ఆంధ్ర ప్రదేశా లేక దీక్షాంధ్ర ప్రదేశా.....??
ఇది నా ఒక్కడి ప్రశ్న మాత్రమే కాదు, ఇది తెలంగాణా ఉద్యమం తీవ్ర స్థాయిలో రగుల్తున్న ఈ సమయం లో గత కొన్ని రోజులుగా జరిగిన కొన్ని సంఘటనలను చాలా తీక్షణంగా వీక్షించిన ప్రతి ఒక్కరికి ఉన్న ప్రశ్నే ఇది.
ఈ సంఘటనలను ఒక్కసారి పరిశీలిస్తే, ముఖ్యంగా ఈ దీక్షా సంస్కృతికి ప్రాణం పోసింది KCR అని చేపడంలో కొత్తేమి లేదు, చిత్రం లేదు, ఇక విచిత్రం అంతకన్నా లేదు.. ఎందుకంటే ఇది వాస్తవం, ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా ఇది మాత్రం పచ్చి నిజం. ఇక ఒక్క సారి ఈ దీక్షల సమయాన్ని మనం ఒక్కసారి పరిశీలిస్తే, ఒక కఠిన నిర్ణయంతో 4 కోట్ల ప్రజల ఆకాంక్షను నేరవేర్చెందుకై తన ప్రాణాలను సైతం లెక్క చేయక, ఆమరణ నిరాహార దీక్షకు KCR Nov 29 న పూనుకోవడం జరిగింది. అయితే ఇందులో కొంతమేరకు తన రాజకీయ స్వార్ధం ఉన్నా కుడా గమనించల్సినా విషయం ఏంటంటే, తను ప్రజల పక్షాన నిలిచాడు.,,,, తన ప్రాంత ప్రజల ప్రజల కోరికను ప్రపంచానికి చాటాడు. తను చేసినా దీక్ష కారణంగా కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి, తెలంగాణా ప్రకటన కూడా చేసింది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే దీక్షను అడ్డుకోవడానికి ప్రభుత్వం ఎంతగానూ ప్రయత్నించినా తను మాత్రం ఎక్కడ కూడా రాజీ పడలేదు. దీక్ష ప్రారంభం లోనే ఎన్నో ప్రయత్నాలు చేసింది మన ప్రభుత్వం. చివరికి, ఆయనని అరెస్ట్ ఆయన ఇంటి వద్దే అర్రెస్ట్ చేసి తెలంగాణా సెంటిమెంట్ అంతగా లేరని చెప్పే ఖమ్మం జిల్లాకు తరలించింది. ఇక్కడ గమనించాల్సినదేమిటంటే, KCR ఒక భాద్యత కలిగినా హోదా లో ఉన్నాడు, ఒక పార్లమెంటు మెంబరు అని కూడా చూడకుండా అర్రెస్ట్ చేసి ఖమ్మం తరలించారు ఈ పోలిసోల్లు, ఇది కూడా ఒకంతుకు మంచిదే అయింది. ఎందుకంటే అక్కడ కూడా తెలంగాణా వాదులు తమ ప్రతాపాన్ని చాటి ఖమ్మం సైతం తెలంగాణా లోనిదే అనే విషయాన్ని చాటడమే కాకుండా తమ నిరసనలను తెలియజేసి KCR దీక్ష కు తమ సంఘీభావాన్ని తెలిపారు. ఇక ఖమ్మం జైల్లో సైతం తన దీక్షను కొనసాగించాడు మన కెసిఆర్. మరో పక్క తెలంగాణా మొత్తం నిరసనల హోరు, ప్రతి ఊర్లో, ప్రతి పట్టణం లో, ప్రతి గల్లి లో కూడా ఉద్యమ కారులు రోడ్లమీడకొచ్చి తమ నిరసనలను తెలియజేసారు, తెలంగాణా అంతా ఒకే గొంతుకై అరిచింది JAI TELANGANA అని... ఒక దశ లో సీమంధ్ర వాళ్ళందరూ ఏకమై KCR దీక్ష విరమించాడంటూ తమ తమ మీడియా ద్వారా దొంగ నాటకాలడినా కుడా కెసిఆర్ ఎక్కడ కూడా తన పంథాను మార్చలేదు.. అసలు విషయం తెలియని కొందరు విద్యార్థులు అర్దరాత్రి చేసిన కొన్ని నిరసనలను చూసి, ఈ నిరసనల వల్లే మళ్ళీ కెసిఆర్ దీక్ష మొదలు పెట్టాడంటూ, దొంగ నాటకం ఆడుతున్నడంటూ మరో నాటకం కూడా ఆడారు మన సీమంధ్ర వాళ్ళు...అలా ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని దాదాపు పదకొండు రోజులకు పైగా ఆమరణ దీక్ష చేయడం తెలంగాణా చరిత్రలోనే కాదు మన భారత దేశ చరిత్రలో చేపుకోదగినది. ఏది ఏమైనప్పటికీ, తెలంగాణా అనేది 4 కోట్ల ప్రజల గుండె చప్పుడు. అలా KCR చేసిన దీక్షకు అన్ని వర్గాల ప్రజల సహకారం ఉండి. ప్రజల కోసం చేసాడు.. ఇక ఈ సమయంలో జరిగిన విశేషం ఏంటంటే, ఆ రోజుల్లో జరిగినా సంఘటనలను, సామాన్య విద్యార్థుల పై పోలిసుల కుట్రలను చుసిన ఒక DSP నలిని, దేశాద్రోహులపై ఎక్కుపెట్టాల్సిన తుపాకిని విద్యార్థులపై పెట్టలేము అంటూ తన పదవి ని సైతం తృణప్రాయంగా వదిలేసింది. ఇలా అన్ని వర్గాల నుండి బలం చేకూరింది. అలా కఠిన దీక్ష చేస్తున్న KCR ఆరోగ్యం క్షీనిస్తుండగా ప్రభుత్వం KCR ను నిమ్స్ ఆసుపత్రికి సైతం తరలించారు, అక్కడ కూడా తను వెనుకడుగు వేయలేదు. ఇక లాభం లేదనుకున్న కేంద్ర ప్రభుత్వం KCR చేసిన దీక్షకు దిగి వచ్చి, తెలంగాణా రాష్ట్ర ఏర్పాటును వేగిరం చేస్తామంటూ హామీ ఇవడం తో KCR దీక్ష సుఖవంతం ఐంది. ఇక దీక్ష విరమనకై KCR వద్దలు ప్రజలు, ప్రజా నాయకులు, ప్రొఫ్. జయశంకర్, మంద కృష్ణ లాంటి వారు వచ్చారు. దీక్షను విరమిస్తూ, తెలంగాణా కోసం అమరవీరులైన విద్యార్థులను తలచుకొని KCR కంట తడి పెట్టాడు. తెలంగాణా 4 కోట్ల ప్రజల ఆకాంక్ష అంటూ మీడియా ముందు ఏడ్చాడు.
అలా ఎన్నో కష్టాలకోర్చి, 5 దశాబ్దాలకు పైగా పోరాడి సాధించుకున్న నోటికాడి బువ్వను తిననివకుండా చేసారు సీమంధ్ర రాజకీయనాయకులు వారి పెట్టుబడిదారులతో కలిసి. అలా కేంద్ర ప్రభుత్వ ప్రకటన వచిందో లేదో, ఇలా వారి దీక్షా అంటూ, దొంగ దీక్షలు చేసారు. దొంగ దీక్షలు అని ఎందుకంటున్నానంటే, అర్ధరాత్రిలో పుట్టిన కృత్రిమ ఉద్యమం వారిది. దానికో చరిత్ర లేదు, దానికో సెంటిమెంట్ లేదు, ప్రజలు అసలే లేరు.. తెల్లారే సరికి అక్కడి రాజకీయలంత రాజీనామాల డ్రామా మొదలు పెట్టారు. ఇంకా కొందరు MLA లు అయితే రాజీనామా పత్రాలను ప్రింట్ చేసుకొని అసెంబ్లీ కి తీసుకోచి పార్టీలకతీతంగా అందరికి పంచడం జరిగింది. ఇదంతా చుసిన వాడెవడైనా వారు చేసినది అంతా నాటకమనే అంటారు.. ఇంకో విషయం ఏంటంటే, ఒక MP గా భాద్యత కలిగిన పదవిలో ఉన్నా మహానుబావుడు, భారత దేశ జెండా ను అగౌరవ పరుస్థూ, దొంగ వలె దీక్ష శిబిరం నుండి పారిపోయి, భారత పతాకాన్ని చేబూని, హైదరాబాద్ కు చేరుకొని నిమ్స్ లోనికి దొంగ వలె మీడియా నుండి తప్పించుకుంటూ, వెళ్ళాడు..
ఇది కుడా ఒక ఉద్యమమేనా !! ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, సీమంధ్ర పెట్టుబడిదారులు, రాజకీయ నాయకులూ కలిసి తెలంగాణా వారి నోటి కాడి బుక్క ను లాగేసుకున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు,.. మరి కొందరేమో పరదా వెనక రాజకీయాలు నడిపి రెండు ప్రాంతాల్లో తమ పార్టీ ని కాపాడుకొనే ప్రయత్నాలు చేసారు...
ఇక ఆ తర్వాత ప్రతి చిన్న విషయానికి కూడా దీక్షా చేయడం పరిపాటి ఐంది. SC , ST విభజన మరియు రిజర్వేషన్స్ కోసం అంటూ మందకృష్ణ కూడా దీక్షకు సిద్ధం అయ్యాడు, మరో వైపు ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు వారి డిమాండ్ల పరిష్కారానికి దీక్షలే సరి అయినా మార్గం అంటూ ప్రకటించాయి. ఇదంతా వారి వారి కష్ట నష్టాలను తీర్చుకోవడం కోసం చేయడం జరిగింది.
ఈ దశలో ఇక తన రాజకీయ జీవితం ముగింపు దశకు చేరుకున్నాడని తెల్సుకున్న చంద్ర బాబు గారు, కొన్ని వింత చేష్టలకు పూనుకున్నారు. అందులో ముఖ్యంగా రెండు ప్రాంతాలు తనకు రెండు కళ్ళంటూ పలికారు,
అలా బాబ్లి ప్రాజెక్ట్ అంటూ కర్ణాటక సరిహద్దుల్లో అక్కడి పోలీసుల చేతుల్లో చావు దెబ్బలు తిని, బతికి బయట పడ్డాడు మన చంద్రన్న.అంతటితో ఆగాడా అంటే లేదు, తెలంగాణా ఉద్యమాన్ని పక్క దోవ పట్టించేందుకు తన హైటెక్కు తెలివిని కూడా వాడాడు. తన రాజకీయ జీవితం కోసం కాపాడుకోవడం కోసం YS జగన్ పంట పాడయిపోయిన రైతులకు పరిహారం చెల్లించే దాక దీక్ష చేస్తానంటూ చేపగానే దానిని హైజాక్ చేస్తూ చంద్రన్న జగన్ కంటే ముందు తానే దీక్ష ను మొదలు పెట్టి, జగన్ కంటే తానే ముందుండాలని భావించాడు, అలా దీక్షను ప్రారంభించిన బాబు, తనది నిజమైనా దీక్ష అనే నమ్మకం కలిగేలా ఎన్నో ప్రయత్నాలు చేసారు బాబు. అంతేకాదు ఇక తను చేస్తున్న ధీక్షలకు తన సొంత పార్టీ వారి నుండే సరైన స్పందన లేక పోవడంతో, సాధ్యమైనంత మేరకు తన మీడియా నే కాకుండా తన పాత పరపతి ని ఉపయోగించి, నేషనల్ మీడియా ను సైతం ఉపయోగించుకొని, చావు తప్పి కన్ను లొట్ట పోయినట్టు, బతికి పోయారు. అలా చేసినా దొంగ దీక్షలను భగ్నం చేసేందుకు పొలీసులు చేసిన ప్రయత్నాల్లో, తను మాత్రమే కాదు తన కొడుకును సైతం చెబ్బలు తినేలా చేసాడు. అది మన బాబు పరిస్థితి. అలా పోలీసుల దెబ్బలను తను తినడమే కాకుండా తన కొడుక్కి కూడా రుచి చూపించిన ఘనత ఈ తండ్రి ది....
ఈ మధ్య లో మన జగన్ ది ఇంకో భాధ, తన ప్రోగ్రాం ని హైజాక్ చేసాడని, భాధ పడకుండా తన దీక్షలను రెండు రోజులకు కుదించుకొని, నేను సైతం రైతుల కోసం అంటూ ప్రగల్భాలు పలికాడు.. ఈ సమయం లో వారి వారి మీడియా కు 24 గంటల పని దొరికింది మొదటిసారి.. వీళ్ళకు దోమ కుట్టినా, చీమ కుట్టినా కూడా ఒక న్యూస్ ఐపోయింది. 5 స్టార్ హోటల్స్ లో ఉండే పరుపుల మీద పడుకున్న వాళ్ళదీ కూడా దీక్షే ఐపోయింది...
ఇకా ఒక్కసారి వీరి అందరికి సంబందించిన కొన్ని క్లిప్పింగ్స్ ని ఇక్కడ చూడండి,,,
ఏది ఏమైనపటికి, 4 కోట్ల ప్రజల కోసం తన ప్రాణాలను సైతం లెక్కచేయక చేసిన దీక్ష వాళ్ళ అందరికి ఆదర్శం అయ్యాడు మన కెసిఆర్... కానీ దీక్షలు అంటే నలుగురు నవ్వేల చేసారు ఈ చంద్రన్న, జగనన్నలు ...
మొత్తానికి అర్ధం ఐంది ఏంటంటే, తినడానికి తిండి లేని పోరాటం (తెలంగాణా) ఒకడిధైతే, తిన్నదరగని పోరాటం (సీమంధ్ర నాయకులది) ఇంకొకడిది...
ఇట్లు,
మీ మిత్రుడు,
దీపం...
No comments:
Post a Comment