Thursday, March 10, 2011

పోలీసుల అష్టదిగ్భందంలో భాగ్యనగరం... మిల్లియన్ మార్చ్ కి ప్రభుత్వ పరోక్ష సహకారం...

తెలంగాణా పోరాట చరిత్రలో మరోసారి సువర్ణ అక్షరాలతో రాయదగ్గ సమయం రానే వచ్చింది.. అదే తెలంగాణా మిల్లియన్ మార్చ్ పేరుతో చేపడుతున్న చలో హైదరాబాద్ కార్యక్రమం.... ఈ కార్యక్రమానికి తెలంగాణా వ్యతిరేఖ ప్రభుత్వం ఎన్నో విధాలుగా నీరుగార్చాలని చేస్తున్న ప్రయత్నాలను పటాపంచలు చేస్తూ తెలంగాణా ప్రజలంతా ఒకే తాటి మీద ఉంటూ చేపట్టాలనుకున్న కార్యక్రమాన్ని దిగ్విజయం చేయదలచిన రోజు మార్చ్ 10 -2011 . అదిగో తెలంగాణా లో పల్లెలు పట్టనాలనే తేడా లేకుండా తెలంగాణా అని నోరేత్తుతున వారినందరినీ మగ ఆడ అన్నా తేడా లేకుండా నిర్ధాక్షిణ్యంగా అరెస్టులు చేస్తూ ఎక్కడికక్కడే నిర్వీర్యం చేయాలనీ చూస్తున్న ప్రభుత్వానికి పోలిసు ఉన్నతాధికారుల నుండి చక్కగానే సహకారం అందుతున్నా, ఎక్కడో ప్రభుత్వానికి ఒక అనుమానం ... ఎందుకంటే వారి మనస్సాక్షి కి తెల్సు, ఈ ఉద్యమం ఇపుడు ప్రజల చేతుల్లో ఉందని.... ఇది ఏ ఒక్క రాజకీయ నాయకుని కనుసన్నల్లో లేదని, ప్రజలే స్వచ్చందంగా ముందుకు వస్తున్నారని గతంలో జరిగిన ఎన్నో కార్యక్రమాల్లో తెలంగాణా ప్రజలు తమ ప్రగాడ వాంచను పలువిధాలుగా నిరూపించారు కూడా... అయినా, ప్రతిసారి లాగే ఈ సారి కూడా తమ పప్పులు ఉడకవని, ప్రజాస్వామ్య దేశం లో ప్రజలను ఎవరు అడ్డుకోలేరని తెలిసినా, ప్రభుత్వం తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది... కనపడ్డ ప్రతి తెలంగాణా వాడిని అరెస్టు చేసింది, దొరికిన ప్రతి విద్యార్థి కి మరో సారి సంకెళ్ళు వేసింది, జై తెలంగాణా అంటూ గలమేత్తిన ప్రతి నోటిని బలవంతంగా నొక్కాలని దొరికిన వారిని దొరికినట్టు స్టేషనుకు తీసుకెల్లడమే కాదు వారిని కొన్ని రోజులు కస్టడి లో ఉంచారు... ఇలా తమకు తోచిన విధంగా ఎకడివారినక్కడే నిలువరించి మిల్లియన్ మార్చ్ కార్యక్రమాన్ని ప్లాప్ చేయాలని చూస్తుంది ఈ ప్రభుత్వం.. అంతటితోనే ఆగకుండా, తెలంగాణా జిల్లాల నుండి హైదరాబాద్ కి వెళ్ళే ప్రతి దారిని పోలీసులతో నిర్భందించింది, అంతేకాదు ప్రతి దారిలో అడుగడుగునా కొత్తగా చెక్ పోస్టులను ఏర్పాటు చేసి ఎక్కడి వారినక్కడే ఆపేసి, ఎవరు కూడా హైదరాబాద్ లోకి ప్రవేశించకుండా అడ్డుకోవాలని పగడ్భంధీ ప్రణాళిక రచించారు... మరో పక్క పోలీసు ఉన్నతాధికారులు ఈ మార్చ్ కి అనుమతి లేదంటూ భారీగా ప్రచారం చేస్తూ ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నాలు చేస్తున్నారు... వీరందరికీ తల తోకంటూ ఏది లేని మీడియా సహకారం.. అసలు ఒక్కోసారి ఈ మీడియా కథనాలు చదివిన తర్వాత నాకో అనుమానం వస్తుంది ఈ మధ్య.. అదేంటంటే- అసలు మనది ప్రజాస్వామ్య దేసమేనా?? ప్రజాస్వామ్య విలువలు ఇంకా ఉన్నాయా మన దేశం లో... ప్రజాస్వామ్యం ఇంకా బతికే ఉందా ఈ దేశంలో ..... ??? అని...

ఇదంతా చూస్తున్న ప్రజలకు ఒకటే ఉత్సుకత.. ఇది వరకు తెలంగాణా గురించి ఆలోచించని వారికీ కూడా నేను సైతం అంటూ ముందుకు వచ్చేలా వారిని ఆలోచింపచేస్తున్నాయి ప్రభుత్వపు కోతి చేష్టలు... ఇక హైదరాబాద్ నగరంలో ఉన్న ప్రతి ఒక్క తెలంగాణా వాది తన మనసులో ఇపటికే డిసైడ్ చేసుకొని ఉంటాడు, ఎలాగైనా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని.. చేస్తాడు కూడా... ఇదే సరైన సమయమని ప్రతి ఒక్కరు స్వయంగా అర్ధం చేసుకుంటున్నారు ఈ రోజుల్లో .. ఎందుకంటే ఇపుడు అందరూ సామజిక పరివర్తనతో, సమాజంలో జరుగుతున్న విషయాలను అర్ధం చేసుకుంటున్నారు ... అలా అర్ధం చేసుకొనే ఒక పరిపక్వతను ప్రజల్లో తెలంగాణా ఉద్యమం తీసుకొచ్చింది ....తద్వారా ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు తమ వంతు కృషిని మన తెలంగాణా వాదులు చేస్తుండడం మనకు గర్వకారణం...
తాజా సమాచారం ప్రకారం అన్ని జిల్లాల్లో కలిపి 11000 మందిని అరెస్టు చేసి స్టేషన్లలో ఉంచి తెలంగాణా తల్లి కి సంకెళ్ళు వేసి మరీ ఉద్యమాన్ని నీరుగార్చాలని చూస్తున్నారు... ఇంతేకాకుండా ఈ రోజు తెలంగాణా జిల్లాలనుండి వచ్చి పోయే రైళ్ళను, బస్సులను అధికంగా రద్దు చేయడమే కాకుండా మరి కొన్నింటి దారి మళ్ళిస్తు రైల్ రోకో రాస్తా రోకో లతో ప్రభుత్వం ప్రజలకంటే ఉత్సాహంగా మిల్లియన్ మార్చ్ కోసం సిద్ధం అయింది ....
ఇక దీనిని అణచడానికి ఉపయోగించిన పోలీసు ప్రత్యేక సిబ్బంది ని ఒకసారి చూస్తే.....
CRPF , CISF వంటి ప్రత్యేక కేంద్ర బలగాలతో సహా వేల సంఖ్యలో అదనపు పోలీసు సిబ్బంది ని ఉపయోగించిన ప్రభుత్వం... మోతంగా 12000 కమీషనరేటు సిబ్బంది తో పాటు ఇతర ప్రాంతాల్లోని వివిధ జిల్లాల నుండి మోతంగా 100 అధికారులతో మొహరించి హైదరాబాద్ సిటీ మొతాన్ని పోలీసు దిగ్భందం చేసారు...
వీరితో పాటు 4000 మందితో కూడిన 8 APPSC బెటాలియన్లను , 6 ర్యాపిడ్ యాక్సన్ ఫోర్సు కంపెనీలు , 3500 మంది పారా మిలటరీ దళాలు, 9000 అదనపు సైబరాబాదు పోలీసుల మొహరిమ్పులతో పాటు 55 ప్రత్యేక చెక్ పోస్టులను ఏర్పాటు చేసిన దానిని బట్టి చూస్తే, ప్రభుత్వం తెలంగాణా ప్రజల కాంక్షను ఏ విధంగా అణగదొక్కాలని చూస్తుందో ఇంత కన్నా రుజువేం కావాలి...
ఏది ఏమైనపటికి మరోసారి తెలంగాణా ప్రజలు వారి పవర్ ఏంటో చుపెత్తకుండానే, ప్రభుత్వం తనకు తనే తెలుకొన్నా, ప్రతి తెలంగాణా వ్యక్తి మరో సారి తన సత్తా చూపడానికి తయారవుతున్నాడు.. ఈ మధ్య కాలంలో హైదరాబాద్ లోని తెలంగాణా వాదులు కూడా రోడ్ల పైకి వచ్చి ఉద్యమం చేస్తున్న సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాము,, ముఖ్యంగా మొన్న జరిగిన రెండు రెండు రోజుల బంద్ అనుకున్న దానికంటే సూపర్ హిట్ అవడం ఒక ఉదాహరణ... అదే విదంగా ఈ సారి కూడా మరోసారి మన హైదరాబాద్ లోని తెలంగాణా వాదులంతా రోడ్లమీదకోస్తారు...
జై తెలంగాణా... జై జై తెలంగాణా...
మీ,
దీపం

No comments: