Sunday, February 20, 2011

మధు (యాష్కి) మస్తి!

మదన్న నిన్న లాయర్స్ సమర భేరిలో ఇష్టం వచ్చినట్టు కూసిండు ! సభలో మిత్రుడొకాయన రాజీనామా ఎందుకు చేయలేదంటే రోషమొచ్చింది, నువ్వెంత? నీ బతుకెంత? తెలంగాణాకి నువ్వు ఎం చేసినవ్ ? అని కళ్ళెర్ర చేసుకొని కోపం అయిండు. కడుపు మండి మిత్రుడు అడిగిన ప్రశ్నల ఏమైనా తప్పుందా చెప్పుండ్రి? దానికి అంత ఫీల్ గావాలన? అన్న నువ్వు ఇన్ని రోజులు తెలంగాణాకి చేసింది ఏందీ చెప్పు..కుక్కిన పెను లెక్ఖ పడి ఉండటం పనా? లేకపోతె డిల్లి కి ఊకే ఫాషన్ పరేడ్ చేయడం పనా? ఇక్కడ జరిగే పోరాటానికి మొహం చూపలేక ఆడ బోయి దాక్కున్తున్రని మాకు తెల్వదానే! మరి మేము అంత పిచ్చోల్లం గాదు అన్నల్లార! ఇగ మా అక్కలు ఏడున్నరో పాపం , నోరు తెరవరు, సప్పుడు కాకుండా పదవులు ఎంజాయ్ చేస్తారు, తల్లుల్లారా ఒక్కసారి ఈశ్వరి బాయి, సదాలక్ష్మి , మల్లు స్వరాజ్యం ని గురుతు తెచ్చుకోండి, మీరు ఆడోల్లకు ఆదర్శంగా ఉంటారంటే, అది లేకపాయే, మిమ్మల్ని గెలిపించింది తెలంగాణాకు ఎమన్నా చేస్తారని , ఆడోల్లు కదా కనీసం మీకన్నా బాధలు అర్థం అయితే అనుకుంటే , అది మా పిచ్చి అని తెల్చేసిన్రు! అంతా మా దరదృష్టం! ఎవరిని ఏమి అనలేము..

పాపం చాల మందికి తెలవని విషయం ఒకటుంది, ఉసరేల్లుల కథ! అన్ని పార్టీల ఉన్న మోసగాళ్ళు , రంగులు మార్చే మొనగాళ్ళు చాల డేంజర్, పాపం చంద్ర బాబు నాయుడు రెండు కళ్ళ సిద్ధాంతం , రేడు నాల్కల సిద్ధాంతం అట్టర్ ఫ్లాప్ , అయినా ఆయనని వీడరు మనవాళ్ళు, నిను వీడని నీడను నేను అని ఇంకా డుఎట్ పాడ్తనే ఉంటారు, అసలు పార్టీ సంబంధాలు కాక వీరి మధ్య ఇంకేమైనా ఉన్నాయా అని మనం అడగడం అంత బాగోదు..కాని కామన్ సేన్స్సు ఉంటె ఎవరికైనా దౌబుట్ రాక తప్పదు. ఏంచేస్తాం తమ్మి ! కలి కాలం! ఎవడిని నమ్మల్నో ఎవడిని నమ్మోద్దో తెలిస్తే కదా! చిరంజీవి లాంటి వాళ్ళతో మనకు పెద్ద బాద లేదు, సినిమా అయన కదా, ఆయన 'కాట్ వాక్' వస్తది కదా, సక్సేస్ అయిండు, జై కాంగ్రెస్ అని నమ్ముకున్నోల్లని గంగల ముంచిండు. మంత్రి పదవికి అంత దమ్ముంటది మరి! అయినా వాడు అన్ద్రోడే కదా దేన్నైనా తాకట్టు పెడతాడు , పైసా కోసం, పదవి కోసం , పేరు కోసం, గీల్ల తోన్ని దోస్తాని చేసి మావోల్లు పూరితిగా సెడి పోయిన్రు కాదె! కాంగ్రెస్ అనగా మనకు శత్రువు అని తెలుసు, అంటే మళ్లీ ఆంధ్ర కాంగ్రెస్ , తెలంగాణా కాంగ్రెస్, అందులో కోమటి రెడ్డి లాంటి వాళ్ళు , బహిరంగంగా కనపడతారు , మధు యాష్కి లాంటివోల్లు న ఆటు, న ఇటు లెక్క ఉంటారు..కొద్ది మందికి జర అన్నంటే ప్రేమ, మా కులపోడని , మంచోడని, ఏమి మంచి చేసిందో జర తెలిస్తే చెప్ప్పున్రి, మా యాదయ్య సచ్చినట్టు ఎమన్నా సావమంటున్నామే , జర ఒక కాగితం మీద రాజీనామా సంతకం గియి అన్న అన్నం, వంద మాటలు చెప్తారు గాని, ఆ వొక్కటి అడక్కు! అది తక్క ఏమైనా కోరుకో! ఇంకేముంది కోరుకోనికి , మీరు మాకున్న పరువు అంతః పార్లమెంట్ గల్లిలో పడేసి వస్తిరి..ఒక్కడికన్న సోనియమ్మా అప్పాయింట్మెంట్ ఇయక పాయె, సిగ్గు శరం మీకు ఎందుకు దేవుడు పెట్టలేదో అన్న ..మేము మాత్రం తలెత్తుకోలేక పోతున్నాం.. మళ్లీ అందులో సప్పుడు చడి చేయనోల్లు ఉంటారు. పొద్దున్న లేస్తే మా మధు యాష్కి నీ వెంటే నేను అంటడు ..మా కులపోడు, ప్రాంతపోడు అని మనం ఆవేశంగా ప్రేమిస్తాం , చూస్తె ఏముండదు, సూదిలో దారం. ఆవేశంగా మాట్లాడతారు..డిల్లి కి పొతే మాత్రం గల్లి లీడర్లంత పని కూడ చేయలేరు. అమ్మ దర్శనం దొరకదు, మీడియాల రెండు ముక్కలు చెపుతారు..ఇగోస్తది తెలంగాణా, అగోస్తది, అమ్మ బొమ్మ సో 'నియమ్మా' ఇస్తది అని చిలక పలుకులు చెప్తారు. మంచిగయింది , ఇయాల ఎవరు కథల్ చెప్తే ఇననీకి సిద్దంగా లేరు.

మిమ్మల్ని నమ్మకం తో గెలిపించినందుకు ప్రజలకు బాద్యత వహించాలి, వాళ్ళ ఆకాంక్షల మేరకు నడుచుకోవాలి కాని, అంత ఉల్టా చేస్తారెందే అన్న, ఇక్కడ వోల్ట్లు వేసి గెలిపిస్తే అక్కడ సోనియమ్మ పాట పాడితే ఎట్లా చెప్పున్రి ..మీరు చేసిన పనికి, సంవత్సర కాలం నష్ట పోఇనం, ఎన్నో విలువైన పానాలు పోగొట్టుకున్నాం, ఈ హత్యలన్ని మీరు చేసినయె, మీ చాతగాని తనానికి పసి పోరగాల్లు, దైర్యం లేనోళ్ళు గుండె పలిగి సచ్చిన్రు ..మాకు తెలుసు, మీకు నోరు పెగలదు..ఆస్తులు పోయేతోడు జర బయట పడతారు, మీకు ఆటు అవ్వ గావలె, బువ్వ గావలె, మాకు ఇంక ఓపిక లేదన్న,ఏమనుకోకున్ద్రి ..ఇపుడు మీరు రాజేనామ చేయలేదని ఎవరైనా అన్న, ఎందుకు మా పోరగాల్లని పొట్టనబెట్టుకున్నారని ఒక దేబ్బెసిన సప్పుడు చేసే అధికారం మీకు లేదు..ఐతే నోర్ముసుకు పడి ఉన్డున్రి, లేకపోతె అన్ద్రోల్ల సోపతి పట్టి , జగన్ గాని ఎంకనో, లగడపాటి ఎంకనో పొండ్రి..సహాయ నిరాకరణ వద్దని చెప్తాడు ఒక్కో నాయకుడు..జర దేల్వక అడుగుత మీదేం సొమ్ము పోతుందే ! అందరు మంచిగానే సంపాయించుకొని బంగ్లాలు గట్టుకున్నారు , పోయి డిల్లిల కూసున్నరు..కష్టమైనా , నష్టమైన మాకే కదా..తెలంగాణా రాని బిడ్డా! ఒక్కొక్కని ఆస్తులు అన్ని బయట పెడతము, అపుడు గాని తెల్వది ఈ వ్యూహాత్మక మౌనం వెనక అర్థం.

ఇంగ తెలుగు దేశం నాయకులని చూస్తె లేదా ఒక్కతీర్గ బాద ఐతది, బిడ్డలు ఏడ్వలేక , నవ్వలేక, పార్టి లోపల ఉండలేక, బయటికి రాలేక ఒకటే హైరానా పడుతున్నారు. ఎం భక్తి అన్న! కళ్ళు చేమరుస్తున్నై, ఆడికి సోనియమ్మ, నీకు చంద్రన్న ! మా గోస ఎందుకు పట్టి లేదే మీకు. ఇపుడేదో ఉద్యమంల రాకపోతే బాగుండదని జర వోర్లుతున్రు గాని, లేకపోతె నువ్వు చేస్తే , నేను చేస్తా అని పోటీలు పెట్టుకోలేద? ఇగ ఆటు ఇటు గాని బాపతి మా జెపి గాడు..వాడి తెలివి సల్లంగుండ, మాకెవరికి దిమాక్ లేదు అనుకుంటాడు గాని, ఆఖరుకి మా మల్లెషన్న చేతిలో బలి అయిపాయె..మాకు ఇంగ్లీష్ చదువులు , మాయల మరాఠి మాటలు సేవున బడతలేవువు..తెలంగాణా ఇస్తే ఇయున్రి, లేకపోతె ఇయ్యర మయ్యార దంచి ఎట్లా తెచ్చుకోవాలని మాకు తెలుసు..పరేషాన్ కాకుండ్రి.

ఇంతకీ చెప్పొచ్చేది ఏందంటే, కాంగ్రెస్ఒళ్ళు రాజీనామా చేస్తారంట , ఎపుడు.. ఇపుడు ఉద్యమం తప్ప వేరే గత్యంతరం లేదు కాబట్టి, ఇన్ని పానాలు పోయినాయ్ రేపు వాళ్లై కూడ పోతాయి అని భయం పట్టుకుందేమో ..ఒక్క మాట ఇనుండ్రి బిడ్డ! సనిపొఇన పతోక్క బిడ్డ సాక్షిగా చెపుతున్నాం. మీరు అంత తెలంగాణా ద్రోహులు. మీరు ఇపుడు ఎన్ని మంచి పనులు చేసిన ఏమి లాభం లేదు.. ఇపుడు తెస్తే మీకు బర్కతి ఉంటది లేకపోతె మీ రాజకీయ జీవితం కి నూకలు చెల్లినట్లే. ఏ పని అయినా చేసే టైం ల చేయాలే.. మీరు ఇపుడు తప్పదని కదిలిన్రు లేకపోతె మల్ల ఎలక్షన్ల దాక కదుల్తున్తిర కాని..ఎవడన్న ప్రజలని ఒక్క మాట అంటే అది కూడ ఏ పార్టీ రాజ కీయ నాయకుడు ఐన , ఊరికిచ్చి కొడతాం! ఒక నాయకుడు తల్వార్లతో తరుముతం అన్నడు, ఏమైంది గతి..దెబ్బకు లోపటినుంచి అన్నల వార్నింగ్ వచ్చింది , సప్పుడు కాకుండా డిల్లిల బడ్డదాక పోయిండు. ఖబడ్దార్ ! వళ్ళు దగ్గర బెట్టుకొని మర్యాదగా మాట్లాడున్ద్రి. అసలు వీళ్ళని పిలిచినోడిది బుద్ది తక్కువ , ఇంక ఎం చేస్తారని వీళ్ళని నమ్ముతారో నాకు ఇప్పటికి సమజ్ అయితలేదు. ఇప్పటికైనా మనం కళ్ళు తెరవాలి /

ఇప్పుడు కాక పొతే తెలంగాణా ఎప్పటికి రాదు, మరొక టునిషియా, ఈజిప్టు కాకముందే ఇస్తే మంచిది , ఇయ్యకున్న మంచిదే ..దంచుడే, లడై చేసుడే, తెగించి కొట్లాడుడే ..

లాస్టుకి అన్న కెసిఆర్ అన్న కూడ డిల్లి పోతున్దంతా , ఏమ్చేస్తారో చూద్దాం ..అన్న ఏది చేసినా జర పంచ్ ఉంటది..పంజా ఉంటది , అది సొంత అజెండా కావొచ్చు, ప్రజల అజెండా కావొచ్చు..ఎవరు చేసిన , చేయక పోయిన తెలంగాణాని ఆపే దమ్ము ధైర్యం ఎవనికి లేదు , ఇపుడు రాక పొతే,
న ఘర్ కా నా ఘాట్ కా..అందరం అరబ్ దేశాలకు పోయి ఉద్యమం పాటాలు నేర్చుకొని రావాలి..అంత లేదనుకుంటా, వాళ్ళకే మన పోరాటం ఆదర్శం..

జై తెలంగాణా!
సుజాత సూరేపల్లి

No comments: