తెలంగాణా తల్లి ప్రసవ వేదన ఇప్పటిది కాదు ఇది 5 దశాబ్దాల రోదన. ప్రజలకు వ్యతిరేకంగా ఆంధ్ర వారి కుయుక్తులకు తన సర్వస్వాన్ని కోల్పోయి తన అస్తిత్వాన్ని కాపాడుకోవాలని తలచి ఎగసిపడిన తెలంగాణా ఉద్యమం 1969 లో 400 లకు పైగా తన బిడ్డలను కోల్పోయి, మల్లి తన అస్తిత్వాన్ని కాపాడుకొనే క్రమంలో తెలంగాణా కు దొరికిన ముద్దు బిడ్డలు Prof . kodandram మరియు Prof . జయశంకర్ గార్లు. Kodandram గారు TVV ని 1995 లోనే ప్రారంభించి తెలంగాణా ప్రజలను చైతన్యవంతులను చేసే పని మొదలు పెట్టారు...తర్వాత దానికి రాజకీయ రూపు దిద్దడానికి జయశంకర్ గారు చేసిన బాసలు ఎంతో గొప్పవి. అలా రాజకీయం గా కావలసిన అండ కోసం వెతుకుతున్న క్రమంలో వారికి దొరికిన తెలంగాణా ముద్దు బిడ్డ కెసిఆర్. తెలంగాణా ఉద్యమంలో తన రాజకీయ చాతుర్యాన్ని చుపెడుతూ , రక రకాల ఎత్తులు వేస్తూ ఆంధ్ర రాజకీయ నాయకులకు తన శైలి లో జవాబులు ఇస్తూ KCR ని మించిన రాజకీయ నాయకుడు మరొకరు ఉండరు అని తనకు తానే నిరూపించుకొన్నాడు.. ఇలా తెలంగాణా తల్లి ప్రసవ వేదనా కోసం మల్లి ఒక 400 మంది విద్యార్థుల ఆత్మ బలిదానం ఐన నేపధ్యంలో మన రాజకీయ నాయకుల గురించి ఒక సరి ఆలోచిద్దాం .. అసలు మన తెలంగాణా కోసం పోరాడని మన రాజకీయ నాయకుల గురించి ఇదంతా రాసి, చదివి మన టైం వేస్ట్ చేసుకోవడం అవసరమా అనేది million డాలర్ల ప్రసన అయినా కూడా నేనేం అంటానంటే, నేను కస్టపడి రాసినందుకు ఐనా ఒక సారి చదివి మన చేత గాని చవితి దద్దమ్మ లైన మన వారి ని ఒకసారి చూద్దము అంటా.. ఏది ఏమైనా చదవడం చదవకపోవడం మీ ఇష్టం...
అయితే ఇక్కడ ఒకటి మనం తప్పక గుర్తుంచుకోవాలసిన విషయం ఏంటంటే మన తెలంగాణా ఉద్యమంలో ఎంతో మంది రాజకీయ నాయకులు తమ స్వార్ధం కోసం తెలంగాణా అనే పదాన్ని వాడుకుందామని చూసారు కాని వారు నిలదొక్కుకోలేకపోయారు.. ఒక నరేంద్ర, ఒక దేవేందర్ గౌడ్ లు మాత్రమే కాక ఎంతో మంది చిన్న చితక రాజకీయ నాయకులు ఉద్యమంలోకి వచ్చారు, వస్తున్నారు, పోతున్నారు. కాని KCR ఒకడే దిక్కు అనే దాన్ని మనమే కాదు ఎవరైనా అంగీకరిచాల్సిందే.. ఇక ఉద్యమాన్ని తమ స్వార్ధం కోసం వాడుకొనే ఈ కాంగ్రెస్, TDP నాయకులకు బుద్ది చెప్పే సమయం వచ్చింది. ఒకడేమో మేము అడ్డం కాదు అంటదు ఇంకోదేమో ఇచేది మేమే తేచేది మేమే అంటదు, అసలు ఎవరిని నమ్మాలి మనం... ఎవరిని గెలిపించాలి మనం.. అసలెందుకు గెలిపించాలి వీళ్ళను... నా మాటల్లో అయితే వీరంతా తెలంగాణా దొంగలు.. ద్రోహులు.. అసలు తెలంగాణా రాకపోవడానికి వీళ్ళే కారకులు... అసలు వీళ్ళలో ఎందుకు ఐక్యత లేదు... అలా ఆలోచిస్తే వారి వారి పార్టీల సిద్ధాంతాలు అడ్డు వస్తున్నాయ్ వాళ్లకు.. మరి అకడ ఆంధ్ర లో మాత్రం వాళ్లకు మాత్రం ఎలాంటి అడ్డంకులు ఉండవ్ .. ఇది వీళ్ళ చేత కాని తనామా లేక వెర్రి తనమా?? నాకు తెలిసి అయితే వీళ్ళకు ఈ రెండు పదాలు సరి అయినవే... అయితే ఇక్కడ మనం ఒక విషయం ఆలోచించాలి.. అసలు వీళ్ళకు పార్టీ ముక్యమా లేక తెలంగాణా ప్రజలు, వారి ఆకాంక్ష ముఖ్యమా ...??? అంటే ఇక్కడ మన కాంగ్రెస్, TDP నాయకులకు వారి పార్టీ ని నడిపించే ఆంధ్ర నాయకులే ముఖ్యం.. మన ప్రజలు ఎకడ పోయినా పర్లేదు, ఏమై పోయినా పర్లేదు కాని వీళ్ళకు వీరి రాజకీయ జీవితం ముఖ్యం. అసలు వీళ్ళను మనం ఎందుకు తరిమి కొట్టకూడదు.. వీళ్ళలో కొందరు మేము 1969 లో మేము కూడా జైళ్లకు వెళ్ళాం మేము కూడా తన్నులు తిన్నాం అంటూ OU లో విద్యార్థులతో ఇపుడు కూడా మల్లి తన్నులు తింటారు... ఇంకా కొందరేమో హైదరాబాద్ లోనే ఉంటారు కాని అసలు OU లోపలికి కాదు దాని చుట్టుపక్కలకు కూడా పోరు మన వాళ్ళు... అంత పిరికిపందలు మన నాయకులు... ఇంకొకడేమో స్వయం ప్రకటిత మేధావి... IAS అయినంతమాత్రాన తనని మించిన మేధావి మరొకడు లేదు ఈ భూమి మీద అని అనుకునే JP ఎపుడైనా మన విషయం మాట్లదినాడా అంటే దానికి సమాధానమే లేదు... ఎందుకంటే తను ఆంధ్ర వాడు,, అంతే కాదు కుల గజ్జి ని నిర్మూలించాలంటూ తను మాత్రం దాని ఆధారంగానే MLA ఆవుతాడు.. అంటే తనకొక న్యాయం ఎదుటివానికొక న్యాయం... ఏది న్యాయం అంటే నేను మేధావిని ... నేను అన్ని కరెక్టే చెప్తా అని తన డబ్బా తానే కొట్టుకుంటూ ఉంటాడు.. తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే నోరు విప్పలేనిది వాడి సత్తా ... తన పక్కన ఎవరు లేకున్న్నా , విద్యావంతులు ఉన్నారని చెప్తాడు వీడు.. మన టైం బాగోలేక వాడు కూడా మన ప్రాంతం నుండే గెలిచాడు.. ఇక సిని గ్లమోరో లేక తన చేరిస్మా నో తెలిదు కాని వాడి సినిమాలకు నిజాం లో వచినా collections అన్ని తనకే చెందాలని మరి నిర్మాతలకు చెపి, ఒప్పుకున్నకే సినిమా స్టార్ట్ చేస్తాడు ఒకడు... వీడికి కూడా రాజకీయం కావలసి వచ్చింది.. అలా సామాజిక తెలంగాణా అంటూ వచ్చి బొక్క బోర్ల పడి ఏమి చేయాలో తెల్వక ఇపుడు మల్లి సినిమాలు చేస్తా అంటున్నాడు.. ఈ సారి దేవుడు మన పక్కనే ఉన్నాడు కాబట్టి వీడు మన ప్రాంతం నుండి గెల్వలే.... ఇక మన తెలంగాణా లో మరో రకమైన నాయకులు కొందరు. వాళ్లకు వాళ్ళే హీరోలు అనుకొంటూ మాకూ కూడా ప్రత్యేక రాష్త్రం అంటూ హైదరాబాద్ ని ప్రత్యేకం చేయాలంటూ ముందుకు వస్తారు కొంత మంది దద్దమ్మలు.. వీరే నాగేందర్, ముకేష్... అసలు వీళ్ళను చూస్తే వీళ్ళు కూడా నాయకులేనా అన్నట్లుగా ఉంటారు ఈ దద్దమ్మలు. ఇంకా కొందరు లేని విద్యార్హతలు చుపెటుకుంటూ కాలం వెల్లదీస్తారు...
ఇవన్ని చుసిన తర్వాత తెలంగాణా ది ప్రసవ వేదనా కాదు ఇది మన నాయకులు పెట్టే గృహ వేధన అని నా అభిప్రాయం..
ఇలా మన తెలంగాణా తల్లి ని గృహ నిర్భందం చేసి హింస చేస్తున్న ఈ వెధవ నాయకుల గురించి మాట్లాడుకోవడం ఆపి అసలు మన తల్లి ని ఎలా కాపాడుకోవాలో ఆలోచిద్దాం...
అయితే ఇదంతా చదివిన తర్వాత కొంత మందికి ఒక డౌట్ రావొచ్చు అదేంటంటే ఇందులో KCR ని ఏ మాత్రం ఒక మాట కూడా అనలేదు సరి కదా ముద్దు బిడ్డ అని కూడా అంటున్నాడు అని... ఎస్ అది కరెక్టే కదా.. అసలు ఎందుకు అనేది వేల కోట్ల డాలర్ల ప్రశ్న ... తనే లేకుంటే ఇలా ఉందేద మన ఉద్యమం ?? ఇంత తీవ్రంగా ఉండేదా?? అసలు మనం అందరం ఇంత సీరియస్ గా discuss చేసేవాల్లమా?? అంటే నో ఛాన్స్... నెవెర్... అసలు రాజకీయ నేపధ్యం లేకుంటే ఇంత సెంటిమెంట్ ఉండేది కాదేమో అన్నది నా అభిప్రాయం... ఏది ఏమైనపటికి మనం సర్వదా kodandram గారికి మరియు జయశంకర్ గారికి రుణపడి ఉంటాం....
అసలు మన నాయకులు ఎవరు అన్నది మనం నిర్ణయించాలి... మనం అంటే ఇక్కడ నేను చెప్తునది మనం అంటే మన ప్రజలు అని...
ఇపుడు కనీసం వచ్చే కొత్త సంవత్సరం లో నైనా తెలంగాణా ప్రసవం క్షేమంగా జరుగుతుంది అని ఆశిస్తూ ఒక తెలంగాణా బిడ్డ.. నేను ముద్దు బిడ్డను అవునో కాదో నాకు తెలిదు కాని తెలంగాణా బిడ్డ ను అని మాత్రం తెల్సు అదే విషయాన్నీ గర్వంగా గట్టిగా కూడా చెప్తాను ... అయితే ఎకడో ఏదో మూల ఒక చిన్న ప్రశ్న... అదే తెలంగాణా ప్రసవం అసలు జరుగునా.. అంత కన్నా గట్టిగా నా మనసు ఎం చెప్తున్నది అంటే ... జరిగి తీరుతుంది అని... కాని ఇంకా ఎంతమంది విద్యార్థుల ప్రాణం బలి ఆవుతుందో అని ఒక భాధ నా మనసులో ఎల్లపుడూ ఉంటుంది ...
ఇది రాసినది - దీపం( నా కలం పేరు)..
1 comment:
అమ్మా తెలంగానమ్మా, ఇంత బాధను కడుపులో దాచుకొని ఎందుకమ్మా ఈ ధద్ధమలను కానీ ఈ భూమికి భారం చేసావ్...
నీది ప్రసవ వేదన కాదు గృహ నిర్భంద వేదన అని తెల్సు అమ్మా... కాని ఏమి చేయలేకున్నం మేము.. అలా అని మేమేం చేయక ఉండలేం... చేస్తాం ఏదో ఒకటిచేసి వీళ్ళకు సరి అయినా బుద్ది చెప్తాం... నీ ఋణం తీర్చుకుంటాం అమ్మా...
Post a Comment