పాప -- సభాస్థలి వద్ద పోలీసుల ఓవరాక్షన్ అంతా ఇంతాకాదు. నెక్లెస్ రోడ్డులోని మార్చ్ వేదిక వద్ద ఆరోజు మొత్తం 150 రౌండ్ల భాష్ప వాయువు గోళాలు పేల్చారంటే ఈ మార్చ్ పై సీమాంధ్ర ప్రభుత్వం, పోలీసులు ఎంత దమనకాండకు పాల్పడ్డాయో అర్థం అవుతుంది. ఈ టియర్ గ్యాస్ వల్ల మార్చ్ కు వచ్చిన చిన్నపిల్లలు, వృద్ధులతో సహా అనేక మంది అస్వస్థతకు గురయ్యారు. సభాస్థలి వద్ద నేరుగా ప్రజలపైకి టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించడం వల్ల ఇద్దరు ఉద్యమకారులకు తలతో ఫ్రాక్చర్లు అయ్యి ప్రస్తుతం మహావీర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇన్ని కష్టనష్టాలకు ఓర్చి అక్కడికి లక్షలాదిగా ప్రజలు వచ్చింది ఒక ఆకాంక్షను వ్యక్తబరచడానికి మాత్రమే. ఈజిప్టులో హోస్నీ ముబారక్ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు తహ్రీ స్క్వేర్ లో గుమికూడినప్పుడు కూడా అక్కడి నియంతృత్వ ప్రభుత్వం తమ ప్రజల పట్ల ఇంత దుర్మార్గంగా ప్రవర్తించలేదు. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం మార్చ్ కు ప్రజలు రాకుండా చూడాలనే ప్రయత్నించామని సాక్షాత్తూ అధికారులే ఓవైపు చెబుతుంటే పరకాల లాంటి మేతావులు మాత్రం వచ్చిన జనాలను తక్కువచేసి చూపడానికి ఇలాంటి తలతిక్క విశ్లేషణలు చేస్తున్నారు. సీమాంధ్ర ప్రభుత్వం మా గుండెలపై చేసిన గాయాలపై మీరు కారం జల్లుతున్నారు పరకాల ప్రభాకర్. ఇలాంటివి చేసి తెలంగాణ ప్రజలకు మీరు ఏం సంకేతాలు పంపదలుచుకున్నారు? ఈ చర్యలద్వారా మీరు సీమాంధ్ర ప్రజలపై తెలంగాణ ప్రజలకు ఇంకొంచెం ద్వేషం రగిల్చి మా సంకల్పాన్ని బలోపేతం చేయగలరేమో కానీ సమైక్యతను మాత్రం ఎన్నటికీ సాధించలేరు. ఇన్ని నిర్బంధాలు దాటుకుని ఒక మహోజ్వల పోరాటస్ఫూర్తిని కనబరచిన ప్రజల పట్ల జాలి లేకపోయినా పరవాలేదు కానీ మరీ ఇంత దుర్మార్గపు మాటలా? అసలు మీరు మనుషులేనా? ఇంత విషం కడుపులో దాచుకుని మాతో ఎలా కలిసి ఉందామనుకుంటున్నారు?

Thursday, August 23, 2012

ఎవడు రా మా ఈ దుస్థితికి కారణం.. ఇంకెవ్వడు..

సమైక్యాంధ్ర ముసుగు పాలన లో, బీడు బారిన మా బీద బతుకులు, చిద్రమై, మీ ఖజానా కు దేవుడిచ్చిన ఒక వరమై.. మీ జేబులు నింపిన మా జీవితాలు.. తెలంగాణా ఉద్యమ కెరటాలై.. నివురు గప్పిన నిప్పులా మా ఆశయ సాధనే మా ధ్యేయమై.. కదులుదాం కదులుదాం .. మన లక్ష్య సాధనకై కదులుదాం.. ఎవడు రా మా ఈ దుస్థితికి కారణం.. ఇంకెవ్వడు.. http://www.youtube.com/watch?v=xHlkLHunJKY&feature=youtu.be Discriminated !! ఈ ఫోటో లో మీరు చూస్తున్న ఫ్లోరోసిస్ తో బాధపడుతున్న బాలుడి పేరు కారెంగి అజయ్. తండ్రి పేరు యాదయ్య. ఊరు కోడష్పల్లి. ఈ పిల్లవాడి వయసు 14 సంవత్సరాలు. ఇతనికి మాటలు రావు, చూపు లేదు. ఒక వినటం, ఏడవటం తప్ప ఎం చెయ్యరాదు .. !! మెలకువ తో ఉన్నప్పుడు ఈ పిల్లవాడు చలికి వనికినట్టు వణుకుతూ కొట్టుకుంటాడు. ఆకలేసినా "అమ్మా ఆకలి" అని అడగలేని దయనీయ స్థితి. ఇతని పరిస్థితి ఒక 30 సేకేన్లు కు మించి ఎక్కువ చూడలేకపోయాను. అప్పటికే నా కళ్ళ నుండి నీళ్ళు రాలి ఎం చెయ్యాలో తోచని పరిస్థితి. మరి ఆ పిల్లవాడి తల్లిదండ్రులు 14 సంవత్సరాలు నుండి ఆ బిడ్డకు ఎలా సేవ చేస్తున్నారో. కళ్ళ ఎదుట కొడుకును అల చూస్కుంటూ ప్రత్యక్ష నరకాన్ని అనుభవిస్తున్నారు ఆ తల్లిదండ్రులు. డబ్బు పెట్టి రోగాన్ని నయం చేద్దామన్న నయం కానసువంటి రోగం అది. వయసు మీరుతున్నప్పుడు తమ బాగోగులు చుస్కునే కొడుకులను కనలనుకుంటారు ప్రతి తల్లిదండ్రులు. మరి తాము బ్రతికున్నంత కాలం ఆ అమాయకుడైన కొడుకుకు సేవ చేస్కుంటూ బ్రతకాలి అని కొడుకును గానేతప్పుడు ఆ తల్లి కూడా అనుకోలేదు. బిడ్డను కడుపులో మోసేటప్పుడు తల్లి పడే పాట్లకు ఈ విధంగా కొడుకును చూడటం ఇంకెంత నరకం??? ప్రతి తల్లి తమ పిల్లలతో "అమ్మ" అని పిలిపించుకోవాలని కోరుకుంటుంది. మరి ఈ తల్లిని ఎవరు పిలుస్తారు "అమ్మ" అని ??? ఆ పిల్లవాడు అల వణుకుతూ కొట్టుకుంటున్నప్పుడు అతని ఆత్మ గోష నాకు అర్ధమైంది. దేవుడా నన్ను ఈ తెలంగాణా ల ఎందుకు పుట్టిన్చినావ్? ఇసువంటి కష్టము నేను అనుభావిన్చాలేకున్నాను అని అతని ఆత్మ రోదిస్తుంది.. ఇలాంటి అజయ్ లాంటి వాళ్ళు నల్లగొండ జిల్లా లో చాల మంది ఉన్నారు.. వారి బాధను యే దేవుడు అర్ధం చేసుకోగలడు? కుల మతాల పేరుతో అంధకారం తో కొట్టుకుంటున్న మనం నిజమైన అనాగారి'కులము' !!! ఇది ఈరోజు నా తెలంగాణా తల్లి హృదయం లో పడే ఆవేదన !! - తెలంగానాస్ రెబెల్ టైగర్ Dt : 23 ఆగష్టు 2012

Friday, August 10, 2012

సిగ్నల్ సిండ్రోమ్!

సిగ్నల్ సిండ్రోమ్! తెలంగాణ సమాజం ఇప్పుడు కొంచెం ఊరడిల్లే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలారోజుల స్తబ్తత తరువాత, ఈ మధ్యే మళ్ళీ తెలంగాణ మాట వినబడుతోంది. కేసీఆర్ మౌనం వీడడం చాలామందికి ఊర ట కలిగిస్తోంది. ఈమధ్య ఇంట్నట్‌లో ఒక చర్చ నడుస్తోంది. అందులో భాగం గా కేసీఆర్ ఎక్కడ అంటూ ప్రశ్నల పరంపర మొదలయ్యింది. పరకాల ఎన్నిక ల తరువాత తెలంగాణ అలికిడే లేకుండాపోయిందని చాలామంది నెటిజన్లు బహుశా అందులో ఎక్కువమంది ఎన్‌ఆర్‌ఐలు వాపోతున్నారు. కేసీఆర్ ఒక వారం పదిరోజులు కనిపించకుండా, వినిపించకుండాపోయే సరికి సీమాంధ్ర మీడియా బెంగ పడిపోయినట్టే, తెలంగాణ పిల్లలు కూడా అలా బెంబేపూత్తిపోతారు. వెంటనే ఇంట్నట్ గ్రూపుల్లో వ్యాఖ్యానాలు చేస్తుంటారు. ఈ వ్యాఖ్యానాలకు కొందరు మిత్రులు ఓపిగ్గా వింటుంటారు, వివరణలిస్తుంటారు . కేసీఆర్ ఏమైనా టీవీ యాంకరా రోజూ కనిపిస్తూ కబుర్లు చెప్పడానికి అని ఆయన అప్పుడప్పుడు గదమాయిస్తుంటారు. కానీ ఇప్పుడు సగటు తెలంగాణవాదులది కోడిపిల్లల మనస్తత్వంగా మారిపోయింది. తల్లికోడి కనిపించకపోతే పిల్లకోళ్ళు పలవరించినట్టే కేసీఆర్ కనబడకుండాపోతే తెలంగాణ అంత అయోమయం ఆవరించేస్తుంటుంది. దీనికితోడు మీడియా కథనాలు కలవరపెడుతుంటాయి. వాటిని తెలంగాణవాదులు ఎవరికీ వారు తిప్పికొట్టడమో, ఒప్పుకోవడమో చేస్తుంటారు. ఇటువంటి సందర్భంలో అసలు సారేమనుకుంటున్నారన్న ప్రశ్న ఎవరికైనా వస్తుంది. అందుకే కేసీఆర్ ఇప్పుడు ఏ చర్యకైనా కేంద్ర బిందువు అయిపోతాడు. ఆయన ముమ్మాటికి తెలంగాణ ఉద్యమానికి కేంద్ర బిందువే! అలాంటప్పుడు మాటా పలు కూ లేకుండా మాయమైపోతే అయోమయం తప్పదు. నిజమే నాయకుడు ప్రతిరోజూ మాట్లాడడు. ఆ అవసరం లేదు. నాయకునికి ప్రత్యామ్నాయంగా ప్రతిరోజూ మాట్లాడేవాళ్ళు వేరే ఉంటారు. కానీ టీఆర్‌ఎస్‌లో గానీ, తెలంగాణ ఉద్యమంలో గానీ కేసీఆర్‌కు ప్రత్యామ్నాయంలేని పరిస్థితి. కొంతకాలం కోదండరాంను ప్రజలు తెలంగాణ ఉద్యమ ప్రతినిధిగా, కేసీఆర్ ఆలోచన ప్రతిబింబంగా చూశారు. కానీ అది నిజం కాదని ఎవరిదారి వారిదేనని ఇద్దరి మాట లు, కార్యాచరణను బట్టి ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఇక పార్టీలో కూడా కేసీఆర్‌లా ఇంకొక వ్యక్తి కనిపించడు. బయట కనిపించే ‘అధికార ప్రతినిధులు’ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కరకంగా, కొన్నిసార్లు ఒక్కరే అనేక రకాలుగా చానల్స్‌ను బట్టి మాట్లాడుతుంటారు. ఉద్యమంలో కేంద్రీకృత నాయకత్వం తప్పనిసరి. అదిలేకపోతే వ్యవస్థీకృత నిర్మాణం, కార్యాచరణ అయినా ఉండాలి. ఆ రెండూ లేనప్పుడు ముమ్మాటికీ తప్పుడు సంకేతాలు వెళ్తుంటాయి. కేసీఆర్ మాత్రం తనకు సంకేతాలు సరిగానే ఉన్నాయని అంటున్నారు. తనకు ఢిల్లీ నుంచి ఎప్పటికప్పుడు సిగ్నల్స్ అందుతున్నాయనీ అంటున్నాడు. సిగ్నల్స్ అందడం వల్లే తాను మౌనంగా ఉన్నాననీ అంటున్నాడు. కేసీఆర్‌కు ఉన్న సిగ్నల్స్ సామాన్యులకు లేవు. ఆ సిగ్నల్స్, ఉద్యమంలో ఉన్న మిగితా నేతపూవరికీ లేవు. చివరకు ఆయన పార్టీకి చెందిన శాసనసభ్యులకు, అధికారపార్టీకి చెందిన తెలంగాణ నేతలకు కూడాలేవు. సిగ్నల్స్‌తో ఉన్న చిక్కే ఇది. వాటికి రూపం ఉండదు. అవి కేవలం వాయుతరంగాలు. ఒక టవర్ నుంచి, ఇంకొక టవర్‌కు అవి ఉపక్షిగహం గుండా అందుతుంటాయి. ఉపక్షిగహం నుంచి వచ్చిన సిగ్నల్స్‌ను టవర్ నెట్‌వర్క్‌కు అందిస్తుంది. అప్పుడు గానీ అది ప్రజలకు చేర దు. అక్కడే ఉంది చిక్కంతా. తెలంగాణలో ఇప్పుడు అనేక ఉద్యమ నెట్ వర్క్ లు ఉన్నాయి. తెలంగాణ సంస్థలు, వేదికలు, జేఏసీలు, రాజకీయపార్టీలు వేటికవి సొంత నెట్ వర్క్‌లతో నడుస్తున్నాయి. అయినప్పటికీ తెలంగాణ ఉద్యమానికి కేసీఆర్ ఒక్కరే ప్రథానమైన టవర్‌గా ఉన్నారు. టీఆర్‌ఎస్ ఒక్కటే ప్రధానమైన నెట్‌వర్క్ అని అనేక సందర్భాల్లో రుజువయ్యింది. ఒక్క కేసీఆర్‌కు మాత్ర మే సిగ్నల్స్ అందుతున్నాయి కాబట్టి అవి టీఆర్‌ఎస్ శ్రేణులకు, ప్రజలకు కూడా అందితే తప్ప ఈ సమస్య ఉండదు. కానీ అప్పుడప్పుడు కేసీఆర్ గారే అందుబాటులో లేకుండా ఉంటున్నారని దానివల్లే నెట్‌వర్క్ సమస్యలు వస్తున్నాయని అంటున్నారు. ఢిల్లీలో ఉన్న టవర్ నుంచి ఏ సిగ్నల్స్ అందాయో హైదరాబాద్‌లో ఉన్న తెలంగాణ ప్రజలకు తెలియాలి. ఆ సిగ్నల్స్‌ను డీ కోడ్ చేసి ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాల్సిన బాధ్యత సిగ్నల్స్ అందుకున్నవాళ్ళ మీద ఉంటుంది. ఢిల్లీ నుంచి వస్తున్న సిగ్నల్స్ ఏం సూచిస్తున్నాయి అనేది అర్థం కాకపోతే క్రాస్ టాక్ ఇలాగే ఉంటుంది. పార్లమెంటు సమావేశాలు మళ్ళీ మొదలయ్యాయి. ఇప్పుడిక సీక్రెట్ సిగ్నల్స్‌తో పనిలేకుండా పార్లమెంటులో తెలంగాణ విషయంలో ఎవవరు ఏం చేస్తున్నారో ప్రత్యక్ష ప్రసారంలో దృశ్య రూపంలో చూసేయవచ్చు. కొద్దిరోజులుగా తెలంగాణలో ఒక విధమైన స్తబ్ధత నెలకొని ఉన్న మాట వాస్తవం. ముఖ్యంగా పరకాల ఉపఎన్నిక తరువాత విజయమ్మ యాత్ర మినహా మరో సంచలనం ఏమీ లేకపోవడమే ఈ స్తబ్ధతకు కారణం. సుదీర్ఘ పోరాటంలో ప్రతిరోజూ సంచలనాలు ఉండవు, కానీ తెలంగాణ ప్రజలిప్పుడు వాటికి అలవాటుపడి ఉన్నారు. వేరే పనులన్నీ పక్కనబెట్టి ఏదైనా జరిగితే బాగుండునని ఎదురు చూస్తున్నవాళ్ళూ ఉన్నారు. వెంటనే తెలంగాణ ఇచ్చేస్తున్నట్టు కేంద్రం ప్రకటిస్తుందని ఎవరూ అనుకోవడం లేదు. కానీ ఎప్పటికైనా తెలంగాణ వస్తుందనే నమ్మకం మాత్రం ఇంకా సడల లేదు.పార్లమెంటు సమావేశాలు మొదలైన బుధవారం నాటి దృశ్యం టీవీలలో చాలామందే చూసి ఉంటారు. మేడం సోనియాగాంధీ హఠాత్తుగా స్కూల్ టీచర్ అయిపోయారు. చూపులబెత్తంతో ఆమె తన పార్టీకి చెందిన ఎంపీలను కట్టడి చేశారు. మేడం గారు తెలంగాణపై మొదటిసారిగా మౌనం వీడారు. కానీ మౌనం వీడి ఏం చేశారు? తెలంగాణ కోసం మాట్లాడుతున్న ఎంపీలను మౌనంగా ఉండమని ఆదేశించారు. ఈ మాట చెప్ప డం ద్వారా ఆమె ఏ రకమైన సిగ్నల్స్ ఇచ్చారు? మేడంగారి మాటల్లో తమకు సానుకూల సంకేతాలే అందాయని టీ కాంగ్రెస్ ఎంపీలు చెపుతున్నారు. కానీ టీవీల్లో జరిగిన తతంగం చూసిన వారికి సోనియాగాంధీ నోరుమూసుకుని కూర్చోండి అన్నట్టే కనిపించింది. నోరుమూసుకుంటే తప్ప ఎవనా మౌనంగా ఉండలేరు కదా! బహుశా కాంగ్రెస్ ఎంపీలు ఇప్పుడు ఆ పనిలో ఉంటారు. సంకేతాలు సరిగానే ఉన్నా సందేశాలు ఎందుకు అందడంలేదో. నెట్‌వర్క్ నిపుణులు చెప్పాలి. తెలంగాణ విషయంలో ఎప్పటికప్పుడు సిగ్నల్స్ సరిగానే అందుతున్నాయి. ఉట్టి సిగ్నల్సే కాకుండా తెలంగాణ ఉద్యమం చెవులు బద్దలయ్యే శబ్ద తరంగాలను సృష్టించింది.ఇటునుంచి అటు, అటు నుంచి ఇటు సిగ్నల్స్ నిరంతరాయంగా ఉంటున్నా.. ఇప్పటిదాకా ఢిల్లీ టవర్ నుంచి ఒక్క సందేశం కూడా ఇక్కడ డెలివరీ కాలేదు. వాయిదాల మీద వాయిదాలతో ఈ వ్యవహారం అలాగే సాగుతోంది. ఇప్పుడు ఏదో ఒకటి తేలాలంటే ఇప్పటిదాకా ఉత్తుత్తి గాలి తరంగాలుగా ఉన్న వాయుతరంగాలు ఇప్పుడు స్పష్టమైన శబ్ద తరంగాలుగా రావాలి. దాని కి పార్లమెంటును మిం చిన వేదిక ఉండదు. కానీ కేసీఆర్ పార్లమెంటుకు వెళతా రో లేదో తెలియదు. వెళ్ళినా అక్కడ ఉపయో గం లేదనేది గతంలో ఆయన అనుభవం. బిల్లు పెట్టండి మద్దతునిస్తం అని బయట దాంబికంగా మాట్లాడే భారతీయ జనతాపార్టీకి,అస్సాం శాంతి భద్రతల విష యం కంటే తెలంగాణ ప్రశాంతంగానే కనిపిస్తుంది. ఆ పార్టీ తెలంగాణను పెద్దగా పట్టించుకోవ తెలంగాణ మీద పార్లమెంటులో పెద్దగా చర్చ జరగకపోతే ఏం చేయాలి. ఉగా ది నుంచి దసరాకు, దీపావళి నుంచి హోలీకి తిరిగినట్టే తెలంగాణ వ్యవహారం ఎన్నికల తరువాత ఎన్నికలతో వాయిదాపడుతున్నది. చివరికి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు కూడా అయిపోయాయి. రాష్ట్రపతి ఎన్నికల తరువాత ప్రణబ్ ముఖర్జీ తన మొదటి సంతకం తెలంగాణ బిల్లుమీదే పెడతారని ఆ మధ్య కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యులొకరు ఒక జోక్ చేశారు. ఈ జోక్‌కు ఎవ్వరూ నవ్వలేదు. కానీ ఆ పార్లమెంటు సభ్యుడి అమాయకత్వానికి మాత్రం నవ్వుకోక తప్ప దు. ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతిగా హాయిగా పోయిన ఆగస్టు ఫస్టున తన మొదటి సంత కం మొదటి జీతం కోసం పెట్టే ఉంటాడు. అయినా యూపీఏ ఆమోదించకుండా, కేబినేట్ చర్చించకుండా అసలు ప్రతిపాదనే తయారు కాకుండా ఏ బిల్లు పెట్టినా అది చెల్లుబాటు కాదు. ఇప్పుడు అన్ని వాయిదాలు అయిపోయాయి. పార్లమెంటు కూడా మొదలయ్యింది. ఇప్పుడు తెలంగాణ మీద ప్రకటన చేయడానికి కాంగ్రెస్ పార్టీకి ఏ సమస్యా లేదు. బహుశా అందుకే కేసీఆర్ ఆగస్ట్ 20వ తేదీని అంతిమ వాయిదా అంటున్నాడు. చాలారోజుల తరువాత మళ్ళీ తెరమీద కనిపించిన కేసీఆర్ మళ్ళీ వాడి వేడి ప్రకటనలు చేయడంతో హడావిడి మొదలయ్యింది. పోయిన వారమంతా తెలంగాణ నేతల్లో ఏదో ఒక చలనం కనిపించింది. ముఖ్యంగా ఆగ స్టు ఇరవైలోపు తెలంగాణ విషయంలో ప్రకటన రాకపోతే అంతు చూస్తామని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కే సీఆర్ ప్రకటించడం ఒక తాజా పరిణామం. కేసీఆర్‌కు ఇలాంటి డెడ్‌లైన్లు కొత్త కాదని కొట్టిపారేసే వాళ్ళూ ఉన్నారు. అయినా సరే కేసీఆర్ అన్నాడంటే ఆయనకు ఏదో ఒక సిగ్నల్ ఉందని అనుకునే వాళ్లే ఎక్కువ. కేసీఆర్‌కు అందుతున్న సిగ్నల్స్ కంటే మనకు కనిపిస్తోన్న సిగ్నల్స్‌కు చాలా తేడా ఉన్నట్టు అనిపిస్తోంది. ఏదిఏమైనా మొట్టమొదటిసారి కేసీఆర్ ఒక స్పష్టమైన డెడ్‌లైన్ కేంద ప్రభుత్వం ముందుపెట్టారు. కానీ ఇంకా కార్యాచరణ ప్రకటించలేదు. దానికి సంబంధించిన కసరత్తు ఏదీ మొదలుపెట్టలేదు. బహు శా ఆయన ఢిల్లీ నుంచి రావాల్సిన సిగ్నల్స్ కోసం వేచి చూస్తూ ఉండవచ్చు. అయినా ఇప్పుడు కొత్త సిగ్నల్స్ వచ్చే అవకాశం లేదు. అలాంటిదేదైనా జరగాలంటే ఇక్కడ ఉద్యమ పొగ రాజుకోవాలి, ఆ సెగ ఢిల్లీకి తాకాలి. పార్లమెంటు సభ్య్లంతా ఢిల్లీ లోనే ఉండి, చెవిలో జోరీగల్లా పార్లమెంటును చికాకు పరచాలి. ఇప్పుడు ఇక సిగ్నల్స్ తో పనికాదు, నేరుగా షాక్ తగిలితే తప్ప చలించే స్థితిలో కేంద్రం లేదు. ఆ దిశగా ఆలోచించాలి. పొఫెసర్ ఘంటా చక్రపాణి సమాజశాస్త్ర ఆచార్యులు, రాజకీయ విశ్లేషకులు ఈ మెయిల్:ghantapatham@gmail.co

Friday, June 29, 2012

TGBKS victory in singareni elections

ooops.. i just came to know from one of my friends from my city about the victory made by the Telangana Boggu Gani Karmika Sangham (TGBKS) .. kudos.. it seems am missing alot..

Tuesday, August 23, 2011

లోక్ సత్తా లో నాకో బహుమానం..

లోక్ సత్తా లో నాకో బహుమానం..
మిత్రులారా, అందరికీ వందనాలు.. నేనిక్కడ ఈ పోస్ట్ ఎందుకు రాస్తున్నాంటే, ఇలాంటి అనుభవం మరెవ్వరిని కలుగకూడదు అనే ఉదేస్యంతోటి మాత్రమే. అంతేకాదు ఇది నా స్వీయానుభవం కూడా..
నేను మొదట్లో లోక్ సత్తా ఒక ఉద్యమం గా ఉనపుడు దానికోసం పని చేసాను, రాజకీయాల్లోకి రావడాన్ని తీవ్రంగా వ్యతిరేకించి, పార్టీ పెట్టాక వదిలేసాను.. ఇక్కడ మీకో విషయం చెప్పాల్సినదేంటంటే, నేను ఎపుడు కూడా ప్రత్యక్షంగా లోక్ సత్తా లో మెంబెర్ ని కాలే.. ఒక విధంగా బయటి మద్దతు.. నేను చాలా కాలం క్రితం, FB లో నా ఎకౌంటు తాయారు చేసినపుడు, లోక్ సత్తా గ్రూపు లో జాయిన్ అయ్యాను.. కానీ ఎపుడు కూడా నేను ఎలాంటి డిస్కసన్ లో అంత ఆక్టివ్ గా లేను, ఎందుకంటే నాకు అంతకు ముందే అర్ధం అయింది ఏంటంటే, అందులో ఉన్నవాళ్ళంతా చేపెదోకటి చేసేదొకటి.. పైకి మాత్రమే సిద్ధాంతాలు, చేసేదంతా వారికిష్టం వచ్చింది అని..
ఒకప్పుడు నేను జర్మనీ లో ఉన్నపుడు, కొందరు లోక్ సత్తా నాయకులూ నాకు మెస్సేజెస్ కూడా పంపారు, మీ ఊరిలో కొన్ని మంచి పనులు చేద్దాం, మీలాంటి వారు మాకు తోడుగా ఉండాలి అని.. నాకు వ్యక్తిగతంగా లోక్ సత్తా మీద అంత మంచి అభిప్రాయం లేకున్నా, చెడు అభిప్రాయం మాత్రం లేదు, పార్టీ గురించేమో కాని, ఆ మిత్రుడి మాటలు ఎందుకో వినాలి అనిపించి సరే అనుకున్నా..

ఇక ఈ మధ్య నేను కొంచెం active గా ఉండడానికి ముఖ్య కారణాలు ఏంటంటే, కొంతమంది నా మిత్రులు (లోక్ సత్తా కి strong suporters ) లోక్ సత్తా లో democracy ఉంటుంది అని చెప్తే నవ్వుకున్నా (నాలో నేనే), అయితే కొన్ని రోజుల క్రితం, నేనొక పోస్ట్ చూసా, అదేంటంటే ఒక పేరు చెప్పుకోవడానికి ఇష్టపడని ఒక సీమంధ్ర యువకుడు తెలంగాణా గ్రూపుల గురించి మరియు దాని admins ని చాలా చులకనగా చేసి మాట్లాడుతుంటే వాడికి సరైన జవాబు ఇచ్చి వాడి నోరు మూయించా, అప్పుడు డిసైడ్ చేస్కున్న, ఇంత మంది సదువుకున్నోల్లు ఇక్కడ ఉన్నారు కనీసం వీళ్ళలో ఉన్న ఒకరిద్దరయినా అర్ధం చేస్కోలేక పోతారా మన భాదలను అని ఆ గ్రూపులో తెలంగాణా గురించి discussions స్టార్ట్ చేశా.. నేను పెట్టిన pro -తెలంగాణా పోస్ట్ లకి 300 లకు పైగా comments వచ్చిన సందర్భాలు ఉన్నాయి.. అపుడు నా మిత్రుడొకరు, నీ పోస్ట్ గిన్నిస్స్ బుక్ లో రికార్డు అయ్యేలా ఉంది అని అంటే నేను ఎమన్నా అంటే, " అన్నా, ఏదో ఒక రోజు నన్ను ఖచ్చితంగా ఈ గ్రూప్ నుండి తీసేస్తారు " దానికి నా మిత్రుడు ఏమన్నాడు అంటే "నో ఛాన్స్" .. సరే చూద్దాం అని అనుకున్నా, మనసులో .. ఆ పోస్ట్ లను చూసిన కొంత మంది సీమాంధ్ర వాళ్ళు, నాకు పర్సనల్ massages కూడా పెట్టారు, "ఆ పోస్ట్ ని delete చేయండి, నాకిష్టం లేదు ఆ పోస్ట్, తొక్క తోలు అని ఏదో ఏదో "అన్నారు, నేనోకటే అన్న" నువ్వేదన్నా మాట్లాడాలి అనుకుంటే అక్కడే కామెంట్ చేయి " అని, ఇంకొందరు " మీరు చాలా మంచి పని చేస్తున్నారు, keep it up " అని moral support చేసారు.. అందులో ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్న మన తెలంగాణా వాదులయితే ఏకంగా నాతో పాటు ఆ debate లో పాల్గొని మేము సైతం తెలంగాణా కోసం అంటూ నాతో చేయి కలిపారు... అందులో ముఖ్యంగా ఉదయ్ , సతీష్, రమ్య లాంటి వారు... thanks alott to all who supported me in this way.. ఇలా మేము కొంచెం పనే చేస్తున్నాం అనుకున్నాం ఐనా కూడా మా మనస్సులో ఒకటే ఉంది, "ఎపుడో మనకు ఈ గ్రూప్ నుండి మమ్మల్ని compulsory గా remove చేస్తారు" అని ... మరి కొందరైతే, ఏకంగా ఇలాంటి పోస్ట్ లు మీ తెలంగాణా గ్రూప్ లో పెట్టుకోండి అకడ అయితే మీకు ఫుల్ సపోర్ట్ వస్తుంది, ఇక్కడ పోస్ట్ చేయకండి అని... అయినా ఊరుకున్నం... కొంతమంది మేథావి వర్గం అయితే మమ్మల్ని ఫూల్స్ అంది, అయినా భరించాం.. ఇంకొంతమంది తమ తమ ప్రత్యేక భాషలో మమ్మల్ని రెచ్చగొట్టారు అయినా మేము సర్దుకున్నాం.. మంచి మాటలతో సమాధానం ఇచ్చాం...

అలా కొంత మందిని మా శక్తి మేరకు convinience చేయగలిగాం... అది మేము సాధించిన మొదటి విజయం గా భావించాం... ఇలా ఎన్నో విషయాల్లో సాధ్యమయినంత వరకు మేము మా అభిప్రాయాలను పంచుకున్నం. ఇంకా కొందరైతే, మా వల్ల, మా పోస్ట్ ల వల్ల గ్రూప్ అంత నాశనం అవుతుందని పబ్లిక్ గా అరిచి గీపెట్టారు.. కొంతమంది pseudo మేధావి వర్గం వారికి వంత పడింది.. సర్లే ఎవరి ఇష్టం వారిది అనుకున్నాం.. pro -తెలంగాణా పోస్ట్ లకు వందల కొద్ది comments (debate) రాగా anti -సమైక్యాంధ్ర పోస్ట్ లకి ఒక్క రిప్లై వచ్చింది..అది కూడా anti telangana context lo... అది వారి నిజమైన మనస్తత్వానికి నిదర్సనం..
ఇలా మేము- ''చదువుకొని, సొసైటీ కి మంచి చేద్దాం అని వచ్చిన JP కి మా తెలంగాణా ప్రజల గోస కనపడ్తలేదా'' అని భహిరంగంగా, వారి గ్రూప్ లోనే మాట్లాడినం.. శత్రు గడ్డ మీదకెళ్ళి మరీ పోరాడుతున్న సైనికుల్లా మేము గర్వపడ్డాము.. మాకు తెలుసు వీళ్ళంతా (more than 90 % అఫ్ LSP people ) మాట్లాడుతారు తప్ప చేయడం ఏమీ ఉండదు అని.. అయినా కూడా ఏదో చిన్న ఆశ మా మనస్సులో, ఎవరైనా ఒకరు మాది న్యాయమైన పోరాటం అని ఒప్పుకుంటారేమో అని.. మేము అనుకున్నదానికి మించి మేము సాధించాం.. కొంతలో కొంత అన్నట్లు కొందరు మా వాదనలతో అంగీకరించారు. ఇంకొందరు మాతో దోస్తీ చేసారు...వాళ్ళ మనసులో ఏముందో మాకైతే తెలీదు కాని మేము మాత్రం మన సొసైటీ బాగు కోసం sincere గా పని చేసేవాళ్ళని దోస్తీ చేసాం...
అదే సమయంలో అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న అన్నా హజారే మీద ఒక మంచి పోస్ట్ చేస్తే, నన్ను తెలంగాణా విషయంలో ఎదిరించిన కొందరు బాగుందని అన్నారు.. అబ్బో అనుకున్నా.. మొన్న ఒక సభ లో విద్వేషాలు పెంచి ప్రాంతాలను విభాజించోడ్డు అన్న JP comments కి వ్యతిరేకంగా నా మిత్రుడొకరు ఒక పోస్ట్ చేసారు.. దానిని సమర్ధిస్తూ నేను కూడా వాదించా.. ఎంతో వినయంగా అయ్యా అంటూ జవాబు రాసా.. నేను రాసినదాంట్లో ఉన్న తప్పేంటంటే, JP కి వ్యతిరేకంగా రాయడమే ( అలా నేను రాయడం మొదటి సారేమి కాదు) .. JP ని పొగుడుతూ రాస్తే ఎంతో మంది నన్ను మెచుకునే వారేమో?? ఒకానొక సందర్భంలో JP ని కొట్టిన మల్లెషన్న ని సమర్దిన్చాము, AP భవన్ లో చందర్ రావు ని కొట్టి సారి చెపిన హరీష్ రావు ని సమర్దిన్చాము... JP నోరు తెరువాలి అని గట్టిగా అరిచాము.. అలా చేయకపోతే చదువుకొని, రాజకీయాల్లో మార్పు తెద్దామని , రాజకీయం చేస్తున్న JP కి మిగతా వారికి తేడా ఏమి లేదు అని అన్నాము.. నిజమే కదా మరి..
ఇలాంటి discussions నుండే నా మిత్రుడొకరు pseudo intellectuals / pseudo social activists అంటూ ఒక నోట్ పెట్టాడు... ఒక రకంగా ఆలోచిస్తే ఇది కరెక్టే అనిపిస్తుంది...

సమాజంలో మార్పు తెద్దామని కల్లెక్టర్ పదవిని తృణప్రాయంగా వదులుకున్న, ఒక IAS మేధావి, ఇలా అన్యాయం మీద పోరాడుతున్న ప్రజలను పట్టించుకోక పోవడం ఎంతవరకు సమంజసం?? అది తనలోని ఆంధ్ర అహంకారామా లేక, తెలంగాణా పట్ల వివక్షా లేక ఆ ఏమి చేస్తారు లే ఈ తెలంగాణా ప్రజలు అనే నిర్లక్ష్య ధోరణియా ..??
అసలు సమాజ బాగు కోరే వాడెవడైనా ఇలాగే చేస్తాడా? ఒక ప్రాంతానికి ఒక న్యాయం ఇంకో ప్రాంతానికి ఇంకో న్యాయమా?? అంటూ గొంతేత్తాం...
చివరకు మాకు లభించిన బహుమానం ఏంటో తెలుసా ... ఆ గ్రూప్ నుండి మమ్ములను remove చేసారు.. అది లోక్ సత్తా లో ఉన్న ''democracy ''. ఇది వారు కోరుకునే మార్పు.. ఇది వాళ్ళ లక్ష్యం.. ఇది వాళ్ళు తెచ్చే మార్పు.. ఇలాంటి వారు సొసైటీ ని ఏం బాగు చేస్తారో??
My sincere thanks to ravindra nandam, srinivas rao, sri atluri, sravanth reddy, sekhar chandra, vivek joginapally, alleni ramya, satish siripuram, udaykanth and many more for giving your support in many ways... and all the best to my friends who are still beleiving in LSP..
వ్యక్తి పూజ కు వ్యతిరేకం అనే JP తన పార్టీ లో చేసే వ్యక్తి పూజ కనబడడం లేదా, ఓ JP సారూ..?? ఈ మీ గ్రూప్ లో చేస్తున్నది అంత మీ భజనే.. అది తెల్సుకో JP సారూ... నీ లక్ష్యాన్ని మాటల్లో కాదు, చేతల్లో చూపెట్టు కొంచెం... ఓ నా మిత్రులారా, మీ పార్టీ నిజం గా మార్పు కోసమే పుట్టినట్లితే, నిజంగా సొసైటీ బాగు కోసమే పని చేస్తున్నట్లయితే, ఇంకా మిగతా పార్తీల్లాగా కాకుండా ఒక single stand తీసుకోమను.. ఎపుడు అడిగిన కొన్ని రోజుల్లో LSP నుండి గుడ్ న్యూస్ వింటావ్ అంటారు కాని ఎపుడో చెప్పరు... కొంచెం దిమాగ్ తో అలోచించి మాకు చెప్పరు.. ఇంకెన్ని రోజులు వెయిట్ చేయాలి?? మిగతా పార్టీలతో ఏ విధంగా తేడానో చెప్పండి మీ పార్టీ...