Saturday, January 1, 2011

చెలియా నీకై నేను..





ఎకడున్నావు నా చెలి... ఏమి చేస్తున్నావు నా ప్రాణమా..
నా కనులకు నిదురలేక , నీవు లేని ప్రతి క్షణమొక యుగమై బ్రతుకే భారమై, ఎదురుచూస్తూ... ఎన్ని రోజులు మిత్రమా నాకీ ఎదురుచూపులు...
ప్రతిక్షణం నీకై, ప్రతి చూపు మన్మద బాణమై, నీ రాకకై నేను..
నీవు లేని ఈ జీవితం, నీకై నా జీవితం... ఇక ఉండలేను మిత్రమా... నీ వెలితి భరించలేను ప్రియతమా...
ఇకనైనా కరుణించుమా .. నా ఈ జీవితానికి పరిపూర్ణతను ప్రసాదించుమా నా ప్రాణమా..
నీవు లేని నా జీవితం, నీరు లేని ఆ సముద్రం, ఒంటె లేని ఎడారి, చెట్టు లేని అడవి, ప్రాణం లేని ఆ రాయి, అన్ని సమానమే ప్రియతమా..

No comments: