Monday, February 28, 2011

ఇదండీసంగతి

ఇంటర్ విద్యాడైరెక్టరేట్ లో 7గురు డైరెక్టర్లు ఉండగా,అందరూ ఆంద్రోళ్ళే
ఇంటర్ బోర్డ్ లో 5గురు డెప్యుటీసెక్రెటరీలు ఉండగా,అందరూ ఆంద్రోళ్ళే
4 కోట్ల తెలంగాణ ప్రజల్లో ఒక్కరూ అర్హులులేరా?
----- కే.సీ.ఆర్

రెండు,మూడు రోజుల్లో తెలంగాణపైకేంద్రం సానుకూల ప్రకటన చేయకపోతే రాజీనామా చేస్తా
-------కోమటిరెడ్డి వెంకటరెడ్డి.
సమైక్య రాష్ట్తములో అభివ్రుద్ది ఫలాలు కొందరు పెట్టుబడిదారులకే
దక్కాయని,తెలంగాణలోని పేదలు పేదలుగానే మిగిలారని,ప్రజల ఆకాంక్షను
గౌరవించినపుడే ప్రజాస్వామ్యానికి విలువ.
--------సి.హెచ్.హన్మంత రావు,కేంద్ర
ప్రణాళికాసంఘం మాజీ సభ్యుడు.
ఆర్డీయస్ జలాలతోఫాటు,క్రిష్ణాజలాల వినియోగంఫై,శ్రీక్రిష్ణ కమిటీ ఇచ్చిన
నివేదికలో అర్ధసత్యాలున్నాయి.
------------ఆర్.విద్యాసాగర్ రావు,కేంద్రజలసంఘ
మాజీ ఛీఫ్ ఇంజినీర్.
ముఖ్యమంత్రిగా వై.యెస్.ఆర్.పథకం ప్రకారము, తెలంగాణను దెబ్బతీశారు.
యన్,జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని,మూడు ముక్కలు
చేసి,అందులోంచి,ఉద్యానవన విశ్వవిద్యాలయాన్ని,ప.గో.జిల్లాలో,వెటర్నరీ
విశ్వవిద్యాలయాన్ని తిరుపతిలో ఎర్పాటు చేయించారు.
హైద్రాబాద్ లోఉన్న జే.యన్.టి.యూ.ను, ఒకటి కడపలో,మరొటి కాకినాడలో ఏర్పాటు
చేసే కుట్ర పన్నారు.
--------హరీశ్ రావు,ఎమ్.ఎల్.ఏ.

__._,

లగడపాటి పక్కా 420 అని మీరు బావిస్తున్నారా-- ?

కోటి రతనాల వీణ రుద్రా రాగం పలుకుతుంది

దోపిడీ దొరలకు అభద్రతా పెరుగుతుంది (దొరలూ = లీడర్లు )

అర్ధ శతాబ్దంగా నన్ను దోచుకునీ దాచుకునీ

నా సంతానం అమ్బిలికేదిస్తే చికెన్ ముట్టన్ లు తింటున్నారు

నాకోసం గళం విప్పిన తోలి బిడ్డ భీముడే (కొమరం)

ఇప్పుడు గలమేట్టిన ప్రతి బిడ్డా అపర భీముడే

నన్ను వ్యతిరేకించిన ప్రతివోక్కడు సైన్దవుడు దుర్యోధనుడే

కోటి రతనాల వీణ రుద్రా రాగం పలుకుతుంది

దోపిడీ దొరలకు అభద్రతా పెరుగుతుంది

ఎంత కాలం మన్నించాను ఎంతకని క్షమించానూ

నన్ను దోచే వాళ్ళ పాయి ఆగ్రహం లేదు కాని

నా బిడ్డలా అశ్రువులు తుడిచే నాతుడేది?

నన్ను బంధ విముక్తురాలిని చేసే శ్రీ కృష్ణుడు ఏడి?

ఎన్నాళ్ళు ఈ చేర బ్రతుకు ? ఎప్పుడు నాకు చేర విముక్తి ?

కోటి రతనాల వీణ రుద్రా రాగం పలుకుతుంది

దోపిడీ దొరలకు అభద్రతా పెరుగుతుంది

కొందరు నా కడుపునా చెడబుట్టి, దొంగల చేతుల్లో ఆడుతున్నారు

బిడ్డ నీ తల్లి ఆర్తనాదాలు నీకు వినిపించవా?

నా రోదనతో కతోరులే కరుగుతూనే నువ్వెందుకురా మాట్లాడవు?

నీ పాయి ఇంకొక్క తల్లి భూతమేక్కింది, అది తెలుగు తల్లి భూతం

నాకు అది సవతి కాదు, నాకు అది సాటి రాదు, ఆ తల్లి ఒక భ్రమరా

భ్రమల నుంచి బయటపడు, కన్నా తల్లిని గుర్తించు

పుత్రుదంటే పున్నమ నరకం నించి కాపాడేవాడు

నాకీ లోకంలోనే నరకమిచారు, తల్లిని రక్షించు నీ తల్లిని రక్షించు

కోటి రతనాల వీణ రుద్రా రాగం పలుకుతుంది

దోపిడీ దొరలకు అభద్రతా పెరుగుతుంది

నా కోసం ప్రనత్యగాలు ఎందుకురా? తల్లి ముందు బిడ్డ పొతే తల్లికి సంతోషమ?

ఎందుకురా నన్నిన్ని బాధలు పెడతారు? పరాయి వల్ల చిత్రవధ సరిపోదా?

నన్నింకా బాధ పెడతారు? ఎందుకురా మీరు ఆత్మహత్యలు చేస్తారు?

నా కోసం పోరాడురా చావకు నీ తల్లిని దోచే వాడిని చావదన్ను

ఈ తల్లి దీవెనలతో కల కాలం వర్ధిల్లు, వెళ్ళి నన్ను సాధించు.

A Bunch of Bullshitters!

The Justice Srikrishna Committee (JSC) has produced a report about Telangana which is “not worth a bucket of warm spit”, as John Nance Warner, the Vice President of the USA under John D Roosevelt, famously said on one occasion, albeit in a different context.

The JSC members listened to the story of Telangana and Andhra Pradesh for eleven months, like the legendary listener who listened to the story of Ramayana day after day for eleven months. At the end, the Ramayana listener asked the narrator: Pray tell me, sir, what is the relationship of SEETHA to Lord RAMA? Like him, the Committee could not under stand, after listening for eleven long months, that the Telanganites do not want to stay united with the Seemandhraites because of the irreconcilable differences that they want self-rule in Telangana, their erstwhile Hyderabad state, which was an independent entity for nearly 224 years before the unfor tunate merger with Vishalandhra in 1956.

Greed, power lust, and cultural arrogance of Seemandhra brought the state to the present crisis. It is not going to be possible now to stay together. The people of Telangana told the Committee again and again that, for fifty six years, they had committees, councils, pacts etc with statutory guarantees but all were ignored or violated systematically and deliberately by the Seemandhra rulers. The councils etc look good on paper but they don’t work in practice as the people of Telangana have realised to their great cost.

If they, the Committee, really seriously understood this problem, they would not have proposed the same solution again as they did in the proposition 6: United AP with councils etc. If they were really sincere, they would not have put in counter arguments against Telangana while proposing a separate Telangana state, thus trying to neuter their own proposal.

To my knowledge, none of the commit tee members was lobotomized to produce such an intellectually confused, confusing, and self-contradictory report. So, the reasons and motives can only be guessed at as to why the Committee produced such an awful report – a stinking-armpit of a document.

Could they have been influenced by money, gifts, or lucrative deals? No! They looked comical at times but they didn’t look corrupt. The roly-poly Mr.Duggal and the slimline Justice Srikrishna did look like the famous comic duo, Oliver Hardy and Stan Laurel, but without the laughs or the wisecracks, except for one line: “Our report will please everyone!” This was a most hilarious line and they kept repeating it throughout the eleven month period they toured the state.

Some laugh lines are like that. You have to have a heart of stone not to laugh. The situation was simply not amenable for such a statement.

The whodunit

There are three organised groups which could have had a hand in the fiendish skulduggery perpetrated against Telangana: The Seemandhra leaders the Congress party at the centre and the biased bureaucratic babus who fed skewed and choreographed information to the committee.

Here, I will have to disagree with Sherlock Holmes who has been assisting us to unravel the mystery of the malevolence of the report against Telangana. Sherlock thinks that the Tamilian with extensive Andhra connections did it. But which Tamilian? Unfortunately, Sherlock had to leave for London in a hurry before he could nail the guy who has been secretly aiding the Seemandhra leaders. Sherlock promised to come back to investigate The Sign of the Five – that’s what we have tentatively decided to call this mystery. Sherlock, you remember, previously featured in The Sign of the Four by Arthur Conan Doyle which had strong Indian flavour.

What about the Rasputin from over the other border who has been in cahoots with Andhra leaders for a long time and is a dab hand in political black arts, actively working with them behind the scenes against the interests of Telangana? He is certainly a strong suspect and has been on the short list as one to watch for a long time – a very slippery customer.

Could t h e C et r a l Governm ent have a c t i v e l y encouraged t h e Committee to produce a report which will keep the issue in a limbo? No! The Com mittee is unimpeachable, and impervious to any such influence or corruption. So, we come to the inevitable conclusion that the committee is plain stupid and that they did it all by themselves – to be totally irrelevant to the solution of the problem.

Super trash

The Justice Srikrishna Committee members (two permanent ones and three part-timers) have not proved themselves to be a fab five as some had hoped for. They have turned out to be a bunch of bullshitters, but it is utterly out of order to think that bullshitters are of no use at all to a society or to a government. Sometimes they can be useful. Here are some of the ways the JSC proved useful: 1 Following the December 9, 2009 announcement from the centre, stating that the process for the formation of a separate Telang ana state had started, there was panic, perturbation, and severe p u b l i c anxiety in Seemandhra. They wanted wider consultations. So the centre had to satisfy this demand with a committee.

2 The Seemandhra leaders were confident they could manipulate the outcome of the committee’s deliberations through various means available to them. In this, they feel, they have been successful.

3 The central government wanted to back away from the explosive issue they wanted to remove the immediate threat to its survival from the mass resignations of the Seemandhra MPs and MLAs and they wanted to delay the resolution of the problem until wiser counsels prevailed among the Seemandhraites or until such time that they could come to terms with the inevitability of the formation of Telangana state. It has served this purpose and the issue, we reckon, is moving in this direction.

Although what the Committee has written is proving irrelevant for us in Telangana, it helped to let the steam out of the Seemandhra pressure cooker. They, the Seemandhraites, can now see that their manipulated victory (with the JSC report) is proving hollow that we still insist they give back what is legitimately ours that we are not going to give up on our demand. The Seemandhra leaders can now go to the people in their region and say that they have tried but Telangana insists on going its own way and that the time has come to resolve the issue.

I’m not going to analyse the report in minute detail. There are ma ny startling omissions – and some high profile struggles such as the 1969 Telangana agitation were barely mentio ned. They deliberately glossed over many of the Telangana grievances, and skirted round the misdeeds perpetrated by the Seemandhra leaders against the region over five decades. It only steels us to carry on the struggle for Telangana with renewed vigour, which we most certainly shall.

After 54 years of Seemandhra domination, we can now see through their every trick and fraud, but, to rephrase a wellknown aphorism, the race is not always to the fraudsters, or the battle to the rich. We, in Telangana, may not be able to match Seemandhra’s wealth and influence. But we have the courage we have the heart we have the will and above all, we have justice on our side to win the final battle. As Horatius, the famous Roman defending ancient Rome against huge odds said: “And how can a man die better Than facing fearful odds For the ashes of his fathers And the temples of his gods?” Like him, we shall fight for our Telangana, the land of our fathers’, our fathers’ ashes, every which way possible. In the coming days we shall see which Telangana MLA or MP will continue to sell his soul and the blood of the students and the martyrs of Telangana for the scraps and the bones the Seemandhra power-wielders may throw at him or her like they throw at their dogs. For our part, it does not matter which Tamilian or which Rasputin from over the border or which Rahu and Kethu bite us. We shall hold firm – and fight, until we achieve our legitimate goal.

By Dr.V.Ram Mohan

(The author is a doctor, a poet, and a political commentator) vrrao_05@yahoo.com The way forward ?


Sunday, February 27, 2011

TG NAMMAKA DROHAM AWARDS

Best Actor: Manmohan Singh

Best Actress: Sonia Gandi

Best Character artists: Pranab Mukarji, Veerappa Moily

Best Comedian: DS & Chiru

Best Jump: Devendar Goud (TDP-NTP-PRP-TDP)

Best Consultancy: TG CONGRESS CABINET (Antha Meme chesipedtham TG prajalu calm ga undandi)

Special Jury Award: Kiran

Best Travel Team : TG Congress MLAs & MPs (ikkada serious ga unte Delhi,Akkada serious ga unte Hyd)

Best Watchman: Ahmad Patel (TG MLA lu evaru Amma daggaraku ravaddu)

Jodi Cities Jodi Brothers : Talasani & Teegala / Mukesh & Danam

Best Fight Masters: JP & Nagam

Best Publicity: Seemandra Vidyardi Kishore (Iddaru unte 2 channels, Naluguru unte all channels coverage)

Best Supporting Actors: Nagam, Dayakar,Jagga Reddy, KomatiReddy Brothers

Best Director: Onti Kannu BABU

Best Chorus: TG TDP MLAs (Seemandra Babu entha chepthe antha)

Best Producers: Lagadapati, Rayapati, Mekapati, Kavuri, Daggupati..

Best Banners: TDP & CONGRESS

Best Studio: TDP OFFICE & 10 Janpath Road

Best Anchor: Chidambaram (9th Dec 2009)

Best Editor: Justice Sri Krishna

Best TV artists: Chalasani Srinivas, Gandra, Tulasi Reddy

Best Dialog1: Congress vallu rajinama chesthe memu chestham – NAGAM

Best Dialog2: Jai Telangana Jai TDP, Jai Chandrababu - Revanth

Life time achievement award: Roshaih

Droha Ratna Award: Babu

Best Gajiji : Damodar Reddy (Shavala Meeda Pramanam)

Best Courier Award : Narsimhan (Reports to Central)

Best Scene: Lagadapati Deeksha & Nannapaneni odarpu

Best Confuse Master: Jana Reddy

Best Calm Actor: Jaipal Reddy & Sabitha Indra Reddy

Best Screenplay: TG issue in TDP & Congress manifesto

Best Family: NARA, NAMA, THUMMALA,MANDAVA……

Best Audience: Seema Andhra Prajalu (Antha nayakule chustunnaru kada..)

Best News Papers : Eenadu

Best TV Channels: TV9 & NTV


Cheers,

Deepam

పల్లె పల్లె పట్టాల పైకి...

నేను జేబుల్లో
కోకిలలు వేసుకు రాలేదు.
పిడికిళ్ళలో బాంబులతో వచ్చాను
నేను మోకరించి ప్రార్థిస్తున్నాను
ఓ జిందగీ నన్ను
సుఖం మీద శిలువ వేయకు -శేషేంద్ర

సుఖం..ఎన్నిరోజులైందో తెలంగాణా ప్రజలు దాని జాడ చూసి, నేను రోజులంటే , నా ఊర్ల ఉన్న అవ్వ వెక్కిరిస్తుంది, పొట్ట కూటికి దేశం పోయిన కొడుకు వస్తాడో రాడో అని ఏడ్చి ఏడ్చి ఎండిపోయిన , అలసి పొఇన కళ్ళతో గురుతు చేస్తుంది , రోజులు కాదు బిడ్డ యుగాలని. అవును యుగాలు, అన్యాయాన్ని చూసి చూసి, మోసి మోసి కూలబడ్డ కాలాలు. ఇపుడే నిద్ర లేచినట్టుంది తెలంగాణాల పోరాటాలు చూస్తుంటే జనాలకి , ఇయ్యాల రైలు పట్టలేక్కిస్తున్రు , అంటే ఇన్నేండ్లు గాడి తప్పిందా అని ఒక దోస్త్ అడుగుతుండు, ఏమో బై ఇప్పటికైనా సరిగ్గా నడుస్తుందేమో చూద్దాం . ఇన్ని ఏండ్లు చేసినయ్ కూడ పోరాటాలే , మాటలు, పాటలు, రాతలు, కోతలు,కోలాటాలు, కథలు, కత్తులు, ఎత్తులు , జిత్తులు..అన్ని పోరాటాలే..దశలు దశలు గా పోరాటాలు ..

అన్న, తెలంగాణా ఎట్లోస్తదో చెప్పుండ్రి జర! ఒక హౌలే గాడు, వాడు సోనియమ్మకి ‘రాష్ట్రంలో ఏమి జరుగుతలే’ అని రిపోర్ట్ ఇస్తాడు. సహాయ నిరాకరణ అంత కేవలం ఉద్యోగులు మాత్రమె చేస్తున్రని చెప్తాడు. ఎన్ని కోట్లు ముట్టినాయో వానికి జర కనుక్కోండి భై, తెలంగాణా ప్రజలందరూ రక్తం అమ్మైన సరే అంతకన్నా ఎక్కువిస్తామంటున్రు మావోల్లు, ఎవరన్న జర బేరం జేయున్ద్రి , ఈ వెధవలకి డబ్బులు తప్ప ఎం కనపడై..అసలు ఆంధ్ర జ్యోతి అనే చానెల్ ని బహిష్కరించండి రా భై అంటే ఆడనే బోయి ముచ్చట్లు చెప్తారు మావోల్లు..అసలు రాజ్ న్యూస్ లాంటి చానళ్ళు డిస్కషన్లు ఎందుకు పెట్టరు? ఇపుడు బాగానే వస్తున్నాయి కదా పైసలు? పొద్దున్న డిస్కషన్ పెడతాడు, సాయంత్రం విషం కక్కుతాడు ఆ చానల్ వాడు. పేపర్ మనది కాదు, చానెల్ మనది కాదు..పెట్టుబడిలకు పుట్టిన విష పుత్రికలు అని వాళ్ళే చెప్పుకున్నారు. మనాది అంతా ఒక్కటే, బక్క పలచ గుండెలున్నోల్లు, గుండె పలిగి సస్తరే అన్న , అసలే దిక్కు దివాణం లేని జనాలు, పొద్దున్న లేస్తే రోడ్ల మీద పడి ఉద్యమాలు చేస్తున్రు, బతుకమ్మలు, బోనాలు, వంటలు , వార్పులు, దిష్టి బొమ్మ దహనాలు, రాలీలు, రాస్తా రోకోలు..ఎన్ని చేసిన అన్తలేవు అనడానికి ఇవే నిదర్శనం. సిఎం లు మనోళ్ళు ఎపుడు ఉండరు, ఉన్న మనోళ్ళు భయం భయంగా చస్తానే ఉంటారు. అమ్మ దీవెనల కోసం , ఉన్న పదవుల కోసం ఇంకా ఇంకా మభ్య పెడ్తనే ఉంటారు.

ఇపుడే అందిన వార్త, అది కూడ అదే చానల్ ల వస్తది, జూపూడి గారి జ్యోతిష్యం, అసెంబ్లీ సెషన్ అయి పోగానే రాష్ట్ర పతి పాలన వస్తదంట. కానియండి రా ! ఎడికైతే ఆడికి కానియండి. తెలంగాణా మీద పడి అడ్డగోలుగా దోచుకొని ఒక్కొక్కడు వోల్లు కొవ్వెక్కి ఉన్నాడు, మా పోరాటాలు ఎవడికి కానోస్తలే. చివరి వరకు లాగితే ఏమైతది..తెలంగాణా బండి ఇప్పటికైనా రైలు పట్టాల పైకి ఎక్కుతుంది..జస్మిను విప్లవాల పరిమళాలు తెలంగాణాల కూడ పరిమలిస్తున్నాయి, ఈజిప్ట్ విప్లవాలు నరాల్లో నిండుతున్నాయి. ఆలస్యమే కావొచ్చు, అంత తేటతెల్లం అయితున్నాయి, రంగులు బయట పడుతున్నాయి, మావోడు ఎవడు రాజకీయాల పనికి రాదనీ తేల్చి చెపుతున్నాయి. గ్రామాల తిరుగుతుంటే కళ్ళు తిరుగుతున్నాయి, ఒక కాడ కంగ్రేసోడు తెలంగాణా అన్నోడిని జైల్ల పెడతాడు, ఇంకొక కాడ తెలుగు దేసపోడు తన్ని తరిమేస్తాడు, మొన్న కరీం నగర్ల యువజన నాయకుడు తిరుపతిని, టిడిపి వాళ్ళు దుడ్డు కర్రలతో కొడితే తల పగిలింది , తప్ప తాగి బందు రోజు , కర్రలతో విచ్చలవిడిగా తిరుగుతున్రు వాళ్ళు. ఎవడికి కనపడదు , వినపడదు. నిన్నటికి నిన్న మీటింగులో ఇంకొక నిజం బయట పడ్డది, తెలంగాణా నాయకులకు కూడ నిజమైన నాయకులని చూస్తె పడతలేదని, ఈ రాజకీయ నాయకులు మాకొద్దు అని జనం తేల్చి చెప్పెసిన్రు. మోరల్ ఆఫ్ ద స్టోరి ఏందంటే, రాజకీయ నాయకులు తెలంగాణా తెచ్చేది ఏమో కాని రానీకుండా అడ్డు పడుతున్రు..ఇంత పచ్చి నిజం చెపితే అక్కలకి, అన్నలకి కోపం రావొచ్చు..అయితే ఇక్కడ చిన్న కిటుకు ఉంది..టీవి లల్ల మాట్లాడే నాయకులు వేరు, గ్రామాల ఉండే నాయకులు వేరు, వాళ్ళ వాళ్ళ సమీకరణాలు తెలుసుకోవాలంటే కొన్ని రోజులు గ్రామాల్లో ఆబ్జెక్టివ్ గా పరిసిలిన్చల్సిందే..గంతే..

ఇపుడు రైల్ రోకో అంటున్నాం, సోనియమ్మ మల్లా డిఎస్ ని పిలుస్తది , ఆయనకి తిని తిని వళ్లే కదలదు, ఇంత తిన మరిగినోడికి తెలంగానోస్తే పెద్ద దెబ్బే, అందుకని ఏమ్లె మేడం అంత ఒకే అంటడు..ఆంధ్రల బిసినెస్లు దెబ్బతింటై కాదె అన్న! కేంద్రం చదరంగం ఆడుతుంది, అన్ద్రోల్ల, దొంగ తెలంగానోల్ల చేతిలో ఉంది, మనం కబడ్డీ ఆడుతున్నాం..ఎట్లా వస్తది తెలంగాణా చెప్పుండ్రి. నాన్ కో ఆపరేషన్ ..కోట్లు నష్టం ..అయినా ఎం కాదు కిరణ్ రెడ్డి గాడికి (గార్లు బూరెలు అనే ఓపిక లేదు ప్లీస్) ఎం లేదు అమ్మ! అంత శాంతం ప్రశాంతం అని చెప్తాడు , అది ఒక చానెల్ వాడు ఎస్తాడు ,ఒక అతి తెలివి వెధవ పెద్ద స్టోరి చేస్తాడు, అది చూసి మనకు మల్లా గుబులు..అసలు ఇంత పెద్ద భారత దేశానికి, శ్రీలంక టైగర్ని చంపిన పేరున్న చిదంబరానికి, తెలంగాణాల ఏమైతుందని తెలుసుకోవడానికి తెలంగాణా అన్టేందో తెలవని బెకార్గాడిని అడుగుతారు..ఇది మనం నమ్మాలే..ఇంక నిఘా విభాగాలు, సైన్యాలు అవసరం లేదు మన దేశానికి, అది చూసి .. మనం పిచ్చోళ్ళ లెక్ఖ చూస్తాము.

నిజంగా మనం తలచుకుంటే తెలంగాణా రాదా? సింగరేణి తలచుకొంటే , ఎన్టిపిసి బంద్ పెడితే, కొల్లగొడుతున్న వనరులను ఆపేస్తే తెలంగాణా రాదా..క్విట్ తెలంగాణా అంటే తెలంగాణా రాదా? శాంతం , శాంతం, ఆరు వందల చావులు ..అయినా శాంతి మంత్రం..రేపటికి జీతాలు లేవు, కాలే కడుపులు, ఆక్రోశించే జీవితాలు ..అస్తవ్యస్తమైన సమూహాలు..కుళ్ళి పోయిన రాజకీయాలు..బయట పడుతున్న కుతంత్రాలు. అయినా ఎక్కడో ఒక వెలుగు రేఖ ..వేగు చుక్క..రైలు పట్టాలేక్కుతుంది, సరిగ్గా, మళ్లీ దిగకుండా, మరెక్కడా ఆగకుండా, గమ్యం చేరే దాకా. పల్లె పల్లె భుజానేసుకుంది తెలంగాణని, ఇంక ఆగదు, ఇపుడు తెలంగాణా మేధావుల చేతిలో లేదు, రాజ కీయ నాయకుల లేక్ఖల్లో లేదు, లక్ష కోట్ల నినాదాలతో , గళాలతో గొంతెత్తి అరుస్తోంది జై తెలంగాణా అని, నై తెలంగాణా అన్నోడిని ద్రోహి అని పక్కకు తోసి ముందుకు పోతుందీ..ఎవడికైనా దమ్ముందా ఆపనికి ..అయితే ఒక సవాలిసురుతుంది నా పల్లె తెలంగాణా, ఆపగలరా? శాంతి మంత్రాల ద్వారా తెలంగాణా రాదనీ మాత్రం అర్థం ఐంది. విద్వంసం అంటే భయం, అయినా శతాబ్దాలుగా భరిస్తూనే ఉంటాం.

ఇన్ని రోజులు వోట్లు , సీట్లు, రాజీలు, రాజీనామాలు, తెలంగాణా రాలే, పోయిన భూములు, నీళ్ళు, నిధులు, ఉద్యోగాలు..లిక్ఖలేని ప్రాణాలు..పూలమ్మిన చోట కాయలమ్ముకొంటున్నాం..అయినా తెలంగాణా రాలే..ఇపుడు తేలింది ఒకటి..ఉద్యమాలే శరణ్యం అని, వత్తిడే మార్గం అని, నిన్నటికి నిన్న విద్యార్థులు చలో అసెంబ్లీ అంటే కొన్ని పార్టీలు మద్దతు తెలపవు, ఎందుకు అని అడగొద్దు..(చిదంబర రహస్యం కాదు చంద్ర శేఖర రహస్యం , దాని పేరు శాంతి అందురు..అసలు ఎంత శాంతి తెలంగాణా ల ఉందొ చూడాలంటే నిజమైన ఉద్యమ కారులని అడగాలే. ఎం చెప్పలే అక్కా! చావలేక బతక లేకున్నం, మేము మనోల్లతోని కొట్లాదాలే, అవతలోనితోటి కొట్లాదాలే..బతుకంతా కోట్లాటనే అని గొల్లు మంటారు..అయినా పోరాటం ఆపరు). మారణ కాండ జరుగుతుంది.. రక్తం చిమ్ముతుంది, కాంపస్ లు పోలిస్ కాంప్ లైతై, సైన్యం గుప్పిట్లో విద్యార్థులు, రాళ్ళు, రబ్బరు బుల్లెట్లతో స్నేహాలు, అయినా వారికి మనం దూరంగా ఉంటాం, వారిది విప్లవం భై అంటాం, అన్టేందో అర్థం తెలవాలంటే చేగువేరాని చదవాలి..విద్యార్థుల ఆవేశంని, క్రిఎటివిటిని మనం ఉద్యమానికి వాడుకోలేము. కాని వాళ్ళు (అసలు వాళ్ళు ఏందో మనం ఏందో) మాత్రం మనం ఏ పిలుపు ఇచిన మేము సైతం అని ముందు పడతారు..అదే తేడా. ఇక్కడ గాంధీలు ఉంటారు, భగత్ సింగ్లు ఉంటారు..ఎవరు ఎక్కువ , ఎవరు తక్కువ కాదు, అందరు దేశం కోసమే అనేది నీతి. ఇప్పుడున్న సందర్బంల, ఎవరు ఏ పిలుపునిచ్చినా మనం అందరం కలిసి పోరాడాలే..అదే ఉద్యమానికి బలం. కొన్ని పార్టీలు సగం మందిని తన గుప్పిట్లో పెట్టుకొని, పోరాటాలకు పోకుండా చేస్తారు ..పోతున్న వనరులని నిమ్మకు నీరెత్తినట్టు చూస్తాం..తెలంగాణా రాని అపుడు మాట్లాడుదాం అంటాం, తరువాత ఏముంటది బూడిద, ఆస్థి పంజరాలు, కరీం నగర్ల గ్రానైట్ మైనింగ్ ల ఇరవై శాతం మాత్రమె మన వాళ్ళు ఉంటారు, అంత బయటి వోల్లు తవ్వక పోతుంటారు, మనం వాళ్లకు సహాయం చేస్తుంటాం, పైసల్ రా భై! ఇక్కడ తెలంగాణా వాదం అడ్డు రాదు. అసలు తెలంగాణా అంటే భూములు, నీళ్ళు , ఉద్యోగాలు కాదు ! డబ్బుకు కులం, మతం, నమ్మకాలు, సెంటిమెంట్లు లేవు సారూ.

సోది చాన అయినట్టుంది..క్షమించున్ద్రి..సోది కాదె, గోస..పానం ఒపుతలేదు..ఒక్కో పిలుపు వెనక ఎంత హింస ఉంటదో చూస్తున్నాం..రేపటి పిలుపుకి విరిగే లాథిలెన్నో, చిందే రక్తం ఎంతో, పేలే గన్నులెన్నో, పోయే పానాలెన్నో..ఏమి కాకుంటే, పోకుంటే శాంతి, పొతే ఆవేశం..సింపుల్, చివరాకరికి .ఎక్కిన రైలు బండిని గమ్యం చేరేదాక తీసుక పోదాం, మన సిద్ధాంతాలన్నీ , పైత్యాలని పక్కన పెడదాం..ప్రజలేమంటే అదే నిర్ణయం. టునిసియా, ఈజిప్ట్, లిబియ పోరాటాలు రోజులలోనే నడచినాయి , వొట్లతోటి, సీట్లతోటి, మాటల గారడి తోటి కాదు.అక్కడ అశేష ప్రజా స్రవంతికి, వారి ఆకాంక్షలకి అడ్డు పడే వాడు లేదు, పేర్లు పెట్టే వాడు లేదు. మంచిదా , చెడ్డదా అని కాదు సమస్య..ప్రజల చేతిలోకి వెళితే వాళ్ళే చూసుకొంటారు..అలా వేల్లోద్దని మన నాయకులు అనుకుంటున్నారు, థిస్ ఇస్ టూ లేట్ నవ్! వెయిట్ అండ్ సి ది రిసల్ట్.

” నీ బాణానికి గురి ఎవడో శత్రువు, నా బాణానికి గురి ఏదో హృదయం;
గాలి వాలు తెలిసి ఎగిరే పక్షివి నీవు ,
గాలి కూడ భయపడే గమ్యం కోసం రగిలే పక్షిని నేను” (ఎం పరేషాన్ చేస్తార్ర భై ఈ కవులు)

జై తెలంగాణా!

Sujatha surepally

Wednesday, February 23, 2011

బాంచన్ కాదు దొరా బాకులం!

ముసుగులు జారుతున్నాయి,
ఒక్కోడు నగ్నంగా బయటబడుతున్నాడు
చూపులు, స్వరాలు మారుతున్నాయ్
దార్లు మల్లుతున్నాయ్

ఒక దొర(కెసిఆర్) భూకంపాన్నైన సృష్టించి
తెలంగాణా తెస్తానన్నాడు ,
అయన జాడల కోసం తెలంగాణా ప్రజలు
కళ్ళళ్ళ వొత్తులేసుకొని సూత్తున్నారు

తెలంగాణాకు అడ్డొస్తే అడ్డంగా నరికేస్తాం
అన్న (దామోదర్ రెడ్డి) దొర
రాయల సీమ ముద్దు బిడ్డ జగన్ శిబిరం కై సూస్తుండు
సీటు వాకిట బోర్ల బడి
జగనన్న పేరు ఎత్తుతడెమో అని చూస్తుండు

మంత్రి పదవి తీసుకున్న జానన్న
తెలంగాణా గిలన్గాన జాన్త నై అంటుండు

ఉస్మానియా ల అగమాగామైన నాగన్న
బాబును చూడంగానే
బాత్రూమ్ల దాక్కున్టాండు
వారీ! నోరారి పోతది!

వేణుగోపాల్ శవంపై
ప్రమాణాలు చేసిన మంత్రులు, కంత్రులు
మమ్మల్ని మాజిలే అనాలన్న మాటలు
చెవుల రింగుమంటున్నాయి

దొరలారా! ఒక్కనిజం తెలుసుకోండి
తెలంగాణా ప్రజలు ఎపుడు సాయుదులే
మాటలు, పాటలు, రాతలు తూటాలే ,
వోడిసేల రాళ్ళు, విల్లంబులు, గుత్పలు,
చిపుర్లు, గొడ్డళ్ళు, కారంపోల్లు, రోకలిబండలు
దొరికిన పతోక్కటి AK 47 లే

ప్రజా సంబంధం లేని
మీ రాజకీయాలు బొంద బెట్టేందుకు
మా వోల్లు పలుగు, పార పట్టి కదులుతున్రు
కుడి ఎడమల దగాపడ్డ జనం
నీపై నిఘా పెట్టినరు
పులి ఎక్కి స్వారి చేద్దామని చూడకే
ఖమ్మంల జూస్ తాగితే ఏమైందో
అదే అయితది
తెలంగాణా మట్టి కాళ్ళు
మెడపై పెట్టి వంచుతారు
మీ
బాంచన్ కాదు దొరా బాకులం!

మీమీద మాకేన్నాడు ప్రేమ లేదు,
మీగొంతుల ఉన్న తెలంగాణా మీద తప్ప
మీ నాయకత్వం మీద భరోసా లేదు
ప్రజలే ప్రత్యామ్నాయం
చూస్కుంటారు
నువ్వు నోర్మూసు
కో!

sujatha surepally

Tuesday, February 22, 2011

తెలంగాణ ముద్దుబిడ్డ వనం ఝాన్సీకి అశృనివాళి.....

తెలంగాణ ముద్దుబిడ్డ వనం ఝాన్సీకి అశృనివాళి.....
నిజమేనా ఇది!
నమ్మలేకపొతున్నం అక్క..
రోజూ నిన్ను టీవీ లల్ల
తెలంగాణ లొల్లులల్ల చుశేటోల్లం,
నువ్వు మట్లాడ్తాంటే,
తెలంగాణ కోసం కొట్లాడ్తాంటే
ఝాన్సి లక్ష్మి గిట్లనే
ఉండెనేమో అనుకున్నం!

మొగోళ్ళు సయితం
మొహమాటపడ్డ క్షణాల్లో
నీ మాటల్తోనే వాళ్ళకు
మార్గదర్శివయినవ్..
ఎందరో ఆడబిడ్డలకు
సయితం ఆదర్శం నువ్వు,
రాణి రుద్రమను సూడలే
కాని నిన్ను సూశినం అక్క..

పొద్దునలేశినసంది
పొద్దుగుంకేదాక
తెలంగాణ కోసం
ఎన్ని వేదికలెక్కినవో,
ఎన్నెన్నీ చర్చల్ల
నీ గళం విప్పినవో
తెలంగాణ తల్లికి పుట్టిన
ప్రతి బిడ్డకు ఎర్కే అక్క..
మా గుండెచప్పుడు
ఇక నుండి
నీ గొంతుకద్వార
వినలేమన్న నిజం
ఓ విషాదం!

పాలకులు మరణిస్తే
మా కండ్లల్ల యెప్పుడు నీళ్ళు రాలే,
కానీ తోబుట్టువు మరణం
యెప్పటికీ తీరని శోకం!
తెలంగాణ ల ప్రతి గుండె నిన్ను
యాదుంచుకుంటది..
నాలుక్కోట్ల మందిని
ఒకళ్ళుగ చేశిన నువ్వు
ఒక్కదానివయి
యెట్ల ఎల్లిపొయినవ్!
ఈ చేదునిజం
అబద్దమయితే
ఎంతమంచిగుండునోకదా!

వీరులకు మరణం లేదన్నది
వాస్తవం,
నడుస్తున్న చరిత్రలో
వనం ఝాన్సి ఒక భాగం,
తెలంగాణల
ప్రతి వేదిక మీద
నీ మనాది ఉంటది..
నువ్వేశిన తొవ్వలో
ఎందరో తమ్ముళ్లు చెల్లెండ్లు
నడుస్తనే ఉంటరు,
ప్రతి ఆడబిడ్డ
జై తెలంగాణ నినాదాల్లో,
ఎత్తిన పిడికిళ్లలో నువ్వుంటవ్ అక్కా....

ఎవలన్నరు తోడబుట్టిన రక్తసంబంధీకులమధ్యనే ఆప్యాయతానురాగాలుంటయని,
రక్తసంబంధంకన్నా వర్గసంబంధం గొప్పది. వర్గసంబంధంతోపాటు తెలంగాణల పుట్టిన ప్రతివ్యక్తి మధ్యగల ఆత్మీయ బంధం గొప్పది. అందుకే ఆమె మా అక్క.. తెలంగాణ ఝాన్సీ, సార్థక నామధేయురాలు

Monday, February 21, 2011

మారిన నేతల మాటలు...

ఒకే ఒక్క దెబ్బ ... అది కూడా అలా ఏదో ముట్టి ముట్టనట్లు, తగిలి తగలనట్లు తగిలింది.. ఏదైతేనేం కొట్టింది మన మల్లెషన్న, కొట్టిచుకున్నది JP , పబ్లిక్ గా మీడియన్ ముందు ఒకే ఒకటి అలా తగిల్లిందో లేదో...
దెబ్బ రుచి చుసినోడే కాదు, మిగతా వాళ్ళంతా తెల్లారేసరికి స్వరం మార్చారు, ముఖ్య మంత్రి సైతం తెలంగాణా కు నేనేమి అడ్డు కాదంటూ అరుస్తునాడు.. గవర్నర్ అయితే ఏకంగా తాను తటస్థం అంటూ స్టేట్మెంట్ ఇచ్చాడు, JP అయితే ఏకంగా అది బలీయ ఆకాంక్ష అని అంటున్నాడు ఇపుడు...
TDP నేత వయ్యావుల అయితే విభజన పై వోటింగ్ కు సయ్యంటున్నాడు ఈ సీమంధ్ర నేత...
అది దే తడి పోచమ్మ గుడి..
దెబ్బంటే అలా ఉండాలి.. ఒకే దెబ్బకు ఎన్ని పిట్టలో ....
మామూలు దెబ్బ కాదె మల్లెషన్న నీది... అకడ రాయినిగుడెం లో మన చెల్లెళ్ళు తెలంగాణా ఆడపడుచు దేబ్బెంతో ముఖ్య మంత్రికి, మిగతా మంత్రులకు, అధికారులకు రుచి చూపిస్తే, నువ్వు తెలంగాణా మగాడి దెబ్బ ఒక పార్టీకే కాదు అన్ని పార్టీలకు చుపించినావ్.......
ఒక పార్టీ అని కాదు అన్ని పార్టీల నాయకులూ ఇపుడు మాట్లాడుతున్నారు నీ దెబ్బకి... ఇక పార్లమెంటులో మన వాళ్ళు JAI TELANGANA అంటూ ప్లే కార్డుల ప్రదర్శిస్తూ తెలంగానం చేసారు మన MP లు.....ఇది ఎంత వరకు నమ్మోచ్చో కాని వారి అధిష్టానం దృష్టిలో మాత్రం పడ్డారు...
ఇపుడు అసలు దొంగలు భయత పాడుతారు.. ఇక కాంగ్రేస్సోల్లకు మొహం చుపెటడానికి లేదు...
ఈ దెబ్బతో మన పని కొంచెం ఈజీ అయినా, ఇపుడు అసలు దొంగల భారతం పట్టాలి, అదే మన ఇంటి దొంగల భారతం ... అసలు ఎవరు అద్దంకి మనకు... మన ముందు అందరు అంటారు జై తెలంగాణా అని... పోరాడుతారు కుడా అందరూ పోరాదేవల్లె... పాపం బక్క చిక్కిన సామాన్య ప్రజలు తప్ప... రాజకీయనాయకులైతే మరీను... వాళ్ళు చేసే ప్రతి పని తెలంగాణా కోసమే, వేసే ప్రతి అడుగు తెలంగాణా సాధన కోసమే... అంటే అసలు అద్దంకి సామాన్య ప్రజలం అయిన మనమేనా ....!!!!
అయితే మన తీరు మార్చుకుందామా??
ఇన్నాళ్ళు మనోడు మందోడు అని చూసాం కాని ఇపుడు మందోడు అయితే రెండు దెబ్బలు కొడదాం, అదే మనోడు అయితే ఇంకో రెండు రెండు ఎకువ కొడదాం... తెలంగాణా కోసం మాటలు కాదు చేతలు కావలి అని చెపుదాం.. ఇంకా నీ కల్లబొల్లి కబుర్లు వినే వాళ్ళం కాదని చెబుదాం ...

దెబ్బకు దిగివచ్చిన JP...

ఇన్నాళ్ళు సమస్యే లేదంటూ, అసలు తెలంగాణా పోరాటం రాజకీయ నిరుద్యోగుల పని అంటూ ఎన్నో రకాలుగా మా తెలంగాణా ఉద్యమాన్ని కించపరుస్తూ మాట్లాడిన LSP JP కి దెబ్బ పడితే కాని తెలిసి రాలేదు... ఒక్క దెబ్బకు సమస్య తీవ్రత తెల్సుకోవడమే కాదు సమస్య ఉంది, దీనిని ప్రధాన పార్టీలు పక్క దోవ పట్టిస్తున్నయంటూ, అసలు సమస్య లేనట్టు నటిస్తున్నయంటూ మాట మార్చాడు... ఆ పార్తీలకంటే బుద్ధి లేదు, వాళ్ళంతా చదువుకున్న కళ్ళు మూసుకుపోయిన దద్దమ్మలు ఎందుకంటే వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చిందే దోచుకుతినడానికి, ప్రజలను మభ్యపెట్టడానికి... మరి నువ్వో ?? రాజకీయాలను మారుస్తా, ప్రజలకు అండగా ఉంటా, ఏదో పీకుత, పొడుస్తా అని ప్రగల్భాలు పలికావ్...!! గుర్తుందా JP నీకు ???
ఇంకా ఇలాంటి సమస్యను సామరస్యంగా పరిస్కరించుకోవాలంటూ,దానికి అసెంబ్లీ నే సరి ఐన వేదిక అంటూ సరికొత నీతులు వల్లిస్తునాడు.. ఏది ఏమయినపటికి మల్లెషన్న JP కి బుద్ది జెప్పిండు..... అసలు ప్రజల పక్షాన పోరాడింది మన మల్లెషన్న...
ఇదేనా నీ తెలివి Mr . JP ... ?? నీవు ఒక మాజీ IAS ఆఫీసర్ అని మరచిపోయావా JP .... సారీ ఇవన్ని నేను నీకు చేపుతున్నందుకు..
ఒకపుడు నీవు మాకు సేప్పావ్, కాని ఇపుడు మేము అంటే నేనోకడినే కాదు ఎంతో మంది తెలంగాణా ప్రజలు నీకు చేపెందుకు సిద్ధంగా ఉన్నారు... ఇపటికైనా నిజాలు తెల్సుకున్నందుకు థాంక్స్...
ఇదేమాట మీద నిలబడటమే కాదు, ఈ 4 కోట్ల తెలంగాణా ప్రజల ఆకాంక్ష ఐన ప్రత్యేక రాష్ట్ర సాధనకై నీవు కూడా తన వంతు కృషి చేస్తావని ఆసిస్తూ,
నీ మాజీ అభిమాని ఐన ఒక తెలంగాణావాది,

Sunday, February 20, 2011

మధు (యాష్కి) మస్తి!

మదన్న నిన్న లాయర్స్ సమర భేరిలో ఇష్టం వచ్చినట్టు కూసిండు ! సభలో మిత్రుడొకాయన రాజీనామా ఎందుకు చేయలేదంటే రోషమొచ్చింది, నువ్వెంత? నీ బతుకెంత? తెలంగాణాకి నువ్వు ఎం చేసినవ్ ? అని కళ్ళెర్ర చేసుకొని కోపం అయిండు. కడుపు మండి మిత్రుడు అడిగిన ప్రశ్నల ఏమైనా తప్పుందా చెప్పుండ్రి? దానికి అంత ఫీల్ గావాలన? అన్న నువ్వు ఇన్ని రోజులు తెలంగాణాకి చేసింది ఏందీ చెప్పు..కుక్కిన పెను లెక్ఖ పడి ఉండటం పనా? లేకపోతె డిల్లి కి ఊకే ఫాషన్ పరేడ్ చేయడం పనా? ఇక్కడ జరిగే పోరాటానికి మొహం చూపలేక ఆడ బోయి దాక్కున్తున్రని మాకు తెల్వదానే! మరి మేము అంత పిచ్చోల్లం గాదు అన్నల్లార! ఇగ మా అక్కలు ఏడున్నరో పాపం , నోరు తెరవరు, సప్పుడు కాకుండా పదవులు ఎంజాయ్ చేస్తారు, తల్లుల్లారా ఒక్కసారి ఈశ్వరి బాయి, సదాలక్ష్మి , మల్లు స్వరాజ్యం ని గురుతు తెచ్చుకోండి, మీరు ఆడోల్లకు ఆదర్శంగా ఉంటారంటే, అది లేకపాయే, మిమ్మల్ని గెలిపించింది తెలంగాణాకు ఎమన్నా చేస్తారని , ఆడోల్లు కదా కనీసం మీకన్నా బాధలు అర్థం అయితే అనుకుంటే , అది మా పిచ్చి అని తెల్చేసిన్రు! అంతా మా దరదృష్టం! ఎవరిని ఏమి అనలేము..

పాపం చాల మందికి తెలవని విషయం ఒకటుంది, ఉసరేల్లుల కథ! అన్ని పార్టీల ఉన్న మోసగాళ్ళు , రంగులు మార్చే మొనగాళ్ళు చాల డేంజర్, పాపం చంద్ర బాబు నాయుడు రెండు కళ్ళ సిద్ధాంతం , రేడు నాల్కల సిద్ధాంతం అట్టర్ ఫ్లాప్ , అయినా ఆయనని వీడరు మనవాళ్ళు, నిను వీడని నీడను నేను అని ఇంకా డుఎట్ పాడ్తనే ఉంటారు, అసలు పార్టీ సంబంధాలు కాక వీరి మధ్య ఇంకేమైనా ఉన్నాయా అని మనం అడగడం అంత బాగోదు..కాని కామన్ సేన్స్సు ఉంటె ఎవరికైనా దౌబుట్ రాక తప్పదు. ఏంచేస్తాం తమ్మి ! కలి కాలం! ఎవడిని నమ్మల్నో ఎవడిని నమ్మోద్దో తెలిస్తే కదా! చిరంజీవి లాంటి వాళ్ళతో మనకు పెద్ద బాద లేదు, సినిమా అయన కదా, ఆయన 'కాట్ వాక్' వస్తది కదా, సక్సేస్ అయిండు, జై కాంగ్రెస్ అని నమ్ముకున్నోల్లని గంగల ముంచిండు. మంత్రి పదవికి అంత దమ్ముంటది మరి! అయినా వాడు అన్ద్రోడే కదా దేన్నైనా తాకట్టు పెడతాడు , పైసా కోసం, పదవి కోసం , పేరు కోసం, గీల్ల తోన్ని దోస్తాని చేసి మావోల్లు పూరితిగా సెడి పోయిన్రు కాదె! కాంగ్రెస్ అనగా మనకు శత్రువు అని తెలుసు, అంటే మళ్లీ ఆంధ్ర కాంగ్రెస్ , తెలంగాణా కాంగ్రెస్, అందులో కోమటి రెడ్డి లాంటి వాళ్ళు , బహిరంగంగా కనపడతారు , మధు యాష్కి లాంటివోల్లు న ఆటు, న ఇటు లెక్క ఉంటారు..కొద్ది మందికి జర అన్నంటే ప్రేమ, మా కులపోడని , మంచోడని, ఏమి మంచి చేసిందో జర తెలిస్తే చెప్ప్పున్రి, మా యాదయ్య సచ్చినట్టు ఎమన్నా సావమంటున్నామే , జర ఒక కాగితం మీద రాజీనామా సంతకం గియి అన్న అన్నం, వంద మాటలు చెప్తారు గాని, ఆ వొక్కటి అడక్కు! అది తక్క ఏమైనా కోరుకో! ఇంకేముంది కోరుకోనికి , మీరు మాకున్న పరువు అంతః పార్లమెంట్ గల్లిలో పడేసి వస్తిరి..ఒక్కడికన్న సోనియమ్మా అప్పాయింట్మెంట్ ఇయక పాయె, సిగ్గు శరం మీకు ఎందుకు దేవుడు పెట్టలేదో అన్న ..మేము మాత్రం తలెత్తుకోలేక పోతున్నాం.. మళ్లీ అందులో సప్పుడు చడి చేయనోల్లు ఉంటారు. పొద్దున్న లేస్తే మా మధు యాష్కి నీ వెంటే నేను అంటడు ..మా కులపోడు, ప్రాంతపోడు అని మనం ఆవేశంగా ప్రేమిస్తాం , చూస్తె ఏముండదు, సూదిలో దారం. ఆవేశంగా మాట్లాడతారు..డిల్లి కి పొతే మాత్రం గల్లి లీడర్లంత పని కూడ చేయలేరు. అమ్మ దర్శనం దొరకదు, మీడియాల రెండు ముక్కలు చెపుతారు..ఇగోస్తది తెలంగాణా, అగోస్తది, అమ్మ బొమ్మ సో 'నియమ్మా' ఇస్తది అని చిలక పలుకులు చెప్తారు. మంచిగయింది , ఇయాల ఎవరు కథల్ చెప్తే ఇననీకి సిద్దంగా లేరు.

మిమ్మల్ని నమ్మకం తో గెలిపించినందుకు ప్రజలకు బాద్యత వహించాలి, వాళ్ళ ఆకాంక్షల మేరకు నడుచుకోవాలి కాని, అంత ఉల్టా చేస్తారెందే అన్న, ఇక్కడ వోల్ట్లు వేసి గెలిపిస్తే అక్కడ సోనియమ్మ పాట పాడితే ఎట్లా చెప్పున్రి ..మీరు చేసిన పనికి, సంవత్సర కాలం నష్ట పోఇనం, ఎన్నో విలువైన పానాలు పోగొట్టుకున్నాం, ఈ హత్యలన్ని మీరు చేసినయె, మీ చాతగాని తనానికి పసి పోరగాల్లు, దైర్యం లేనోళ్ళు గుండె పలిగి సచ్చిన్రు ..మాకు తెలుసు, మీకు నోరు పెగలదు..ఆస్తులు పోయేతోడు జర బయట పడతారు, మీకు ఆటు అవ్వ గావలె, బువ్వ గావలె, మాకు ఇంక ఓపిక లేదన్న,ఏమనుకోకున్ద్రి ..ఇపుడు మీరు రాజేనామ చేయలేదని ఎవరైనా అన్న, ఎందుకు మా పోరగాల్లని పొట్టనబెట్టుకున్నారని ఒక దేబ్బెసిన సప్పుడు చేసే అధికారం మీకు లేదు..ఐతే నోర్ముసుకు పడి ఉన్డున్రి, లేకపోతె అన్ద్రోల్ల సోపతి పట్టి , జగన్ గాని ఎంకనో, లగడపాటి ఎంకనో పొండ్రి..సహాయ నిరాకరణ వద్దని చెప్తాడు ఒక్కో నాయకుడు..జర దేల్వక అడుగుత మీదేం సొమ్ము పోతుందే ! అందరు మంచిగానే సంపాయించుకొని బంగ్లాలు గట్టుకున్నారు , పోయి డిల్లిల కూసున్నరు..కష్టమైనా , నష్టమైన మాకే కదా..తెలంగాణా రాని బిడ్డా! ఒక్కొక్కని ఆస్తులు అన్ని బయట పెడతము, అపుడు గాని తెల్వది ఈ వ్యూహాత్మక మౌనం వెనక అర్థం.

ఇంగ తెలుగు దేశం నాయకులని చూస్తె లేదా ఒక్కతీర్గ బాద ఐతది, బిడ్డలు ఏడ్వలేక , నవ్వలేక, పార్టి లోపల ఉండలేక, బయటికి రాలేక ఒకటే హైరానా పడుతున్నారు. ఎం భక్తి అన్న! కళ్ళు చేమరుస్తున్నై, ఆడికి సోనియమ్మ, నీకు చంద్రన్న ! మా గోస ఎందుకు పట్టి లేదే మీకు. ఇపుడేదో ఉద్యమంల రాకపోతే బాగుండదని జర వోర్లుతున్రు గాని, లేకపోతె నువ్వు చేస్తే , నేను చేస్తా అని పోటీలు పెట్టుకోలేద? ఇగ ఆటు ఇటు గాని బాపతి మా జెపి గాడు..వాడి తెలివి సల్లంగుండ, మాకెవరికి దిమాక్ లేదు అనుకుంటాడు గాని, ఆఖరుకి మా మల్లెషన్న చేతిలో బలి అయిపాయె..మాకు ఇంగ్లీష్ చదువులు , మాయల మరాఠి మాటలు సేవున బడతలేవువు..తెలంగాణా ఇస్తే ఇయున్రి, లేకపోతె ఇయ్యర మయ్యార దంచి ఎట్లా తెచ్చుకోవాలని మాకు తెలుసు..పరేషాన్ కాకుండ్రి.

ఇంతకీ చెప్పొచ్చేది ఏందంటే, కాంగ్రెస్ఒళ్ళు రాజీనామా చేస్తారంట , ఎపుడు.. ఇపుడు ఉద్యమం తప్ప వేరే గత్యంతరం లేదు కాబట్టి, ఇన్ని పానాలు పోయినాయ్ రేపు వాళ్లై కూడ పోతాయి అని భయం పట్టుకుందేమో ..ఒక్క మాట ఇనుండ్రి బిడ్డ! సనిపొఇన పతోక్క బిడ్డ సాక్షిగా చెపుతున్నాం. మీరు అంత తెలంగాణా ద్రోహులు. మీరు ఇపుడు ఎన్ని మంచి పనులు చేసిన ఏమి లాభం లేదు.. ఇపుడు తెస్తే మీకు బర్కతి ఉంటది లేకపోతె మీ రాజకీయ జీవితం కి నూకలు చెల్లినట్లే. ఏ పని అయినా చేసే టైం ల చేయాలే.. మీరు ఇపుడు తప్పదని కదిలిన్రు లేకపోతె మల్ల ఎలక్షన్ల దాక కదుల్తున్తిర కాని..ఎవడన్న ప్రజలని ఒక్క మాట అంటే అది కూడ ఏ పార్టీ రాజ కీయ నాయకుడు ఐన , ఊరికిచ్చి కొడతాం! ఒక నాయకుడు తల్వార్లతో తరుముతం అన్నడు, ఏమైంది గతి..దెబ్బకు లోపటినుంచి అన్నల వార్నింగ్ వచ్చింది , సప్పుడు కాకుండా డిల్లిల బడ్డదాక పోయిండు. ఖబడ్దార్ ! వళ్ళు దగ్గర బెట్టుకొని మర్యాదగా మాట్లాడున్ద్రి. అసలు వీళ్ళని పిలిచినోడిది బుద్ది తక్కువ , ఇంక ఎం చేస్తారని వీళ్ళని నమ్ముతారో నాకు ఇప్పటికి సమజ్ అయితలేదు. ఇప్పటికైనా మనం కళ్ళు తెరవాలి /

ఇప్పుడు కాక పొతే తెలంగాణా ఎప్పటికి రాదు, మరొక టునిషియా, ఈజిప్టు కాకముందే ఇస్తే మంచిది , ఇయ్యకున్న మంచిదే ..దంచుడే, లడై చేసుడే, తెగించి కొట్లాడుడే ..

లాస్టుకి అన్న కెసిఆర్ అన్న కూడ డిల్లి పోతున్దంతా , ఏమ్చేస్తారో చూద్దాం ..అన్న ఏది చేసినా జర పంచ్ ఉంటది..పంజా ఉంటది , అది సొంత అజెండా కావొచ్చు, ప్రజల అజెండా కావొచ్చు..ఎవరు చేసిన , చేయక పోయిన తెలంగాణాని ఆపే దమ్ము ధైర్యం ఎవనికి లేదు , ఇపుడు రాక పొతే,
న ఘర్ కా నా ఘాట్ కా..అందరం అరబ్ దేశాలకు పోయి ఉద్యమం పాటాలు నేర్చుకొని రావాలి..అంత లేదనుకుంటా, వాళ్ళకే మన పోరాటం ఆదర్శం..

జై తెలంగాణా!
సుజాత సూరేపల్లి

దెబ్బ పడింది-గుండె మండింది

ఎముకలు కుళ్ళిన
వయస్సు మళ్ళిన
సోమరులార ! చావండి!
నెత్తురు మండే ,
శక్తులు నిండే
సైనికులారా రారండి !...

ఏడనో చదివిన 'రగలని జీవితం లో మిగిలేదేముంది', రగులుతుంది తెలంగాణా, మీ మేక వన్నె పులి ఏసం చూసి, కుతంత్రాలు చూసి .. భాష ప్రావీణ్యం అంతా ఇవాళ పేపర్లలో కనబరచిన్రు మావోల్లు, అన్నల్లార మీ తెలివికి జోహార్లు! ఎంత తెలివి, ఎంత మేధా సంపద, అన్త్ర్హ మామిదనే, ఎక్కడి దృతరాష్ట్ర కౌగిలి ఒకడు 'దౌర్జన్యం' అంటడు, ఇంకొకకడు 'చీకటి రోజు', 'సిగ్గు సిగ్గు', 'రౌడి అసెంబ్లీ', ఇంక టివి చానళ్లల్ల పండగ, చూపిచ్చిందే చూపించి, ఎసిందే ఎసి, ఎం దెబ్బ తమ్మి! బాసా ఒకటి కొడితే వంద కొట్టినట్టు - మా మల్లేష్ అన్న , డ్రైవర్ కావొచ్చు, కాదు కాదు, జార్జ్ బుష్ మీద బూటు విసిరిన 'జెడి' ఇప్పటినుంచి! నీకు తెలంగాణాల ఉద్యమంల ఒక పేజి ఉన్నది మల్లెషన్న! మల్లోకసారి మా కళ్ళకు మరొక వికృత రూపం చూపించి నందుకు.. తెగించి కొట్లాడుడే అని రక్తంల ఉన్నది, పదవులు, చచ్చు పరువు గురించి ఆలోచించలేదు! నీ యబ్బ! ఎం జిందగీ రా భై, జీవితాంతం కండ్లు తెరుచుకుంటూనే ఉంటాయ్, ఇంత దౌర్బాగ్యం ఏడ లేదనుకుంటా! పొద్దునే ఒక మిత్రుడు ఫోన్ చేసి 'చీకటి రోజు' అని టైటిల్ పెట్టినందుకు, ఇవాల్టినుంచి ఈనాడు పేపర్ బందు పెడ్తున్న అన్నడు! అది విజయం, గుండె రగిలింది అన్నకు..అదే ఇప్పుడు కావాల్సింది . ఒక తుగ్లక్ గాడు గవర్నర్ ఉంటాడు, వాడు మాట్లేది మనం వినాలే అంటడు, ఇంకొక దగుల్బాజీ గాడు 'సత్తా' లేని దద్దమ్మ, అవినీతి కి వ్యతిరేకంగా అని, పూర్తిగా అవినీతిలో మునిగే మేక వన్నె పులి గాడికి మీడియా వత్తాసు. హరిషన్న, రాజెందరన్న అందరికి ఇవాళ దెబ్బ పడింది, గౌరవ మర్యాదలు, విలువలు అంటు చిలువలు పలవలుగా పేలుతున్న సీమంద్రా నాయకులను చూస్తుంటే ఇన్ని రోజులు దాచుకున్న , అణచి వేసుకున్న పౌరుషం బయట పడ్డది, ఒక దెబ్బ పండింది. ఇపుడైనా శాంతి మంత్రాలూ పలికే , న్యాయ అన్యాలు పలికే మావోల్లకి తెలవాలే, కడుపు మండితే ఏమైతదో..దమ్మున్నోడు కొడుతాడు, తిడతాడు, చేతకానోడు, బడ బరిన్చాలేనోడు చస్తాడు..గంతే అన్న!

ఎన్ని రోజులు, ఇంకెన్ని రోజులు..ఎంత సహనం ఇంకెంత సహనం, ఏది హింస, ఏది ప్రజాస్వామ్యం? అర్థాలు మార్చిన ఆంధ్రోల్ల దౌర్జన్యం ఎన్నడు కనపడని మేధావులు ఎన్ని రోజులు మామీద మీ జులుం, అన్న! ఎంత మంచి మనసు నీకుందని తెలవక ఎంత సోచయిన్చినం? నీకు ఒక్క దెబ్బ ఇంత దిమ్మ తిరుగుతదని, ఇంత స్పందించే హృదయం నీకుందని తెల్వక పాయె గదనే! ఒక్క దెబ్బనే నీకు ఇంత మండితే, మాకు ఎన్ని దెబ్బలు, ఎన్ని చావులు, ఎన్ని నష్టాలు, కష్టాలు, నవ్వులపాలు అయిన బతుకులు..ఇవన్ని నీకు ఎన్నడు ఎందుకు కాన రాలే? నిన్నటికి నిన్న , మా కరీంనగర్ మడంపల్లి ల, మైనింగ్ కి వ్యతిరేకంగా పోరాటం చేస్తూన్న ఆడోల్ల మీద , హత్య , అత్యాచారం, కుల దూషణ చేసి, ఆడోళ్ళను భయపెట్టి , ఆస్తి నష్టం చేసిన్రని ఊరంతా అర్రెస్ట్ చేసి , 34 మంది పై నాన్ బైలబుల్ కేసులు 400 వందల మంది పోలిసోల్లు, 14 మంది ఎస్సైలు , 4 సిఐలు , ఒక డిఎస్పి ఊరు మీద పడ్డారు, అంతా పెద్ద పోరాటం , అది కూడ చదువు కొని ఆడోల్లు చేస్తూన్న పోరాటం, మా నీళ్ళు బోతున్నై, భూమి పోతుందీ అని రోడ్డున పడితే మీకు వార్త కాదు..జిల్లా పేజీల ఒక చిన్న న్యూస్, మా వోల్లు , రైళ్ళ కింద బడి, విషం తిని, కాలి పోయి, అలసి పోయి సొలసి పొతే మీకు మొదటి పేజి వార్త కాదు ..ఎం డిస్క్రిషన్ అన్న, ఒక్క పాలి చేప్తివంటే మా అజ్ఞానాన్ని మేము మల్ల మర్చి పోయి, మీ గొప్పతనానికి సన్మానం చేస్తాం, ఒక సారి మరొక కొత్త పాటం నేర్సుకున్టం. ఆశలు మిమ్మల్ని చూస్తె చాల బాదేస్తది, ఛీ, తూ, నీయవ్వ, అబ్బ , లుచ్చ , లఫన్గే( ఇంక ఎక్కువ తిట్టలేను..సభా మర్యాద..క్షమించున్ద్రి) అన్నంక కూడ దిక్కులేకుండా మా మీద పడి, మా జాలి దయ మీద బతుకుతున్నారు, ఇంత సిగ్గులేని బెకార్గాల్లతోని ఇన్ని ఏండ్లు ఉన్నామంటే మా మీద మాదే అసహ్యం ఎస్తుంది..మీకు వంత పాడే మా వోళ్ళని కూడ ఇవ్వాల్టి నుంచి జాతి బహిష్కరణ చేస్తున్నాం, మీ ఆంధ్రోల్ల కాడికి తీస్క పొండ్రి, మా బిడ్డలైన సరే, దేశ ద్రోహులని భరించే శక్తి, మంచి తనం మాకు లేదు! మమ్మల్ని జర వదిలేయుండ్రి .. మీ కళ్ళళ్ళ భయం చూస్తున్నాం, ఇది మా విజయం! భయ పడి చావండి , క్షణ క్షణం చావండి, మీరు తినే అన్నం మేతుకులలో మా పిల్లల రక్తం నిండి ఉంది, జలగల్లాగా పట్టి పీడిస్తున్న మీకు ..నిన్న బడ్డది ఒక సాంపిల్ మాత్రమె..భయమున్నోడే ఎక్కువ ఆవేశ పడతాడు, ఎక్కువ వేషాల్ ఎస్తాడు, మైండ్ పని చేయక అడ్డగోల్ పని చేస్తడు, ఏడనో దొరికి పోతాడు ..మీకు దిమాక్ పని చేస్తలేదని చెప్పనికి ఇంత కంటే వేరే సాక్షం అక్కర్లేదు, మాకు తెలుసు..పొల్లు పొల్లు గొట్టి తన్ని తరిమేసే దాక మీరు పోరని, ఆ పరిస్తితి మీరే మాకు కల్పిస్తున్నందుకు మీకు ధన్య వాదాలు..ఎం చేయాల్రా భై! మీ అంతా నీచులం కాదు, కమీనే కుత్తేలం గాదు, మా రక్తంల లేదు, ఒకడో అరనో, కల్తి గాడు ఎడైనా ఉంటాడు అనుకో, ఇగ బోతరు , ఆగ బోతరు అని చూస్తుంటే, ఒక్క అడుగు కూడ కదుల్తలేర్ర బై, నీ జాతి! సిగ్గు సిగ్గు! ఇంక ఎం మిగిలుందిరా వెధవల్లారా! దోసుకున్నంత దోసుకున్నారు! మా బొక్కలు, ఆస్థి పంజరాలు ఉన్నాయి, వాటితోటి కూడ ఏమైనా కొత్త వ్యాపారం చేస్తున్ర? ఎంత కైనా సమర్థులు తమ్మి! ప్రేమలు అమ్మగలరు, అమ్మలను తాకట్టు పెట్ట గలరు, నమ్మకాలను వేలం వెయ గలరు..కానియ్ , మాకు ఇపుడిపుడే సమజ్ అయితుంది..కండ్లు తెరుసుకున్తున్నాయి..మర్యాద మీతో మాత్రం చెల్లది! అయిన మనుషులైతే మర్యాద కదా! జంతువులు అనటానికి కూడ మనసోప్పుతలేదు..ఎం బతుకులురా మీయి, తిడతానికి కూడ తిట్లు లేవు, పోలుస్తానికి జంతువులు కూడ సిగ్గు పడుతున్నాయి.. ఇన్ని రోజులు మీతో కలిసున్నందుకు ఎన్ని పాపాలు చుట్టూ కున్నాయో ఏమో..తెలంగాణాల ఉన్న చెరువుల, నదుల్ల అన్నిట్లల్ల మునిగి పాపాలు కడుక్కోవాలే.. అయిన ఈ పని ఎపుడో చేస్తే బాగుండేది అని అనిపిస్తుంది కదా! ఇపుడిపుడే రక్తం సాల సాల కాగుతుంది కదా..

ఇపుడు శ్రీ శ్రీ లు కావాలి, ఉదం సింగ్ లు , భగత్ సింగ్ లు రావాలి, కావాలి కొదమ సింహాలు కొమరం భీమ్లు, ఐలవ్వలు, యాదగిరిలు, బందగీలు..అపుడే అపుడే తెలంగాణా సాద్యం..కమిటీలు కథలు చూసినం, రాజకీయ చతురతలు చూసినం, ఇంక మిగిలింది ఒకటే పోరాటం, ప్రత్యక్ష పోరాటం..ఎవడికి చేతనైంది వాడు చేయాలే ..శ్రీ శ్రీ లు కావాలె, సింహాలు కావాలె ..

ఏవో
ఏవేవో ఏవేవో
ఘోషలు వినబడ్తున్నై
గుండెలు విడి పోతున్నాయ్

ఎవరో
ఎవరివో ఎవరెవరో
తల విరబోసుకు
నగ్నంగా నర్తిస్తున్నారు - భయో
ద్విగ్నంగా నర్తిస్తున్నారు

అవిగో
అవిగవిగో అవిగవిగో
ఇంకిన - తెగిపోయిన-మరణించిన
క్రొన్నెత్తురు -విపంచికలు-యువయోధులు
నేడే
ఈనాడే ఈనాడే
జగమంత బలివితర్ది
నరజాతికి పరివర్తన
నవజీవన శుభసమయం, అభ్యుదయం ..

తెలంగాణా విముక్తి..తెగిమ్పుతోనే సాధ్యం..

సుజాత సూరేపల్లి

TJAC - TELANGANA BANDH CALL Feb 22, 23 (48hrs)

ALL TELANGANA friends,

Come on the roads. Do not go to office atleast 1-2 days. Give the support to non-coperation and for telangana bandh call on Feb 22, 23.

We have waited enough time, now come on roads. Protest against goverment.
I request you all come out from homes, colleges, offices.

Feb 22, 23 - Tarnaka, Uppal, LB Nagar..

Be ready.. inka chaalu intlo kusokunda.. bayatiki vaddam...

WALK FOR TELANGANA............

ప్రజాస్వామ్యం జేపీకే ఉందా???

1. J.P. ni kottinanduku feel aythuna prathi okaru, okasari e videos chusi, feel kandi - oka nayakuni kodithe antha feel avuthe, intha mandhi studentsni kottinappudu entha feel kavali.

http://www.facebook.com/l/4690abYAKpNGj4mucBIQCQHQ6RA/www.youtube.com/watch?v=ZgnOX9VbLuw
http://www.facebook.com/l/4690ae2l_8vFcLk6ND9VxcGSOyA/www.youtube.com/watch?v=5OB826bGwwM
http://www.facebook.com/l/4690a_JWHkNsgZz3Tift4--IsRA/www.youtube.com/watch?v=B9bVZ6WwGf4

2. News channels chusinavalaki na oka sandesham - first of all andhulo J.P. ni kottindhi oka nayakudi driver, idi gamanisthe evaru driverni kottamani encourage cheyaledu, valu kevalam telangana drohi ani thittaru anthe - J.P. assembly samaveshalu aypoina tharuvatha em matladinado thelusukunte athanu kottadamlo thappuledu anipisthundi -

J.P. matladina video idhi chudandi

http://www.facebook.com/l/4690a45-OqPtrYU-96QQRWbqM1g/www.youtube.com/watch?v=g9pxcJfbCiA&feature=player_embedded#at=19

Anthamandi students chanipothe appudu gurthurani prajaswayam, ippudu gurthukuvachindi J.P.ki

Wednesday, February 9, 2011