ఇవీ రాయపాటి కారణాలు
జాతీయ రహదారుల నిర్మాణంలో పెట్టుబడులు పెట్టిన మరో బడా కాంట్రాక్టర్ గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు. తెలంగాణలో ఇప్పుడిప్పుడే జాతీయ రహదారుల విస్తరణ పనులు మొదలైనవి. తెలంగాణను అడ్డుకోవడానికి కావూరికి, సుబ్బిరామిడ్డికి ఉన్న కారణాలే రాయపాటికీ ఉన్నాయి.
అందరూ దొంగలే
మాదాపూర్ గురుకుల్ ట్రస్ట్ భూముల కబ్జాలో మంత్రి ధర్మాన ప్రసాదరావుకూ భాగముంది. ఆయనా తెలంగాణ వ్యతిరేకే. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులుడ్డి ‘మందు భాయి’లందరికీ సుపరిచితమైన యూబీ (యునైటెడ్ బ్రేవరీస్) గ్రూపు రాష్ట్ర బాధ్యుడు. తెలంగాణ రాష్ట్రం వస్తే ఎక్సయిజ్ అధికారులను చెప్పుచేతుల్లో ఉంచుకోవడం, ప్రభుత్వ ఎక్సయిజ్ విధానాలను నిర్దేశించడం, పన్నులు ఎగవేయడం కుదరకపోవచ్చు. అందుకే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఈయన ఒక అడ్డంకి. నెల్లూరు ఎంపీ మేకపాటి చంద్రశేఖర రెడ్డి కేఎంసీ కన్‌వూస్టక్షన్స్ అధినేత. తెలంగాణలో అనేక కాంట్రాక్టు పనులు వీరూ నిర్వహిస్తున్నారు. తెలంగాణలో భవిష్యత్తులో మరెన్నో కాంట్రాక్టులు చేజిక్కించుకోవాలనే ఆశతో ఉన్నారు. తెలంగాణలో వందల కోట్ల రూపాయల వాణిజ్య, వ్యాపారాలు నిర్వహిస్తున్న సీమాంధ్ర మంత్రులలో రాయలసీమ ఆల్కలీస్ అధినేత కర్నూలు ఎమ్మెల్యే టీజీ వెంక అమర్‌రాజా (బ్యాటరీస్) గ్రూప్ ఆఫ్ ఇండవూస్టీస్ అధినేత భార్య గల్లా అరుణకుమారి ఉన్నారు. నర్సారావుపేట ఎంపీ మోదుగుల వేణుగోపాలడ్డికి తెలంగాణ ప్రజల మొఖాలపై కాలుష్యాన్ని కుమ్మరిస్తున్న రాంకీ గ్రూప్‌తో సంబంధాలున్నాయి. మాజీ మంత్రి పీ రామచంవూదాడ్డి పీవీఆర్ కన్‌వూస్టక్షన్స్ అధినేతకాగా, ఏపీఆర్ కన్‌వూస్టక్షన్స్ ఆదాల ప్రభాకర్‌డ్డిది. బాలినేని శ్రీనివాస్ రెడ్డి గ్రానైట్స్ వ్యాపారంతో, సీమాంధ్ర శాసనసభ్యులైన ఏ ఆదినారాయణడ్డి, శ్రీకాంతడ్డి, గురునాథ రెడ్డి తదితరులకు నీటిపారుదల, రోడ్ల నిర్మాణ కాంట్రాక్టులతో సంబంధం ఉన్నది. తెలంగాణలోని తెలుగుదేశం కాంట్రాక్టర్, ఖమ్మం ఎంపీ నామానాగేశ్వర్‌రావు పార్టీలోని తెలంగాణవాదులలో ఒకనిగా ఉంటూ, తెలంగాణ నేతల ఐక్యతను దెబ్బతీస్తూ, చంద్రబాబుకు ఏజెంట్‌గా, తెలంగాణను వ్యతిరేకించే ఒక సామాజిక వర్గానికి ప్రతినిధిగా వ్యవహరిస్తున్నాడు. వేల కోట్ల మధుకాన్ గ్రూప్‌కు అధిపతి. తెలంగాణ ప్రజల ముఖ్యంగా తన జిల్లాలోని ఆదివాసులు వ్యతిరేకించే పోలవరం ప్రాజెక్ట్‌లో బడా కాంట్రాక్టర్. పోలవరం పూర్తి కావాలంటే తెలంగాణ రాకూడదు. బయటికి తెలంగాణవాదులతోనే ఉన్నట్లు కన్పిస్తున్నా రెండుకళ్ళ సిద్ధాంత బాబుకు నమ్మిన బంటు ఈ నామా.
తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకోవాలనే సీమాంధ్ర నేతల వైఖరికి అసలు కారణాలివి. తెలంగాణలో వేలకోట్ల వ్యాపారాలు చేస్తున్న సీమాంధ్ర సంపన్న వర్గాలు, పారిక్షిశామికాధిపతులు, వాణిజ్య వేత్తపూవరూ తెలంగాణను అడ్డుకోవడం లేదంటే వారికి పైన తెలిపిన నేతలకున్న అవినీతి, అక్రమాల చరిత్ర లేదు. నగరంలో స్థిరపడ్డ సీమాంధ్ర ప్రజలకూ అలాంటి దుష్ట చరిత్ర, దుష్ట బుద్దీ లేదు. బతుకు పోరాటం వారిది.
సీమాంధ్ర నేతల పాపాలు బద్దలయ్యే రోజు, మోసాల, అక్రమాల అవినీతి బాగోతం బయటపడే రోజు మరెంతో దూరం లేదు. ఆరిపోయే ముందు దీపం బాగా వెలిగినట్లు ఈ కుట్రదారులు తెలంగాణను అడ్డుకోవడానికి ‘ఆఖరి ప్రయత్నాలు’ చేస్తున్నారు.
No comments:
Post a Comment