సమైక్య ‘రాగాలు’.. దోపిడీ ‘తాళాలు’
- రాజకీయం ముసుగులో కాంట్రాక్టులు
- తెలంగాణ వస్తే ఆటలు సాగవనే భయం
- పాత కుట్రలు బద్దలవుతాయని ఆందోళన
- ఇకపై యథేచ్ఛ దోపిడీ సాగదని మనాది
- చిత్తం సొమ్ముపైన.. భక్తి దోపిడీపైన
- సీమాంధ్ర నేతల తెలంగాణ వ్యతిరేకత వెనుక..
చెరుకు రైతుల నోళ్ళు కొడుతున్న తిక్కవరపుఆర్‌ఈసీలో సీమాంధ్ర కలుపు మొక్క కావూరితెలంగాణలో రోడ్ల కాంట్రాక్టర్ రాయపాటితెలంగాణ గుత్తేదారు మేకపాటిలాభాలు ఎత్తుకుపోతున్న టీజీరాష్ట్రం విడిపోతే లగడపాటి నోట్లో మన్నేకాలుష్య రాంకీతో మోదుగుల సయ్యాటభూములు మింగిన జగన్గురుకుల్ కబ్జాకోరు ధర్మాన మందు వ్యాపారి మాగుంట‘పొదుగు’ కోసిన బాబుముంచేటి పోలవరం గుత్తేదారు నామాతెలంగాణనుఅడ్డుకుంటున్నది వీరేసీమాంధ్ర జనం విభజనకు వ్యతిరేకం కాదు.
లగడపాటి సమైక్యతా ‘రాగం’ వెనుక ‘తాళం’ ఏమిటి? సాక్షాత్తూ శ్రీకృష్ణ కమిటీనే మేనేజ్ చేసి సమైక్య సిఫారసు చేయించడానికి తిక్కవరపు ఎందుకు ‘కష్ట’పడ్డారు? టీడీపీ సభ్యుల చేతిలోంచి సమైక్య ప్లకార్డు లాక్కుని మరీ జగన్ పార్లమెంటులో ఎందుకు గొంతెత్తారు? కావూరి హస్తినలో చేస్తున్న సమైక్య తంత్రాంగ మంత్రాంగాల వెనుక దోపిడీ యంత్రాంగం ఏమిటి? మేకపాటికి పోయేదేంటి? టీజీ వెంక కోల్పోయేదేంటి? కాలుష్య భూతం రాంకీకి ఎలాంటి ఇబ్బందులు వస్తాయని మోదుగుల ఆందోళన చెందుతున్నారు? చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతి అవతారం ఎందుకు ఎత్తారు? ఇవి కొన్ని ప్రశ్నలు! ఓవైపు ప్రత్యేక రాష్ట్ర సాధనలో సమరంలో తెలంగాణ ఉరకలేస్తున్నది! కపట నాటకాలపై అట్టుడికిపోతున్నది! భావోద్వేగాలు రగులుతున్నాయి! లక్షల మంది బహిరంగ సభల్లో జై తెలంగాణ నినాదాలు చేస్తున్నారు. మరి.. ఏవీ సీమాంవూధలో వేల మందితోనైనా బహిరంగ సభలు? సమైక్య భావోద్వేగం ఏ స్థాయిలో ఉంది? ఎందుకని గుప్పెడు మందే సమైక్య నినాదంతో గొంతు చించుకుంటున్నారు? జగడాల మారిగా మారి లడాయి పెట్టుకుంటున్నారు? ప్రతి మనిషి మాట వెనుక అతని వర్గ స్వభావం దాగి ఉంటుంది! దశాబ్దాల క్రితమే లెనిన్ చెప్పిన మాట ఇది! ఆ మనుషులు సీమాంధ్ర ప్రజానీకం కాదు.. ఆ వర్గం ఆ ప్రాంత మేధావులో సంఘ సంస్కర్తలో, విద్యాధికులో కానే కాదు.. అది సీమాంధ్ర పెట్టుబడిదారీ వర్గం. తెలంగాణలో తమ అక్రమ పెట్టుబడుల గోడలు కూలకుండా.. అక్రమార్జనల గుట్టు రట్టవకుండా.. తాపవూతయపడుతున్న ఫక్తు దోపిడీ వర్గం. రాజకీయం ముసుగేసుకుని మురికి కాల్వ మొదలుకుని.. పంట కాల్వ దాకా.. రోడ్లు మొదలుకుని.. భారీ భవంతుల దాకా.. సత్తు రూపాయలు పెట్టుబడులు పెట్టి.. సొత్తు దోచుకుపోతున్న సీమాంధ్ర కుట్ర కుతంవూతాల గుత్తేదారుల వర్గం ఇది. చెరుకు మద్దతు ధర పెరగకుండా తెలంగాణ రైతుల పొట్టగొడుతున్నదొకరు. వక్ఫ్ భూములాక్షికమించి.. ఆకాశహర్మ్యాలు కట్టి.. కోట్లు కొల్లగొడుతున్నది మరొకరు. వరంగల్ ఆర్‌ఈసీ కాలేజీ నుంచి వచ్చిన సీమాంధ్ర కలుపు మొక్క.. తెలంగాణలో దోపిడీ వట వృక్షమై ఎదిగిందొకరు. రోడ్ల కాంట్రాక్టులను ఎగరేసుకుపోతున్న రాజకీయ నాయకుడింకొకరు. తెలంగాణ పొదుగు కోసి.. తన పాల పంట పండించుకుంటున్న నేతాక్షిగేసరులు.. కాలుష్య రాంకీతో కులుకుతున్న నాయకామణులు.. టోల్ గేట్ల దగ్గర పైసలు గుంజుకుంటున్న చిల్లర దొంగలు... అయ్య హయాంలో చేసిన దోపిడీని కాపాడుకునేందుకు అధికార పీఠంవైపు అర్రులు చాస్తున్న యువరాజ చోరాక్షిగేసరులు...! అంతా కుట్రల గుత్తేదారులు.. తెలంగాణను వ్యతిరేకిస్తున్న రాజకీయ కాంట్రాక్టర్ల ముఠాలు! వీరి చేతుల్లో తెలంగాణే కాదు.. యావత్ రాష్ట్రమూ దగా పడింది. తెలంగాణ ప్రజలే కాదు.. సీమాంధ్ర అమాయక జనమూ తెలుసుకోదగిన కుట్రల పుటలు వీరి దోపిడీ చరివూతలు!
No comments:
Post a Comment