ఉద్యమ తీరు మరబోతున్నదా....
అవునండి, నిజమే ఇది మరి... నాకీ డౌటు ఎందుకోచిందా అనేదే మీ డౌటు కాదు...
ఉద్యమాన్ని అతి దగ్గరగా, అత్యంత ఆసక్తితో చూసే ఎవరికైనా ఈ మధ్య జరిగిన జరుగుతున్న సంఘటనలను చూస్తే ఈ అనుమానం రాకపోదు..
సంఘటనలు ఎన్ని ఉన్న నేను ఇక్కడ కొన్నింటిని మాత్రమే వివరిన్చదలచుకున్న..
మీకు తెలిసిందే కదా మార్చ్ 10 న తెలంగాణా జాక్ హైదరాబాద్ లో million మార్చ్ ప్రకటించింది. దీనికి అన్ని పార్టీల వారు వారి వారి పార్టీ జెండాలను పక్కన పెట్టి పాల్గొనేందుకు సిద్ధం అవుతున్నారు .. దేనిని అనగాదోక్కదనికై ప్రభుత్వం, సీమంధ్ర నాయకులు వారి వారి ప్రయత్నాలు వారు చేస్తున్నారు.. ఇది ఇంతటితోనే ఆగిపోక పోలీసు వ్యవస్థను కూడా ఇందులోకి లాగే ప్రయత్నం జరుగుతున్నది.. DGP అరవింద్ రావు ఈ million మార్చ్ కి అనుమతి లేదని ఎక్కడి ప్రజలను అక్కడే కట్టడి చేయాలనీ జిల్లా పోలీసు ఉన్నత అధికారులకు, జిల్లా SP లకు ఆదేశించడం కూడా ఇందులో బాగంగానే జరుగుతుంది... దీనికి ప్రతి సవాలుగా తెలంగాణా జాక్ కన్వీనర్ ప్రొఫ్. కొదండ్రామ్ అనుమతి తీసుకొం అంటూ దిక్కర స్వరం వినిపించారు.. ఇందులో మనం కొన్ని విషయాలను గమనించాల్సి ఉంది.. ముఖ్యంగా ఇన్ని రోజులు ప్రజలు శాంతియుతంగా తమ తమ నిరసనలను వెలిబుచ్చి ఇక ఎంత చేసిన దున్నపోతుల నిద్రపోతున్న ప్రభుత్వం స్పందించడం లేదని, తమ ఉద్యమానికి కొత్త మలుపు ఇవదలిచారుగా మన భావించవచ్చు.. ఇందులో బాగంగానే ఈ వాఖ్యలు.. ఇంత కాలం ప్రభుత్వం పోరాటం చేసిన మన తెలంగాణా ప్రజలు, ఇక పోలీసులతో కూడా పోరాడటానికి సిద్ధం ఆతున్నారు... మరో పక్క పోలీసుల్లో కూడా తెలంగాణా వారు ఒక వర్గం గా ఏర్పడే సూచనలు జరుగుతుండగా, వారిని ఉన్నతాధికారులు అనగ దోక్కుతున్నరనడంలో కొత్తేమీ లేదు..ఏది ఏమైనపటికి ఉద్యమ తీరు మారబోతున్నది అని చేపటానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు...
ఇదంతా ఒక ఎత్తు అయితే ఇదే సమయంలో ఢిల్లీ లో మరో ప్రకటన..
JNU లోని తెలంగాణా విద్యార్థుల గళం అన్ని రాష్ట్రాల్లోని వివిధ విద్యార్ధి సంఘాలతో కలిసి జాతీయ స్థాయిలో solidarity committee formation మరియు మార్చ్ to పార్లమెంట్ మార్చ్ 10 , 11 వ తేదీల్లో. ఈ కార్యక్రమంలో మొత్తం 15 విద్యార్థి సంఘాలు నిమగ్నమై ఉండగా మరి కొన్ని సంఘాలు మేము సైతం అంటూ ముందుకు రాబోతున్నాయి... మోతంగా 16 రాష్ట్రాల నుండి విద్యార్థులు భారీ సంఖ్యలో రాబోతున్నారు. మార్చ్ 10 న దేశవ్యాప్తం గా ఉన్న అన్ని విద్యార్థి సంఘాలను ఏకం చేస్తూ solidarity committee formation JNU లో జరుగనుంది, ఆ తర్వాత 11 వ తేదిన విద్యార్థులంత కలిసి పార్లమెంటు వైపు రాలీ గా వెళ్తారు.. ఇలా ఉద్యమం దేశవ్యాప్తం అయ్యేవిధంగా జరుతున్న ఇలాంటి వాటిని చూస్తూ ఉంటె ఖచ్చితంగా ఉద్యమ ప్రస్థానం మారబోతోంది అనడానికి బలం చేకూరుతోంది...
ఏది ఏమైనపటికి తెలంగాణా సాధన అనేదే ఇక్కడి ప్రజల బలమైన ఆకాంక్ష అని, దాని సాధనకై ప్రజలు ఎంతకైనా తెగిస్తారు అని మరో మారు చెప్పనవసరం లేదేమో...
No comments:
Post a Comment