Thursday, July 14, 2011

"తెలంగాణ " : అడ్డుకునే అధికారం అసెంబ్లీకి లేదు

అడ్డుకునే అధికారం అసెంబ్లీకి లేదు
రాష్ట్ర అసెంబ్లీకి నిర్దిష్ట కాలవ్యవధిలో అభివూపాయం తెలిపే అవకాశం ఇవ్వాలి. అసెంబ్లీ తన అభివూపాయం చెప్పనంత మాత్రాన అది బిల్లు ప్రవేశపెట్టడానికి అడ్డంకి కాదు. అసెంబ్లీ అభివూపాయాన్ని పార్లమెంటు ఆమోదించాలని, పరిగణనలోకి తీసుకోవాలని ఎటువంటి నిబంధన లేదు.

ఒక అబద్ధాన్ని వెయ్యిసార్లు పదేపదే చెబితే అది వాస్తవం కాదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో ఇదే జరుగుతున్నది. కొంత మంది కాంగ్రెస్ నాయకులు, తెలంగాణ వ్యతిరేకులు తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలంటే చట్టం ప్రకారం ఆంధ్రవూపదేశ్ అసెంబ్లీలో తీర్మానం చేయాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇదంతా పచ్చి అబద్ధం. ప్రముఖ తెలంగాణ వాది సుభాష్ చంద్ర అందించిన వివరాలను ఈ కింది విధం గా ఉన్నాయి. మొదటి భాగం రాజ్యాంగంలోని సంబంధిత వివరాలు. రెండవ భాగం ఈ అంశంపై చర్చలు. మూడవ భాగం బొంబాయి హైకోర్టు ఇచ్చిన తీర్పులోని భాగం. రాష్ట్ర విభజన బిల్లును ఆ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించవలసిన అవసరం లేదనేది కోర్టు తీర్పు సారాంశం.

మొదటి భాగం:
భారత రాజ్యాంగం- ఆర్టికల్ 2 ప్రకారం పార్లమెంటు చట్టం ద్వారా కొన్ని నిబంధనలతో కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేయడానికి, కలపడానికి అధికారం ఉంది.
ఆర్టికల్3 ప్రకారం కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేయవచ్చు, సరిహద్దులను మార్చవచ్చు. రాష్ట్రాల పేరు మార్చవచ్చు.

పార్లమెంటు చట్టం ద్వారా ఈ విధంగా చేయవచ్చు.
ఒక రాష్ట్రం నుంచి కొంత భాగాన్ని విడదీయడం ద్వారా, రెండు లేదా అంతకు మించి రాష్ట్రాలను కలపడం ద్వారా లేదా కొన్ని రాష్ట్రాలలోని భాగాలను కలపడం ద్వారా, ఏదైనా భూభాగాన్ని ఒక రాష్ట్రానికి కలపడం ద్వారా కేంద్రం కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయవచ్చు. ఈ విధంగా ఏదైనా రాష్ట్ర భూభాగాన్ని పెంచవచ్చు, లేదా తగ్గించవచ్చు. రాష్ట్ర సరిహద్దు లు మార్చవచ్చు. రాష్ట్రం పేరు మార్చవచ్చు.

రాష్ట్రపతి సూచన ద్వారా తప్ప సంబంధిత బిల్లును పార్లమెంటు ఏ సభలోనూ ప్రవేశపెట్టకూడదు. ఈ బిల్లు ఏదైనా రాష్ట్ర భూభాగానికి, సరిహద్దుకు పేరుకు సంబంధించినది అయితే రాష్ట్రపతి ఆ బిల్లును సంబంధిత రాష్ట్ర అసెంబ్లీ అభివూపాయం తెలుసుకోవడానికి పంపించాలె. రాష్ట్రపతి సూచించిన గడువు ముగిసేవరకు వేచి ఉండాలి.

రెండవ భాగం:
రెండవ అధికరణానికి సంబంధించి రాజ్యాంగ నిర్మాతలు ఏమన్నా రు. (1948 రాజ్యాంగ సభ) కె. సంతానం ఈ విధంగా వివరించారు- ఉదాహరణకు మద్రాసు రాష్ట్రం సంగతి చూద్దాం. ఆంధ్రా వారు విడిపోవాలంటున్నారు. మద్రాసు శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టారు. తీర్మానం వీగిపోయింది. కథ అక్కడితో ముగుస్తుంది. ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయడానికి వారింక ఏమీ చేయలేరు. ఇట్లా కాకుండా గౌరవనీయులైన డాక్టర్ అంబేడ్కర్ చెప్పిన ప్రకారమైతే- ఆంధ్రా వారు శాసనసభలో మెజారిటీ పొందలేకపోతే రాష్ట్రపతి దగ్గరికి వెళ్లి తమ సమస్య వివరించుకోవచ్చు. తమ రాష్ట్ర ఏర్పాటుకు అడ్డంకి తొలగించమని కోరవచ్చు. రాష్ట్రపతి సంతృప్తి చెందితే వారి సూచనల ప్రకారం పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టమని సూచించవచ్చు. కేంద్ర ప్రభుత్వం గానీ ప్రైవేట్ సభ్యులు లేదా బృందం ఈ బిల్లును ప్రవేశపెట్టవచ్చు.

పండిట్ హృదయ్‌నాథ్ కుంజ్రూ ఈ విధంగా అన్నారు:
ప్రాంతాల పునర్ వ్యవస్థీకరణకు రాష్ట్రాల ఆమోదం అవసరం లేదు. వాటిని సంప్రదిస్తే సరిపోతుంది.

పండిట్ ఠాకూర్ దాస్ భార్గవ ఈ విధంగా అన్నారు:
ఒక ప్రాంతం ఒక రాష్ట్రం నుంచి విడిపోయి మరో రాష్ట్రంతో కలవడానికి స్వేచ్ఛ ఉండాలె. ఈ సౌకర్యం దేశంలోని అన్ని ప్రాంతాలకు వర్తింపచేయాలి. అడ్డంకులు ఉండకూడదు. ఒక ప్రాంతం విడిగా ఉండాలనుకుంటే స్వయం నిర్ణయాధికార హక్కు ఉండాలి.

ప్రొఫెసర్ కె.టి.షా ఈ విధంగా అన్నారు:
ఒక ప్రాంతం రాష్ట్రం నుంచి విడిపోదలుచుకుంటే ఆ ప్రతిపాదన సభ్యుల ముందు పెట్టాలి. మెజారిటీ సభ్యులు దానిని తిరస్కరిస్తారు కనుక ఆ లక్ష్యం నెరవేరదు. ఏ రాష్ట్రం నుంచి అయినా ఒకవూపాంతం విడిపోయే ఆకాంక్షను గౌరవించాలని నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతున్నాను. కొత్త రాష్ట్రం ఏర్పాటులో అడ్డంకులను తొలగించాలి. అందు కు సంబంధించిన చట్టబద్ధమైన సహకారం అందించాలి. ఏ రాష్ట్ర అసెంబ్లీ కూడా కొంత భూభాగం విడిపోతామంటే అంగీకరించదు. బాధిత ప్రాంతం అభివూపాయాలు వెలుబుచ్చడానికి అవకాశం కల్పించ దు. ఆ ప్రాంత ప్రజల అభివూపాయం, అసెంబ్లీ తీర్మానం పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకునే అధికారం పార్లమెంటుకు ఉండాలె తప్ప రాష్ట్రపతికి కాదు.

ఈ బిల్లుకు సంబంధించి నోటీసు ఇచ్చే అధికారం ప్రతి సభ్యునికి ఉండాలి. రాష్ట్ర అసెంబ్లీ అభివూపాయం తెలుసుకోవచ్చు. కానీ విడిపోదామన్న ప్రాంత ప్రజల అభివూపాయం మేరకే మార్పు జరగాలి. ఈ ఏర్పాటు చేయకపోతే ప్రజల స్వయం నిర్ణయాధికారం అనే సూత్రాన్ని విస్మరించినట్టవుతుంది. స్వాతంత్య్ర రాగానే అందరికీ స్వయం నిర్ణయాధికారం ఉంటుందని చెప్పుకున్నాం. రాష్ట్ర అసెంబ్లీ అభివూపాయం తెలుసుకోవచ్చు, పరిశీలించవచ్చు. కానీ నిర్ణయాత్మ పాత్ర వహించేది మాత్రం విడిపోదామనుకుంటున్న ప్రాంత ప్రజల అభివూపాయం మాత్రమే.

ప్రొఫెసర్ షిబ్బన్‌లాల్ సక్సెనా ఈ విధంగా అన్నారు:
రాష్ట్రపతికి ఎవరైనా సభ్యుల నుంచి తీర్మానానికి సంబంధించి నోటీసు అందినట్టయితే ఆబాధిత ప్రాంత ప్రజల అభివూపాయం ముందు తెలుసుకోవాలి. ఆ ప్రాంత మెజారిటీ ప్రజలు విడిపోతే సంతోషంగా ఉంటామని అభివూపాయపడుతున్నట్టయితే మంత్రి వర్గాన్ని సంప్రదించి బిల్లు ప్రవేశపెట్టాలనే సూచన చేయ్యాలి. ప్రధానికి కూడా ఈ సూచన చేయాలి. తీర్మానం ప్రవేశపెట్టి పార్లమెంటులో చర్చించాలనే విషయమై ప్రధాని కూడా రాష్ట్రపతితో ఏకీభవించవచ్చు. దీనివల్ల తమ సరిహద్దులు మార్చుకునే అవకాశం, స్వేచ్ఛ ప్రతి ప్రాంతానికి లభిస్తుందని ఆశిస్తున్నాను.

ఆర్.కె. సిధ్వా ఈ విధంగా అన్నారు:
రాష్ట్రాల నుంచి ‘అభివూపాయం’ తీసుకోవాలే తప్ప ‘ఆమోదం’ కాదు.

మూడవ భాగం:
బాబూలాల్ పరంథేకు బొంబాయి రాష్ట్రానికి మధ్య వివాదం. (1960-ఎఐఆర్ 51, 1960 ఎస్ సిఆర్(1) 605)
ఈ కేసులో కోర్టు ఆర్టికల్ మూడులోని అంశాలను వివరించింది.

రాష్ట్ర అసెంబ్లీ ఎంత కాలంలోగా తన అభివూపాయాలు వెల్లడించాలనేది రాష్ట్రపతి నిర్ణయించాలి. అవసరమైతే ఆ గడువును పెంచవచ్చు. గడువు ముగిసే లోగా రాష్ట్ర శాసనసభ తన అభివూపాయం చెప్పకపోయినా కూడా రాష్ట్ర అసెంబ్లీని సంప్రదించాలన్న నిబంధన పాటించినట్టవుతుంది.

న్యాయస్థానం ఇచ్చిన ఈ వివరణ ప్రకారం-రాష్ట్ర అసెంబ్లీకి నిర్దిష్ట కాలవ్యవధిలో అభివూపాయం తెలిపే అవకాశం ఇవ్వాలి. అసెంబ్లీ తన అభివూపాయం చెప్పనంత మాత్రాన అది బిల్లు ప్రవేశపెట్టడానికి అడ్డంకి కాదు. అసెంబ్లీ అభివూపాయాన్ని పార్లమెంటు ఆమోదించాలని, పరిగణనలోకి తీసుకోవాలని ఎటువంటి నిబంధన లేదు.

No comments: