ఆరోపణలు చేస్తున్నది ఎవరు?
తెలుగుదేశం నాయకులు (అనగా తెలంగాణ వ్యతిరేకులు)
ఆరోపణలు చేస్తున్నది ఎవరి మీద?
తెలంగాణా ఉద్యమ నాయకత్వం మీద
తెలంగాణవాదిగా నేనేం చెయ్యాలె?
ఉద్యమ నాయకత్వాన్ని నమ్మాలె
ఎందుకు నమ్మాలె?
గుడ్డిగ నమ్మొద్దు. నిజాలు తెలుసుకొవాలె.
పోలవరం టెండర్లు SEW Infrastructure కంపెనీకి ఇచ్చినందుకు ఉద్యమాన్ని ఆపేసిన్రట కదా?
SEW Infrastructure అనే కంపెనీ ఎవరిదో ఒకసారి తెలుసుకోవాలె.
ఆ కంపెనీ గురించి నాకెట్ల తెలుస్తది.
ఏం లేదు. గీడికి పోయి చూడాలె
http://sewinfrastructure.com/aboutsew/aboutus/
సదువుడు అయిపొయినంక...
ఒక సారి చంద్రబాబు నుండి జగన్ దాకా ఉన్న రెండు కళ్ల బటాచోర్ లను గమనించాలె
లగడపాటి నుండి రాయపాటి దాక ఉన్న బలిసిన కాంట్రాక్టర్ల కుట్రలను కనిపెట్టాలె
దానం నాగేందర్ నుండి దేవేందర్ గౌడ్ దాకా ఉన్న తెలంగాణ ద్రోహుల చరిత్ర చూడాలె
గత పదేళ్లలో కాంగ్రెస్ నుండి మొదలుకొని సి.పి.ఐ, బీజేపీ, ప్రజారాజ్యం, తెలుగు దేశం, సి.పి.ఐ (ఎం.ఎల్ - న్యూ డెమోక్రసీ) వరకు అన్ని రాజకీయ పార్టీలు తెలంగాణకు జై కొట్టడానికి కారకులెవరో గుర్తుకు తెచ్చుకోవాలె
తెలంగాణను జాతీయ పార్టీలన్నీ గుర్తించి, పార్లమెంటులో బలపరచడానికి వెనుక ఎవరి కృషి ఉందో తెలుసుకోవాలె
సీమాంధ్ర పాలక వర్గాల కుట్రలను కాచుకుంటూ, వారి డబ్బు సంచుల నుండి ఉద్యమాన్ని ఎప్పటికప్పుడు కాపాడుకుంటూ వస్తున్నది ఎవరో తెలుసుకోవాలె.
మన ప్రాంత నాయకులే, ప్రజా సంఘాల ముసుగు దొంగలే నిత్యం పోట్లు పొడుస్తున్నా మడమ తిప్పకుండా ఉద్యమపధంలో సాగుతున్నదెవరో అర్థం చేసుకోవాలె.
త్యాగానికి సరికొత్త అర్థం చెబుతూ కేంద్ర మంత్రి పదవుల నుండి ఎమ్మెల్యే పదవుల వరకూ ఉద్యమం కొరకు గడ్డి పోచల్లా విసెరేసిన పార్టీ ఏదో గమనంలో ఉంచుకోవాలె.
శరద్ పవార్ నుండి మొదలు కొని శరద్ యాదవ్ వరకూ, వీపీ సింగ్ నుండి మొదలు కొని ఐ.కె. గుజ్రాల్ వరకూ ఎందుకు జై తెలంగాణ అన్నారో చదవాలె.
పొరపాట్లు జరిగి ఉండవచ్చు.
కాదనట్లేదు.
వ్యూహాలు కొన్ని విఫలం కావొచ్చు,
కానీ నిజమైన తెలంగాణ నాయకుడెవరో
ఇంకా అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నామా?
శత్రువు దొంగ దాడి చేస్తున్నప్పుడు
అందరం ఒక్కటై,
నాయకత్వాన్ని కాపాడుకోవాలనే
కనీస జ్ఞానం లేని వారమైపోయామా?
Jai Telangana!
No comments:
Post a Comment