ఒక్కోడు నగ్నంగా బయటబడుతున్నాడు
చూపులు, స్వరాలు మారుతున్నాయ్
దార్లు మల్లుతున్నాయ్
ఒక దొర(కెసిఆర్) భూకంపాన్నైన సృష్టించి
తెలంగాణా తెస్తానన్నాడు ,
అయన జాడల కోసం తెలంగాణా ప్రజలు
కళ్ళళ్ళ వొత్తులేసుకొని సూత్తున్నారు
తెలంగాణాకు అడ్డొస్తే అడ్డంగా నరికేస్తాం
అన్న (దామోదర్ రెడ్డి) దొర
రాయల సీమ ముద్దు బిడ్డ జగన్ శిబిరం కై సూస్తుండు
సీటు వాకిట బోర్ల బడి
జగనన్న పేరు ఎత్తుతడెమో అని చూస్తుండు
మంత్రి పదవి తీసుకున్న జానన్న
తెలంగాణా గిలన్గాన జాన్త నై అంటుండు
ఉస్మానియా ల అగమాగామైన నాగన్న
బాబును చూడంగానే
బాత్రూమ్ల దాక్కున్టాండు
వారీ! నోరారి పోతది!
వేణుగోపాల్ శవంపై
ప్రమాణాలు చేసిన మంత్రులు, కంత్రులు
మమ్మల్ని మాజిలే అనాలన్న మాటలు
చెవుల రింగుమంటున్నాయి
దొరలారా! ఒక్కనిజం తెలుసుకోండి
తెలంగాణా ప్రజలు ఎపుడు సాయుదులే
మాటలు, పాటలు, రాతలు తూటాలే ,
వోడిసేల రాళ్ళు, విల్లంబులు, గుత్పలు,
చిపుర్లు, గొడ్డళ్ళు, కారంపోల్లు, రోకలిబండలు
దొరికిన పతోక్కటి AK 47 లే
ప్రజా సంబంధం లేని
మీ రాజకీయాలు బొంద బెట్టేందుకు
మా వోల్లు పలుగు, పార పట్టి కదులుతున్రు
కుడి ఎడమల దగాపడ్డ జనం
నీపై నిఘా పెట్టినరు
పులి ఎక్కి స్వారి చేద్దామని చూడకే
ఖమ్మంల జూస్ తాగితే ఏమైందో
అదే అయితది
తెలంగాణా మట్టి కాళ్ళు
మెడపై పెట్టి వంచుతారు
మీ
బాంచన్ కాదు దొరా బాకులం!
మీమీద మాకేన్నాడు ప్రేమ లేదు,
మీగొంతుల ఉన్న తెలంగాణా మీద తప్ప
మీ నాయకత్వం మీద భరోసా లేదు
ప్రజలే ప్రత్యామ్నాయం
చూస్కుంటారు
నువ్వు నోర్మూసుకో!
sujatha surepally
No comments:
Post a Comment