Sunday, March 6, 2011

అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో నీతి జాతి లేని రాజకీయాలు ప్రజాస్వామ్యానికి కళంకం కాదా... ??

ఫ్రపంచంలొనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశముగా పేరొందిన మన భారత దేశం మీద ప్రపంచంలోని గొప్ప గొప్ప ప్రజాస్వామ్య వాదులకు ఈ మధ్య ఒక పెద్ద డౌట్ వస్తోంది.. అదేమంటే అసలు ఇది ప్రజాస్వామ్య దేసమేనా అని??
ఆను మరి ఈ డౌట్ రావటంలో తప్పేమీ లేదు ఎందుకంటే ఈ మధ్య కాలంలో జరుతున్న రాజకీయాలు అలా ఉన్నాయి.. నేతి జాతి లేని రాజకీయాలను భారత దేశ ప్రజలు చూస్తున్నారు.. ముఖ్యంగా తెలుగు భాష మాట్లాడే ప్రాంతములో అయితే మరీ దరిద్రం గా ఉన్నాయి అని కొత్తగా చెప్పనవసరం లేదు....
ఈ మధ్య జరిగిన కొన్ని ఆసక్తి కర విషయాలను ఒకసారి మీ ముందుకు తీసుకువస్తే ముఖ్యంగా..

తెలుగు వారి ఆత్మ గౌరవం అంటూ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకముగా పుట్టిన TDP పార్టీ, ఇపుడు అదే పార్టీ తో దోస్తీ కట్టింది.. అది కూడా ఒకే ఒక్క MLC సీటు కోసం. ఎన్నికలు వొస్తే చాలు ఒకరి మీద ఇంకొకరు దుమ్మెత్తి పోసుకొనే ఈ రెండు పార్టీలు ఇపుడు భాయి భాయి అనే స్థాయిలో జత కట్టాయి... ఇక ఆ పార్టీ అధినేత (CBN ) అయితే కాంగ్రెస్ పార్టీ కి పెద్ద బద్ద శత్రువు అని అనేవాళ్ళు... అయినా ఈ రాజకీయాలను నేనే సరిగ్గా అర్ధం చేసుకోవట్లేదేమో... ఇంకా CBN కి అందరికి ఉన్నట్లే రెండు కళ్ళు ఉన్నాయి కాని అవి అందరిలా ప్రపంచాన్ని చూసేవి మాత్రం కావండోయ్ ... ఆ రెండు కళ్ళు ఏంటంటే ఒకటి తెలంగాణా, ఇంకోటి సమైక్యాంధ్ర... ఇక్కడ మనం ఒకటి అర్ధం చేసుకోవాలి.. సమైక్యాంధ్ర అంటే Seema+ ఆంధ్ర అని తన దృష్టిలో మాత్రం ... ఈ రెండు కళ్ళలో ఒక కంటికి చూపు సరిగ్గా ఉండదు తెల్సా... ఆ కంటితోనే తెలంగాణా ప్రాంతాన్ని చూస్తున్నాడు మన బాబు... మన అన్నాను అని ఇంకోల అర్ధం చేసుకోకండి.. ఎంతైనా తెలుగు వాడు కదా, అందులోను తెలుగు వాడి ఆత్మ గౌరవం కోసం పుట్టిన పార్టీకి అధినేత.. అధినేత ఎలా అయితే మనకేంటి కాని మనం మన విషయం మాట్లాడుకుందాం...
ఇలా తన పార్టీ నాయకులను వేర్వేరుగా చూస్తూ తన కంట్రోల్ లో పెట్టుకుంటున్న బాబు మంచి తెలివి గల్లోడు ...తెలంగాణా ప్రాంత TDP నాయకులూ ప్రజల ఒత్తిడి తో JAI తెలంగాణా అంటుండగా SA కి చెందిన నాయకులను సమైక్యంద్ర అనండి ani బయటికి చేపకపోయిన అంతర్గతంగా వాళ్ళను రెచ్చగొడుతూ తన పబ్బం గడుపుతున్నాడు...
అంతే కాకా తెలంగాణా ప్రాంత నాయకులతో TRS పార్టీ ని, KCR ని బండ భూతులు తిట్టందని ప్రేరేపించి తెలంగాణా వారి మధ్య విభేదాలు సృష్టించాలని చూసాడు... అందులో కొంతవరకు తాను సక్సెస్ అయినా తాను తవ్వుకున్న గోతిలో తనే పడిపోయే స్థితిలో ఉన్నాడు ... ఇదంతా తెలియని మన తెలంగాణా TDP నాయకులూ కెసిఆర్ ని, TRS ని బండ భూతులు తిట్టారు. ముఖ్యంగా, TRS కాంగ్రెస్ ఒకటే అని, KCR కాంగ్రెస్ పార్టీ తొత్తులా పనిచేస్తున్నాడు అని ఇంకా తెరాస, KCR వి నీతి జాతి లేని రాజకీయాలు అని.. ఏవో ఏవో బాగానే తిట్టారు అనుకోండి... ఇవన్ని ఎందుకు తిట్టారు అంటే కాంగ్రెస్ అంటే TDP వారికి పడదు కనుక... మరి ఇలా తిట్టిన ఆ నాయకులూ ఇపుడు కాంగ్రెస్ తో దోస్తీ కట్టడాన్ని ఎలా జీర్నించుకున్తున్నారో... ఇపుడు అసలు విషయం మాట్లాడుకుంటే అసలు నీతి జాతి లేనిది ఎవరికీ...?? ఇలాంటి TDP నాయకులకా.. లేక ప్రజల పక్షాన, ప్రజల కోసం పోరాడుతున్న తెరాస, KCR కా ...?? అసలు సిగ్గు, సారం లాంటివి ఎమన్నా ఉంటె ఇలా చేస్తారా....?? అయినా మన రాజకీయ నాయకులకు సిగ్గు సారం లాంటివి లేవు లే... ఇది ఒక ఘటన మాత్రమే..
ఇంకోటి చూస్తే-

మనది ప్రజాస్వామ్య దేశం, ప్రజల మాటే ప్రభుత్వం మాట, ప్రజల కోసమే ప్రభుత్వం పని చేయాలి, ప్రజలే ఇక్కడ ప్రభువులు అన్నా లోక్ సత్తా (పార్టీ గురించే సుమా.... నాకు తెల్సి ఒకపుడు లోక్ సత్తా అని ఒక అర్గానైజేసన్ ఉండేది ప్రజల కోసం అవినీతి మీద చాల బాగా పోరాటం చేసారు, కానీ ఇపుడు ఏకడ కూడా కనిపిస్తలేదు.నేను దాని గురించి మాట్లాడటంలేదు...) గురించి కూడా కొంచెం మాట్లాడుకోవాలి...
నీతులు చేపడం లో పెద్ద దిట్ట ఈ JP ... ఒకరికి నీతులు చెప్పు సామీ అని కూడా అడగనవసరం లేదు.. నీతులు చెప్పేవాళ్ళకు నోబెల్ ప్రైజ్ ఇచ్చే అవకాశం ఉంటె మన JP కే ప్రతి సంవత్సరం నోబెల్ ప్రైజ్ వస్తుంది.... ఇలాంటి JP కి తెలంగాణా కు జరిగిన జరుగుతున్న అన్యాయం కనిపించడం లేదంటే అది తన గొప్పతనం మరి... ఎపుడో జరిగిన అన్యాయం గురించి కాకున్నా ఇపుడు తన కాళ్ళ ముందు జరుగుతున్న అన్యాయాన్ని కూడా ఎదురించలేని అసహాయత తనది... అది అసహాయత కాదు... ఇంకేదో.. ఎంత అయిన ఆంధ్ర ప్రాంతానికి చెందిన రాజకీయ నాయకుడు కదా.. తన మనసుకు తెల్సు ఇక్కడ అన్యాయం జరుగుతుంది అని... కాని ఎదురించాడు... ఇంతే కాదు ఈ మధ్య జరిగిన ఒక సంఘటన ఒకటి చూస్తే , అదేనండి మల్లేషు JP తలకాయ సరిగ్గా పని చేస్తాలేదని ఒకసారి అసలు మెదడు ఉందొ లేదో చూద్దామని అలా తల మీద తన చేయి
పెట్టిండో లేదో కొట్టాడు అని అరిసారు అందరూ పార్టీలకు అతీతంగా ... కొంత మంది ప్రజాస్వామ్య వాదులు అయితే ఏకంగా ప్రజాస్వామ్యానికి మచ్చ ఈ ఘటన అన్నారు.. అసలు ప్రజాస్వామ్యానికి అర్ధం ఏంటో?? నన్ను మాత్రం అడగకండిఓయ్ ... నేను చిన్నపుడు చదువుకున్న ప్రజాస్వామ్యం అర్ధం వేరు, ఇపుడు చూస్తున్న ప్రజాస్వామ్య వేరు.. ఈ విషయం లో నాకు పెద్ద కాంఫుజను..... ప్రజాస్వామ్యం అనేది ఎపుడు గుర్తుకు రాని వారికి కూడా ఇపుడు ప్రజాస్వామ్యానికి ఏదో ఐనటు అరిసారు... ఇలా అరవడం అన్నది అసలు కళంకం అన్నది నా ఒపినిఒను ...
దీనిని ఇంతటి తో ఆపి ఇంకో విషయం గురించి మాట్లాడుకుంటే... అదేనండి ముఖానికి ఇంత రంగు పూసుకొని నటించు వయా చిన్నజీవి అని అంటే (సారీ, చిన్నజీవి అనడం అలవాటు అయింది, నిజానికి చిరంజీవి అనుకోండి మీ త్రుప్తి కోసం ) రాజకీయాల్లో కొచ్చి ఏదో పీకుత పొడుస్తా CM అవుత అంటూ ఓ పెద్ద పెద్ద భారీ డైలోగులు చెప్పి చివరికి ఏం చేయాలో తోచక ఎవరినైతే తిడుతూ వోట్లు సంపాదించుకోవాలి అనుకున్నాడో వాళ్ళ తోనే కలిసిపోయాడు మన చిరు జీవి,,, మళ్ళీ సారీ చిరు జీవి అన్నందుకు.. ఈ పేర్లు కూడా కరెక్టే అనుకోండి...పార్టీ పెట్టె సమయంలో చెప్పిన డైలాగులను ఏదైనా సినిమాలో పెట్టి ఉంటె మంచి భారీ హిట్ సినిమా అయి ఉండేది.. పాపం.. అయినా ఏముంది లెండి ఆ ఒక సినిమా కు వచ్చే కల్లెక్షన్ల కంటే ఎకువే సంపాదించాడు లెండి బామ్మర్ది తో కలిసి... అలా కాంగ్రెస్ అవినీతి మీద పుట్టిన ఈ పార్టీ కూడా చివరికి అందులోనే విలీనం అయిపొయింది ...
ఇలా అవినీతి అంతం కోసం పుట్టిన పార్టీలన్నీ ఇలా పుట్టి అలా అవినీతి సామ్రాజ్య పార్టీలో కలిసి పోతుండడం అనే దానిని మనం ఎలా అర్ధం చేసుకోవాలో ఏమో...
ఇవన్నీ ఒక రాష్ట్రము లోనివే సుమా ఇలాంటివి ప్రతి రాష్ట్రం లోనూ ఉన్నాయి..
వీటిని ఎదుర్కోవడానికి మన దేశానికి మరో బాపూజీ కావాలేమో, కాదు మరో భగత్ సింగ్ పుట్టాలి, మరో సుభాష్ చంద్ర బోస్ పుట్టాలి.. మరో రాయ్ పుట్టాలి...మరో ఝాన్సీ రాణి పుట్టాలి..
ఎవరో పుట్టాలి ఎవరో ఏదో చేయాలి అనడం కాదు.. పుట్టేది ఎకడో కాదు, చేసేది ఎకడో కాదు... అంత మన దగ్గరే.. భగత్ సింగ్ ఎవరో కాదు, బోస్ ఎవరో కాదు, ఝాన్సీ రాణి ఎవరో కాదు, రాయ్ ఎవరో కాదు.. వాళ్ళంతా మనలోనే ఉన్నారు.. మనలో ఉన్న వాళ్ళను మేల్కొలపాలి.. ఒక అవినీతి రహిత ప్రపంచాన్ని నిర్మించడం లో మనము కూడా భాగస్వామ్యులం కావలి.. భాగస్వాములం అవడం కాదు మనమే మొదలు పెట్టాలి.. మొదటి అడుగు మనదే కావాలి.. మనం చదువుకున్న వాళ్ళం, మంచి ఏదో చెడు ఏదో గుర్తున్చాగాలిగిన వాళ్ళం ...
రావాలి మనం రాజాకీయల్లోకి .. చూపించాలి మనం మన సత్తా ఏంటో...
నవ భారత దేశ నిర్మాణానికి మనం మున్డుండం ... చేయి చేయి కలుపుదాం ...
ఇదంతా చదువుతుంటే మీకో అనుమానం రావొచ్చు...ఇదంతా రాసిన నేను ఒక రాజకీయ నాయకుణ్ణి అని?? మరో JP ని అనే డౌట్ కూడా రావోచు.. ప్లీజ్ దయచేసి అంత గొప్ప మహానుభావులతో మాత్రం పోల్చకండి నన్ను.. నేనో సామాన్య జీవిని.. ప్రజాస్వామ్యం లో జరుతున్న సంఘటనలను చూసి నాలోని భాదను ఇలా చెప్తున్నా అంతే..
నేనో పెద్ద రైటర్ ని కాకపోయినా. ఏదో అలా రాసాను అంతే...
ఇట్లు మీ,
దీపం..

No comments: