Thursday, March 31, 2011

ఇండియా- పాక్ ల మధ్య జరిగిన వరల్డ్ కప్ సెమి ఫైనల్ మ్యాచ్ పై ఇంటేల్లిజేన్స్ రిపోర్ట్-

ఇండియా- పాక్ ల మధ్య జరిగిన వరల్డ్ కప్ సెమి ఫైనల్ మ్యాచ్ పై ఇంటేల్లిజేన్స్ రిపోర్ట్--- అన్ని విజయాల వెనుక ఒక మహిళా ఉన్నట్లే, ఈ మ్యాచ్ విజయం వెనక కూడా ఒక స్త్రీ హస్తం..
ఇండియా-పాక్ మ్యాచ్ ఫిక్స్ అయ్యిందని.. భారత ఆటగాళ్ళకు పాక్ ఆటగాళ్ళ పరోక్ష మద్దతు..
అదేలాగంటారా.. అదేనండి మ్యాచ్ కి ముందు నగ్నంగా తిరుగుతా నంటూ శపథం చేసిన డిల్లి మోడల్ పూనం అందానికి మన వాళ్లు బానిసై పోయారు.... మ్యాచ్ మొదట్లో సెహ్వాగ్- సచిన్ నువ్వా నేనా అన్నట్లు పోటీ పడగా, మధ్యలో నేను సైతం అంటూ వచ్చిన గంభీర్, ధోని, ఆ తర్వాత వచ్చిన కుర్రోడు రైనా కూడా సచిన్ కు మంచి పోటీనే ఇచ్చినా, దురద్రుష్టం వెంటాడి డకౌట్ అయిన యువి ఆ తర్వాత బౌలింగ్ లో రాణించగా, మేమేమీ తక్కువ కాదన్నట్లు యువి కి పోటీగా బజ్జీ, నెహ్రా, మునాఫ్, జహీర్, ఇలా అందరూ పూనం అందాల కోసం ఎంతో కష్టపడి మొత్తానికి టీం ఇండియా ను గెలిపించారు... అయితే టీం ఇండియా ని వీళ్ళే గెలిపించారని అనుకుంటే పొరపాటే, వీళ్ళకు పాక్ ఆటగాళ్ళ నుండి కూడా కొంచెం సాయం అందింది... వాళ్ళు ఓడిపోయి మనలని నెగ్గించడం కాదు .. పూనం అందాల కోసం వాళ్ళు పరోక్షంగా మనతో చేయి కలిపారు...

చివరికి ఏమయిందయ్యా అంటే, మ్యాచ్ అయిపోయినప్పటి నుండి పూనం కనిపించడంలేదు.. ఎక్కడికెళ్ళి ఉంటుంద అని ఇప్పుడు మన బోయ్స్ అంత వెయిటింగ్ చేస్తున్నారు... సచిన్ తో సహా... ఆ ముద్దుగుమ్మ అందాలు అలాంటివి మరి... ఎలాంటి ఎఫైర్ లేని సచిన్ ను సైతం పడగొట్టింది... పాపం సచిన్ న బోయ్స్...
మ్యాచ్ పై నా రివ్యూ త్వరలో..
ఇట్లు,
మీ దీపం,

Wednesday, March 30, 2011

How SKC members influenced

The stunning revelations by local news media on how the SKC was lured and influenced, by providing 7 Star facilities to write the report against Telangana.
It is like rubbing salt into the wounds. Close on the heels of the disturbing revelations about the “secret note” of the Justice BN Srikrishna Committee on Telangana, it has now emerged that the state government went out of the way to please the five-member panel and recklessly spent tax-payers’ money to provide lavish facilities for them. Apart from Rs 20 crore spent by the central government on the committee during its one year tenure, the state government, on its part, sanctioned Rs 2.50 crore on a host of facilities provided to the members including the purchase of two luxury cars costing Rs 50 lakhs, imported furniture, plasma television sets and computers.
The Lake View Guest House was converted into a plush office to facilitate the work by the committee members whenever they visited Hyderabad to hold interactions with various groups and receive representations on Telangana issue. Brand new furniture, expensive TV sets, computers and cars were purchased by the government. Ironically, the funds were sanctioned without batting an eyelid. All this for a committee that does not even have statutory powers!
Two Toyota Camry luxury cars were purchased and kept ready for the exclusive use of the committee members who made 20 trips to the city as part of their work. The huge bills footed by the government during their visits spoke of the extravagance and lavishness indulged in by the panel members.
Though Lake View Guest House already has five-star facilities for its guests, the government chose to spend additional funds to replace the furniture and provide new computers, TV sets and other amenities. This was in addition to the full-fledged office that the Committee had in New Delhi.
The new items procured included seven touch-screen computers, worth Rs 7 lakh, wi-fi, LAN Network, worth Rs 6 lakh, Sony TV sets Rs 4.50 lakh, branded furniture for Rs 15 lakh, Air-conditioners Rs 3.80 lakh and furnishings like paintings worth Rs 3 lakh.
Angered over the anti-Telangana observations made by the SRK Committee in its Chapter 8 of the 500-page report, the Telangana MLAs are already planning to move a privilege motion against the panel members.
“The members of the Srikrishna Committee must face action for insulting the Telangana people and denigrating the statehood movement. We will move a privilege notice in the Assembly and demand that the panel members be summoned to the House and admonished,” the Deputy Floor Leader of the main opposition Telugu Desam Party N Janardhan Reddy said.
A group of Telangana MLCs, belonging to the ruling Congress, have already moved a privilege motion in the Council against the panel. If the Council Chairman A Chakrapani admits the privilege motion, then the panel members and its chairman and former Supreme Court judge Justice BN Srikrishna could be summoned to the House and pulled up for violating the rights of MLCs.
What other individual benefits the committee members got for working in the said committee is yet to be made public.

Monday, March 28, 2011

అసలు ఏకడ పోయారు మన ప్రజాస్వామ్య వాదులు...

అసలు ఏకడ పోయారు మన ప్రజాస్వామ్య వాదులు...
ఒక సామాన్య పౌరుడు ఒక MLA తల మీద అలా చెయ్యి వేసాడో లేదో అది కూడా 4 కోట్ల ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడినపుడు అది కూడా అస్సేమ్లీ వెలుపల జరిగిన సంఘటనకు మన ప్రజాస్వామ్యానికే మచ్చ, కళంకం, బ్లాకు డే, రెడ్ డే అన్న మన ప్రజాస్వామ్య సోదరులు, అసెంబ్లీ లోపల ఒక భాద్యత గల హోదాలో మంత్రి పదవిలో ఉంది, ఒక మాజీ MP అయి ఉంది, తోటి MLA లని గల్ల పడితే, వాళ్ళ మీద దౌర్జన్యం గా దాడి కి దిగితే...
ఆ మంత్రికి సారి మంత్రుల వత్తాసు... ముఖ్యమంత్రే స్వయంగా క్షమాపణలు.... ఎక్కడ పోయారూ ఈ ప్రజాస్వామ్య వాదులు.... మీ కళ్ళకు ఇది ఏమి కనపడుతలేదా లేక, కళ్ళు దొబ్బాయా?? లేక మైండ్ దొబ్బిందా.. ఓ స్వయం ప్రకటిత మేధావుల్లరా, ఏమైందిరా మీకు... నోరు మెదపటం లేదు... కావాలని మెదపటం లేదా లేక ఇక్కడ కూడా ప్రాంతీయ భేదమా... ఇది కాదా వివక్ష... ?? ఇది కాదా ప్రజాస్వామ్యానికి బ్లాకు డే.. ఇది కాదా ప్రజాస్వామ్యాని మచ్చ... ఓ పత్రిక సంపాదకుల్లరా, ఓ టీవీ వాఖ్యతాల్లారా ... ఇపుడు పెట్టరా డిస్కషన్లు .. ఇపుడు ఉండవా ఫ్లాష్ న్యూషు లు.. చెపిందే చెపి రేపెఅట్ చేయారా మీ చాన్నెల్ల రేటింగు పెంచుకోరా ఇపుడు.. ....?? ఏ ... మీకు కూడా ఇక్కడ ప్రాంతీయ వివక్షేనా... దీనిని వివక్ష అనరా... ??

అసెంబ్లీ బయట JP పై గట్టిగా గద్ధరిస్తేనే వారం రోజులపాటు మా MLA లను అసెంబ్లీ నుండి బహిష్కరించారు కదా.. మరి అసెంబ్లీ లోపల జరిగిన ఈ సంఘటనకు ఎన్ని రోజులు బహిష్కరించాలి...??
డిస్కషన్లు పెట్టండి TV చాన్నేల్లలో ... ఏకడ పొయరూ ఆ మేథావులు...

ఇట్లు,
మీ దీపం,

Thursday, March 24, 2011

కౄర నిర్బంధంపై తెలంగాణ ప్రజల విజయం

ఏ పోస్ట్ నా మిత్రుడి స్వీయానుభవం.. మిల్లియన్ మార్చ్ కోసం కలలు కనడమే కదూ, దానిని సక్సెస్ చేయాలని తపించడమే కదూ దానిని సాధించిన నా మిత్రుడి మాటల్లో-

మిలియన్ మార్చ్ కాస్తా 4 గంటల ర్యాలీగా మారినప్పుడు అందరు తెలంగాణవాదుల్లాగే నేనూ నిరాశ చెందాను. కానీ దాన్ని మొత్తానికి వాయిదా వేయడం కంటే ఏదో ఒక రూపంలో కొనసాగించడమే మేలని సరిపెట్టుకున్నాను.
తొలుత మిలియన్ మార్చ్ ను చాలా భారీ ఎత్తున జరపాలనేది తెలంగాణ జేయేసీ వ్యూహం. అయితే మార్చ్ 10 న జరగవలసిన ఇంటర్ మీడియట్ పరీక్షను వాయిదా వేస్తామని మాట ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం, ఆ తరువాత తెర వెనుక ఏ శక్తులు పనిచేశాయో గానీ పరీక్షను వాయిదా వేసే ప్రసక్తే లేదని భీష్మించుకు కూర్చుంది. దీంతో మిలియన్ మార్చ్ ను కొంచెం వెనకకు జరుపుదామని తెలంగాణ రాష్ట్ర సమితి ప్రతిపాదించింది. అయితే జేయేసీలోని బీజేపీ, సీ.పీ.ఐ. ఎం.ఎల్, ఇతర ఉద్యోగ, ప్రజా సంఘాలు మాత్రం ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవద్దని గట్టిగా పట్టుబట్టాయి. దీనితో ప్రొ. కోదండరాం ఆధ్వర్యంలో జేయేసి ఒక రోజంతా చర్చించి చివరికి మధ్యేమార్గంగా మిలియన్ మార్చ్ ను ఒక ర్యాలీ రూపంలో జరపాలని నిర్ణయించాయి.
రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఉద్యమకారులు చూపించిన విజ్ఞతలో వందోవంతు కూడా చూపలేకపోయింది.


మార్చ్ 9 నాడు ఉదయం వరంగల్ నుండి మిత్రుడు రాకేశ్ ఫోన్ చేశాడు. అక్కడ 24 గంటలుగా యుద్ధ వాతావరణం నెలకొన్నదని, పోలీసులు ఎవరినీ హైదరాబాద్ కు వెళ్లనివ్వడం లేదని చెప్పాడు. బస్ స్టాండ్, రైల్వే స్టేషన్లలో పోలీసులు క్యాంపు పెట్టారట. 30 యేళ్ల లోపు ఉన్న యువతీ యువకులను ఎవరినీ హైదరాబాద్ వెళ్లే బస్సు కానీ, రైలు కానీ ఎక్కనివ్వడం లేదట. ఈపాటికే జేయేసీ, టీఆరెస్, బీజేపీ నాయకులను అరెస్టు చేశారట. తను కూడా హైదరాబాదుకు రాలేకపోవచ్చని రాకేశ్ చెబుతుంటే అసలు ఇది ప్రజాస్వ్యామ్యమేనా అని ఆవేదన కలిగింది.
నల్లగొండలో ఉన్న మా బంధువులకు ఫోన్ చేస్తే అదే పరిస్థితి. సూర్యాపేట, నకిరేకల్, నార్కట్ పల్లి, చౌటుప్పల్ ఇలా హైవే పై డజన్ల కొద్దీ చెక్ పోస్టులు. చౌటుప్పల్ దగ్గరలోని ఒక పల్లెటూళ్లో టీచర్ గా పని చేస్తున్న మా బావ, మరునాటి ర్యాలీకి ఎలాగైనా తమ స్కూలు స్టాఫ్ అంతా వస్తామని చెప్పడం సంతోషం కలిగించింది.
యాదగిరిగుట్ట దగ్గరలో ఒక గ్రామంలోని స్కూళ్లో పని చేసే మిత్రునికి ఫోన్ చేస్తే తను కూడా మిత్ర బృందంతో కలిసి వస్తానని. ట్యాంక్ బండ్ దాకా రానివ్వకపోతే కనీసం తార్నాక వరకన్నా వచ్చి ప్రతిజ్ఞ చేసి వెళతామని ఆ మిత్రుడు చెప్పాడు.
మధ్యాహ్నం వరకే 10 తెలంగాణ జిల్లాల్లో పోలీసుల నిర్బంధం తీవ్రమైంది. మొత్తం తెలంగాణలో 1,00,000 మంది ప్రజలను ముందస్తుగా అదుపులోకి తీసుకుంటే ఒక్క హైదరాబాదులోనే 11,000 మందిని అరెస్టు చేశారంటే ఈ ప్రభుత్వం ఉద్యమంపై ఎంతటి నిర్బంధం అమలు చేస్తుందో అర్థం అవుతుంది.
టీవిలో ఒక ఎస్పీగారు ర్యాలీకి ప్రజలెవరూ పోకుండా తాము ఎలాంటి చర్యలు చేపడుతున్నామో గొప్పగా సెలవిస్తున్నారు. జిల్లాలో ఉన్న ప్రైవేటు వాహనాల యజమానులందర్నీ ర్యాలీకి వాహనాలు పంపొద్దని హెచ్చరించడం, స్కూలు కాలేజీ యాజమాన్యాలను కూడా ర్యాలీకి తమ వాహనాలు ఇవ్వొద్దని హెచ్చరించడం, విద్యార్ధుల తల్లి తండ్రుల వద్దకు వెళ్లి మీ పిల్లలు ర్యాలీకి వెళ్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించడం, ఉద్యమంలో క్రియాశీలకంగా ఉన్న వారిని అదుపులోకి తీసుకోవడం, బైండోవర్ చేయడం…
ఇవీ ఒక ప్రజాస్వ్యామ్య దేశంలో ప్రజలకున్న హక్కులు!
సాయంత్రం నగర కమీషనర్ గారు సిటీలో ఎన్ని రోడ్లు మూసేస్తున్నామో లిస్టు చదివారు. ప్రజలకు, ట్రాఫిక్ కు అసౌకర్యం కలుగుతుందనే ర్యాలీకి అనుమతి నిరాకరించారట. ఇన్ని రోడ్లు ముళ్ల కంచెలతో, బ్యారీకేడ్లతో మూసేస్తే ప్రజలకు అసౌకర్యం కలగదేమో మరి.

ఇవన్నీ చూస్తుంటే ఒకవైపు ఆగ్రహం కలుగుతోంది. ఈజిప్టులో, ట్యునీషియాలో నియంతలకు వ్యతిరేకంగా ఆయా రాజధాని నగరాల్లో లక్షల మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి తమ నిరసన తెలియపరచగలిగారు. కానీ తెలంగాణలో మాత్రం ఒక ప్రజా ఉద్యమంపై ఇంతటి నిర్బంధం.
10 మార్చ్ ఉదయం మిత్రులతో ఫోన్లో మాట్లాడుతుంటే అందరి మదిలోనూ ట్యాంక్ బండ్ దాకా వెళ్లగలమా లేదా అనే అనుమానమే. సరే, ప్రయత్నమైతే చేద్దాం ఎక్కడ ఆపితే అక్కడ “జై తెలంగాణ” నినాదాలు చేసి “తెలంగాణ ప్రతిజ్ఞ” చేసి వద్దాం అనుకున్నాం.
ముందే స్వర్ణ కూడా వస్తానని చెప్పడంతో మా బాబును అక్క వాళ్ళింటికి పంపించాం. ముందు రోజే ఒక మిత్రునితో ఒక జాతీయ జెండా, ఎండకు రక్షణలా ఉంటాయని కొన్నీ టోపీలు తెప్పించాను.
ఉదయం నుండీ బారికేడ్లను చేదించుకుని ట్యాంక్ బండ్ సమీపం దాకా వచ్చిన ప్రజలను అరెస్టు చేస్తూనే ఉన్నారు పోలీసులు.
తెలంగాణ అకాడమీ ఆఫ్ ఎక్స్ లెన్స్ సంస్థకు చెందిన శశి అర్జుల ఫోన్ చేశాడు, తాము ఖైరతాబాద్ వైపు నుండి వస్తున్నామని. ఇంతలో సూరేపల్లి సుజాత ఫోన్ చేసింది ఎలా వెళ్తున్నారని. మేము నల్లకుంటకు వస్తున్నామని, తనని కూడా అక్కడికే రమ్మని చెప్పాను.
నల్లకుంటలో ఇంకొందరు మిత్రులను కలిసి ఎలా వెళ్దామని అలోచిస్తుండగా తెలంగాణ ఆత్మ గౌరవ వేదికకు చెందిన బాల్ రెడ్డి గారు ఫోన్ చేశారు దోమల్ గుడా మీదుగా అయితే ట్యాంక్ బండ్ సులభంగా చేరుకోవచ్చని.

సరేనని ఏ.వి. కాలేజి పక్క సందుగుండా లోవర్ ట్యాంక్ బండ్ వద్దకు చేరుకున్నాం. అప్పటికే అక్కడ బారీకేడ్లను విరగ్గొట్టారు. ట్యాంక్ బండ్ కు ఉన్న మెట్ల దారి గుండా పరుగు పరుగున పైకి వెళ్లి చూస్తే నా కళ్లను నేనే నమ్మలేకపోయాను. రెండు వైపుల నుండీ ట్యాంక్ బాండ్ పైకి “జై తెలంగాణ” నినాదాలతో కదం తొక్కుతూ వస్తున్న వేలాది మంది ప్రజలు.
ఎంతటి మహత్తర ఘడియలవి!
తెలంగాణ మొత్తాన్నీ ఒక బందీఖానాగా మార్చి ర్యాలీ ఎలా జరుగుతుందో చూస్తాం అని సవాలు విసిరిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, రాష్ట్ర డిజీపీకి గూబ గుయ్యిమనిపించారు నా తెలంగాణ ప్రజలు.
అదిగో ఉద్యమానికి వేగుచుక్కలు ఉస్మానియా వీరులు. ఆ వెనకే వస్తున్నది న్యాయపోరాటానికి తమ వంతు సహకారం అందిస్తున్న న్యాయవాదులు. కాస్త వెనక భారతీయ జనతా పార్టీ జెండాల రెప రెపలు. కుడి వైపు నుంచి కదం తొక్కుతూ వస్తున్న భారత కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు.
వెంటనే ఇతర దేశాల్లో, రాష్ట్రాల్లో ఉన్న ఆప్త మిత్రులకు ఫోన్ చేసి ఈ శుభవార్తను పంచుకున్నాను.
స్వర్ణ, నేను ట్యాంక్ బండ్ ప్రధాన ద్వారం వైపు నడిచాం. ఎదురుగా పరుగున వస్తున్న వేణు కనిపించాడు. ఒక పక్కన ఇద్దరు చిన్న పిల్లలతో ర్యాలీకి వచ్చిన సృజన కనపడింది. స్వర్ణను అక్కడే నిలబడమని చెప్పి నేనూ, వేణు ట్యాంక్ బండ్ మరో వైపుకు నడక సాగించాం. మా ఎదురుగా అలలు అలలుగా వస్తున్న తెలంగాణ ప్రజలు.
తెలంగాణ డాక్టర్ల జేయేసి, సింగరేణి మైన్స్ కార్మికులు, విద్యుత్ ఉద్యోగుల జేయేసి, లెక్చరర్ల జేయేసి, ఉపాధ్యాయ సంఘాలు…

అదిగో ఉస్మానియా చెల్లెమ్మలు మణి, బాల లక్ష్మి.
పక్కనే తన పాటలతో హుషారెత్తించేది నేర్ణాల కిషోర్ కదూ! నా ఎదురుగా వస్తున్నది అరుణోదయ రామారావుగారు…
లాన్స్ పక్కన బ్యానర్ చేతబట్టి నిలబడ్డారు సింగిడి తెలంగాణ రచయితలు. ఇంకొంచెం ముందు లాన్స్ లో కూర్చుని జనాలను చూస్తున్నారు మంజీర రచయితల సంఘానికి చెందిన నందిని సిధారెడ్డి గారు.
ఇంతలో గద్దర్ రానే వచ్చాడు. ఆయన వెంట ప్రజలు ఉరుకులు పరుగులు పెట్టారు.
ఎండలో నిలబడ్డ సియాసత్ ఎడిటర్ జాహెద్ అలీ ఖాన్ సాబ్ తో వేణు కరచాలనం చేశాడు. దేశంలో అత్యధిక సర్క్యులేషన్ గల ఉర్దూ పత్రిక సియాసత్.
ఎదురుగా గుంపులు గుంపులుగా వస్తున్న ఏబీవీపీ, పీ.డీ.ఎస్.యూ విద్యార్ధులు. వారికి ఎదురుగా ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ (IFTU) సభ్యులు వస్తున్నారు.
మూవ్ మెంట్ ఫర్ పీస్ ఎండ్ జస్టిస్ (MPJ) సంస్థనుండి ముస్లింలు భారీగా తరలి వచ్చారు. “ఔర్ ఏక్ ధక్కా తెలంగాణ పక్కా” అంటూ వారు నినాదాలు చేస్తున్నారు.
కరీం నగర్ జిల్లాలో తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహిస్తున్న మిత్రురాలు సూరేపల్లి సుజాత కలిసింది.

చాలా మంది ఏ సంఘాలకు, పార్టీలకు చెందని సామాన్య హైదరాబాదీ ప్రజలే ఉన్నారు. ఎంతో కాలంగా హైదరాబాదులో తమ సత్తా ఏమిటో చూపెట్టాలనే తెలంగాణవాదుల పట్టుదల, పోలీసుల నిర్బంధంవల్ల రెట్టింపైంది. ప్రతీ ఒక్కరూ ఇవ్వాళ ఏదో ఒకటి తేలిపోవాల్సిందే అనే తెగింపుతో వచ్చారు.
ఇంతలో ప్రజాతంత్ర పబ్లికేషన్స్ దేవులపల్లి అజయ్ గారు కలిసారు. పాపం ఆయన ఈ మధ్యనే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పోలీసులు విసిరిన రాయి తగిలి తీవ్రంగా గాయపడి కోలుకుంటున్నారు. అయినా ఓపికచేసుకుని ఇక్కడికి వచ్చారు.
ఒక పక్క మీడియా వారితో మాట్లాడుతూ చుక్కా రామయ్య గారు కనపడ్డారు. ఇంకొంచెం ముందుకు వెళ్తే పోలీసులు అడ్డుకున్నా ఆగక తన అనుచరులతో వస్తున్న విమలక్క కనపడింది.
ఇంకో పక్క లాన్స్ లో ఉద్యమ గీతాలాలపిస్తున్న మాభూమి సంధ్యక్క కనపడితే వేణు, నేను వెళ్లి షేక్ హాండిచ్చి వచ్చాం. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పోలీసులు అడ్డుకోబోగా చాకచక్యంగా వారిని తప్పించుకుని పరుగు పరుగున ట్యాంక్ బండ్ చేరుకున్నారు. రెండున్నర అవుతుండగా ప్రొఫెసర్ కోదండరాం ను పోలీసులు అరెస్టు చేశారని తెలిసింది.

ట్యాంక్ బండ్ పై అనేక బెటాలియన్ల రాపిడ్ ఆక్షన్ ఫోర్స్ పోలీసులు ఆటోమేటిక్ తుపాకులు చేబూని కనపడ్డారు.
మేము ఆ చివర వరకూ వెళ్ళి తిరిగి వస్తుంటే అకస్మాత్తుగా ఒక చోట కలకలం రేగింది. ఏమైందని పరుగున వెళ్లి చూస్తే అక్కడ ఒక ఉస్మానియా విద్యార్ధి విషం తాగి పడిపోవడం, అక్కడున్నవారు ఆ యువకుడిని వెంటనే ఒక అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించడం కనిపించింది. ఆ యువకుడు చేతిలో ఉన్న తన సూసైడ్ నోట్ కాపీలు అక్కడున్న ఇద్దరు ముగ్గురికి ఇచ్చాడట. ఒక విశాలాంధ్ర విలేకరి మాకు ఆ నోట్ చూపించాడు. అది చదువుతుంటే హృదయం ద్రవించిపోయింది నాకు. సంపత్ నాయక్ అనే ఆ యువకుడు ఆ ఉత్తరంలో కేంద్ర, రాష్ట్ర రాజకీయ నాయకులను తీవ్రంగా విమర్శించాడు. ఈ రోజు జరిగిన మూడో ఆత్మహత్యయత్నం ఇది. పొద్దున ఖమ్మంలో ఒక యువకుడు ప్రాణాలు తీసుకోగా, బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ ముందు మరో యువకుడు ఆత్మాహుతికి ప్రయత్నించాడు.
ఆ సంఘటన ట్యాంక్ బండ్ పై చేరిన అనేక మందిని కలచివేసింది. పోలీసు వలయాలను చేధించి విజయం సాధించామన్న సంతోషం ఆవిరయ్యి దాని స్థానంలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. కొంతమంది యువకులు కంటికి కనపడ్డ దాన్నల్లా ధ్వంసం చేయడం మొదలు పెట్టారు. పోలీసు జీపు ఒకటి అగ్నికి ఆహుతయ్యింది. కొన్ని హోర్డింగులు నేల కూలాయి. ఆంధ్రా ఆధిపత్య సంస్కృతికి చిహ్నాలుగా ట్యాంక్ బండ్ పైనున్న విగ్రహాలను కొంతమంది యువకులు కూల్చేశారు. అప్పుడే అటుగా వచ్చిన కేకే, మధు యాష్కీ లపై కొందరు యువకులు చేయి చేసుకున్నారట.

సాయంత్రం కేసీయార్ వచ్చేసరికి ట్యాంక్ బండ్ పై పూర్తి ఉద్రిక్తత నెలకొన్నది. ఆయన పోతన విగ్రహం వద్దకు నేరుగా వెళ్లి తెలంగాణ ప్రతిజ్ఞ చేయించారు.

సాయంత్రం అయిదున్నర ప్రాంతంలో మేము అక్కడినుండి బయలుదేరాము.
మలి దశ ఉద్యమంలో మిలియన్ మార్చ్ ఒక మైలు రాయి. తెలంగాణలో వేలాదిగా CRPF, CISF, RAF, ITBP, APSP, BSF వంటి పారామిలిటరీ బలగాలను దింపి ఉద్యమాన్ని అణచివేయొచ్చని కలలుగన్న ముఖ్యమంత్రి, డిజీపీ, గవర్నర్ లకు ఈ మార్చ్ ఒక చెంప పెట్టు లాంటిది.
ఇక ఈ ప్రజా ఉద్యమ విజయాన్ని ఆపే శక్తి ఏ ప్రభుత్వానికీ లేదు.


నా మిత్రుడు-
దిలీప్ సౌజన్యం తో...
దీపం,

Tuesday, March 22, 2011

ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోవాలి ఈ తెలంగాణా TDP నాయకులూ....

40 మంది ధీరులు, అందులో ఇద్దరు MP లు, మిగతా వారు ఒకే ప్రాంతానికి చెందిన MLA లు, మాజీ MALలు... ఇంకా ఒక పేద్ద రాష్ట్రానికి చెందిన పార్టీకి నం. 2 ,3 ,4 ....... ఆ పార్టీకి నం.1 తర్వాత అంత వీరే... ఒకప్పుడు ఆ రాష్ట్రానికి , మంత్రులుగా ఏలిన వారు... హోం మంత్రి గానే కాకుండా ఎన్నో మంత్రిపదవులను అనుభవించిన వారు ఉన్నారు...
ఏం లాభం... బంచన్ కాల్ మొకుత అనే టైపు... ఏదో పోదిసేద్దాం, పీకేద్దాం అనుకుంటూ పోయిండ్రు.. ఏం పీకారు..?? ఏం పోడిసారు...?? ప్రధాన మంత్రిని కలిసోస్తం, సోనియా ని కలుస్తాం, తెలంగాణా ను మేమే తెస్తాం అంటూ ప్రగల్భాలు పలుకుతూ పరిగెత్తారు డిల్లి కి ... ఏం లాభం..??
రెండంటే రెండు నిమిషాల్లో ముగించారు కేంద్ర హోం మంత్రి తో భేటి..... అసలు ఏమైనా మాట్లాడారా చిదంబరం తో... పైగా దెప్పిపొడుపు మాటలు అనిపించుకున్నారు.... ఇంకా వీళ్ళు, తెలంగాణా తెస్తారాన్ ట ......
తూ... వీళ్ళ జీవితాలు...
భేటి అయిపోయినాక అందులోని ఒక సిగ్గు లేని నాయకుడు అంటాడు, మూకుమ్మడి రాజీనామాలే శరణ్యం అని .... ఇన్ని రోజులు ఏమైంది వీడి తెలివి...?? అయినా సొంత ఇంటినే సక్కబెట్టుకోలేని వీళ్ళంతా తెలంగాణా తెస్తారాన్ టా ...?? ఇంకొందరికేమో భాధ కలిగిందంట .... ఇంకా ఒకప్పుడు జై సామాజిక తెలంగాణా అన్న వాళ్ళకైతే నోరే రావటంలేదు ఈ మధ్య ... నోరు పడిపోయిందో లేక ఆ నోట్లో ఎవడిధైన పెట్టుకున్నాడో...?? ఇపుడైనా కనీసం మీ ఎక్ష్-పార్టీ వాడయిన చిదంబరం అన్న మాటలకైన కొంచెం సిగ్గు తెచ్చుకోండి... ఓఒహ్ సారి, మీకు ప్రజల మాటలు వినపడాయి కదూ, ఎదుటి పార్టీ వాడు ఎమన్నా పట్టించుకోం కదూ... మీ ఒంట్లో ఉన్నది రక్తమే అయితే, మీరు తెలంగాణా లో పుట్టినవారే గనుక అయితే...
ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొండ్రా... సిగ్గూ, ఎగ్గూ లేని జన్మలూ, మీరూ...
మీ ఎదుటి పార్టీ వారు మీ గురించి ఏమి ఆలోచిస్తున్నారో ఆలోచించుకోండి....

Thursday, March 17, 2011

తెలంగాణా కవులను మరచేలా చేసిన మన చదువులు...

many poets missed brothers..
Many greatest people forgotten by history too
Shri Malli Natha Suri- who belonged to 5th century.
Bhaskaracharya second century mathematician believed to live near BOHAN (previously known as POUDANYA PURAM capital city of ASMAKA kigdom)
was great sanskrit poet and critique
who believed to live in ‘kulcharam’ now in medak district.
Yenugu Lakshmana kavi near siddipet who translated sanskrit slokas of BHARTEUHARI into telugu language.
JAYAPA SAHINI the Warrior poet of KAKATIYAS wrote NRUTTARATNAVALI in SANSKRIT.
BAMMERA POTHANA well known to all
Suravaram prathapa reddy from warangal dist
who wrote Ranganatha Ramayanam.
…….many unknown to today’s history
Praja kavi KALOJI
Dasarathi Krishnamachari who gave the slogan ” Naa telangana koti ratnala veena”
and fought against NIZAM
spent in NIZAMABAD JAIL
VATTIKOTA ALWARU SWAMI
Dasarathi rangacharyulu translated VEDAS into telugu language….
.
.
.
Today’s
GADDAR
ANDE SRI
GORANTIVENKANNA
DESAPATI SRINIVAS

Monday, March 14, 2011

చెక్కు చెదరని మీ చెప్పులేసిన చరిత్ర!

నాడు 'దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుషులోయ్' అన్నాడొక మహానుభావుడు. కాని నేడు 'రాష్ట్రమంటే రాతిబొమ్మలేనోయ్ రాలిపోయే ప్రాణులు కాదోయ్!' అని అంటున్నారు
వన్నెతగ్గని కుహనా ప్రజాస్వామిక, సాంస్కృతిక-సాహిత్య దురంధరులు. కూలిన విగ్రహాల గురించి నిరసనలు, నివాళులు, లెంపలేసుకోవడం మరియు పాలాభిషేకాలు చేసి కన్నీరు పెట్టుకోవడం కడు శోచనీయం. వారి దూషణలు మిక్కిలి గర్హనీయం. ఐదున్నర దశాబ్దాల దోపిడి, ఆరాచక మరియు నియంతృత్వపు వలసవాద పాలన నుండి విముక్తికై పోరాడుతూ,
తమ ప్రాణాలనే ఫణంగా పెట్టి మంటల్లో కాలి బూడిదవుతున్న ఆ త్యాగ మూర్తుల కంటే తమది కాని అన్య మూర్తుల ప్రాముఖ్యత సమయానికందిరాని ఆలోచన. పాలకుల తుపాకుల నుండి వర్షించే తూటాలు, ఇనుప బూట్ల తొక్కుల్లు మరియు లాఠీల విలయతాండవంతో నెత్తురోడి నేల రాలిన ఆ భావి కుసుమాల గురించి ఒక్క కన్నీటి చుక్క రాల్చి సానుభూతి తెలిపే, మానవత్వం మూర్తిభవించిన సాటి తెలుగువారలె లేకపోయిరి కదా! అణచివేతలతో, ఆధిపత్యపు ఆగడాలతో దెబ్బ తిన్న జీవుల కళ్ళలోంచి నీళ్ళకు బదులు
నిప్పులు, హృదయంలోంచి ప్రేమకు బదులు ద్వేషం పుడుతుందనే నగ్న సత్యం విజ్ఞులకు తెలియంది కాదు. దాని పర్యావసనమే ట్యాంక్ బండ్ ఘటనలు. ఇది గ్రహించక పుండు మీద కారం జల్లినట్లు ' అమానవీయమని, తెలుగు వారు తలదించు కోవాలని, దున్న పోతులూ సిగ్గు పడతాయని, చరిత్ర క్షమించదని, దోషులను ఉరి తీయాలని ఎన్నెన్నో సూక్తులు వినిపించారు కుహనా సంగీత-సాహిత్య-సాంస్కృతిక సామ్రాట్లు . మరి తెలుగు వారి ఆత్మగౌరవాన్ని విశ్వ వ్యా ప్తంగా చాటి చెప్పి అందుకు ప్రతీకగా నిలిచిన మహానుభావుడు కీ.శే. నందమూరి తారక రామారావు మీద చెప్పులు విసిరి అవమానం చేసిన నాడు ఈ తెలుగు జాతి ఎక్కడ విశ్రాంతి తీసుకుందో ? ఆ దోషులను శిక్షించక పోగా నిసిగ్గుగా ఓట్లు వేసి రాజ్యాధికారాన్ని అప్పగించిన ఘనత మీకే చెల్లింది కాబోలు. చివరకు ఏ ఆదరణకు నోచుకోక కృశించి దిక్కు లేని చావు చచ్చిన మాట వాస్తవం కాదా? ఇక మరో తెలుగు ముద్దు బిడ్డ కీ.శే. పి.వి. నరసింహారావు గారి మీద కర్నూల్ లో చెప్పులు విసిరి తమ తెలుగు సంస్కృతీ అభిమానాన్ని దశ దిశల చాటిన ఆ ఘనత మీకే సొంతం. అట్టి కార్యక్రమ వ్యూహ కర్తలకు శాపనార్థాలు, శిక్షలు ఉండకపోగా మంత్రులు-ముఖ్య మంత్రులను చేసి ఆనందపడిన చరిత్ర మీకు మాత్రమే వున్నది. ఇంతగా గొంతు చించుకుని, గుండెలు బాదుకునేవారు ఈ మధ్య బరంపురంలో జరిగిన తెలుగు మహాసభలో తెలంగాణ కవి నందిని సిద్దా రెడ్డి మీద భౌతిక దాడి జరిగినప్పుడు ఎందుకు ఖండించలేదు? ప్రసార సాధనాలు ఎందుకు వెలుగులోకి తీసుకురాలేదు?. అతను సిమాంధ్ర రాతిబొమ్మ పాటి విలువ చేయరు కాబోలు. ఇగ త్రివర్ణ పతాక సృష్టి కర్త పింగళి వెంకయ్య చరిత్ర తిరగవేస్తే మరీ దుర్భరం. ఆ దేశబక్తుడి ఆర్ధిక పరిస్థితి దిగజారిపోయి ఎలాంటి ఆదరణకు నోచుకోకుండా కడు పేదరికంతో కనుమూశాడు. అప్పుడు ఏలిన వారికిగాని, అనా మకులను, అవినీతిపరులను ఆదుకుని సత్కరిం చే తెలుగు సంస్థలు గాని, సంఘాన్ని ఉద్దరించే ఆపన్న హస్తా లు ఎక్కడికి అదృశ్యం ఆయ్యాయో తెలియదు. మరో దారుణం ఏమిటంటే పింగళి వెంకయ్య కుమారుడు పింగళి దశరథరాం ఎందుకు చంపబడ్డాడు? ఎవరు చంపారు? దోషులు ఎలా మాయమయ్యిండ్రు? దీనిపైన ఈ తెలుగు జాతి గళం విప్పలేదెందుకు? ధర్నాలు, పోరాటాలు చెయ్యలేదేందుకు?
పాది రికుప్పం, కారంచేడు మరియు చుండూరు హత్యలు గుర్రం జాషువా గౌరవార్థం జరిగి నవేనా? ఈ కుహనా ప్రజాస్వామిక వాదులు, సాహితీ వేత్తలు తమ నిసిగ్గు ద్వంద ప్రమాణాలు ఇక నైనా మానడం
మం చిది. అంతెందుకు ఈ మధ్య రోశయ్య ముఖ్యమంత్రిగా పదవి చేపట్టగానే సీమాంధ్రలో అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహాలు ఎన్ని ద్వంశం అయ్యయో చెప్పక్కర్లే దు మరి పెకిలిన గొంతులెన్ని? ఖండించిన ప్రజాసంఘాలేన్ని? ప్రశ్నించిన మానవతావాదులేరి?.ఆగడం చేస్తే జగడం ఆగదు సరికదా ఇంకా ఉదృతం అవుతుంది. పది సంవత్సరాల పసి బాలుడి నుండి పండు ముదుసలికి తప్పని బైన్దోవర్లు, కాలికి చెప్పులు లేకుండా రచ్చబండకు రమ్మనడం లేదంటే ఊర్ల దిగ్బంధనం, ఇండ్లు,బండ్లు,గొడ్డు గోదను తగులబెట్టడం ఇదేనా ప్రజాస్వామ్యం? ఇదేనా సోదరభావం? చావడానికి యావత్ తెలంగాణ సిద్దం అయ్యింది గాని భాష పేరుతో
బానిసత్వానికి, కులంపేరుతో కుటిల రాజకీయానికి
ఏ మాత్రం సహకరించడానికి సంసిద్దులుగాలేరనే నగ్న సత్యాన్ని వలస
పాలకులు గుర్తుంచుకోవాలి. లేదంటే ప్రజల కోపాగ్నికి
ఆహుతి గాక తప్పదు.నియంతల చరిత్రనుండి నిజాలు తెలుసుకుని
హుందాగా నిష్క్రమించడం ఉత్తముల లక్షణం.

"భక్తుడి కోపానికి భగవంతుడికే భంగపాటు తప్పలేదన్న సత్యం జగత్వ్యాపితం".

జై తెలంగాణా - జై భోలో తెలంగాణా!

అనీల్ మద్దిరాల సహాయంతో మీ,
దీపం,

Sunday, March 13, 2011

The Bronze Poet in the million march

Hi all,
I have got a mail from one of my friends who is at that place and tried to stop when a few agitators were trying to destroy the statues on tankband. this is the real experience with the agitators, in her words-----------

“Tankbund loo shavaalu maavi,vigrahaalu miivi” said one Telangana poet long back. I felt it more than ever before when I went to Million March to connect myself with the many spirited individuals who are struggling for justice. I saw every woman activist from Telangana walking with self esteem. Spontaneous slogans were echoing like rhythmic drum beat. I started giving slogans along with my friends in full voice. I joined with people who were marching from this end to that end of the Tank Bond with great confidence. Their cheering smiles were glowing like green blades of grass. I melted in their collective gaze for a better society. I sang in a roaring tone. I anticipated this day of collective action. I was intoxicated with the beautiful spirit of my friends. Suddenly, empty bottles and cutting-edged rocks were hitting like hail at the iron block that was molded into a human shape. I shot through the frenzied crowd to the bronze poet. People were shouting, screaming ‘hey-ammaa, go away, go away……stones…stones”. I struggled to grab the rod from his hands.

He asked me ‘who are you to stop me?”

I said ‘I am your sister, don’t you recognize me!? I am with you all these years, didn’t I?”

As he continued his work, he said from under the mask, “I don’t know you, how can you call me your brother…. you did not come to rescue me when they were stumping me? When they were crushing my expression…Tell me sister… am I not worth enough of this Iron block which you try to rescue??”…..

I was startled by his question. I looked up into the frozen iron face of my beloved poet. His eyes were static. His gaze was at the sinking sun behind Buddha. I wanted the bronze poet to say to me that he needs me, I wanted him to say ‘protect me my reader’. But he was quite and peaceful as if he liked being hit. I remembered his words “die…..you worthless beings of rotten bones…..” I saw the iron face that started glowing in patches. The crashing sound of the rod reminded me of the stone crushing sound near our village mango grove, next to the forest. How much I cried when I saw our village rock hill was blasted! How much it pained me to see our forest being destroyed! How cruel was the sound of those giant machines that deafened my ears! When I cried out for my hills, birds, trees, lakes, land, my people…….no one listens to me…..how much destruction……….

“But sister……I listened to you” said the man in the mask, as if he is reading my thoughts.

“What did you say?” I said surprisingly.

“I said I listened you, that is why I am here”…….But…

I struggled to say something.

”but you don’t like what I am doing” he said coolly as he broke the bronze statue hand with the book.

“Yes…..I don’t like this, I insist you… stop this”….I said with fury.

”why?” he asked without turning his eyes….

”because……he is our pride”….

“To see in death a dream, in the sunset

A golden sadness-such is the poetry,

Humble and immortal, poetry,

Returning like dawn and the sunset”

Don’t you know sister; there are some great personalities in each generation in every place who lived their lives up to their values! They are not just ornamental symbols of pride. Don’t you know this poet whom you respect so much does not want give up his self respect until his last breath? Don’t you know he would not agree to kill his true spirit in the name of “pride”…..

” he is our dear poet” I corrected.

“So?”….

”I don’t want to see him dying”…

Man in the mask laughed

“My dear sister….I wish the same…don’t you see….that is what I am doing”…….

”what……dismantling him!?”

“no ….I am liberating this poet from his frozen moment……I am doing what he wanted, he wants to join us…” he said as he pluck out the pen out of his hand and threw it to the crying crowd ”be brave…..Return to life …oh poet”… Like the hand cuffs released from his hands, poet started moving & rolled down with a thud. Man in the mask turned to me and insisted,

“sister…..take this rod……..liberate the poets……they are helpless….they want to get back their souls out from these fake prides ….I know you are worried that this act might damage our peaceful movement, but sister to stop the destruction we need to create new things… rewrite the history, sister’……

An ambulance rushed in with an alarming sound and went away with the same speed. A mother in her rush who stepped on an empty pesticide bottle fell down and with a fury picked the bottle and threw it at the Bronze poet. The bronze poet on the Tank bund road started moving and joined in the million march with the people.
By
Vimala.K
10th March

ఆహా హా వచ్చారండి వచ్చారు తెలుగు జాతి పరిరక్షకులు వచ్చారు

ఆహా హా వచ్చారండి వచ్చారు తెలుగు జాతి పరిరక్షకులు వచ్చారు.
ఆత్మ గౌరవ నినాదం తో మళ్ళీ మన ముందుకు వచ్చారు.
పాలామూరు లో పంటలు లేక ప్రజలు లక్షల్లో వలస వెళ్ళి
కూలిన భవన శిథిలాల కింద బ్రతుకు ఛిద్రమై కుంగిపోయినపుడు ఏమైంది ఆత్మ గౌరవం?
రాజోళిబండ తూమును రాయలసీమ రెడ్లు పేల్చి వేసి కర్నూలుకి నీరు మరల్చినప్పటి కన్నా రాయల వారి విగ్రహ కూల్చివేత ఎక్కువగా బాధిస్తున్నదా?
తలా తునా గోదారి పారుతోన్నా బ్రతుకే యెడారై
విష జ్వరాలకు వినమ్రంగా ప్రాణార్పన చేస్తున్న అదిలబాదు అడవి బిడ్డలను చుసినపుడైనా
గుర్తుకు రాలేదా ఆత్మ గౌరవం?
నల్లగొండ నడ్డి విరిచి, నీరు మరల్చి, మాయదారి ఫ్లోరైడ్ కి మా బతుకుల్ని బలి ఇచ్చి
విరిగిన మా అన్నదమ్ముల ఎముకలతో వెలిగించిన మీ సంక్రాంతి భోగి మంటలో నైనా కనపడలేదా ఆత్మ గౌరవం?
కాకతీయ కళాప్రభల విస్మరించి "తెలుగు" పాఠ్య పుస్తకాలలో ఎక్కడా రాణి రుద్రమ ప్రస్తావనే రాకుండ చరిత్రను కాల రాసి నేడు జాతి జాతి అని వాపోతున్నారా?
తెలుగు సాహితీ పరిమళాలు విరాజిల్లిన విజయవాడ సాక్షిగ కళాశాలల్లో ప్రతి కులానికి ప్రత్యేకంగా స్వాగత కార్యక్రమాలు జరిపినపుడు ఎమైంది ఆత్మ గౌరవం?
కాళోజి ని కాల రాసి, దాశరథి ని దాచివేసి, కొమురాన్ని, ఐలమ్మ ను తెలుగు చరిత్రలోంచే కడిగేసి
భళ్ళారి రాఘవ సాక్షిగా మా భాష ను యాస ను కించపరచి, తెలంగాణ వారిని చిల్లర మల్లర రౌడీలుగా చిత్రీకరించినప్పటికన్నా నిన్నటి సంఘటన ఎక్కువగా బాధిస్తున్నదా?
"సొంత లాభం కొంత మానుకు పొరుగు వాడికి తోడు పడవోయి" అన్న గురజాడ వారి ఆదర్శాలను అధహ్ పాతాళానికి తోసి, ఒక రాతి విగ్రహం పై రాధ్ధాంతమ?

సిగ్గు సిగ్గు

ఉస్మానియా లో మీ సాటి అక్క చెల్లెళ్ళను రక్షక భటులే రాక్షస భటులై చెప్పరాని చోట లాఠీలతో దెప్పి పొడుస్తూ హింసించినపుడు ఏమైంది ఆత్మ గౌరవం?
ఆ నాడు కాదా తెలుగు జాతికి చీకటి రోజు?
ఆవేదన తో ఆక్రోషం తో ఆరు వందల ప్రాణాలు ఆత్మార్పణ చేసుకున్న ఇవి కావా చీకటి రోజులు?

Friday, March 11, 2011

పుడమి తల్లి గర్జనకు తల్లడిల్లుతున్న జపాన్...

పొద్దున్నే లేచి లాప్ టాప్ ఆన్ చేయగానే చూసా ఒక ఘోరమైన సంఘటనను, ఈ ఘటన భవిష్యత్తులో రాబోయే మరిన్ని ప్రకృతి వైపరీత్యాలకు ఒక సూచకం మాత్రమే అని ardam ayindi... పుడమి తల్లి తన కడుపులో ఎన్నో ఏళ్లుగా దాచుకున్న కోపాన్నంత ఒక్కసారిగా కక్కినట్టు (వోమిటింగ్ ) ఉన్నది ఈ సంఘటన..
అప్పటిదాకా తాము చూసిన, ఉంటున్న నగర రూపురేఖలు మారడానికి ఒక్క పావుగంట సమయం కూడా పట్టలేదు... రిక్టరు స్కేలు సూచీ ఎపుడెపుడా అన్నట్లు ఎగిసిపడి ఏకంగా 9 కి దరిదాపుల్లో ఆగిపోయింది... ఆ సమయంలో పుడమి తల్లి గర్జనకు భయపడి రిక్టరు స్కేలు ఇంకా ఎగిసిపదేదేనేమో, ఎందుకో ఆ సమయంలో ఆ రిక్టరు స్కేలుకు తనలోని మానవత్వం మేలుకున్నట్లు, ఆగిపోయింది... ఆ దృశ్యాలు చూస్తుంటే ఏడేళ్ళ క్రితం మానవాళికి గజ గజ వణికించిన సునామి మరోసారి నా కాళ్ళ ముందు కనిపించింది.. పుడమి తల్లికి ఎంత కోపం వచ్చిందో తెలీదు కాని, తన కోపాన్ని అంత ఒకే సారి వెలువరిచింది... ఒక భూకంపం, మరో ఆ భూకంపమే మరో రూపమై సునమిలా వచ్చింది.. ప్రజలకు ఏమి చేయాలో తెలియలేదు... ఏం చేద్దామా అని ఆలోచిన్చేలోపే, సునామి రూపంలో నగరమంతా కబళించింది... ప్రపంచమంతా ఒక్కతాటి పై నిలవాల్సిన సందర్భం మరోసారి రానే వచ్చింది..... టెక్నాలజీ కి కొదువ లేని దేశం అది.. అసలే ఒకసారి మానవుని అణుబాంబు కు బలై, ఎన్నో సంవత్సరాలు తల్లడిల్లి, ఇపుడిపుడే కోలుకుంటున్న జపాన్ దేశానికి ఈ సారి సునామి రూపంలో పుడమి తల్లి ఆగ్రహానికి భరించలేని మరో దెబ్బ తగిలింది.. ఈ దెబ్బకు కోలుకోవడానికి ఎన్ని సంవత్సరాలు పట్టునో... వారికి ప్రపంచంలో ఎవరికీ లేని ఆత్మస్థైర్యం, మనోబలం అన్నింటికీ మించి తెక్నలగి అందుబాటులో ఉంది కనుక నాకు తెలిసి ఎన్నో సంవత్సరాలు పట్టవు... మానవత్వం ఉన్న వారెవరైనా చలించిపోఎలా ఉంది ఈ ఘటన.. మొత్తం నగరాన్నంతటిని కబళించింది.. ఇంకా నయం ఈ ప్రాంతానికి అతి దగ్గరలోనే ఉన్న అణు విద్యుత్ రియాక్టర్ల మీద పడలే ఈ పుడమి తల్లి కళ్ళు... ఇలాగే మళ్ళీ ఎపుడైనా మన పుడమి తల్లి గర్జిస్తే.. అమ్మో తలచుకుంటేనే ఒళ్ళు జలదరిస్తోంది..
మంచైనా చెడైనా అందరిని భరించే ఒకే ఒక్కమాత్రుమూర్తివి నువ్వు.. నువ్వే ఇలా, నిర్దాక్షిణ్యంగా గర్జిస్తే, ఇక మానవాళి అంతా ఎకడికి వెళ్ళాలి .... శాంతించు మాతా శాంతించు....
కొన్ని ఫోటోలు చూస్తుంటే ఈ ప్రజలు ఉండేది అసలు భూమి మీదన లేక సముద్రం మీదన అన్నట్లున్నాయి... ఆ పక్కనే ఉన్న ఆయిల్ రిఫైనరీ కేంద్రం నుండి ఎగిసిపడుతున్న మంటలను చూస్తుంటే చాలా భయం వేసింది... ఇలాంటి జపాన్ దేశం త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ..
మీ,
దీపం,

please realize atleast now after reading this

Hi everyone...i would like to suggest you ..to know the facts about telugu ....culture..and where it came from ....telugu came from kakatiya dynasty..se this videos ....and relaize the facts ...
Telugu culture ..is not at present at tankbund... se this videos ..its belong to Kakatiya kingdom.

PART1 http://www.youtube.com/watch?v=YIt5WkBbF-Y
PART2 http://www.youtube.com/watch?v=I8lhyMMdId
PART3 http://www.youtube.com/watch?v=0CdnqivdHZs
PART4 http://www.youtube.com/watch?v=MVJpnq6i_5s
PART5 http://www.youtube.com/watch?v=m8lTgovXfOw
PART6 http://www.youtube.com/watch?v=LR9uXRJMy-Q
PART7 http://www.youtube.com/watch?v=uW86drf1cr8

after you watching these videos ..tell me ,what these so called govt ..recongnised and given importance ..to orginal Teleugu culture ....

at present Tank Bund ..what ever the statues are there....they alone wont represent Telugu culture......after seeing these videos ...it will be eye opener for everyone.

then we will discuss who evaded who 's culture.....who has demolished the original Telugu culture

వి'గ్రహాల' విద్వంసం!

జాతి రత్నాలు అంటున్నావ్, ఎవడి జాతి..
బొమ్మలు తగలబడితేనే నీకు చరిత్ర, సంస్కృతీ గురుతోచ్చిందా..
అసలు నీకు 'ఆత్మ' ' గౌరవం' అంటే అర్థాలు తెలుసా..
కూలిన నీ చరిత్ర కారులని అడిగి తెలుసుకో బ్రదర్
తెలుగు జాతి తగల బడింది అని కుల్లుతున్నావ్
తెలంగాణా జాతి మాటేప్పుడైనా వినపడిందా

వారు గొప్ప వారు కావొచ్చు..
కాని నా తల్లి గుండె మీద
నిప్పులై మండుతున్నారు
ఎపుడైనా నీ ఎసి కార్లల్ల తిరుగుతుంటే
కనపడిందా మా గోస

హుస్సేన్ సాగర్ నిండా నా తల్లి కంటి నీరే కదా..
భాషని, యాసని హేళన చేసి చూసే నీకు
ఎక్కడిదిరా హక్కు
జాతి గురించి ఊసెత్తడానికి

అందమైన హైదరాబాద్ ను తయారు చేసిన
నా రాజుల చరిత్ర ఏది?
ప్రపంచ పటంల నా జాతి ని నిలబెట్టిన
నా నిజాం పరిమళాలు కలుషితం చేసి
మా కొమరం భీమ్ ధైర్యానికి , వీర చరిత్రకు మసి పూసి,
అయిలవ్వను , యాదగిరిని , బందగిని బొందపెట్టి
ఏ చరిత్ర గురించి మాట్లాడుతున్నావ్..

రాయి బద్దలయితే రాద్ధాంతం చేస్తున్నావ్,
బొమ్మ పగిలితే గుండె పగిలినట్టు
గంటలూ గంటలూ రొద పెడుతున్నావ్
నువ్వు నిలబడ్డ జాగా నాది,
నా జాగా చరిత్ర ఏది? సంస్కృతీ ఏది?

నా బిడ్డలు ఏరి..
ఓ గురజాడా, ఎర్ర ప్రగడ, ఇంకా ప్రజా కవులారా..
మీరు చేసిన తప్పంతా..
రక్త మాంసాలు తినే నర రూప రాక్షసుల చేతుల్లో పడడమే,
మిమ్మల్ని అడ్డం పెట్టుకొని మా జాతి ని మట్టు బెట్టి,
మా చరిత్ర సమాధుల మీద మిమ్మల్ని నిలబెట్టడమే

మేము గురి పెట్టింది మిమ్మల్ని కాక పోవచ్చు,
మీరు చేసిన కృషిని కాకపోవచ్చు..
మా ఆక్రోశం బద్దలు అయింది
భాల్ల్లున పగిలింది మీ బొమ్మల పైన..

మీ జాగా ఖాళి అయితేనే కదా
మా చరిత్రలు నిలబడేది

ఒకటి అంతం అయితేనే మరొకటి మొదలు..
మా జాతి కోసం ప్రాణాలు అర్పించిన
అమర వీరుల సమాధులకు కూడ
జాగా లేదు, వారికి చోటియ్యనియండి,
బొమ్మలకి బాద పడే మీరు..
బిడ్డలు కళ్ళముందు కాలుతుంటే
ఒక్క కన్నీటి బొట్టు కూడ రాల్చ లేదే?
కవితలు రాల లేదే, పుస్తకాలు అచ్చు కాలేదే ?

మీ మాటలు కత్తుల్ల దిగుతుంటే
ముక్కలైన మా మట్టిని ,
బూడిదైన మా సంస్కృతిని
మళ్లీ నిలబెట్టుకున్దామనే
చరిత్రని మల్లా తిరగ రాస్తున్నాం,

ఇక్కడ మీకు , మీ గొప్ప చరిత్రలకు
స్తానం లేదు..అందమైన విగ్రహాలకు
విడిది కాదు నా ఇల్లు,
ఆగమైతున్న బతుకు చిత్రాలకు
కొలువు..

భుతల్లి కన్నీట మునుగుతున్నాం
గర్భ శోకంతో కుంగి పోతున్నాం..
మోసాలకు ఎత్తులకు జిత్తులకు
విసిగి వేసారి ఉన్నాం..
కొలిమిల్లాగా మండుతున్నాం..
దగ్గర కొస్తే ఆగం అయితారు..

మాట్లాడే సహనం లేదు,
బ్రతిమిలాడే క్వాయిష్ అంత కన్న లేదు
మిగిలినవి చేతలు , చేతులే ..
ఆవేశం అంటుకున్నది
ఆవేదన అలుముకున్టున్నది..
మంచి చెడుల మధ్య
చెరిగిన రేఖ..
న్యాయ అన్యాయాల మధ్య నలిగిన
సత్యం..

ఇప్పటికైనా ...
నా భూమ్మీద నా బిడ్డలకే హక్కు..
మేమూ ప్రజా కవులను ప్రేమిస్తాం..
మీ చరిత్రనూ నిలబెడతాం..
మా చేతుల మీదుగా
మేము ప్రశాంతంగా
స్వేచ్చగా గాలి పిలచిన రోజు..


...సుజాత సూరేపల్లి

తెలంగాణ మిల్లియన్ మార్చ్ ప్రజాస్వామ్యానికే ఒక పెద్ద ప్రశ్న అయ్యిందా ...???

మిలియన్ మార్చ్ మామూలు విజయ౦ కాదు, అఖ౦డ విజయ౦... అమోఘవిజయ౦... అపూర్వవిజయ౦... అనిర్వచనీయమైన విజయ౦..! గర్వంగా ఫీల్ అవుతున్నా... అంతే కాదు, నిన్న జరిగిన మార్చ్ లో పాల్గోననందుకు చింతిస్తున్నా కుడా.....అనుకున్న కార్యక్రమాన్ని ఎన్నో అడ్డంకులకు ఓర్చి దిగ్విజయవంతం చేసినా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు....

చెప్పడానికి మాటలు కూడా రావటం లేదు ఫోటోలు చూసినపుడు... నా ఒంట్లోని రక్తం ఉడుకుతోంది.. నేనెందుకు అక్కడ లేనా అని... ఒళ్ళు జలదరిస్తోంది.. తెలంగాణా వాడినై పుట్టినందుకు గర్వంగా ఫీల్ అవుతున్నా.. అందులోను ఈ కాలంలో ఉన్నందుకు, ఇలాంటి గొప్ప గొప్ప సంఘటనలను కనీసం ఇంటర్నెట్ లో చూసే భాగ్యం దొరికినందుకు నేను గొప్పగా ఫీల్ అవుతున్నా... ప్రతి తెలంగాణా వాడికి మానసికంగా ఎంతో ధైర్యాన్ని చేకూర్చింది ఈ మిల్లియన్ మార్చ్ ...
దేవుడంటూ ఉంటె నేను ఒకటే కోరుకుంటా.. మరో జన్మంటూ ఉంటె దేవుడా, నన్ను మరో సారి కూడా ఈ తెలంగాణా వాడిగా పుట్టించు... ఈ తల్లి ఋణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేను....

ఈ ప్రభుత్వం మన ప్రజల సమస్యలను అసలు పట్టించుకోదా అనే ఒక నిరాశ, నిస్పృహలతో కూడిన సామాన్య తెలంగాణా వాడికి.... ఎన్ని రోజులు చేయాలా ఈ ఉద్యమం అన్న దిగులుతో... ఇక చాలు మన బతుకేదో మనం బతుకుదాం బానిస బతుకైన సరే, అనే ఒక చాతకాని తనం వస్తున్న తరుణం లో చేపట్టిన ఈ మిల్లియన్ మార్చ్ ఒక మంచి మానసిక ధైర్యాన్ని మాత్రమే కాదు సాధించే దాక తెగించి పోరాడుడే అని తెగించి పోరాడే తత్వాన్ని తెలంగాణా ప్రజల్లో ఎన్నో రెట్లు పెంచింది...
శత్రు చక్రభందంలో చిక్కుకున్న అభిమన్యుడి వలె ప్రతి తెలంగాణా వాడు అడుగడుగునా ఉన్న పోలీసు చక్రభంధాన్ని దాటుకుని ట్యాంక్ బాండ్ కు నేను సైతం అంటూ చేరుకున్న తీరు, మనవారి తెగింపు, స్థైర్యం, స్ఫూర్తి అమోఘం... అపూర్వం... అనిర్వచనీయం... మొత్తం 350 కి పైగా ఏర్పాటు చేసిన చెక్ పోస్టులను, అడుగడుగునా చేస్తున్న తనికీలను సైతం దాటుకుంటూ, ఫోటోల్లోని ఒక్కొక్క తెలంగాణా పౌరుడిని చూస్తుంటే వారి మొహాల్లో ఎక్కడ లేని సంతోషం, ఎక్కడ లేని ఆనందం, ఏదో సాధించాం అన్న ఒక ఫీలింగ్, తనను మించిన వాడు ఈ ప్రపంచంలోనే ఇంకొకడు లేదు అన్న రేంజ్ లో ఉంది ... ఇలాంటి స్ఫూర్తి, ఇలాంటి ఆనందం ప్రతి రోజు ఉండాలి మన వాళ్ళలో... మనం చూడాలి కూడా ... ఉండేలా మనం చేయాలి కూడా... ఆ భాద్యత మనమీదనే ఉంది..
ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్ప స్థాయిలో దిగ్విజయం చేసి, ప్రపంచానికే ఒక పాటాన్ని నేర్పించడానికి పని చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా మనస్పూర్తి ధన్యవాదాలు తెలుపుకుంటూ తెలంగాణా అభివందనాలు...
ఒక పక్క తెలంగాణా ప్రజలు మిల్లియన్ మార్చ్ కి సిద్ధం ఆతుంటే ప్రభుత్వం పోలీసు మార్చ్ చేయించింది తెలంగాణా జిల్లాల్లో.. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో చూసినట్లయితే, ఇది మన భాగ్య నగరమేనా అన్నట్లుంది... అరెస్టులతో తెలంగాణా ప్రజలను, నాయకులను, విద్యార్థులను ఎక్కడికక్కడే బంధించాలని చూస్తుంటే ఈ దశలోనూ తెలంగాణా వారు తమ ఆత్మస్థైర్యాన్ని కోల్పోలేదు, పైగా వారి ఆత్మస్థైర్యం రెట్టింపు అయి ఎలాగైనా ఈ మిల్లియన్ మార్చ్ లో నేను కూడా పాల్గొనాలని గట్టిగ నిశ్చయిన్చుకోనేలా చేసాయి...నర నరాన రక్తం ఉడికిపోతోంది..
ఇంకా తెలివిగా ప్రభుత్వం, మార్చ్ కి 24 గంటల ముందు మొత్తం ఒక లక్ష మందిని అరెస్టు చేసిందంటే అది నమ్మశక్యం కాదు.. కాని అది నిజం..నమ్మి తీరాల్సిందే.. దాదాపు తెలంగాణా లోని అన్ని యునివేర్సిటిల్లోని విధ్యర్తులన్దరిని అరెస్టు చేసారు,, జై తెలంగాణా అన్నా ప్రతి నాయకుణ్ణి, కార్యకర్తని అరెస్టు చేసి బొక్కలో పెట్టారు.. ఒక దశలో ప్రతి తల్లి తన కొడుక్కి వీర తిలకం దిద్ది, జై తెలంగాణా అని పంపించేలా ఉసి గోల్పాయి ఈ ప్రభుత్వపు చేష్టలు... నాకు తెలిసినా నా మిత్ర్హులు కొందరు ఇదే విషయం చెపారు.. మిల్లియన్ మార్చ్ కి వేల్లెముందర వారి తల్లి ఇంట్లో వీర తిలకం దిద్ది, జై తెలంగాణా అని చెయ్యెత్తి జై కొట్టి, మరీ పంపిందంట, ఒక వీరుడి తల్లి వలె... ఇలాంటి పరిస్తితుల్లో, అనుమతి లేదంటూ పోలీసు ఉన్నతాధికారులు అతిగా ప్రవర్తించి, ఉదయమే TG -JAC చైర్మన్ ఐన ప్రొఫ్. కొదండ్ రామ్ ని అరెస్టు చేసి ప్రజలను రెచ్చగొట్టింది ఈ ప్రభుత్వం... ఇక ఈ కార్యక్రమాన్ని ముందుంది నడిపించే దిక్కు లేకుండా చేసారు.. అయినా కూడా ఎవరు ఎలాంటి సహనం కోల్పోకుండా, కార్యక్రమాన్ని ఎవరికీ వారే ముందుకు తీసుకు వెళ్లి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరు అభినందనీయులే...

ఇక ఈ కార్యక్రమంలో అనుకోకుండా చోటు చేసుకున్న కొన్ని సంఘటనలను కొంత మంది కావాలని భూతద్దంలో పెట్టి చూస్తూ మరీ, పెద్దగ చేస్తుండడం చూస్తే చాల భాదేస్తోంది.. ఇన్ని సంవత్సరాలుగా దాదాపు 6 దశాబ్దాలుగా తెలంగాణా వారికి అన్యాయం జరుగుతుంటే ఎవరికీ కూడా గుర్తుకు రాని తెలుగు వారు ఆత్మగౌరవం, ఎన్నో సంవత్సరాలుగా పోరాడి తెచుకున్న తెలంగాణా ను రాత్రికి రాత్రే అర్ధరాత్రిలో లాగేసుకున్నపుడు గుర్తుకురాని ఈ ఆత్మాభిమానం, ఏం చేయాలో తెలీని దిక్కు తోచని పరిస్థితుల్లో 600 మందికి పైగా ఆత్మహత్య చేసుకున్నపుడు గుర్తుకు రాణి ఈ గొప్పతనం, ఒట్టి మట్టి బొమ్మలను పగులగోడితే గుర్తుకువచింది ఈ తెలుగు వారికి.... ఈ దాడిని ఒక ఆంధ్ర పెత్తందారుల మీద జరిగిన దాడిగా గుర్తించాలే తప్ప, వ్యక్తుల మీద జరిగిన దాడిగా గుర్తించకూడదు... అయినా అక్కడికి వచ్చింది లక్షల మంది జనం, విధ్వంసానికి పాల్పడింది కొన్ని వందల మంది కూడా కాదు... దీనికే, ఒక TV (TV-9)ఛానల్ లో అయితే వెర్రి కూతలతో మొత్తం ఉద్యమాన్నే కించపరిచేలా వాఖ్యలు చేసింది... ఆ ఛానల్ వాడికి అసలు కళ్ళు ఉన్నాయా...?? చెవులు ఉన్నాయా....? ఉంటె ఏమయి పోయాయి... కొన్ని లక్షల మంది ఊరూరా దీక్షలు చేస్తుంటే కళ్ళు దొబ్బాయా.. చెవులు మూసుకుపోయాయా..?? అసలు ఇలాంటి వాళ్ళను ఇంకా హైదరాబాద్ లో ఉండనిస్తున్నందుకు ప్రతి తెలంగాణా వాడు మనసులో ఎంతో భాదపడుతూ ఉంటాడు... ఇలాంటి విధ్వసానికి దిగడానికి కారణం ఐన కొన్నింటిని మనం అర్ధం చేసుకోవాలి ఇక్కడ,, ముఖ్యంగా ఎంతో ప్రశాంతంగా చేయాలనుకున్న మిల్లియన్ మార్చ్ ని కావాలని పోలీసులను విచ్చలవిడిగా రప్పించి విధ్వంసభరితం చేసింది ఈ ప్రభుత్వం.. అసలు నాకో పెద్ద డౌటు ఏంటంటే, ఈ విధ్వంసాలకు పాల్పడింది మఫ్టీ లో ఉన్న పోలీసులే అని.. లేదంటే సీమంధ్ర పెత్తందారుల తొత్తులు ఎవరైనా ఉద్యమంలోకి వచ్చి అసలు ఉద్యమ కారులను ప్రేరేపించి ఐన ఉండాలి... అసలు తెలంగాణా ప్రజలే గనక ఈ విగ్రహాలు ఇక్కడ ఉండొద్దు అని అనుకున్నా, తెలంగాణా ఉద్యమం అన్నది పిచోది చేతిలో రాయి అని కొన్ని చాన్నేల్లు అనుకున్నట్టు అయితే, ఇపటికి ఎప్పుడో ఈ పని చేసి ఉండేవారు.. ఇలా విగ్రహాలను ధ్వంసం చేయొద్దని అక్కడ ఉన్న ఎంతో మంది ప్రొఫెసర్లు, ఉద్యమ నేతలు కోరినా వారిని నెట్టేసి, ఈ పని చేసారంటే ఖచ్చితంగా ఇది ఉద్యమాన్ని నీరుగార్చాలని కొంతమంది పెత్తందారులు చెపితే చేసిన పనే... అంతే కాని ఇది ఉద్యమ కారులు చేసిన పని ఎంత మాత్రం కాదు... దీనిని ఇంకో కోణంలో కూడా ఆలోచించాలి... తెలంగాణాకు, హైదరాబాద్ కు నది బొడ్డు ఐన ట్యాంక్ బాండ్ పై కొంత మంది తెలంగాణాకు చెందినా వారివి విగ్రహాలు పెట్టాలని తెలంగాణా ప్రజలు ఎపటినుందో కోరుతున్నారు. దేనికి సానుకూలంగా 7 ,8 నెలల క్రితం కొమురం భీమ్ విగ్రహ స్థాపనకు ప్రభుత్వం ముందుకు వచినా ఇపతివరకు దానికి సంభందించిన పనులు మొదలు కాలేదంటే ప్రభుత్వం యొక్క అలసత్వాన్ని మనం అర్ధం చేసుకోవచు.. ఇది తెలంగాణా వారిని కావాలని చిన్న చూపు చూస్తున్నట్లుగా కాదా???? ఇదే కోపం లో, కొంత మంది ఆవేశపరులు చేసిన పనిగా కూడా మనం దీనిని అర్ధం చేసుకోవచ్చు .. అసలు ఈ విధ్వంసాలకు దారి తీసిన కారణాలను, పరిస్థితులను మనం అర్ధం చేసుకోవాలి కాని నోటికి వచ్చిందే చందం అన్నవిధంగా అనకూడదు... ఇంకా విగ్రహాల మీదనే కాదు అన్ని పార్టీలకు చెందిన తెలంగాణ నాయకుల మీద కూడా ప్రజలు తమ కోపం చుపెట్టారంటే ఇది ఏ రాజకీయ పార్టీకి చెందినది కాదని గ్రహించాలి... ప్రజల కోపం తాకిడి కెసిఆర్ ను సైతం తాకింది... KCR సెక్యూరిటీ వాహనాన్ని ధ్వంసం చేసారంటే పరిస్థితి ఎంత ఉద్విగ్నభరితంగా ఉందొ అర్ధం చేసుకోవాలి...

ఒకే ప్రాంతానికి వంత పాడే ఒక వెబ్ సైట్ లోనైతే, ఏకంగా, '' మనుషులం అన్న సంగతే మరచిపోతే, ఇక ప్రాంతాలేందుకు, రాజ్యాంగం ఎందుకు , ప్రభుత్వం ఎందుకు'' అంటూ స్టేట్మెంట్ లు .. అవును నేను కూడా అదే అంట... ఈ దాడి మనుషుల మీద జరగలేదు అన్న విషయం గుర్చుంచుకోండి... మనుషుల మీద దాడులు జరుగుతుంటే ఇలాంటి వారికి ఇవన్ని ఎందుకు గుర్తుకు రావో...??? ఇంకా మిల్లియన్ మార్చ్ ని మిలిటెంట్ మార్చ్ గా అభివర్ణించారు కొందరు మేథా(తా)వులు.... అసలు ఇంత వరకు జరిగిన తెలంగాణ ఎలా ఉందొ కూడా తెలీనట్టుగా మాట్లాడుతున్నారు వాళ్ళు.... పైగా తెలుగోడు తల దించుకోవాలి, రాష్ట్ర చరిత్రలో ఇదొక బ్లాక్ డే అంటూ అరుస్తున్నారు, అసలు ఏ రోజు కాదు బ్లాక్ డే, తెలంగాణ ప్రజలను మభ్య పెట్టిన ఇన్ని రోజులు బ్లాక్ డే నే, దానికి సిగ్గుతో తల దించుకోవాలి అసలు సిగ్గు సారం ఎమన్నా ఉంటె...... అసలు మిలిటెంట్ ఉద్యమం ఈ సీమంధ్ర పెట్టుబడిదారులకు చుపెట్టాలనుకుంటే ఎపుడో చూపెట్టే వారు ఈ తెలంగాణా ప్రజలు.. ప్రజాస్వామ్యానికి కట్టుబడి, రాజ్యాంగ బద్దం గా చేస్తున్న తెలంగాణ ఉద్యమం ఇది.. ఇంకా కొన్ని పత్రికలైతే విధ్వంసాల మార్చ్ అంటూ విధ్వంసం సృష్టించాయి.. ఐనా లక్షల మంది వచ్చినపుడు, ముందుండి నడిపించే నాయకుణ్ణి దిగ్భందం చేసినపుడు ఏమి చేయాలో తెలీని ప్రజలు ఇంత ప్రశాంతంగా ఉన్నారంటే తెలంగాణ ప్రజల ఓపికను అర్ధం చేసుకోవాలి... ఇదే ఘటన వేరే ఈ దేశంలో గనక జరిగితే తెలిసేది అసలు ఏమయ్యేదో... అసలు వేరే దేశం ఎందుకు వేరే రాష్ట్రంలో జరిగితే ఏం అయ్యేదో తెలిసేది ప్రభుత్వానికి...

ఇంకా కొందరు అయితే అబద్దపు పెళ్లి చేసి మరీ ట్యాంక్ బాండ్ మీదకి వచ్చారంటే ప్రజలు ఎంత బలంగా అనుకున్నారో అర్ధం చేసుకోవచ్చు... ముందే చెపిన సమయం కంటే అర గంట ముందు వరకు కూడా ఎవరు ఊహించి ఉండరు ఇంత గ్రాండ్ సక్సెస్ అవుతుందని.. ప్రతి తెలంగాణ వ్యక్తి స్వచ్చందంగా ముందుకు వచ్చారు... మహిళలు కూడా మేము సైతం అంటూ పిల్లలతో ముందుకు వచ్చారు...ఒకే ఒక్క గంటలో ట్యాంక్ బాండ్, దాని పరిసరాలు మొత్తం మారిపోయాయి... పోద్దటినుండి పోలీసుల కవాతులతో ప్రశాంతంగా ఉన్న ట్యాంక్ బాండ్, ఒక్కసారిగా హోరెత్తిన జై తెలంగాణ నినాదాలతో మార్మోగింది... అరగంట వ్యవధిలో బుద్దుడి సాక్షిగా ట్యాంక్ బాండ్ అంతా జనసంధ్రమయింది... పరిస్థితి పూర్తిగా పోలీసుల చేయి దాటి తెలంగాణ ప్రజల్లోకి వెళ్లిపోయింది.. అందరి నోట ఒకటే మాట- జై తెలంగాణ అని.... ఎంతో మంది ఎన్నో ప్రయాసలకు ఓర్చుకొని దిగ్విజయం చేయడానికి పూనుకొని వచారు... తెలంగాణ జిల్లాల నుండి హైదరాబాద్ కి వచ్చేవారిని కట్టడి చేయాలనే ఉద్దేశ్యంతో అడుగడుగునా చెక్ పోస్టులను ఏర్పాటు చేసిన ప్రభుత్వం, మరి ఇంత మంది ఎలా వచ్చారు, ఎకడనుండి వచాఋ అన్నది అర్ధం చేసుకోవాలి... అంతే కాదు, హైదరాబాద్ లో అసలు ఉద్యమమే లేదు అనేవారికి ఇదొక గుణపాటం కుడా... గమనించాల్సింది ఏంటంటే, ఈ మార్చ్ లో పాల్గొన్న వారు దాదాపుగా అందరూ హైదరాబాద్ లోని వారే... అంటే ఇపటికైన ప్రతి ఒక్కరు అంగీకరించాల్సిన విషయం ఏంటంటే, తెలంగాణ లోని ప్రతి ఒక్కరు, తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకుంటున్నారు, వారి ఆశ, శ్వాస అంతా తెలంగాణే అని... ఇంత కన్నా ఇంకేం చేయాలి ఏ తెలంగాణ ప్రజలు......???
అసలు ఈజిప్టులో ముబారక్ సైతం ప్రజల ఆకాంక్షకు తల వంచాడు, శాంతియుత ర్యాలి కి అనుమతి ఇచ్చాడు, కాని ఏ మన ప్రజాస్వామ్య దేశంలో 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ఈ భారతదేశంలో ఎలాంటి హక్కులు లేవు... దీనికి ప్రతి ఒక్కరు సిగ్గుతో తలదించుకోవాలి... ప్రతి భారతీయుడు ఆలోచించాల్సిన సమయం ఇది.... ఒక ప్రాంతానికి చెందిన 4 కోట్ల మంది ప్రజలు ఒక్కటై తమ ఆత్మ గౌరవం కోసం, తమ గుర్తింపు కోసం, తమ హక్కుల కోసం గొంతెత్తి ఒకే చోట చేరడం అన్నది భారత దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన సందర్భం... కానీ, ఒక్కటే అర్ధం కానీ విషయం ఏంటంటే, ఇంత గొప్ప ప్రజాస్వామ్య దేశంలో ఒక ప్రాంతానికి చెందిన 4 కోట్ల ప్రజల ఆకాంక్షలకు విలువ లేకపోవడం అన్నది మన ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటు...
మీ,
దీపం

Thursday, March 10, 2011

watch raj news online

మిలియన్ మార్చ్

మిలియన్ మార్చ్ మామూలు విజయ౦ కాదు, అఖ౦డ విజయ౦... అమోఘవిజయ౦... అపూర్వవిజయ౦... అనిర్వచనీయమైన విజయ౦..! జై తెలంగాణా... సహకరించిన వారికందరికీ పేరు పేరున ధన్యవాదములు...






త్వరలో విశ్లేషణ...

మీ,
దీపం...

పోలీసుల అష్టదిగ్భందంలో భాగ్యనగరం... మిల్లియన్ మార్చ్ కి ప్రభుత్వ పరోక్ష సహకారం...

తెలంగాణా పోరాట చరిత్రలో మరోసారి సువర్ణ అక్షరాలతో రాయదగ్గ సమయం రానే వచ్చింది.. అదే తెలంగాణా మిల్లియన్ మార్చ్ పేరుతో చేపడుతున్న చలో హైదరాబాద్ కార్యక్రమం.... ఈ కార్యక్రమానికి తెలంగాణా వ్యతిరేఖ ప్రభుత్వం ఎన్నో విధాలుగా నీరుగార్చాలని చేస్తున్న ప్రయత్నాలను పటాపంచలు చేస్తూ తెలంగాణా ప్రజలంతా ఒకే తాటి మీద ఉంటూ చేపట్టాలనుకున్న కార్యక్రమాన్ని దిగ్విజయం చేయదలచిన రోజు మార్చ్ 10 -2011 . అదిగో తెలంగాణా లో పల్లెలు పట్టనాలనే తేడా లేకుండా తెలంగాణా అని నోరేత్తుతున వారినందరినీ మగ ఆడ అన్నా తేడా లేకుండా నిర్ధాక్షిణ్యంగా అరెస్టులు చేస్తూ ఎక్కడికక్కడే నిర్వీర్యం చేయాలనీ చూస్తున్న ప్రభుత్వానికి పోలిసు ఉన్నతాధికారుల నుండి చక్కగానే సహకారం అందుతున్నా, ఎక్కడో ప్రభుత్వానికి ఒక అనుమానం ... ఎందుకంటే వారి మనస్సాక్షి కి తెల్సు, ఈ ఉద్యమం ఇపుడు ప్రజల చేతుల్లో ఉందని.... ఇది ఏ ఒక్క రాజకీయ నాయకుని కనుసన్నల్లో లేదని, ప్రజలే స్వచ్చందంగా ముందుకు వస్తున్నారని గతంలో జరిగిన ఎన్నో కార్యక్రమాల్లో తెలంగాణా ప్రజలు తమ ప్రగాడ వాంచను పలువిధాలుగా నిరూపించారు కూడా... అయినా, ప్రతిసారి లాగే ఈ సారి కూడా తమ పప్పులు ఉడకవని, ప్రజాస్వామ్య దేశం లో ప్రజలను ఎవరు అడ్డుకోలేరని తెలిసినా, ప్రభుత్వం తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది... కనపడ్డ ప్రతి తెలంగాణా వాడిని అరెస్టు చేసింది, దొరికిన ప్రతి విద్యార్థి కి మరో సారి సంకెళ్ళు వేసింది, జై తెలంగాణా అంటూ గలమేత్తిన ప్రతి నోటిని బలవంతంగా నొక్కాలని దొరికిన వారిని దొరికినట్టు స్టేషనుకు తీసుకెల్లడమే కాదు వారిని కొన్ని రోజులు కస్టడి లో ఉంచారు... ఇలా తమకు తోచిన విధంగా ఎకడివారినక్కడే నిలువరించి మిల్లియన్ మార్చ్ కార్యక్రమాన్ని ప్లాప్ చేయాలని చూస్తుంది ఈ ప్రభుత్వం.. అంతటితోనే ఆగకుండా, తెలంగాణా జిల్లాల నుండి హైదరాబాద్ కి వెళ్ళే ప్రతి దారిని పోలీసులతో నిర్భందించింది, అంతేకాదు ప్రతి దారిలో అడుగడుగునా కొత్తగా చెక్ పోస్టులను ఏర్పాటు చేసి ఎక్కడి వారినక్కడే ఆపేసి, ఎవరు కూడా హైదరాబాద్ లోకి ప్రవేశించకుండా అడ్డుకోవాలని పగడ్భంధీ ప్రణాళిక రచించారు... మరో పక్క పోలీసు ఉన్నతాధికారులు ఈ మార్చ్ కి అనుమతి లేదంటూ భారీగా ప్రచారం చేస్తూ ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నాలు చేస్తున్నారు... వీరందరికీ తల తోకంటూ ఏది లేని మీడియా సహకారం.. అసలు ఒక్కోసారి ఈ మీడియా కథనాలు చదివిన తర్వాత నాకో అనుమానం వస్తుంది ఈ మధ్య.. అదేంటంటే- అసలు మనది ప్రజాస్వామ్య దేసమేనా?? ప్రజాస్వామ్య విలువలు ఇంకా ఉన్నాయా మన దేశం లో... ప్రజాస్వామ్యం ఇంకా బతికే ఉందా ఈ దేశంలో ..... ??? అని...

ఇదంతా చూస్తున్న ప్రజలకు ఒకటే ఉత్సుకత.. ఇది వరకు తెలంగాణా గురించి ఆలోచించని వారికీ కూడా నేను సైతం అంటూ ముందుకు వచ్చేలా వారిని ఆలోచింపచేస్తున్నాయి ప్రభుత్వపు కోతి చేష్టలు... ఇక హైదరాబాద్ నగరంలో ఉన్న ప్రతి ఒక్క తెలంగాణా వాది తన మనసులో ఇపటికే డిసైడ్ చేసుకొని ఉంటాడు, ఎలాగైనా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని.. చేస్తాడు కూడా... ఇదే సరైన సమయమని ప్రతి ఒక్కరు స్వయంగా అర్ధం చేసుకుంటున్నారు ఈ రోజుల్లో .. ఎందుకంటే ఇపుడు అందరూ సామజిక పరివర్తనతో, సమాజంలో జరుగుతున్న విషయాలను అర్ధం చేసుకుంటున్నారు ... అలా అర్ధం చేసుకొనే ఒక పరిపక్వతను ప్రజల్లో తెలంగాణా ఉద్యమం తీసుకొచ్చింది ....తద్వారా ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు తమ వంతు కృషిని మన తెలంగాణా వాదులు చేస్తుండడం మనకు గర్వకారణం...
తాజా సమాచారం ప్రకారం అన్ని జిల్లాల్లో కలిపి 11000 మందిని అరెస్టు చేసి స్టేషన్లలో ఉంచి తెలంగాణా తల్లి కి సంకెళ్ళు వేసి మరీ ఉద్యమాన్ని నీరుగార్చాలని చూస్తున్నారు... ఇంతేకాకుండా ఈ రోజు తెలంగాణా జిల్లాలనుండి వచ్చి పోయే రైళ్ళను, బస్సులను అధికంగా రద్దు చేయడమే కాకుండా మరి కొన్నింటి దారి మళ్ళిస్తు రైల్ రోకో రాస్తా రోకో లతో ప్రభుత్వం ప్రజలకంటే ఉత్సాహంగా మిల్లియన్ మార్చ్ కోసం సిద్ధం అయింది ....
ఇక దీనిని అణచడానికి ఉపయోగించిన పోలీసు ప్రత్యేక సిబ్బంది ని ఒకసారి చూస్తే.....
CRPF , CISF వంటి ప్రత్యేక కేంద్ర బలగాలతో సహా వేల సంఖ్యలో అదనపు పోలీసు సిబ్బంది ని ఉపయోగించిన ప్రభుత్వం... మోతంగా 12000 కమీషనరేటు సిబ్బంది తో పాటు ఇతర ప్రాంతాల్లోని వివిధ జిల్లాల నుండి మోతంగా 100 అధికారులతో మొహరించి హైదరాబాద్ సిటీ మొతాన్ని పోలీసు దిగ్భందం చేసారు...
వీరితో పాటు 4000 మందితో కూడిన 8 APPSC బెటాలియన్లను , 6 ర్యాపిడ్ యాక్సన్ ఫోర్సు కంపెనీలు , 3500 మంది పారా మిలటరీ దళాలు, 9000 అదనపు సైబరాబాదు పోలీసుల మొహరిమ్పులతో పాటు 55 ప్రత్యేక చెక్ పోస్టులను ఏర్పాటు చేసిన దానిని బట్టి చూస్తే, ప్రభుత్వం తెలంగాణా ప్రజల కాంక్షను ఏ విధంగా అణగదొక్కాలని చూస్తుందో ఇంత కన్నా రుజువేం కావాలి...
ఏది ఏమైనపటికి మరోసారి తెలంగాణా ప్రజలు వారి పవర్ ఏంటో చుపెత్తకుండానే, ప్రభుత్వం తనకు తనే తెలుకొన్నా, ప్రతి తెలంగాణా వ్యక్తి మరో సారి తన సత్తా చూపడానికి తయారవుతున్నాడు.. ఈ మధ్య కాలంలో హైదరాబాద్ లోని తెలంగాణా వాదులు కూడా రోడ్ల పైకి వచ్చి ఉద్యమం చేస్తున్న సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాము,, ముఖ్యంగా మొన్న జరిగిన రెండు రెండు రోజుల బంద్ అనుకున్న దానికంటే సూపర్ హిట్ అవడం ఒక ఉదాహరణ... అదే విదంగా ఈ సారి కూడా మరోసారి మన హైదరాబాద్ లోని తెలంగాణా వాదులంతా రోడ్లమీదకోస్తారు...
జై తెలంగాణా... జై జై తెలంగాణా...
మీ,
దీపం

Tuesday, March 8, 2011

పోలీసుల దిగ్భంధంలో తెలంగాణా యూనివర్సిటీలు

మరోసారి పోలీసుల దిఘ్భంధం లో ఉస్మానియా, కాకతీయ యునివెర్సిటీలు , పోలీసు స్టేషన్లలో విద్యార్థులు...
మరో పక్క అన్ని జిల్లాల్లోని తెలంగాణా నాయకుల అరెస్టులు...
ఇదేనా మన ప్రజాస్వామ్యం... ???
ఒక్క విషయం గుర్తుంచుకోండి... అరెస్టులతో ఆపలేరు తెలంగాణా ఉద్యమాన్ని...
144 ,104 సెక్షన్లతో అడ్డుపడలేరు మిల్లియన్ మార్చ్ ...
జరిగి తీరుతుంది మిల్లియన్ మార్చ్ ... జిల్లాల్లోని తెలంగాణా వాదులను అర్రెస్తులతో ఆపితే, హైదరాబాద్ లోని తెలంగాణా వాదులంత రోడ్లమీదకోస్తారు... హైదరాబాద్ లో ఉద్యమ తీవ్రత లేదంటున్న వారికో మంచి గుణపాటం చెప్తారు....
చివరి చరమాంకం లో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు....

మీ,
దీపం

Sunday, March 6, 2011

ఉద్యమ తీరు మరబోతున్నదా....

ఉద్యమ తీరు మరబోతున్నదా....
అవునండి, నిజమే ఇది మరి... నాకీ డౌటు ఎందుకోచిందా అనేదే మీ డౌటు కాదు...
ఉద్యమాన్ని అతి దగ్గరగా, అత్యంత ఆసక్తితో చూసే ఎవరికైనా ఈ మధ్య జరిగిన జరుగుతున్న సంఘటనలను చూస్తే ఈ అనుమానం రాకపోదు..
సంఘటనలు ఎన్ని ఉన్న నేను ఇక్కడ కొన్నింటిని మాత్రమే వివరిన్చదలచుకున్న..
మీకు తెలిసిందే కదా మార్చ్ 10 న తెలంగాణా జాక్ హైదరాబాద్ లో million మార్చ్ ప్రకటించింది. దీనికి అన్ని పార్టీల వారు వారి వారి పార్టీ జెండాలను పక్కన పెట్టి పాల్గొనేందుకు సిద్ధం అవుతున్నారు .. దేనిని అనగాదోక్కదనికై ప్రభుత్వం, సీమంధ్ర నాయకులు వారి వారి ప్రయత్నాలు వారు చేస్తున్నారు.. ఇది ఇంతటితోనే ఆగిపోక పోలీసు వ్యవస్థను కూడా ఇందులోకి లాగే ప్రయత్నం జరుగుతున్నది.. DGP అరవింద్ రావు ఈ million మార్చ్ కి అనుమతి లేదని ఎక్కడి ప్రజలను అక్కడే కట్టడి చేయాలనీ జిల్లా పోలీసు ఉన్నత అధికారులకు, జిల్లా SP లకు ఆదేశించడం కూడా ఇందులో బాగంగానే జరుగుతుంది... దీనికి ప్రతి సవాలుగా తెలంగాణా జాక్ కన్వీనర్ ప్రొఫ్. కొదండ్రామ్ అనుమతి తీసుకొం అంటూ దిక్కర స్వరం వినిపించారు.. ఇందులో మనం కొన్ని విషయాలను గమనించాల్సి ఉంది.. ముఖ్యంగా ఇన్ని రోజులు ప్రజలు శాంతియుతంగా తమ తమ నిరసనలను వెలిబుచ్చి ఇక ఎంత చేసిన దున్నపోతుల నిద్రపోతున్న ప్రభుత్వం స్పందించడం లేదని, తమ ఉద్యమానికి కొత్త మలుపు ఇవదలిచారుగా మన భావించవచ్చు.. ఇందులో బాగంగానే ఈ వాఖ్యలు.. ఇంత కాలం ప్రభుత్వం పోరాటం చేసిన మన తెలంగాణా ప్రజలు, ఇక పోలీసులతో కూడా పోరాడటానికి సిద్ధం ఆతున్నారు... మరో పక్క పోలీసుల్లో కూడా తెలంగాణా వారు ఒక వర్గం గా ఏర్పడే సూచనలు జరుగుతుండగా, వారిని ఉన్నతాధికారులు అనగ దోక్కుతున్నరనడంలో కొత్తేమీ లేదు..ఏది ఏమైనపటికి ఉద్యమ తీరు మారబోతున్నది అని చేపటానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు...
ఇదంతా ఒక ఎత్తు అయితే ఇదే సమయంలో ఢిల్లీ లో మరో ప్రకటన..
JNU లోని తెలంగాణా విద్యార్థుల గళం అన్ని రాష్ట్రాల్లోని వివిధ విద్యార్ధి సంఘాలతో కలిసి జాతీయ స్థాయిలో solidarity committee formation మరియు మార్చ్ to పార్లమెంట్ మార్చ్ 10 , 11 వ తేదీల్లో. ఈ కార్యక్రమంలో మొత్తం 15 విద్యార్థి సంఘాలు నిమగ్నమై ఉండగా మరి కొన్ని సంఘాలు మేము సైతం అంటూ ముందుకు రాబోతున్నాయి... మోతంగా 16 రాష్ట్రాల నుండి విద్యార్థులు భారీ సంఖ్యలో రాబోతున్నారు. మార్చ్ 10 న దేశవ్యాప్తం గా ఉన్న అన్ని విద్యార్థి సంఘాలను ఏకం చేస్తూ solidarity committee formation JNU లో జరుగనుంది, ఆ తర్వాత 11 వ తేదిన విద్యార్థులంత కలిసి పార్లమెంటు వైపు రాలీ గా వెళ్తారు.. ఇలా ఉద్యమం దేశవ్యాప్తం అయ్యేవిధంగా జరుతున్న ఇలాంటి వాటిని చూస్తూ ఉంటె ఖచ్చితంగా ఉద్యమ ప్రస్థానం మారబోతోంది అనడానికి బలం చేకూరుతోంది...
ఏది ఏమైనపటికి తెలంగాణా సాధన అనేదే ఇక్కడి ప్రజల బలమైన ఆకాంక్ష అని, దాని సాధనకై ప్రజలు ఎంతకైనా తెగిస్తారు అని మరో మారు చెప్పనవసరం లేదేమో...

అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో నీతి జాతి లేని రాజకీయాలు ప్రజాస్వామ్యానికి కళంకం కాదా... ??

ఫ్రపంచంలొనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశముగా పేరొందిన మన భారత దేశం మీద ప్రపంచంలోని గొప్ప గొప్ప ప్రజాస్వామ్య వాదులకు ఈ మధ్య ఒక పెద్ద డౌట్ వస్తోంది.. అదేమంటే అసలు ఇది ప్రజాస్వామ్య దేసమేనా అని??
ఆను మరి ఈ డౌట్ రావటంలో తప్పేమీ లేదు ఎందుకంటే ఈ మధ్య కాలంలో జరుతున్న రాజకీయాలు అలా ఉన్నాయి.. నేతి జాతి లేని రాజకీయాలను భారత దేశ ప్రజలు చూస్తున్నారు.. ముఖ్యంగా తెలుగు భాష మాట్లాడే ప్రాంతములో అయితే మరీ దరిద్రం గా ఉన్నాయి అని కొత్తగా చెప్పనవసరం లేదు....
ఈ మధ్య జరిగిన కొన్ని ఆసక్తి కర విషయాలను ఒకసారి మీ ముందుకు తీసుకువస్తే ముఖ్యంగా..

తెలుగు వారి ఆత్మ గౌరవం అంటూ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకముగా పుట్టిన TDP పార్టీ, ఇపుడు అదే పార్టీ తో దోస్తీ కట్టింది.. అది కూడా ఒకే ఒక్క MLC సీటు కోసం. ఎన్నికలు వొస్తే చాలు ఒకరి మీద ఇంకొకరు దుమ్మెత్తి పోసుకొనే ఈ రెండు పార్టీలు ఇపుడు భాయి భాయి అనే స్థాయిలో జత కట్టాయి... ఇక ఆ పార్టీ అధినేత (CBN ) అయితే కాంగ్రెస్ పార్టీ కి పెద్ద బద్ద శత్రువు అని అనేవాళ్ళు... అయినా ఈ రాజకీయాలను నేనే సరిగ్గా అర్ధం చేసుకోవట్లేదేమో... ఇంకా CBN కి అందరికి ఉన్నట్లే రెండు కళ్ళు ఉన్నాయి కాని అవి అందరిలా ప్రపంచాన్ని చూసేవి మాత్రం కావండోయ్ ... ఆ రెండు కళ్ళు ఏంటంటే ఒకటి తెలంగాణా, ఇంకోటి సమైక్యాంధ్ర... ఇక్కడ మనం ఒకటి అర్ధం చేసుకోవాలి.. సమైక్యాంధ్ర అంటే Seema+ ఆంధ్ర అని తన దృష్టిలో మాత్రం ... ఈ రెండు కళ్ళలో ఒక కంటికి చూపు సరిగ్గా ఉండదు తెల్సా... ఆ కంటితోనే తెలంగాణా ప్రాంతాన్ని చూస్తున్నాడు మన బాబు... మన అన్నాను అని ఇంకోల అర్ధం చేసుకోకండి.. ఎంతైనా తెలుగు వాడు కదా, అందులోను తెలుగు వాడి ఆత్మ గౌరవం కోసం పుట్టిన పార్టీకి అధినేత.. అధినేత ఎలా అయితే మనకేంటి కాని మనం మన విషయం మాట్లాడుకుందాం...
ఇలా తన పార్టీ నాయకులను వేర్వేరుగా చూస్తూ తన కంట్రోల్ లో పెట్టుకుంటున్న బాబు మంచి తెలివి గల్లోడు ...తెలంగాణా ప్రాంత TDP నాయకులూ ప్రజల ఒత్తిడి తో JAI తెలంగాణా అంటుండగా SA కి చెందిన నాయకులను సమైక్యంద్ర అనండి ani బయటికి చేపకపోయిన అంతర్గతంగా వాళ్ళను రెచ్చగొడుతూ తన పబ్బం గడుపుతున్నాడు...
అంతే కాకా తెలంగాణా ప్రాంత నాయకులతో TRS పార్టీ ని, KCR ని బండ భూతులు తిట్టందని ప్రేరేపించి తెలంగాణా వారి మధ్య విభేదాలు సృష్టించాలని చూసాడు... అందులో కొంతవరకు తాను సక్సెస్ అయినా తాను తవ్వుకున్న గోతిలో తనే పడిపోయే స్థితిలో ఉన్నాడు ... ఇదంతా తెలియని మన తెలంగాణా TDP నాయకులూ కెసిఆర్ ని, TRS ని బండ భూతులు తిట్టారు. ముఖ్యంగా, TRS కాంగ్రెస్ ఒకటే అని, KCR కాంగ్రెస్ పార్టీ తొత్తులా పనిచేస్తున్నాడు అని ఇంకా తెరాస, KCR వి నీతి జాతి లేని రాజకీయాలు అని.. ఏవో ఏవో బాగానే తిట్టారు అనుకోండి... ఇవన్ని ఎందుకు తిట్టారు అంటే కాంగ్రెస్ అంటే TDP వారికి పడదు కనుక... మరి ఇలా తిట్టిన ఆ నాయకులూ ఇపుడు కాంగ్రెస్ తో దోస్తీ కట్టడాన్ని ఎలా జీర్నించుకున్తున్నారో... ఇపుడు అసలు విషయం మాట్లాడుకుంటే అసలు నీతి జాతి లేనిది ఎవరికీ...?? ఇలాంటి TDP నాయకులకా.. లేక ప్రజల పక్షాన, ప్రజల కోసం పోరాడుతున్న తెరాస, KCR కా ...?? అసలు సిగ్గు, సారం లాంటివి ఎమన్నా ఉంటె ఇలా చేస్తారా....?? అయినా మన రాజకీయ నాయకులకు సిగ్గు సారం లాంటివి లేవు లే... ఇది ఒక ఘటన మాత్రమే..
ఇంకోటి చూస్తే-

మనది ప్రజాస్వామ్య దేశం, ప్రజల మాటే ప్రభుత్వం మాట, ప్రజల కోసమే ప్రభుత్వం పని చేయాలి, ప్రజలే ఇక్కడ ప్రభువులు అన్నా లోక్ సత్తా (పార్టీ గురించే సుమా.... నాకు తెల్సి ఒకపుడు లోక్ సత్తా అని ఒక అర్గానైజేసన్ ఉండేది ప్రజల కోసం అవినీతి మీద చాల బాగా పోరాటం చేసారు, కానీ ఇపుడు ఏకడ కూడా కనిపిస్తలేదు.నేను దాని గురించి మాట్లాడటంలేదు...) గురించి కూడా కొంచెం మాట్లాడుకోవాలి...
నీతులు చేపడం లో పెద్ద దిట్ట ఈ JP ... ఒకరికి నీతులు చెప్పు సామీ అని కూడా అడగనవసరం లేదు.. నీతులు చెప్పేవాళ్ళకు నోబెల్ ప్రైజ్ ఇచ్చే అవకాశం ఉంటె మన JP కే ప్రతి సంవత్సరం నోబెల్ ప్రైజ్ వస్తుంది.... ఇలాంటి JP కి తెలంగాణా కు జరిగిన జరుగుతున్న అన్యాయం కనిపించడం లేదంటే అది తన గొప్పతనం మరి... ఎపుడో జరిగిన అన్యాయం గురించి కాకున్నా ఇపుడు తన కాళ్ళ ముందు జరుగుతున్న అన్యాయాన్ని కూడా ఎదురించలేని అసహాయత తనది... అది అసహాయత కాదు... ఇంకేదో.. ఎంత అయిన ఆంధ్ర ప్రాంతానికి చెందిన రాజకీయ నాయకుడు కదా.. తన మనసుకు తెల్సు ఇక్కడ అన్యాయం జరుగుతుంది అని... కాని ఎదురించాడు... ఇంతే కాదు ఈ మధ్య జరిగిన ఒక సంఘటన ఒకటి చూస్తే , అదేనండి మల్లేషు JP తలకాయ సరిగ్గా పని చేస్తాలేదని ఒకసారి అసలు మెదడు ఉందొ లేదో చూద్దామని అలా తల మీద తన చేయి
పెట్టిండో లేదో కొట్టాడు అని అరిసారు అందరూ పార్టీలకు అతీతంగా ... కొంత మంది ప్రజాస్వామ్య వాదులు అయితే ఏకంగా ప్రజాస్వామ్యానికి మచ్చ ఈ ఘటన అన్నారు.. అసలు ప్రజాస్వామ్యానికి అర్ధం ఏంటో?? నన్ను మాత్రం అడగకండిఓయ్ ... నేను చిన్నపుడు చదువుకున్న ప్రజాస్వామ్యం అర్ధం వేరు, ఇపుడు చూస్తున్న ప్రజాస్వామ్య వేరు.. ఈ విషయం లో నాకు పెద్ద కాంఫుజను..... ప్రజాస్వామ్యం అనేది ఎపుడు గుర్తుకు రాని వారికి కూడా ఇపుడు ప్రజాస్వామ్యానికి ఏదో ఐనటు అరిసారు... ఇలా అరవడం అన్నది అసలు కళంకం అన్నది నా ఒపినిఒను ...
దీనిని ఇంతటి తో ఆపి ఇంకో విషయం గురించి మాట్లాడుకుంటే... అదేనండి ముఖానికి ఇంత రంగు పూసుకొని నటించు వయా చిన్నజీవి అని అంటే (సారీ, చిన్నజీవి అనడం అలవాటు అయింది, నిజానికి చిరంజీవి అనుకోండి మీ త్రుప్తి కోసం ) రాజకీయాల్లో కొచ్చి ఏదో పీకుత పొడుస్తా CM అవుత అంటూ ఓ పెద్ద పెద్ద భారీ డైలోగులు చెప్పి చివరికి ఏం చేయాలో తోచక ఎవరినైతే తిడుతూ వోట్లు సంపాదించుకోవాలి అనుకున్నాడో వాళ్ళ తోనే కలిసిపోయాడు మన చిరు జీవి,,, మళ్ళీ సారీ చిరు జీవి అన్నందుకు.. ఈ పేర్లు కూడా కరెక్టే అనుకోండి...పార్టీ పెట్టె సమయంలో చెప్పిన డైలాగులను ఏదైనా సినిమాలో పెట్టి ఉంటె మంచి భారీ హిట్ సినిమా అయి ఉండేది.. పాపం.. అయినా ఏముంది లెండి ఆ ఒక సినిమా కు వచ్చే కల్లెక్షన్ల కంటే ఎకువే సంపాదించాడు లెండి బామ్మర్ది తో కలిసి... అలా కాంగ్రెస్ అవినీతి మీద పుట్టిన ఈ పార్టీ కూడా చివరికి అందులోనే విలీనం అయిపొయింది ...
ఇలా అవినీతి అంతం కోసం పుట్టిన పార్టీలన్నీ ఇలా పుట్టి అలా అవినీతి సామ్రాజ్య పార్టీలో కలిసి పోతుండడం అనే దానిని మనం ఎలా అర్ధం చేసుకోవాలో ఏమో...
ఇవన్నీ ఒక రాష్ట్రము లోనివే సుమా ఇలాంటివి ప్రతి రాష్ట్రం లోనూ ఉన్నాయి..
వీటిని ఎదుర్కోవడానికి మన దేశానికి మరో బాపూజీ కావాలేమో, కాదు మరో భగత్ సింగ్ పుట్టాలి, మరో సుభాష్ చంద్ర బోస్ పుట్టాలి.. మరో రాయ్ పుట్టాలి...మరో ఝాన్సీ రాణి పుట్టాలి..
ఎవరో పుట్టాలి ఎవరో ఏదో చేయాలి అనడం కాదు.. పుట్టేది ఎకడో కాదు, చేసేది ఎకడో కాదు... అంత మన దగ్గరే.. భగత్ సింగ్ ఎవరో కాదు, బోస్ ఎవరో కాదు, ఝాన్సీ రాణి ఎవరో కాదు, రాయ్ ఎవరో కాదు.. వాళ్ళంతా మనలోనే ఉన్నారు.. మనలో ఉన్న వాళ్ళను మేల్కొలపాలి.. ఒక అవినీతి రహిత ప్రపంచాన్ని నిర్మించడం లో మనము కూడా భాగస్వామ్యులం కావలి.. భాగస్వాములం అవడం కాదు మనమే మొదలు పెట్టాలి.. మొదటి అడుగు మనదే కావాలి.. మనం చదువుకున్న వాళ్ళం, మంచి ఏదో చెడు ఏదో గుర్తున్చాగాలిగిన వాళ్ళం ...
రావాలి మనం రాజాకీయల్లోకి .. చూపించాలి మనం మన సత్తా ఏంటో...
నవ భారత దేశ నిర్మాణానికి మనం మున్డుండం ... చేయి చేయి కలుపుదాం ...
ఇదంతా చదువుతుంటే మీకో అనుమానం రావొచ్చు...ఇదంతా రాసిన నేను ఒక రాజకీయ నాయకుణ్ణి అని?? మరో JP ని అనే డౌట్ కూడా రావోచు.. ప్లీజ్ దయచేసి అంత గొప్ప మహానుభావులతో మాత్రం పోల్చకండి నన్ను.. నేనో సామాన్య జీవిని.. ప్రజాస్వామ్యం లో జరుతున్న సంఘటనలను చూసి నాలోని భాదను ఇలా చెప్తున్నా అంతే..
నేనో పెద్ద రైటర్ ని కాకపోయినా. ఏదో అలా రాసాను అంతే...
ఇట్లు మీ,
దీపం..

Friday, March 4, 2011

Student march to parliament on 10th and 11th march

Invitation to Convention for the formation of Students’ Solidarity Committee for Separate Telangana
10am – 5pm, 10 March 2011, JNU, New Delhi

Students’ March to Parliament
12 pm, 11 March 2011, Mandi House to Parliament Street

The world has been very much familiar with the history of the heroic sacrifices of the Telangana people. The struggle for a separate Telangana state is one of the most longstanding democratic movements of the Indian subcontinent. From the very inception of Andhra Pradesh in 1956 the people of Telangana have demanded a separate statehood. The more than five decades of continuous struggle have resulted today in the recognition and acceptance of a separate Telangana as a necessity among the people of the country. There is a wide acceptance among the rest of Andhra Pradesh that its people have a right to a separate statehood because they have been economically, socially, politically and culturally exploited and discriminated against by the rulers of Seemandhra. Clearly, it is only with the formation of a separate Telangana that a concrete step towards resolving the problems of the region can be taken, and a true people-oriented process of development can be initiated.

The present Telangana movement is in a continuation to the movement that had begun seven decades ago, with a great vision to liberate Telangana people from the clutches of Nizam’s brutal autocracy and the system of Vetti. The people of Telangana were made to join the Indian Union on 17 September 1948, while the people of India is said to have got independence from British colonialism on 15 August 1947. This political change created the necessary conditions to exploit the region with the establishment of Seemandhra colonial rule in the form of government employees from Seemandhra, who replaced the Nizam rule. Seeing that the independent Hyderabad state has been a potential source of natural resources like coal, iron-ore, limestone, forest wealth, water resources and the cheap labour of hard-working Telangana people, Seemandhra capitalists and feudal landlords who constitute the ruling classes usurped the Telangana region. Against the recommendations of Fazl Ali State Reorganisation Committee Report which recommended Hyderabad state to be independent, and against the aspirations of the Telangana people, Andhra Pradesh state was formed, merging Seemandhra region with Telangana region. All the GOs, committees and agreements that have been made, right from the Gentlemen’s Agreement in 1956 to GO 36, 6 Point Formula, 8 Point Formula, Regional Council, Presidential Order, 610 GO, Girglani Commission, Pranab Mukherjee Committee, Rosaiah Committee and even the most recent Sri Krishna Committee, are the attempts of the Government of India to betray the democratic demands of the Telangana people, who have consistently fought against the secret plot behind the ‘Telugu nationality’.

Above all, in the United Andhra Pradesh, Telangana people are to lead the existence of mere ‘second grade citizens’. The people of Telangana region, which is rich in natural resources, are to migrate and live as bonded labourers. The exploitative policies followed by the central government in collusion with the regional ruling classes of Seemandhra has led to the scarcity of water for both drinking and cultivation purposes, even when Telangana has several perennial rivers like Krishna and Godavri running through the region. The negligence of the Seemandhra government to develop better irrigation and safe drinking water facilities can be identified as the cause for the increased number of farmers’ suicides and Fluorosis cases in the Telangana region. It is due to nearly 3 lakh Seemandhra employees, who illegally occupied several governmental positions reserved for Telangana people by producing fake local certificates, graduates and post graduates from Telangana are compelled to become auto drivers, day-labourers and some even have to leave the motherland for abroad(Dubai, Muscat and Saudi Arabia etc.) to be bonded labourers. It is heart-rending to know that the parents, wives and the children of the dead in abroad are not in a position to pay the last sight to their beloved. Telangana region has now become dried and decimated due to internal colonial exploitation by the Seemandhra ruling classes that began in 1956 with its merger with Seemandhra. Threat of loosing language, dialect and the culture, Telangana people have been fighting against economic, political and cultural exploitation to have independence from Seemandhra domination. In 1953, Jawaharlal Nehru, then Prime Minister of India, rightly identified the expansionist designs behind the idea of Visalandhra and at a public meeting in Nizamabad compared the conditional merger of Telangana and Seemandhra with the matrimonial alliance which always have a provision of divorce in case the alliance becomes unwanted for any party. Even after seeing through the reasons behind the merger, Nehru gave in to the Seemandhra ruling classes’ interests, and did a historic injustice to Telangana by approving the merger. Subsequent Indian rulers, be it Indira Gandhi or presently Sonia Gandhi, followed the path of Nehru to act against Telangana.

Telangana movement is a democratic movement for self- respect, liberty, equality and fraternity, for which the people of Telangana have been fighting for decades. Going against the people’s justified and democratic demand, the Central Government under the leadership of Indira Gandhi and the State Government under the Seemandhra leader Kasu Brahmananda Reddy had brutally suppressed the people’s movement in 1969 firing bullets, killing around 400 students and putting thousands behind the bars. In this way, the government has acted to serve the interests of only the ruling classes, employing different repressive methods to put an end to the people’s heroic battle. They have drenched Telangana region with bloodshed, violating even the fundamental right of its people to live. While Telangana movement has followed a non-violent path and remained under the constitutional limits, the government has been most violent, undemocratic and unconstitutional in addressing it.

In 1971 the Telangana people overwhelmingly cast their votes to TPS, a party that went to people with the single demand for separate Telangana state. The people made TPS victorious with a thumping majority, electing 11 parliamentary members out of its 14 candidates. This continued in 2001, 2004, 2006, 2007, 2009 and 2010 elections when TRS party went with the same demand and the people of Telangana expressed their aspirations repeatedly. But, all the political parties, particularly the Congress party, have been successfully using the people’s emotions and their heroic sacrifices to play their political games in order to come to power. The Congress party, in the 2004 elections, included the demand for separate Telangana in its election manifesto. However, it changed its stand once it came to power, cleverly constituting the Pranab Mukherjee Committee to delay the process of state formation. It again repeated the same in the 2009 elections. But bowing down to the latest phase of the movement with participation of people from all walks of life, including students and advocates, the Home Minister of India Mr. P. Chidambaram officially announced on 9 December 2009 the initiation of the process of introducing the Telangana Bill in the parliament. But the Congress, influenced by the Seemandhra ruling classes, once again repeated its history of betrayal and changed its own statement in less than 15 days of announcement.

For the past 14 months, the ruling Congress has imposed a military rule in Telangana by deploying large numbers of paramilitary forces all over the region. It has appointed a cruel and anti-people ex-police officer, Mr. Narasimhan, as the governor of Andhra Pradesh in order to turn Telangana region into a sea of blood. These paramilitary forces have been lathi-charging the protesting students, firing rubber bullets and tear gas shells on them and filing false cases against the students to put them behind bars. These armed forces have occupied colleges, universities and the student hostels (including those of the girls), torturing the students with their inhuman behaviour and derogatory language. These forces are not even hesitant in assaulting the media persons who try to report the police atrocities on the students and the common people. The Journalists’ Forum has marked its protest against these actions. The police have also tried to break the movement from inside by acting as agent-provocateurs, joining the student protestors in civil dress and pelting stones at their own fellow policemen, and later charging the students for violence. In these ways, the government has been converting the universities into war zones, and are playing with the lives and aspirations of the Telangana people. In this critical situation, many of the dejected youth, who had dreams of a bright future in a separate and independent Telangana state, have been committing suicides leaving behind their suicide notes addressed to the rulers. Not less than 600 students have committed suicide so far. While the Congress government has been indifferent to the self-immolation of these students, the leaders of Telangana political parties too are mortgaging the self-respect of Telangana people for their personal political careers. The progressive and democratic sections of the country, all major parliamentary parties of India such as BJP, BSP, CPI, JDU, FB, RPI, excluding CPI(M), and various democratic and people’s organisations have extended their solidarity to the demand of separate Telangana state.

There is an urgent need to stand in solidarity with the people of Telangana in the coming phase of their struggle, and to build up a movement across the country in its support. The students and youth of Telangana have spearheaded the movement with their militant and uncompromising struggle in the past, which have captured the imagination of not only the people of Telangana but also outside. Now is the need to build a broad-based solidarity of students and student organisations across various states and regions with the fighting masses of Telangana, particularly with its students and youth. With the movement now about to enter a critical phase, solidarity of students for a separate Telangana is the need of the hour. It is with this understanding that the students of universities and colleges of Telangana wish to invite you/your organisation to participate in a students’ convention in New Delhi towards forming a solidarity platform where students and students’ organisations across various states and regions can come together with the agenda of fighting for a separate Telangana state. The convention will be followed by a march to parliament demanding that the central government introduce a bill for separate Telangana within the budget session.

● Implement the Central Government’s official statement on separate Telangana state made on 9 December 2009 by introducing a bill in the parliament in the coming budget session!

● Withdraw the paramilitary forces deployed in Telangana region, including university and college campuses!

● Withdraw all the cases that have been filed on the protesting Telangana students, activists and the people!

On behalf of Preparatory Committee
Students’ Solidarity Committee for Separate Telangana

All India Backward Students’ Front (AIBSF), All India Students’ Association (AISA), Democratic Students’ Union (DSU), JNU Forum for Telangana, Manipur Students’ Association Delhi (MSAD), Progressive Democratic Students’ Union (PDSU), Students’ Islamic Organisation (SIO), Students’ Uprising Movement, Tamil Nadu (SUMS), Committee for Peace and Democracy, Manipur (CPDM), Telangana Students’ JAC, Best complements from IISc telangana forum