Sunday, February 20, 2011

దెబ్బ పడింది-గుండె మండింది

ఎముకలు కుళ్ళిన
వయస్సు మళ్ళిన
సోమరులార ! చావండి!
నెత్తురు మండే ,
శక్తులు నిండే
సైనికులారా రారండి !...

ఏడనో చదివిన 'రగలని జీవితం లో మిగిలేదేముంది', రగులుతుంది తెలంగాణా, మీ మేక వన్నె పులి ఏసం చూసి, కుతంత్రాలు చూసి .. భాష ప్రావీణ్యం అంతా ఇవాళ పేపర్లలో కనబరచిన్రు మావోల్లు, అన్నల్లార మీ తెలివికి జోహార్లు! ఎంత తెలివి, ఎంత మేధా సంపద, అన్త్ర్హ మామిదనే, ఎక్కడి దృతరాష్ట్ర కౌగిలి ఒకడు 'దౌర్జన్యం' అంటడు, ఇంకొకకడు 'చీకటి రోజు', 'సిగ్గు సిగ్గు', 'రౌడి అసెంబ్లీ', ఇంక టివి చానళ్లల్ల పండగ, చూపిచ్చిందే చూపించి, ఎసిందే ఎసి, ఎం దెబ్బ తమ్మి! బాసా ఒకటి కొడితే వంద కొట్టినట్టు - మా మల్లేష్ అన్న , డ్రైవర్ కావొచ్చు, కాదు కాదు, జార్జ్ బుష్ మీద బూటు విసిరిన 'జెడి' ఇప్పటినుంచి! నీకు తెలంగాణాల ఉద్యమంల ఒక పేజి ఉన్నది మల్లెషన్న! మల్లోకసారి మా కళ్ళకు మరొక వికృత రూపం చూపించి నందుకు.. తెగించి కొట్లాడుడే అని రక్తంల ఉన్నది, పదవులు, చచ్చు పరువు గురించి ఆలోచించలేదు! నీ యబ్బ! ఎం జిందగీ రా భై, జీవితాంతం కండ్లు తెరుచుకుంటూనే ఉంటాయ్, ఇంత దౌర్బాగ్యం ఏడ లేదనుకుంటా! పొద్దునే ఒక మిత్రుడు ఫోన్ చేసి 'చీకటి రోజు' అని టైటిల్ పెట్టినందుకు, ఇవాల్టినుంచి ఈనాడు పేపర్ బందు పెడ్తున్న అన్నడు! అది విజయం, గుండె రగిలింది అన్నకు..అదే ఇప్పుడు కావాల్సింది . ఒక తుగ్లక్ గాడు గవర్నర్ ఉంటాడు, వాడు మాట్లేది మనం వినాలే అంటడు, ఇంకొక దగుల్బాజీ గాడు 'సత్తా' లేని దద్దమ్మ, అవినీతి కి వ్యతిరేకంగా అని, పూర్తిగా అవినీతిలో మునిగే మేక వన్నె పులి గాడికి మీడియా వత్తాసు. హరిషన్న, రాజెందరన్న అందరికి ఇవాళ దెబ్బ పడింది, గౌరవ మర్యాదలు, విలువలు అంటు చిలువలు పలవలుగా పేలుతున్న సీమంద్రా నాయకులను చూస్తుంటే ఇన్ని రోజులు దాచుకున్న , అణచి వేసుకున్న పౌరుషం బయట పడ్డది, ఒక దెబ్బ పండింది. ఇపుడైనా శాంతి మంత్రాలూ పలికే , న్యాయ అన్యాలు పలికే మావోల్లకి తెలవాలే, కడుపు మండితే ఏమైతదో..దమ్మున్నోడు కొడుతాడు, తిడతాడు, చేతకానోడు, బడ బరిన్చాలేనోడు చస్తాడు..గంతే అన్న!

ఎన్ని రోజులు, ఇంకెన్ని రోజులు..ఎంత సహనం ఇంకెంత సహనం, ఏది హింస, ఏది ప్రజాస్వామ్యం? అర్థాలు మార్చిన ఆంధ్రోల్ల దౌర్జన్యం ఎన్నడు కనపడని మేధావులు ఎన్ని రోజులు మామీద మీ జులుం, అన్న! ఎంత మంచి మనసు నీకుందని తెలవక ఎంత సోచయిన్చినం? నీకు ఒక్క దెబ్బ ఇంత దిమ్మ తిరుగుతదని, ఇంత స్పందించే హృదయం నీకుందని తెల్వక పాయె గదనే! ఒక్క దెబ్బనే నీకు ఇంత మండితే, మాకు ఎన్ని దెబ్బలు, ఎన్ని చావులు, ఎన్ని నష్టాలు, కష్టాలు, నవ్వులపాలు అయిన బతుకులు..ఇవన్ని నీకు ఎన్నడు ఎందుకు కాన రాలే? నిన్నటికి నిన్న , మా కరీంనగర్ మడంపల్లి ల, మైనింగ్ కి వ్యతిరేకంగా పోరాటం చేస్తూన్న ఆడోల్ల మీద , హత్య , అత్యాచారం, కుల దూషణ చేసి, ఆడోళ్ళను భయపెట్టి , ఆస్తి నష్టం చేసిన్రని ఊరంతా అర్రెస్ట్ చేసి , 34 మంది పై నాన్ బైలబుల్ కేసులు 400 వందల మంది పోలిసోల్లు, 14 మంది ఎస్సైలు , 4 సిఐలు , ఒక డిఎస్పి ఊరు మీద పడ్డారు, అంతా పెద్ద పోరాటం , అది కూడ చదువు కొని ఆడోల్లు చేస్తూన్న పోరాటం, మా నీళ్ళు బోతున్నై, భూమి పోతుందీ అని రోడ్డున పడితే మీకు వార్త కాదు..జిల్లా పేజీల ఒక చిన్న న్యూస్, మా వోల్లు , రైళ్ళ కింద బడి, విషం తిని, కాలి పోయి, అలసి పోయి సొలసి పొతే మీకు మొదటి పేజి వార్త కాదు ..ఎం డిస్క్రిషన్ అన్న, ఒక్క పాలి చేప్తివంటే మా అజ్ఞానాన్ని మేము మల్ల మర్చి పోయి, మీ గొప్పతనానికి సన్మానం చేస్తాం, ఒక సారి మరొక కొత్త పాటం నేర్సుకున్టం. ఆశలు మిమ్మల్ని చూస్తె చాల బాదేస్తది, ఛీ, తూ, నీయవ్వ, అబ్బ , లుచ్చ , లఫన్గే( ఇంక ఎక్కువ తిట్టలేను..సభా మర్యాద..క్షమించున్ద్రి) అన్నంక కూడ దిక్కులేకుండా మా మీద పడి, మా జాలి దయ మీద బతుకుతున్నారు, ఇంత సిగ్గులేని బెకార్గాల్లతోని ఇన్ని ఏండ్లు ఉన్నామంటే మా మీద మాదే అసహ్యం ఎస్తుంది..మీకు వంత పాడే మా వోళ్ళని కూడ ఇవ్వాల్టి నుంచి జాతి బహిష్కరణ చేస్తున్నాం, మీ ఆంధ్రోల్ల కాడికి తీస్క పొండ్రి, మా బిడ్డలైన సరే, దేశ ద్రోహులని భరించే శక్తి, మంచి తనం మాకు లేదు! మమ్మల్ని జర వదిలేయుండ్రి .. మీ కళ్ళళ్ళ భయం చూస్తున్నాం, ఇది మా విజయం! భయ పడి చావండి , క్షణ క్షణం చావండి, మీరు తినే అన్నం మేతుకులలో మా పిల్లల రక్తం నిండి ఉంది, జలగల్లాగా పట్టి పీడిస్తున్న మీకు ..నిన్న బడ్డది ఒక సాంపిల్ మాత్రమె..భయమున్నోడే ఎక్కువ ఆవేశ పడతాడు, ఎక్కువ వేషాల్ ఎస్తాడు, మైండ్ పని చేయక అడ్డగోల్ పని చేస్తడు, ఏడనో దొరికి పోతాడు ..మీకు దిమాక్ పని చేస్తలేదని చెప్పనికి ఇంత కంటే వేరే సాక్షం అక్కర్లేదు, మాకు తెలుసు..పొల్లు పొల్లు గొట్టి తన్ని తరిమేసే దాక మీరు పోరని, ఆ పరిస్తితి మీరే మాకు కల్పిస్తున్నందుకు మీకు ధన్య వాదాలు..ఎం చేయాల్రా భై! మీ అంతా నీచులం కాదు, కమీనే కుత్తేలం గాదు, మా రక్తంల లేదు, ఒకడో అరనో, కల్తి గాడు ఎడైనా ఉంటాడు అనుకో, ఇగ బోతరు , ఆగ బోతరు అని చూస్తుంటే, ఒక్క అడుగు కూడ కదుల్తలేర్ర బై, నీ జాతి! సిగ్గు సిగ్గు! ఇంక ఎం మిగిలుందిరా వెధవల్లారా! దోసుకున్నంత దోసుకున్నారు! మా బొక్కలు, ఆస్థి పంజరాలు ఉన్నాయి, వాటితోటి కూడ ఏమైనా కొత్త వ్యాపారం చేస్తున్ర? ఎంత కైనా సమర్థులు తమ్మి! ప్రేమలు అమ్మగలరు, అమ్మలను తాకట్టు పెట్ట గలరు, నమ్మకాలను వేలం వెయ గలరు..కానియ్ , మాకు ఇపుడిపుడే సమజ్ అయితుంది..కండ్లు తెరుసుకున్తున్నాయి..మర్యాద మీతో మాత్రం చెల్లది! అయిన మనుషులైతే మర్యాద కదా! జంతువులు అనటానికి కూడ మనసోప్పుతలేదు..ఎం బతుకులురా మీయి, తిడతానికి కూడ తిట్లు లేవు, పోలుస్తానికి జంతువులు కూడ సిగ్గు పడుతున్నాయి.. ఇన్ని రోజులు మీతో కలిసున్నందుకు ఎన్ని పాపాలు చుట్టూ కున్నాయో ఏమో..తెలంగాణాల ఉన్న చెరువుల, నదుల్ల అన్నిట్లల్ల మునిగి పాపాలు కడుక్కోవాలే.. అయిన ఈ పని ఎపుడో చేస్తే బాగుండేది అని అనిపిస్తుంది కదా! ఇపుడిపుడే రక్తం సాల సాల కాగుతుంది కదా..

ఇపుడు శ్రీ శ్రీ లు కావాలి, ఉదం సింగ్ లు , భగత్ సింగ్ లు రావాలి, కావాలి కొదమ సింహాలు కొమరం భీమ్లు, ఐలవ్వలు, యాదగిరిలు, బందగీలు..అపుడే అపుడే తెలంగాణా సాద్యం..కమిటీలు కథలు చూసినం, రాజకీయ చతురతలు చూసినం, ఇంక మిగిలింది ఒకటే పోరాటం, ప్రత్యక్ష పోరాటం..ఎవడికి చేతనైంది వాడు చేయాలే ..శ్రీ శ్రీ లు కావాలె, సింహాలు కావాలె ..

ఏవో
ఏవేవో ఏవేవో
ఘోషలు వినబడ్తున్నై
గుండెలు విడి పోతున్నాయ్

ఎవరో
ఎవరివో ఎవరెవరో
తల విరబోసుకు
నగ్నంగా నర్తిస్తున్నారు - భయో
ద్విగ్నంగా నర్తిస్తున్నారు

అవిగో
అవిగవిగో అవిగవిగో
ఇంకిన - తెగిపోయిన-మరణించిన
క్రొన్నెత్తురు -విపంచికలు-యువయోధులు
నేడే
ఈనాడే ఈనాడే
జగమంత బలివితర్ది
నరజాతికి పరివర్తన
నవజీవన శుభసమయం, అభ్యుదయం ..

తెలంగాణా విముక్తి..తెగిమ్పుతోనే సాధ్యం..

సుజాత సూరేపల్లి

No comments: