పొద్దున్నే లేచి లాప్ టాప్  ఆన్ చేయగానే చూసా ఒక ఘోరమైన సంఘటనను, ఈ ఘటన  భవిష్యత్తులో రాబోయే మరిన్ని ప్రకృతి వైపరీత్యాలకు ఒక సూచకం మాత్రమే అని ardam ayindi... పుడమి తల్లి తన కడుపులో ఎన్నో ఏళ్లుగా దాచుకున్న కోపాన్నంత ఒక్కసారిగా కక్కినట్టు (వోమిటింగ్ ) ఉన్నది ఈ సంఘటన.. 
అప్పటిదాకా తాము చూసిన, ఉంటున్న నగర రూపురేఖలు మారడానికి ఒక్క పావుగంట సమయం కూడా పట్టలేదు... రిక్టరు స్కేలు సూచీ ఎపుడెపుడా అన్నట్లు ఎగిసిపడి ఏకంగా 9 కి దరిదాపుల్లో ఆగిపోయింది...  ఆ సమయంలో పుడమి తల్లి గర్జనకు భయపడి రిక్టరు స్కేలు ఇంకా ఎగిసిపదేదేనేమో, ఎందుకో ఆ సమయంలో ఆ రిక్టరు స్కేలుకు తనలోని మానవత్వం మేలుకున్నట్లు, ఆగిపోయింది... ఆ దృశ్యాలు చూస్తుంటే ఏడేళ్ళ క్రితం మానవాళికి గజ గజ వణికించిన సునామి మరోసారి నా కాళ్ళ ముందు కనిపించింది.. పుడమి తల్లికి ఎంత కోపం వచ్చిందో తెలీదు కాని, తన కోపాన్ని అంత ఒకే సారి వెలువరిచింది... ఒక భూకంపం, మరో ఆ భూకంపమే మరో రూపమై సునమిలా వచ్చింది.. ప్రజలకు ఏమి  చేయాలో తెలియలేదు... ఏం చేద్దామా అని ఆలోచిన్చేలోపే, సునామి రూపంలో నగరమంతా కబళించింది... ప్రపంచమంతా ఒక్కతాటి పై నిలవాల్సిన సందర్భం మరోసారి రానే వచ్చింది..... టెక్నాలజీ  కి కొదువ లేని దేశం అది.. అసలే ఒకసారి మానవుని అణుబాంబు కు బలై, ఎన్నో సంవత్సరాలు తల్లడిల్లి, ఇపుడిపుడే కోలుకుంటున్న జపాన్ దేశానికి ఈ సారి సునామి రూపంలో పుడమి తల్లి ఆగ్రహానికి భరించలేని  మరో దెబ్బ తగిలింది.. ఈ దెబ్బకు కోలుకోవడానికి ఎన్ని సంవత్సరాలు పట్టునో... వారికి ప్రపంచంలో ఎవరికీ లేని ఆత్మస్థైర్యం, మనోబలం అన్నింటికీ మించి తెక్నలగి అందుబాటులో ఉంది కనుక నాకు తెలిసి ఎన్నో సంవత్సరాలు పట్టవు... మానవత్వం ఉన్న వారెవరైనా చలించిపోఎలా  ఉంది ఈ ఘటన.. మొత్తం నగరాన్నంతటిని కబళించింది.. ఇంకా నయం ఈ ప్రాంతానికి అతి దగ్గరలోనే ఉన్న అణు విద్యుత్ రియాక్టర్ల మీద పడలే ఈ పుడమి తల్లి కళ్ళు... ఇలాగే మళ్ళీ ఎపుడైనా  మన పుడమి తల్లి గర్జిస్తే.. అమ్మో తలచుకుంటేనే ఒళ్ళు జలదరిస్తోంది.. 
మంచైనా చెడైనా  అందరిని భరించే ఒకే ఒక్కమాత్రుమూర్తివి నువ్వు.. నువ్వే ఇలా, నిర్దాక్షిణ్యంగా గర్జిస్తే, ఇక మానవాళి అంతా  ఎకడికి వెళ్ళాలి .... శాంతించు మాతా శాంతించు....
కొన్ని ఫోటోలు చూస్తుంటే ఈ ప్రజలు ఉండేది అసలు భూమి మీదన లేక సముద్రం మీదన అన్నట్లున్నాయి...  ఆ పక్కనే ఉన్న ఆయిల్ రిఫైనరీ కేంద్రం నుండి ఎగిసిపడుతున్న మంటలను చూస్తుంటే చాలా భయం వేసింది... ఇలాంటి జపాన్ దేశం  త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ..
మీ,
దీపం,
 
 
No comments:
Post a Comment