పిచ్చి బేవకూఫ్ గాళ్ళకి తెలవనిది ఒకటుంది, విద్యార్తులని జైల్లో బెట్టినట్టు, కాంపస్ నిండా మిలిటరీ , పొలిసు బలగాలను దింపితే, మీడియాని రాకుండా చేస్తే ఉద్యమం అణచి వేస్తె, తెలంగాణా లొల్లి సద్దుమనుగుతుంది అనుకుంటున్రు. ఇక్కడ నిప్పు పెడితే, తెలంగాణాల పది జిల్లాలు భగ్గు మంటయి, ఇప్పుడు కిక్కురు మనకుండా ఉన్న నాయకులను ఏడ తిరగ కుండ చేస్తున్నారు. బక్వాజ్ రిపోర్ట్ తప్పు వచ్చింది, వ్యతిరేకంగా వచ్చింది అని తెలుసుకున్నంక కూడ ఒక్క రాజకీయ నాయకుడు రాజీనామా చేయాలే, చిదంబరం రిపోర్ట్ చదవమన్నాడు, అది అర్థం చేసుకోవడానికి కొంత సమయం ఇచ్చిండు , ఆతరువాత ఎం చేయాలనో చెపుతాం అని అంటున్నారు. ఇంక ఇపుడు పార్ల మెంటుల బిల్లు పెట్టక పొతే అపుడు రాజీనామా చేస్తాం అంటున్నారు? ఇంత తెలివి అన్ద్రోల్లకు ఎందుకు లేదో, కొన్ని గంటలల్ల రాజీనామాలు చేసింరు. ఇంత ఘోరం జరుగుతున్న అందరు కలిసి ఒక కాడికి రాలే, ఎవడి గోల వాడిదే, ఎన్నడు మారతారు వీళ్ళు? ఇంక ఎన్ని ప్రాణాలు గావాలె? ఎంతమంది గుండెలు మండాలే, మన అనైక్య మత్వం చూసి, ఇపుడు నిజంగా అన్ద్రోల్లు హిరోల్లెక్క కనిపిస్తున్నారు, వారి ప్రాంతం కోసం, వారి ఆస్తుల కోసం ఎంతకైనా తెగిస్తారు వాళ్ళు, మరి మనోళ్ళు ఒక్క సారి కూడ పదవి త్యాగం చేయక పోవడం లో అర్థం ఏందీ, జీవితం లో ఎన్నడు గెలవమని వాళ్ళే వోప్పేసుకున్తున్నట్ల? ఎండలు మారిన ఈ నాయకులు మారార? రేపటి తెలంగాణాల ఇలాంటి చచ్చు, పుచ్చు పట్టిన నాయకులతోనే వేగాల్న? ఆసిడ్ టెస్ట్ చేస్తే తెలుస్తది అంటారు కదా? ఇట్లాంటి సంఘటనలే మనకి టెస్టింగ్ కదా? జగన్ సోనియంమని వనికిస్తుండు, అక్కడ ధన బలం ఉంది, మనం ఆ పని చేయలేక పోతున్నాం ఎందుకు? ఇక్కడ ధనం లేక పోయిన జన బలం ఉంది అని మన నాయకులు నమ్మట్లేదు, ప్రజలే రేపటి న్యాయ నిర్ణేతలు అని ఎందుకు తెలుసుకోలేక పోతున్నారు మన వాళ్ళు?
ఇక్కడ ఎందుకు విప్లవ కారులు తయారు ఐతారో ఇప్పటికైనా మనకి అర్థం కావాలి. హింసకి పాల్పడుతున్నారు , మావోయిస్ట్లున్నారు అన్నోల్లని చెప్పు తీస్కుని కొట్టలే కదా ? ఏది హింస? నేను చేస్తే హింస, నువ్వు చేస్తే శాంతి బద్రతలా ? ఇదెక్కడి న్యాయం అన్న? శాంతి యుతంగా చేయక పొతే, ఎమర్జెన్సి ప్రకటించి , రాష్ట్ర పాటి పాలన తెస్తార? ఇది ఎమర్జెన్సి కంటే ఏమైనా తక్కువనా? ఇక్కడ ప్రబుత్వాలు ఉన్నాయా? ప్రజాస్వామ్యం అంటారా దీన్ని? ఒక ఆఫీసర్ /అధికారి, ఉద్యోగి చస్తే వాడి ఇంట్లో మంచి ఉద్యోగం, పైసలు, జాగలు ఇస్తరు, మా పిల్లలు చస్తే ఏమిస్తరు? చావుకు ఖర్చులు కూడ లేని పేదలు చస్తున్రు. నువ్వు అరెస్ట్ చేయనికి, కొట్టనికి ఏ కారణం ఉండదు అయిన నీడే పై చేయి. ఇంత అన్యాయం చూస్తూ ఎట్లా భరించాలో, ఇంక ఎన్ని గాంధీ సూక్తులు ఎట్లా చెప్తారో చెప్పండి, ఒంటిపై లాఠీలు విరుగుతుంటే, టియర్ గాస్ తో కళ్ళు మండుతుంటే, రబ్బరు బుల్లెట్లని 'అసలు' బుల్లెట్లతో కొడుతుంటే, ఒక్కొక్కన్ని పది మందేసి కొడుతుంటే దీన్ని ఏమంటారో చెప్పాల్సిన బాద్యత మనపైననే ఉంది . ఏ పాపము ఎరుగని ఒక్క్కో విద్యార్ధి కళ్ళల్లో కసిని ఎట్లా అణచి వేస్తారో చెప్పండి. మనలాంటి వాళ్ళు నిస్సహాయంగా ఈ ఘోర దృశ్యాలని చూస్తూ, చాతనైన కాడికి ఉద్యమాన్ని చల్లార కుండా, విద్యార్థులకి , ఉద్యమ కారులకి అండగా ఉంటుంటే, మనకంటే పెద్ద పెద్ద వాళ్ళంతా ఎం చేయాలి, అసలు కష్ట పడట్లేదు అనలేము కాని, ఈ నిస్సహాయత నుండి తప్పించ గలిగే, శత్రువుకి భయం కలిగే స్తాయిలో మాత్రం లేము అని చెప్పొచ్చు. ఎందుకు? మన ఉద్యమ పద్దతులు ఎట్లా మారాలో మనం ఆలోచించాలి, అందరిని ఒకే వేదిక దగ్గరకు తెచ్చే ప్రయత్నాలు చేయాలి. మనమే వేరుగా ఉంటె మన నాయకులు ఎన్నడు కలవరు. కనీసం తెలంగాణా వచ్చేంత వరకైనా మనం తటస్థంగా ఉండాలి.
ఇవాళ మీడియా పని చేస్తలేదు, మనకి నిజా నిజాలు తెలుస్త లేవు, ఇది ఎమర్జెన్సి ని తలపిస్త లేదా ఎవరికీ? ఇక్కడ ప్రజా స్వామ్య ప్రభుత్వాల మీద ఎవరికైనా ఇంకా నమ్మకాలు ఉన్నాయా? ఇంత కాలం చేసిన ప్రయత్నాలు అన్ని ఒక వైపు, ఇప్పటి ఉద్యమ దశని కాపాడు కొనేడి ఒక వైపు, ఒకరు జైలు కు పొతే ఇంకొకరు బయట ఉండాలి , ఒకడు మోసం చేస్తే దానిని తప్పించే వారు కొంత మంది కావాలి, ఎట్టి పరిస్తిలో ఉద్యమం కేంద్రికృతమైతే ఒక్క సారే పడి పోయే అవకాశం ఉంది, అణగ దొక్కే అవకాశాలు ఉన్నాయి. మన పిల్లలు ఇంక ప్రాణాలు పోగొట్టుకున్టనే ఉన్నారు, చంపుడు, చచ్చుడు, గొడ్లను బాదినట్టు బాదుడు.
మనం ఒక్కటిగా ఉంటేనే , మనోళ్ళు ఒక్కటి కాగలరు, అదే సూత్రం, అదే మంత్రం, మధ్యస్టంగా ప్రాంతీయ జెండాలు, పర్సనల్ అజెండాలు పక్కన పెట్టి, బాదల్ , కష్టాల్, కన్నీళ్ పంచుకుంటూ, శత్రువును దెబ్బ తీసే ప్రయత్నాలు మొదలు పెడదాం. త్యాగాలకి సిద్ధ పడడం.
ఒక తమ్ముడు ఏమ్చేయల్నో చెప్పక్క అన్న్తుండు, ఇపుడున్న పరిస్తితి చెప్పగలను, ఎం చేస్తే బాగుంటుందో నా మాటలుగా చెప్పగలను కాని మనమందరం ఆలోచిన్చాలన్నదే నా ఉద్దేశ్యం. ముక్యంగా ఇపుడు అర్జెంటుగా చేసే పనులు:
రాజ కీయ నాయకుల పై వత్తిడి తేవడం.
ఈ ప్రబుత్వాలని నడవ నీయకుండా చేయడం, పని బందు పెట్టడం.
గాయపడ్డ విద్యార్థుల పరిస్తితి తెలుసుకోవడం, సహాయ పడడం, అర్రెస్ట్ అయిన వారిని విడి పించడం.
నిరసన ప్రదర్శన లతో పాటు, రహదార్లు బంద్ పెట్టడం, బస్సు , రైల్ రోకో లు చేయడం.
అన్ని జాక్లు, రక రకాల నిరసనలు చేపట్టాలి.
ఇంక... మీరంతా చెప్పాలి.
తెలంగాణా సాధన లో నేను సైతం అంటు ఉద్యమించే అందరికి..జై బోలో తెలంగాణా!
సుజాత సూరేపల్లి
No comments:
Post a Comment