Sunday, August 7, 2011

ఎపిలో విచిత్రమైన పరిస్తితి- చిదంబరం!

ఎపిలో విచిత్రమైన పరిస్తితి- చిదంబరం!

చిదంబరం గారు సెలవిచ్చారు, ఇక్కడ విచిత్రమైన పరితిస్తితి ఉందని. కొద్దిగా అచ్చుతప్పులు ఉన్నాయనుకుంటా చిదంబరం , మిమ్మల్ని మీరు అనుకోబోయి నోరు జారి ఉన్నట్టున్నారు. మీకు పరిపాలనా సామర్ధ్యమే లేదనుకున్నాము కాని, మానసిక వైకల్యం కూడా వుందని ఇపుడే అర్థం ఐతుంది, మా కళ్ళు తెరిపించినందుకు శత కోటి దండాలు. అపుడు తెలంగాణా పై ప్రకటన ఇచ్చింది నేను కాదు మా ప్రభుత్వం అనుకుంటూ, ఇపుడు మాత్రం పరిస్తితి క్లిష్టంగా, జటిలంగా, అయోమయంగా, ఆందోళనగా ఉందంటూ దాట వేస్తున్నారు, పూటకొక మాట మాట్లాడే వాళ్ళని ఏమనాలె? ఏమిటి మీ భాద చిదంబరం? మా ప్రజా ప్రతినిధులు ఎట్లాగు మిమ్మల్ని అర్థం చేసుకోలేక పోతున్నారు, కనీసం మాకైనా చెప్పండి. మేము చాల మంది జోకర్లని భారిస్తున్నాము, మీరెంత మాకు? ఇప్పటికే మీ పుణ్యమా అని మాకు ఈ దేశం లో స్వతంత్రం ఉందా, అసలు ఇక్కడ ప్రజాస్వామ్యం అనగా ఏమి? పార్టీలు అనగా ప్రజలను పీడించుకుని, శవాల మీద రాజకీయాలు చేయును, వగైరా వగైరా ప్రశ్నలు వేసుకుంటూ, ఎన్నో విషయాల గురించి తెలుసుకో గలుగుతున్నాము. మీ పరిస్తితి ఎంత విచిత్రంగా ఉందొ, మీరు బఫూన్ల కంటే ఘోరంగా ఉన్నారు, మీరు కేంద్రం లో భాద్యతా యుత మైన స్తానంలో ఉన్నారంటే, మా దేశ భద్రతా మీద మాకు ఆందోళనగా ఉంది, నిన్నటి మీ మాటకి, ఇవ్వాల్టి జవాబుకి పొంతన లేదు, మేము మా నాయకులే పిచ్చి అనుకున్నాం కాని, మొత్తం కాంగ్రెస్ పార్టీ ఇట్లా నిర్వీర్యం అయిపాయింది అని తెలుసుకోలేక పోయినం. మాకు ప్రభుత్వాలు పోయి రెండు సంవత్సరాలు ఐతుంది, ఇక్కడ ఏమి లేదు, బూడిద తప్పితే, రేపటి పై ఆశలు లేవు, ఇపుడు మా ముందు ఉన్నది ఒకే ఒక్క కోరిక , పొద్దున్నే ఏ చావు వార్త వినకుండా ఉంటె బాగుండును అని. అసలు ఈ దేశ రాజకీయాలే విచిత్ర మైన స్తితిలో ఉన్నాయి, ఈ దేశంలో ఒక పార్టీ ఒక సిద్ధాంతం ఉండును అనుకుంటే చాల పొరపాటు. ఒక పార్టీ రెండు కళ్ళు, నాలుకలు..కేర్ ఆఫ్ మాత్రం ఒకే సోనియమ్మ. మా ప్రతినిధులు, మీ ప్రతినిధులు..ఇదే అన్ని పార్టీలలోనూ ఉన్నది. మరి రెండు ప్రభుత్వాలు ఉంటె ఏంది? ఇది చూసి కూడా మీకు అర్థం ఐతలేదంటే మీ పరిస్తితి..మెంటల్ హాస్పిటల్ డిల్లీలో లేకపోతె మా ఎర్రగడ్డకి రండ్రి అందరు..మా గుండె చాల పెద్దది, శత్రువులని కూడా మంచిగానే చూస్తాం. కాంగ్రెస్ వాళ్ళందరికీ ఆమోద యోగ్యమైన నిర్ణయం తీసుకుంటార? అంటే ఏంది? అసలు అంత ఉంటె, ఇంత ఉద్యమం ఎందుకు చిదంబరం? మీ పార్టీలో రెండు ప్రాంతాలల్లో ప్రజలు విదిపోఇనారు కదా? దాని అర్థం ఏమి మహానుభావా? వారు మిమ్మల్ని బహిష్కరించారని అర్థం..మీకు డబ్బు మూటల మీద అంత ప్రేమ ఉంటె ఏదైనా వ్యాపారం పెట్టుకొని ఉండొచ్చుకదా? నువ్వు దేశాన్ని దోచుకొని, విదేశీయులకి అమ్ముతున్నవన్న సంగతి, నీ 'వేదాంతం', నీ మైనింగులు లాంటి వార్త విన్నపుడే అందరికి తెలిసింది..నువ్వు సోనియమ్మ కలిసి దేశాన్ని అమ్ముకొని పోవాలని చూస్తున్నారా ఏంది? అంత లేదు చిదంబరం, ఇక్కడ ఉన్న వాళ్ళని చాల చిన్న చూపు చూడకు , ఆతరువాత చూడడానికి కళ్ళు ఉండవు, వినడానికి చెవులు ఉండవు..మెంటల్ గా పిచ్చి వాడివి ఎలాగు అయిపోయారు, ఇంకా శారీరక వైకల్యం గురించి కూడా ఆలోచించండి. నువ్వు ఏకాభిప్రాయం మాట ఎత్తావంటేనే అది బోగస్, అపుడు కృష్ణ కమిటీ వేసినపుడు కూడా ఇదే మాట మాట్లాడిన్రు.. మీ కాలయాపన వల్ల పానాలు పోతున్నాయిర హౌలే! ఎం చదువు చదువు కున్నారురా? సమస్యలకి పరిష్కారం డబ్బు మాత్రమె అని చెప్పిన్రా? మా చావులు కదిలించవు, బందులు, సమ్మెలు, నిరాహార దీక్షలు చివరికి మీ వోల్లు రాజీనామా చేసినాకూడా చలించరా?

మావోల్లకి సిగ్గులేదు అనడానికి ఒకటే నిదర్శనం, ఇంకా మీ వెనుకబడి తిరగడం, మీ పైన అపార నమ్మకం కలిగి ఉండడం. ఒకాయన అంటడు, మేము టిడిపిని ఒప్పించుకోవాలంట, సిబిఎన్ , వాడొక తుగ్లక్ కాడు, వాడి సంగతి ఎపుడో ఐపొఇన్ది తెలంగాణాల, మీ అమ్మని ఒప్పించుకో చేతకాని వాళ్ళు, మమ్మల్ని ప్రస్నించేది ఎక్కడిది? ప్రస్నించినోడిని అర్రెస్ట్ చేసి మరి జెండా పండుగలు చేస్తున్నారు కదా ? ఎవరి కోసం పండుగలు? ఏ సందర్బం లో? మీరు చచ్చిన నాడు, మేమంతా పండుగలు చేసుకుంటాం, పరేషాన్ కాకుండ్రి. మా పోరగాళ్ళను పొట్టన బెట్టుకున్నారు కదరా..మా ఉసురు తగలక మానదు, బిడ్డా! ఇది తెలంగాణా గడ్డ, జాదా నహి చల్తా..సమజ్ అయిందా? మీరు వాడి మీద, వాడు ఇంకొకడి మీద..పాస్సింగ్ ది బగ్, సరే, ఆడండి , ఎన్నిరోజులు ఆడతారో అదికూడా చూస్తాం. రాజీనామాలు మళ్ళా ఎలక్షన్ల కోసం అనుకునేరు ..మీ వోటు మీకు కూడ పడదు..మల్లా తెలంగాణా రాష్ట్రంలనే మీరు అందరు ఎన్నికల్ల నిలబడాలే, ఇది కాకుండా ఏమాత్రం గిమ్మిక్స్ చేసినా మంచిగున్డది. మీకు పని లేకపోతె మాకు పని లేదు అనుకుంటార? ఆంద్ర నాయకులు ఎందుకు అంత కూతలు కూస్తున్నారో మాకు అర్థం ఐతనే ఉంది, మీ అండ దండలు పరిపూర్ణంగా ఉంది అని తెలుస్తూనే ఉంది. ఆంధ్రా జనులారా, కళ్ళు తెరవండి, నిన్నటికి నిన్న మీ విజయవాడలో దళిత బహుజనులు ఒక చిన్న మీటింగ్ పెట్టుకోలేక పాయినారు, మీ దగ్గర ఏమి స్వాతంత్రం ఉంది అనుకుంటున్నారు? తెలంగాణాల ఏకులం అయినా, మతం అయినా ఎక్కడైనా మీటింగ్ పెట్టుకోవచ్చు ధైర్యంగా, దర్జాగా.. తెలుసుకోండి, అవే పెట్టుబడి రాజకీయ నాయకులు, మిమ్మల్ని , మమ్మల్ని మోసం చేయాలని చూస్తున్నారు, మాకు తెలుసు, ఆ 'నలుగురు' తప్పితే, మెజారిటీ ప్రజలకి తెలంగాణా ఆంధ్రా సెపరేట్ కావాలని ఉందని, ప్రజలుగా కలిసి, ప్రాంతాలుగా విడిపోదామని కోరుకుంటున్నారని, కాని ఇవే క్షుద్ర రాజకీయాలు మిమ్మల్ని అణగదొక్కి, ఇక్కడ కూడా దోపిడీ చేద్దామని అనుకుంటున్నారు.

అసలు అన్ని పార్టీలను కొంత కాలం మనం మరిచి పొఇ, మన సమ్మెలు, మన బందులు నిర్వహిస్తే? అపుడు కాని అందరు ఉరికి రారు కదా? అయ్య జాక్లు, మీరు కెసిఆర్ దగ్గరకి పొతే చాల తప్పుడు సంకేతాలు పోతున్నయి, దయచేసి అందరూ ఒక్క కాడ కలవండి..పెద్దన్నకి సడెన్ గా కలబడి, సమ్మె విరమించండ్రి అని కేకేస్తాడు, తస్మాత్ జాగ్రత్త! ఎంతైనా అన్న మనసు వెన్న అంటే నమ్మున్రి. ఈ సారి మాత్రం మీరు స్వతంత్ర నిర్ణయాలు తీసుకోండి, లేకపోతె నిజంగా ప్రపంచం ముందు తల వంచుకోవాల్సి వస్తుంది. ఇదే ఫైనల్ బట్టిల్, విజయమో వీర స్వర్గమో! సోనియమ్మనో, తెలంగాననో! టీడిపినో, బీజేపినో..ఏదో ఒకటి తెల్చేద్దాం. ఇంకా దాగుడు మూతలు ఆడడం వల్ల, ఆత్మ బలి దానాలు ఎక్కువైతై తప్పితే పరిష్కారం లభించదు.

మేము గెలిస్తే రాష్ట్రం ప్రకటిస్తాం అంటున్నారు బీజేపి, గెలవక పొతే? నో తెలంగాణా కదా? మీ పార్టీలు అందరు, ఒక కన్ను, ఒక చెవి, ఒక నాలుక ఉన్నవారు కలవండ్రి దయచేసి, మిగిలిన వాళ్ళని ఊరికిచ్చి తన్నున్రి. ఇంకా చిన్నగా చెపితే వినరు అన్నల్లార, కొంచెం చురక తగలాలి, అపుడు మాత్రమె ఉద్యమం ముందుకు పోతది. ఇంకా దిల్లికి పొతే తెలంగాణా రాదు అన్న విషయం మరిచిపోవద్దు! మీకు చాతనైతే సోనియామ్మని రప్పించున్రి, ఎట్లనో కోదండ సారూ చెప్తారు, ఇంకా పోరాట రూపాలు ఇపుడిపుడే మార్తుతున్నై, మన ధైర్యం చూసి, మన పట్టుదల చూసి, మన నమ్మకాలపై వారి జులుం ఏమి నడవదని తెలిసిపాయింది చాల జాగలల్ల,..కాబట్టి ప్రజా ఉద్యమం నడిపిద్దాము, సహాయ నిరాకరణ చేద్దాము, బిల్లులు కట్టుడు బందు, కరెంట్ బందు, నల్లాలు బంద్..మరి అందరం ఏడికి పోదాం..కూకట్పల్లి, వనస్టాలి పురం పోదాం! ఇంకా ౨౦౧౪ వరకు మేము ఆగలేము. అప్పటి వరకు లాక్కొని వచ్చిన్రంటే మన ఉద్యమం ఒడి పాయినట్టే, ఆత్మలు అవమాన పడ్డట్టే. మనకు రాజకీయ పార్టీలు లేనట్టే..

మా జాక్లు, ప్రజా సంఘాలు విజయం సాదిస్తే, వారే మన హై కమ్మాండ్, మన నాయకులు కాదు..వాళ్ల లోంచే మంచి నాయకులని ఎన్నుకుందాం, ఎవడు త్యాగం చేస్తే వాడే నాయకుడు, పని చేసిన వాడిదే హక్కు..

నువ్వు నడిచినా దారంతా ముళ్ళూ..పల్లేరు గాయాలు
నీ కలల నిండా కాలాల గేయాలు,
నీ వర్తమానం కావాలి ఒక
అలుపెరుగని పోరాటం..


జై తెలంగాణా!
సుజాత సూరేపల్లి

No comments: